తేనెలొలుకు భాష తెలుగుభాష, తెలుగు భాష మాట్లాడినా, చదివినా, విన్నా నిస్సందేహంగా అమృతంలా ఉంటుంది.అందుకు తగ్గట్లే రాష్ట్ర అధికార తెలుగు భాషా సంఘం చేసిన అవిరాళ కృషికి నేడు ఫలితం దక్కింది. ఇందుకుగానూ తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు, ప్రముఖ పాత్రికేయులు ఏ.బి.కె.ప్రసాద్ చేసిన కృషి ప్రశంసనీయం.ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తెలుగు భాషాభిమానులకు తీపికబురు అందింది. తెలుగుభాషకు ప్రాచీనహోదా దక్కింది.
తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడం వెనక రాష్ట్ర అధికార తెలుగు భాషా సంఘం చేసిన ప్రయత్నాలు ఆమోఘమైనవి. కేంద్రంలో ఉన్న కమిటీకి నివేదికలు ఇవ్వడం, సచివాలయంలో సంప్రదింపులు జరపడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడితేవడంలో తెలుగు భాషా సంఘం కీలక పాత్ర వహించింది.ఈ వార్త వెలువడడం వెనక భాషాభిమానులు, విద్యావేత్తలు, కవులు, రచయితల కృషి మరువలేనిది. అంతేకాకుండా కేంద్రంపై ఒత్తిడి తేవడంలో ఎబికె ప్రసాద్ చేసిన ప్రయత్నాలెన్నో.ఎబికే తెలుగు భాషా ప్రాచీన హోదాకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తూ, తెలుగు భాష ప్రాచుర్యానికి విస్తృతంగా ప్రచారం చేశారు. తెలుగుభాషకు మరింత ప్రాచుర్యం కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఏబికే ప్రసాద్ నేతృత్వంలో తెలుగు భాషా సంఘం ఈ మధ్యనే తెలుగు భాషా పతాకాన్ని రూపకల్పన చేసి ఆవిష్కరింపజేశారు. వచ్చేఉగాది నుంచి ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తెలుగువారి ఇళ్ళ ముంగిట ఈ పతాకం రెపరెపలాడాలని ఆయన ఆకాంక్షించారు. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి ఒకరోజు ముందు కేంద్ర ప్రభుత్వం పాచీనహోదా కల్పించడంతో రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొంది.
మాతృభాష విషయంలో గాంధీజీ ఆశించిన లక్ష్యాలు అనుకున్న విధంగా నెరవేరలేదు. స్వంత భాషలకు తిలోదకాలిచ్చి నిజమైన అభ్యుదయాన్ని సాధించలేరన్న గాంధీజీ మాటలను స్పూర్తిగా తీసుకున్న ఏబికే అందుకు తగ్గట్లుగానే భాషా ఉద్యమానికి నడుంబిగించారు. ప్రపంచకీరణ పేరిట వ్యాపార ప్రయోజనాల కోసం మాతృభాషలను మింగజూసే ఆంగ్లీకరణ విధానం, తెలుగు భాషకు తెలుగు దనానికి చేటు తీసుకొచ్చే పరిస్థితులు ఎదురవుతున్నాయి.ఇప్పటికే తెలుగు భాషకు తీవ్రమైన నష్టం జరిగిపోయింది. పాఠశాల దశలోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ చివరకు మన ఇళ్లల్లో కూడా తెలుగు వాడకం కరువవడమే నేడు కరువైపోతున్న తరుణంలో తెలుగుభాషా సంఘం ప్రయత్నాలు ఆరంభించి అందులో సఫలీకృతమయింది.ఈ సందర్భంలో తెలుగు భాషా సంఘం ప్రదానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిలకు కృతఙ్ఞతలు తెలియజేసింది. తెలుగుభాషకు ప్రాచీన హోదా కల్పించినందుకు ప్రతి తెలుగువాడి ఇంట ఆనందం వెల్లువెరుస్తోంది.
Thursday, November 13, 2008
తెలుగుభాషకు ప్రాచీన హోదా
Labels:
Telugu Language
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment