దహన సంస్కారం.. దేశదేశాలా వీక్షణం వెబ్‌లో అంత్యక్రియలు ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం ఎన్నారైల్లో ప్రత్యేక ఆసక్తి;అయ్యో.. కడసారి చూపైనా దక్కలేదే&; ఆత్మీయులు చనిపోయినప్పుడు దూరప్రాంతాలు, విదేశాల్లోని బంధువులు అనుకునే మాటే ఇది. కానీ.. దీనికీ ఓ అత్యాధునిక పరిష్కారం ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. అంత్యక్రియల తంతు యావత్తూ ఇంటర్నెట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఇప్పుడు చాలా సంస్థలు ముందుకొస్తున్నాయి.
ఇప్పటికే గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో రెండు సంస్థలు ఈ సదుపాయాన్ని ప్రాచుర్యంలోకి తెస్తున్నాయి. విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ప్రసారాలు మున్ముందు మరింతగా విస్తరించటం తథ్యమంటున్నారు పరిశీలకులు.వివేక్ అమెరికాలో ఉంటాడు. గుజరాత్‌లో ఉండే తన అమ్మమ్మ ఓ రోజు హఠాత్తుగా చనిపోయింది. తానున్న పరిస్థితిలో వెంటనే బయలుదేరి రావటం అసంభవం. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు? అయినవాళ్లందరికీ దూరంగా.. ఒక్కరే తమలోతాము కుమిలిపోతారు. కానీ వివేక్ అలా విచారించలేదు. అమెరికాలోనే ఉండి అమ్మమ్మ అంత్యక్రియలను, అక్కడ చేరిన బంధువులందరినీ ప్రత్యక్షంగా చూశాడు. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? అంతా వెబ్‌కాస్ట్; మహిమ. గుజరాత్‌లోని ముక్తిధామ్ శ్మశానవాటిక ఇంటర్‌నెట్ ద్వారా ఈ సౌకర్యాన్ని అందిస్తోంది మరి. దూరప్రాంతాల్లో ఉన్న బంధువుల కోసం దహనక్రియలను ఇలా నెట్‌ద్వారా ప్రసారం చేస్తోంది. దీనికోసం తమ వెబ్‌సైట్ ్ఝ్య్త్మ్ౖట్త్చ్ఝ.్న్్ణలో ప్రత్యేక స్థానాన్ని కేటాయించింది. అంత్యక్రియలకు రాలేకపోయిన బంధువులు, స్నేహితులకు నిజంగా ఇక్కడే, తమవారందరితో ఉన్నామన్న భావన కలిగించడమే దీని ఉద్దేశం; అని అంటున్నారు ఈ ముక్తిధామ్ మేనేజర్ అశోక్ ఆచార్య.
కుమారుడు అమెరికా నుంచి రావటంలో జాప్యం జరగటంతో ఓ వృద్ధుడి శవాన్ని రెండురోజుల వరకు అలాగే ఉంచాల్సి వచ్చింది. అప్పుడే మాకీ ఆలోచన వచ్చింది. స్థానిక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల సాయంతో కొద్దిరోజుల్లోనే దీన్ని ప్రారంభించాం అని చెప్పారు. వారి శ్మశానవాటికలో రెండు వెబ్ కెమెరాలను ఇంటర్నెట్‌కు అనుసంధానం చేశారు. కావలసిన వారంతా పాస్‌వర్డ్ తీసుకుని దేశవిదేశాల్లో ఎక్కడున్నా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. పైగా ఈ సేవ మొత్తం నామమాత్రంగా ఒకే ఒక్క రూపాయికి అందిస్తుండటం విశేషం. మొదట్లో ఇబ్బందులు ఎదురైనా బ్రాడ్‌బ్యాండ్ అందుబాటులోకి రావటంతో ప్రసార నాణ్యత పెరగటమే కాకుండా, దీనికయ్యే ఖర్చూ తగ్గిందనీ, ఇలా ఇప్పటివరకూ 18 దేశాల్లోని బంధువులు 300 మంది అంత్యక్రియలను చూడగలిగారని అశోక్ తెలిపారు. నెలకు దాదాపు 8 అంత్యక్రియలను ఇలా వెబ్ ద్వారా ప్రసారం చేస్తున్నారు.ఇలాంటి శ్మశానవాటికే చెన్నైలో మరోటి ఉంది. మద్రాస్ సెమెటరీస్ బోర్డ్ తమ వెబ్‌సైట్ ద్వారా అంత్యక్రియల ప్రత్యక్ష ప్రసారాలను అందిస్తోంది. క్రైస్తవుల కోసం ఉద్దేశించిన ఈ శ్మశానవాటిక.. ప్రత్యక్షప్రసారంతో పాటు వాటిని రికార్డు చేసి మరీ తమ సైట్‌లో ఉంచుతోంది. కావాలనుకుంటే దాన్ని డీవీడీ రూపంలోనూ తీసుకోవచ్చు.మొత్తానికి వూపందుకుంటున్న ఈ కొత్త ధోరణి.. అంత్యక్రియలకు హాజరుకాలేని కుటుంబ సభ్యులు, బంధువులకు ఎంతో చింత తీరుస్తోంది. ఇక ఇంటర్నెట్లో పెళ్లిచూపులే కాదు.. ఆఖరి చూపులూ చూస్కోవచ్చు!
Tuesday, November 11, 2008
వెబ్‌లో అంత్యక్రియలు
Labels:
NEW IN WORLD
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment