welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Sunday, November 30, 2008

telugu Dr Ghazal Srinivas in new Guinness Book


the great Telugu singer Dr Ghazal Srinivas has got a place in Guinness Book of World records . He has set a new record by singing Ghazals on Gandhism in 76 languages. He was also proactive and took initiative in spreading Gandhism across the world crossing the boundaries of sub continent.

Well known Telugu singer Dr Ghazal Srinivas has got a place in Guinness Book of World records today. He has set a new record by singing Ghazals on Gandhism in 76 languages. He was also proactive and took initiative in spreading Gandhism across the world crossing the boundaries of sub continent.

about Ghazal Srinivas

Ghazal Srinivas divinely gifted genius hails from Palakol, West Godavari District, in Andhra Pradesh. He has scaled the heights of International Fame as Prince and Pioneer of singing Telugu Ghazals. Srinivas has been singing and performing Telugu Ghazals since 1986. He has developed a unique style of his own – a care free, effortless and sonorous singing. He makes use of Kanjeera, a common instrument, as his only accompaniment. Characteristically Ghazal Srinivas analyzes each stanga of the Ghazal that he sings and brings out the hidden literary beauty of it as he explains to the audience.


Honorary Doctorate

Dr Ghazal Srinvas conferred Honorary Doctorate from Acharya Nagarjuna University, Andhra Pradesh in the Year 2008 for his contribution to Art of Ghazal singing and world peace.

Thursday, November 13, 2008

నేటి తెలుగుకు మేటి వెలుగు - అద్భుత


తెలుగు భాష ప్రాచీనమైందంటూ రాజముద్ర ఎట్టకేలకు పడింది. అసలు అధ్యాయం మొదలైంది. ప్రాచీన హోదా కిరీటమొక్కటే తెలుగుభాషను బతకించజాలదు. అమ్మకు అమ్మ ఉండేదని అంగీకరించినంత మాత్రాన ఒనగూడే ప్రయోజనం నామమాత్రమే. ఆత్మగౌరవం ఆయువు పోసుకుంది- అంతే! ఎంతసేపూ గతంలో గెంతులువేసి బావుకొనేదేం ఉండదు. తాతలు తాగిన నేతి వాసనల్ని చర్చకు పెట్టి లాభంలేదు. చెట్టుపేరు చెప్పుకొని కాయలు అంటగట్టలేం.

ప్రాచీనహోదా ఇచ్చినందుకు మహా అయితే ఏటా కొన్ని కోట్ల రూపాయల నిధులు ముట్టచెబుతారు. ఆ మొత్తంతో ఏం వెలగబెడతారన్నదే అసలు ప్రశ్న. పొరుగు రాష్ట్రంలోలాగా మనకంటూ పకడ్బందీ అనువాద విభాగం లేదు. అముద్రిత గ్రంథాలెన్నో శిథిµలావస్థకు చేరుతున్నాయి. ఆ జాబితా మన చేతుల్లో లేదు. పోనీ అకాడమీలను పునరుద్ధరిద్దామంటే- గతంలోని చేదు అనుభవం మనల్ని వెంటాడుతోంది. రచయితమ్మన్యులు తమ ప్రాపకం కోసం అకాడమీలను భ్రష్టుపట్టించి ఆధిపత్యపోరుకు తెరతీసిన నీచచరిత్ర ఇటీవలి మాటే. సాహిత్య అకాడమీ, సంగీత అకాడమీలను ఎన్టీఆర్ ఉన్నపళంగా రద్దు చేశారనటం నిజం కాదు. వాటి రద్దుకు దారితీసేలా కుళ్లు రాజకీయాలు రాజ్యమేలాయన్నది నిన్నటి సూర్యాస్తమయం అంతటి ఎర్రని నిజం!

ప్రస్తుత శుభసందర్భంలో తెలుగుభాష విశిష్టత గురించి వూరూరా సభలు పెట్టి వూదరకొట్టినందువల్ల ఉపయోగం శూన్యం. ఆంధ్రత్వ మాంధ్రభాషాచ నల్పస్య తపసఃఫలమ్ (ఆంధ్రులుగా పుట్టడం, ఆంధ్రభాష వ్యవహరించడం తపస్సిద్ధి పుణ్యమే) అంటూ ఢిల్లీ పాదుషాను మెప్పించిన గోదావరి వాసి అప్పయ్యదీక్షితులు ఏనాడో తెలుగుభాషకు జేజేలు పలికారు. అంతక్రితమే 'క్రీడాభిరామ' కర్త 'దేశభాషలందు తెనుగులెస్స' అంటూ తెలుగుకు పట్టం కట్టాడు. 'తెనుగు' అన్నమాట పరిమితమైన అర్థంలో భాషాపరంగానే చెలామణిలో ఉన్నందువల్ల దాన్ని తెలుగుగా మార్చి ఆముక్తమాల్యద కర్త 'దేశ భాషలందు తెలుగు లెస్స' అన్నాడు. తమిళకవి సుబ్రమణ్య భారతి 'సుందర తెనుంగు' అన్నాడని మురిసిపోనక్కరలేదు. అచ్చులతో అంతమయ్యే అరుదైన పదసంపద కలిగి- డాంటీ, పెట్రార్క్, బొకాసియోలు మెరుగులు దిద్దిన ఇటాలియన్ భాషతో మన భాషని పోల్చి, 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్'గా వినుతికెక్కేట్టు చేసిన నావికుడు నికొలయ్ కోంటి పేరు తలచుకుంటే ఒరిగేదేం లేదు. దేశానికి హిందీ, ఆంగ్లభాషలతో పాటు అధికారభాష కాదగ్గ అర్హత తెలుగుభాషకుందని ఆంగ్లశాస్త్రవేత్త హాల్డేన్ భావిస్తే ఏముంది... మన పాలకులకు ఆపాటి స్పృహ ఉండాలిగాని! పాత అణాలపై ఆనాటి ఆంగ్ల పాలకులు 'ఒక అణా' అంటూ ఆంగ్ల, హిందీ, బెంగాలీ, తెలుగు భాషల్లో ముద్రించిన ముచ్చట్లు స్వపరిపాలకులు మరిచారు.

రాజకీయ గ్రహణం పట్టి భాషల ఉనికి మసకబారిపోతోంది. ప్రపంచీకరణ పుణ్యమా అని ఎన్నో ప్రాంతీయ భాషలు, ముఖ్యంగా ఆఫ్రికన్ భాషలు మట్టికొట్టుకుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అయిదువేల భాషలు వ్యవహారంలో ఉన్నాయని అంచనా. నేడు రమారమి రెండువేల భాషల రెక్కలు విరిగి ప్రపంచభాషల సంఖ్య మూడువేలకు పడిపోయింది.

ఇప్పుడు మనముందున్న సమస్యల్లా- నేటి అవసరాలకు సరిపడేలా తెలుగు భాషను రూపొందించేందుకు త్వరపడటం. ప్రాచీనత విషయం పక్కన ఉంచి ఆధునికతవైపు మనం దృష్టి సారించాలి. ఆధునిక భాషగా తెలుగు మనగలిగేలా మనం నడుం బిగించాలి. తెలుగు మాధ్యమంలో చదివిన సిసలైన భాషాభిమానుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి. పీజీ స్థాయిలో తెలుగును అభ్యసించిన వాళ్లకు ఉపాధి అవకాశాలు అందివచ్చేలా హామీ ఇవ్వగలగాలి. ప్రహసనంగా మారిన జిల్లాకో విశ్వవిద్యాలయం ప్రణాళికలో ఎం.ఎ. (తెలుగు) కోర్సుకు అంతంతమాత్రం చోటుండటం ఆలోచించాల్సిన విషయం. ఎం.ఎ (తెలుగు)లో పత్రికారచనను రెండు పేపర్లుగా, ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు పాఠ్యప్రణాళికను కొత్త విశ్వవిద్యాలయాలు సిద్ధం చేసుకోలేకపోవటం అంతుబట్టని విషయం. ఓవైపు ఆరువేల బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో సీబీయస్ఈ కోర్సును ప్రవేశపెడుతున్న మన సర్కారు, ఆధునికభాషగా తెలుగును ఏ మేరకు నిలబెడుతుందన్న విషయంలో సవాలక్ష సందేహాలున్నాయి. యాభైఆరు అక్షరాల తెలుగు వర్ణమాల విషయంలో ప్రామాణికత సాధించాల్సి ఉంది. ప్రాచీన ద్రావిడ మాతృకలో పదహారు హల్లులూ, పది అచ్చులూ మాత్రమే ఉన్నాయి. క్రీ.శ. ఏడో శతాబ్ది తెలుగులో పది అచ్చులూ, ఇరవైఒక్క హల్లులూ ఉండగా కాలక్రమంలో సంస్కృత ప్రభావంతో మహాప్రాణ వర్ణాలు పది (శ, ష, హ...) వచ్చి చేరాయి. ప్రాకృతం నించీ 'ఱ' ప్రవేశించింది. మరీ ఎక్కువగా తెలుగులోకి యాభైవేలకుపైగా సంస్కృత పదాలు చేరి అచ్చతెలుగు కనుమరుగైంది. తెలుగు భాషకు అడ్డుగోడగా ఆంగ్లమే కాకుండా సంస్కృతమూ వచ్చి చేరింది. ఇంటర్మీడియట్ స్థాయిలో కార్పొరేట్ కళాశాలల్లో సంస్కృతం స్థానంలో ద్వితీయభాషగా తెలుగును కనీసమాత్రంగానైనా అధికారభాషా సంఘం ఎందుకని అమలు చేయలేకపోతోందో చూడాలి. తెలుగు మీడియం పొత్తాల్లో తెలుగుపాలు ఎంతన్నది ఓ ధర్మసందేహం. సకశేరుకాలు (వెన్నెముక కలిగిన జీవులు), అకశేరుకాలు (వెన్నెముక లేని ప్రాణాలు)... వంటివి ఏ ఒక్కరికైనా బోధపడతాయా అన్నది ప్రశ్న. తెలుగులో సంతకంచేయని ఆచార్యులున్న భాషమనది. ఆంగ్లమాధ్యమంలో తరించిన సుపుత్రులున్న తెలుగు భాషోద్యమకారులు మనసొత్తు. ఇన్ని వైరుధ్యాల నడుమ తెలుగుభాష నడుం బెణక్కుండా ఆధునిక భాషగా రాణించటానికి పెద్దపెట్టున కృషి జరగాలి. అందుకు మన మనసుల విస్తీర్ణం పెరగాలి.

విషయ పరిజ్ఞానం లేని శుంఠలకు కూడా ఉద్యోగాలు వస్తాయా?


సంస్కృతం,తమిళం తో పాటు తెలుగు కన్నడ భాషలను కూడా ప్రాచీన భాషలు గా కేంద్రం ప్రకటించింది. ప్రాచీన హోదాతో వచ్చే నిధుల్ని ఆధునిక అవసరాలకు వినియోగించాలనే వాదనలు అప్పుడే మొదలయ్యాయి.చైనా భాష తమిళం కంటే ప్రాచీనం.వారు లిపిఆధునిక అవసరాలకు అనువుగాలేదని చాలా సార్లు సంస్కరించుకున్నారు.మనం కుండపెంకుల మీద, బండరాళ్ల మీద రాసుకుంటున్న రోజులలో ఒక లిపి సహితం లేని రష్యా వాళ్లు, జపాన్ వాళ్లు వారి భాషలను ఆధునిక అవసరాలకు అనువుగా మార్చారు.మన లిపిని మనం ఎందుకు మార్చుకోలేము? జాతి ఎదుగుదలకు కావలసింది వారి భాష ప్రాచీనహోదాతో పాటు ఆభాషను ఆధునిక అవసరాలకు కూడా సరిపడేలా తీర్చిదిద్దుకోవటం.భాషాభిమానంతో పాటు ప్రజల నిత్య జీవి తానికి సంబంధించిన పాలనా వ్యవహారాలలో స్వభాష పెత్తనం చేయాలి.

తెలుగు అధికార భాష చట్టం 1966లో వచ్చింది.ఉర్దూ హైదరాబాద్, అనంత పురం, కర్నూలు, కడప, గుంటూరు, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలలో రెండవ అధికార భాష అన్న సవరణ 1996లో జారీ అయింది. ప్రభుత్వం జారీ చేసే చట్టాలూ ఆదేశాలూ నియమాలూ, ప్రభుత్వం ఇతర సంస్థలతో జరిపే ఉత్తరప్రత్యుత్తరాలూ అధికార భాషలలోనే ఉండాలనీ చట్టంలో ఉంది,కానీఉర్దూలోకానీ తెలుగులోకాని అనే అమలు కావటంలేదు.ఇద్దరికీ ఇంగ్లీషే శరణ్యమయ్యింది.1988 నవంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ ఉత్తర్వులూ ఉత్తర ప్రత్యుత్త రాలూ తెలుగులోనే ఉండాలనీ, ఇంగ్లీష్ కేవలం కేంద్ర ప్రభుత్వంతో, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడే భాష అని జీవో జారీ అయ్యింది. ప్రభుత్వ ఉత్తర్వులు ఉత్తర ప్రత్యుత్త రాలు ప్రజలకు అందుబాట్లో ఉంచాలని, వారి అభిప్రాయాలు అభ్యంతరాలు వినడానికి బహిరంగ విచారణ జరపాలనీ చట్టం అంటుంది. కానీ అవి ప్రజలకర్థమయ్యే భాషలో ఉండటంలేదు. ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆ పని మాత్రం చేయటంలేదు.అలాగే న్యాయస్థానాలలో స్థానిక భాష వాడటంలేదు.తెలుగు ప్రజల జీవితాలు, ఆస్తులు, కుటుంబ వ్యవహారాలకు సంబం ధించిన వ్యాజ్యాలలో విచారణ, వాదోపవాదాలు తమకు అర్థం కాని భాషలో జరుగుతుంటే తెలుగు ప్రజలు నోరు వెళ్ల బెట్టుకొని చూస్తున్నారు.ఇది మన జాతికి అవమానకరం. తమిళులు 1976 నుంచి క్రిమినల్ కేసులు సెషన్స్ కోర్టు దాకా,1982 నుంచి సివిల్ కేసులు పూర్తిగా తమిళంలోనే జరుపుతున్నారు.

హిందీ రాష్ట్రాలు హిందీలోనూ గుజరాత్, బెంగాల్ రాష్ట్రాలుహైకోర్టుల్లో తప్ప మిగతా అన్ని కోర్టుల్లో తమ తమ భాషలలోనే న్యాయవ్యవస్థను నడుపుతున్నాయి. మనకు మెజిస్ట్రేట్ కోర్టులలో కూడా ఇంగ్లీషే.తమిళం ఇంగ్లీష్తో పోటీపడి ఎదుగుతున్నది .వత్తులు గుణింతాలు అన్నీ పక్కపక్కనే ఇంగ్లీష్లో లాగా ఒక వరసలో యంత్రానికి అనుకూలంగా తమిళ లిపి వారికి వరంగా మారింది."అరవమున డెమ్మీ ఫారము ముద్రణకు నాలుగు రూపాయలు చార్జి చేయగా తెలుగునకదేమాదిరి ఫారమునకు ఎనిమిదిరూపాయలు చార్జి చేయుచున్నారు.ఇట్లు ధర తక్కువయగుటకు కారణము అరవ లిపిలో సంకేతముల సంఖ్య మిక్కిలి తక్కువగా నుండుట.తెలుగచ్చును కంపోజిటర్లు నేర్చుకొనుటకు ఆరునెలలు పడితే అరవము ఒక నెలలో నేర్చుకొన వచ్చును.తెలుగు లిపిని గూర్చుట జాల జాగగును.గంటకు ఒక గాలీ అరవము కూర్చగలుగగా తెలుగున అరగాలీ మాత్రమే కుర్చగలము.అచ్చునకే ఇన్ని చిక్కులుండగా నింక టైపురైటింగు కుదురునా?" అని వేటూరి ప్రభాకర శాస్త్రి వాపోయారు.ఇంగ్లీషున అరవమున ఉన్నట్లు లిపి సంకేతములు ప్రక్కప్రక్కనే (ఒకదానిక్రిందనొకటి యుండకుండుట) యుండవలెనని ఆయన కోరారు.రాజీవ్ గాంధీ హత్య కేసు కూడా తమిళంలోనే జరి గిందట. అప్పీలును విచారించే సుప్రీంకోర్టు తమిళంలో ఉన్న పత్రాలన్నిటినీ ఇంగ్లీష్‌లోకి అనువాదం చేయించుకొని అప్పీల్ వింది. ఇంగ్లీష్ వచ్చిన వారికే మంచి ఉద్యోగాలు వస్తున్నందు వల్ల ప్రభుత్వ పాఠశాలలలో కూడ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నారు.పిల్లలు కొత్త భాషలు సునాయాసంగా నేర్చుకుటారని వాదిస్తున్నారు.మాతృభాషలో విద్యా బోధనే పిల్లల కు మంచిదంటే హేళనచేస్తున్నారు.మీపిల్లలు ఏ మాధ్యమం లో చదువుకుంటున్నారని ఎదురు ప్రశ్నిస్తున్నారు.పిల్లలందరినీ ఆంగ్ల మాధ్యమం లో పడేస్తే నిజంగానే గొప్పఅవకాశాలొస్తాయా? ఉద్యోగాలు వస్తున్నది ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం వల్లనా లేక విషయవిజ్ఞానం వల్లనా? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళలోకూడా విషయ పరిజ్ఞానం లేని శుంఠలకు కూడా ఉద్యోగాలు వస్తాయా?భాష నేర్చుకోవడం వేరు, భాషలో చదువు నేర్చుకోవడం వేరు.పర భాషలో చదువుపిల్లలకు హింసే. పిల్లలందరినీ ఇంగ్లీష్ మీడియంలోకి నెట్టడంకంటే ప్రైవేట్ పాఠశాలలు కూడా మాతృభాషలోనే చదువు నేర్పటం తప్పనిసరి చేయాలి. ఇంగ్లీష్‌ను కేవలం ఒక భాషగా నేర్పాలి.

లిపిసంస్కరణ కోసం ప్రాచీన హోదా నిధుల్ని వినియోగించాలి.

సంస్కృతం,తమిళం తో పాటు తెలుగు కన్నడ భాషలను కూడా ప్రాచీన భాషలు గా కేంద్రం ప్రకటించింది. ప్రాచీన హోదాతో వచ్చే నిధుల్ని ఆధునిక అవసరాలకు వినియోగించాలనే వాదనలు అప్పుడే మొదలయ్యాయి.చైనా భాష తమిళం కంటే ప్రాచీనం.వారు లిపిఆధునిక అవసరాలకు అనువుగాలేదని చాలా సార్లు సంస్కరించుకున్నారు.మనం కుండపెంకుల మీద, బండరాళ్ల మీద రాసుకుంటున్న రోజులలో ఒక లిపి సహితం లేని రష్యా వాళ్లు, జపాన్ వాళ్లు వారి భాషలను ఆధునిక అవసరాలకు అనువుగా మార్చారు.

మన లిపిని మనం ఎందుకు మార్చుకోలేము? జాతి ఎదుగుదలకు కావలసింది వారి భాష ప్రాచీనహోదాతో పాటు ఆభాషను ఆధునిక అవసరాలకు కూడా సరిపడేలా తీర్చిదిద్దుకోవటం.భాషాభిమానంతో పాటు ప్రజల నిత్య జీవి తానికి సంబంధించిన పాలనా వ్యవహారాలలో స్వభాష పెత్తనం చేయాలి. తెలుగు అధికార భాష చట్టం 1966లో వచ్చింది.ఉర్దూ హైదరాబాద్, అనంత పురం, కర్నూలు, కడప, గుంటూరు, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలలో రెండవ అధికార భాష అన్న సవరణ 1996లో జారీ అయింది. ప్రభుత్వం జారీ చేసే చట్టాలూ ఆదేశాలూ నియమాలూ, ప్రభుత్వం ఇతర సంస్థలతో జరిపే ఉత్తరప్రత్యుత్తరాలూ అధికార భాషలలోనే ఉండాలనీ చట్టంలో ఉంది,కానీఉర్దూలోకానీ తెలుగులోకాని అనే అమలు కావటంలేదు.ఇద్దరికీ ఇంగ్లీషే శరణ్యమయ్యింది.

1988 నవంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ ఉత్తర్వులూ ఉత్తర ప్రత్యుత్త రాలూ తెలుగులోనే ఉండాలనీ, ఇంగ్లీష్ కేవలం కేంద్ర ప్రభుత్వంతో, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడే భాష అని జీవో జారీ అయ్యింది. ప్రభుత్వ ఉత్తర్వులు ఉత్తర ప్రత్యుత్త రాలు ప్రజలకు అందుబాట్లో ఉంచాలని, వారి అభిప్రాయాలు అభ్యంతరాలు వినడానికి బహిరంగ విచారణ జరపాలనీ చట్టం అంటుంది. కానీ అవి ప్రజలకర్థమయ్యే భాషలో ఉండటంలేదు. ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆ పని మాత్రం చేయటంలేదు.అలాగే న్యాయస్థానాలలో స్థానిక భాష వాడటంలేదు.తెలుగు ప్రజల జీవితాలు, ఆస్తులు, కుటుంబ వ్యవహారాలకు సంబం ధించిన వ్యాజ్యాలలో విచారణ, వాదోపవాదాలు తమకు అర్థం కాని భాషలో జరుగుతుంటే తెలుగు ప్రజలు నోరు వెళ్ల బెట్టుకొని చూస్తున్నారు.ఇది మన జాతికి అవమానకరం.

తమిళులు 1976 నుంచి క్రిమినల్ కేసులు సెషన్స్ కోర్టు దాకా,1982 నుంచి సివిల్ కేసులు పూర్తిగా తమిళంలోనే జరుపుతున్నారు. హిందీ రాష్ట్రాలు హిందీలోనూ గుజరాత్, బెంగాల్ రాష్ట్రాలుహైకోర్టుల్లో తప్ప మిగతా అన్ని కోర్టుల్లో తమ తమ భాషలలోనే న్యాయవ్యవస్థను నడుపుతున్నాయి. మనకు మెజిస్ట్రేట్ కోర్టులలో కూడా ఇంగ్లీషే.తమిళం ఇంగ్లీష్తో పోటీపడి ఎదుగుతున్నది .వత్తులు గుణింతాలు అన్నీ పక్కపక్కనే ఇంగ్లీష్లో లాగా ఒక వరసలో యంత్రానికి అనుకూలంగా తమిళ లిపి వారికి వరంగా మారింది."అరవమున డెమ్మీ ఫారము ముద్రణకు నాలుగు రూపాయలు చార్జి చేయగా తెలుగునకదేమాదిరి ఫారమునకు ఎనిమిదిరూపాయలు చార్జి చేయుచున్నారు.ఇట్లు ధర తక్కువయగుటకు కారణము అరవ లిపిలో సంకేతముల సంఖ్య మిక్కిలి తక్కువగా నుండుట.తెలుగచ్చును కంపోజిటర్లు నేర్చుకొనుటకు ఆరునెలలు పడితే అరవము ఒక నెలలో నేర్చుకొన వచ్చును.తెలుగు లిపిని గూర్చుట జాల జాగగును.గంటకు ఒక గాలీ అరవము కూర్చగలుగగా తెలుగున అరగాలీ మాత్రమే కుర్చగలము.అచ్చునకే ఇన్ని చిక్కులుండగా నింక టైపురైటింగు కుదురునా?" అని వేటూరి ప్రభాకరశాస్త్రి, వేటూరి ప్రభాకరశాస్త్రి వాపోయారు.
ఇంగ్లీషున అరవమున ఉన్నట్లు లిపి సంకేతములు ప్రక్కప్రక్కనే (ఒకదానిక్రిందనొకటి యుండకుండుట) యుండవలెనని ఆయన కోరారు.రాజీవ్ గాంధీ హత్య కేసు కూడా తమిళంలోనే జరి గిందట. అప్పీలును విచారించే సుప్రీంకోర్టు తమిళంలో ఉన్న పత్రాలన్నిటినీ ఇంగ్లీష్‌లోకి అనువాదం చేయించుకొని అప్పీల్ వింది. ఇంగ్లీష్ వచ్చిన వారికే మంచి ఉద్యోగాలు వస్తున్నందు వల్ల ప్రభుత్వ పాఠశాలలలో కూడ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నారు.పిల్లలు కొత్త భాషలు సునాయాసంగా నేర్చుకుటారని వాదిస్తున్నారు.మాతృభాషలో విద్యా బోధనే పిల్లల కు మంచిదంటే హేళనచేస్తున్నారు.మీపిల్లలు ఏ మాధ్యమం లో చదువుకుంటున్నారని ఎదురు ప్రశ్నిస్తున్నారు.పిల్లలందరినీ ఆంగ్ల మాధ్యమం లో పడేస్తే నిజంగానే గొప్పఅవకాశాలొస్తాయా? ఉద్యోగాలు వస్తున్నది ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం వల్లనా లేక విషయవిజ్ఞానం వల్లనా? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళలోకూడా విషయ పరిజ్ఞానం లేని శుంఠలకు కూడా ఉద్యోగాలు వస్తాయా?భాష నేర్చుకోవడం వేరు, భాషలో చదువు నేర్చుకోవడం వేరు.పర భాషలో చదువుపిల్లలకు హింసే. పిల్లలందరినీ ఇంగ్లీష్ మీడియంలోకి నెట్టడంకంటే ప్రైవేట్ పాఠశాలలు కూడా మాతృభాషలోనే చదువు నేర్పటం తప్పనిసరి చేయాలి. ఇంగ్లీష్‌ను కేవలం ఒక భాషగా నేర్పాలి.ఇంగ్లీషు,తమిళ భాషల లాగా మన తెలుగులిపి సంకేతములు ప్రక్కప్రక్కనే కూడా ఉండేలా లిపిసంస్కరణ (ఇంకా రాయలేదు లిపిసంస్కరణ కోసం ప్రాచీన హోదాద్వారా వచ్చే నిధుల్ని వినియోగించాలి.

చక్కని తెలుగుకు చాంగుభళా!

చక్కని తెలుగుకు చాంగుభళా!
- రావూరి ప్రసాద్
మేడలా, మిద్దెలా, కరెన్సీ నోట్లా, కనకాభరణాలా... ఏది నిజమైన ఆస్తి?

ఆరుద్ర మాటల్లో చెప్పాలంటే-
'ఎవరికైనా ఆస్తిఏముంటుంది?
సంగీతంలో సప్తస్వరాలు
సాహిత్యంలో యాభైరెండు అక్షరాలు!'

నిజం. అసంఖ్యాకమైన రాగాలకు ఊపిరిలూదిన ఏడంటే ఏడు స్వరాలకంటే, అసమానమైన రసరమ్య కావ్యాలెన్నింటికో రెక్కలు తొడిగిన యాభైరెండు అక్షరాలకంటే వేరే కలిమి ఎవరికైనా ఏముంటుంది?

అవును. అజరామరమైన ఆ సప్తస్వరాలే తెలుగువాడిగా నా ఆస్తి! అక్షయమైన ఆ యాభైరెండు అక్షరాలే తెలుగువాడిగా నా ఆస్తి!

పట్టుతేనెలోని మధురిమను చిలకరించే నా తెలుగు అక్షరాలకు సాటిరాగల మేడలేవి?

వెన్నెల జలపాతాన్ని కురిపించే నా తెలుగు పదం వన్నెచిన్నెలకు ఏ కనకాభరణాల మిలమిలలు సరితూగగలవు?

నింగీ, నేలా నడుమ నిలువెత్తు సంతకమై నిలిచిన నా తెలుగు వాక్యం ఠీవికి ఏ ఆకాశహర్మ్యం సొగసులు దీటు కాగలవు?

ఆమని సౌందర్యాన్ని తన అక్షరాల్లో సాక్షాత్కరింపజేసే నా తెలుగు 'సరస్వతమ్మ' పలుకుల కలరవాలకు ఎన్ని కరెన్సీ నోట్ల రెపరెపలు సరిపోలగలవు?

రామకథా 'రాగసుధాపానముచేసి' తెలుగు మనసు రంజిల్లడానికి త్యాగయ్య నాదమయం చేసిన సంగీతార్ణవంలోని సప్తస్వరాల క్షీరధారలు నా తెలుగు అక్షరాలు-

తెలుగునేల చీకట్లను పారదోలడానికి వేల సంకీర్తనల్లో అన్నమయ్య వెలిగించిన 'వెన్నెలవంటి శ్రీవేంకటేశు మంత్రము'లోని మణిదీప్తులు నా తెలుగు అక్షరాలు-

మాధవస్వామికి క్షేత్రయ్య అలదిన మధుర పద భక్తిచందనంలోని పరిమళాలు నా తెలుగు అక్షరాలు-

ప్రభువులు సాక్షాత్తు దైవాంశ సంభూతులేనని భావించే కాలంలోనే 'ఇమ్మనుజేశ్వరాధములు' అంటూ 'పాలక దేవుళ్ల' నిజరూపాన్ని బయటపెట్టిన పోతన ధిక్కార గళంలోని రణన్నినాదాలు నా తెలుగు అక్షరాలు-

'రాజుల్ మత్తులు' అంటూ ఆ రోజుల్లోనే ఎలుగెత్తిన ధూర్జటి ఘంటారావంలోని గర్జనలు నా తెలుగు అక్షరాలు-

'మనుష్యుడే నా సంగీతం, మానవుడే నా సందేశం' అని చాటి దోపిడీలకు, అసమానతలకు, దౌర్జన్యాలకు తావులేని 'మరో ప్రపంచం' వైపు పదండి ముందుకు అంటూ శ్రీశ్రీ క్రాంతి గానం మీటిన కత్తి అంచులమీది తళతళలు నా తెలుగు అక్షరాలు-

'ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది' అంటూ వైతాళికుడు గురజాడ వందేళ్ల క్రితమే నినదించిన భవిష్య వాక్కులు నా తెలుగు అక్షరాలు-

నన్నెచోడుని నుంచి నవయుగ కవిచక్రవర్తి జాషువా దాకా, కవిత్రయం నుంచి కృష్ణశాస్త్రి దాకా, వేమన నుంచి విశ్వనాథ దాకా ఎందరెందరో సాహితీ సారస్వతమూర్తులు తమ అమృత కరస్పర్శతో సుసంపన్నం చేసిన తెలుగు అక్షర భాండాగారం మన ఆస్తి!

ద్వారం వెంకటస్వామి నుంచి జనార్దన్ వరకు, ఈమని శంకరశాస్త్రి నుంచి షేక్ చినమౌలానా వరకు; బాలమురళీకృష్ణ నుంచి నూకల చినసత్యనారాయణ వరకు ఎందరో నాద, గాన యోగులు తమ వేళ్ల కొసలతో, గాత్రమాధుర్యంతో సంపద్వంతం చేసిన సంగీత రసధుని మన ఆస్తి!

ఈ ఆస్తిని కాపాడుకోవాలంటే నిరంతరం తెలుగు అక్షరాలు వెలుగుతుండాలి. తెలుగు పదాలు పల్లవిస్తుండాలి. తెలుగు శబ్దాలు వేదాలై, నాదాలై ప్రతి గుండెలో ప్రతిధ్వనిస్తుండాలి. 'జాను తెనుగే మేము- జాతి ఘనతే మేము' అంటూ మల్లాది రామకృష్ణశాస్త్రి మోగించిన తెలుగు జయభేరిని సగౌరవంగా అందుకుంటూ తెలుగువారిలో ప్రతి ఒక్కరూ సగర్వంగా ముందుకు సాగాలి

తెలుగుభాషకు ప్రాచీన హోదా

తేనెలొలుకు భాష తెలుగుభాష, తెలుగు భాష మాట్లాడినా, చదివినా, విన్నా నిస్సందేహంగా అమృతంలా ఉంటుంది.అందుకు తగ్గట్లే రాష్ట్ర అధికార తెలుగు భాషా సంఘం చేసిన అవిరాళ కృషికి నేడు ఫలితం దక్కింది. ఇందుకుగానూ తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు, ప్రముఖ పాత్రికేయులు ఏ.బి.కె.ప్రసాద్ చేసిన కృషి ప్రశంసనీయం.ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తెలుగు భాషాభిమానులకు తీపికబురు అందింది. తెలుగుభాషకు ప్రాచీనహోదా దక్కింది.
తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడం వెనక రాష్ట్ర అధికార తెలుగు భాషా సంఘం చేసిన ప్రయత్నాలు ఆమోఘమైనవి. కేంద్రంలో ఉన్న కమిటీకి నివేదికలు ఇవ్వడం, సచివాలయంలో సంప్రదింపులు జరపడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడితేవడంలో తెలుగు భాషా సంఘం కీలక పాత్ర వహించింది.ఈ వార్త వెలువడడం వెనక భాషాభిమానులు, విద్యావేత్తలు, కవులు, రచయితల కృషి మరువలేనిది. అంతేకాకుండా కేంద్రంపై ఒత్తిడి తేవడంలో ఎబికె ప్రసాద్ చేసిన ప్రయత్నాలెన్నో.ఎబికే తెలుగు భాషా ప్రాచీన హోదాకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తూ, తెలుగు భాష ప్రాచుర్యానికి విస్తృతంగా ప్రచారం చేశారు. తెలుగుభాషకు మరింత ప్రాచుర్యం కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఏబికే ప్రసాద్ నేతృత్వంలో తెలుగు భాషా సంఘం ఈ మధ్యనే తెలుగు భాషా పతాకాన్ని రూపకల్పన చేసి ఆవిష్కరింపజేశారు. వచ్చేఉగాది నుంచి ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తెలుగువారి ఇళ్ళ ముంగిట ఈ పతాకం రెపరెపలాడాలని ఆయన ఆకాంక్షించారు. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి ఒకరోజు ముందు కేంద్ర ప్రభుత్వం పాచీనహోదా కల్పించడంతో రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొంది.
మాతృభాష విషయంలో గాంధీజీ ఆశించిన లక్ష్యాలు అనుకున్న విధంగా నెరవేరలేదు. స్వంత భాషలకు తిలోదకాలిచ్చి నిజమైన అభ్యుదయాన్ని సాధించలేరన్న గాంధీజీ మాటలను స్పూర్తిగా తీసుకున్న ఏబికే అందుకు తగ్గట్లుగానే భాషా ఉద్యమానికి నడుంబిగించారు. ప్రపంచకీరణ పేరిట వ్యాపార ప్రయోజనాల కోసం మాతృభాషలను మింగజూసే ఆంగ్లీకరణ విధానం, తెలుగు భాషకు తెలుగు దనానికి చేటు తీసుకొచ్చే పరిస్థితులు ఎదురవుతున్నాయి.ఇప్పటికే తెలుగు భాషకు తీవ్రమైన నష్టం జరిగిపోయింది. పాఠశాల దశలోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ చివరకు మన ఇళ్లల్లో కూడా తెలుగు వాడకం కరువవడమే నేడు కరువైపోతున్న తరుణంలో తెలుగుభాషా సంఘం ప్రయత్నాలు ఆరంభించి అందులో సఫలీకృతమయింది.ఈ సందర్భంలో తెలుగు భాషా సంఘం ప్రదానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిలకు కృతఙ్ఞతలు తెలియజేసింది. తెలుగుభాషకు ప్రాచీన హోదా కల్పించినందుకు ప్రతి తెలుగువాడి ఇంట ఆనందం వెల్లువెరుస్తోంది.

నలుగురి కోసం 'నారాయణ'

నలుగురి కోసం 'నారాయణ'
సామాజిక సంబంధాలకే పెద్దపీట
అందరినీ కలుపుకుపోవడమే ఉత్తమం
మారుతున్న యువత ధోరణి
గుడికి వెళతారు.. కానీ పెద్దగా భక్తి లేదు. అర్చనలు చేస్తుంటారు.. కానీ అంత ఆసక్తితో కాదు. నేటి యువతలో భక్తి కొరవడుతోందని ఓవైపు.. లేదు మళ్లీ పెరుగుతోందని మరోవైపు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువతను పలకరిస్తే.. ''భక్తిమాటెలా ఉన్నా 'సంప్రదాయాలను' మాత్రం వదులుకోం'' అని స్పష్టంగా చెబుతుండటం విశేషం!

''దేవునిపై నాకు ప్రత్యేకంగా నమ్మకం లేదు. అలాగని అపనమ్మకమూ లేదు. ఒక రకంగా ఆ విషయానికి నేను అంత ప్రాధాన్యం ఇవ్వను. సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడు అమ్మానాన్నలతోపాటు పండగలు జరుపుకుంటాను. బంధువులతో కలిసి చర్చికి వెళ్తా'' అని చెబుతారు కేరళకు చెందిన చైత్ర. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ చేస్తున్నారామె. భగవంతునిపై అంతగా నమ్మకం లేనప్పుడు చర్చికి ఎందుకు వెళతారు అని అడిగితే.. అందరితో కలవటం కోసం అని అంటారు! వెళ్లకపోతే అందరికీ దూరంగా విడిగా ఉండాల్సి వస్తుంది, అలా ఉండటం నాకు ఇష్టం లేదని చెబుతున్నారు చైత్ర. నేటి యువత ఆధ్యాత్మిక విషయాలు, ఆచార వ్యవహారాలను వేర్వేరుగా చూస్తున్నారనటానికి చైత్ర ఓ నిదర్శనం. ఈ ధోరణి కొద్దిమందికే, కొన్ని ప్రాంతాలకే పరిమితం కాలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ ఇంగ్లిష్ చేస్తున్న సంపత్‌ను కదిలించినా ఇలాంటి అభిప్రాయమే వినిపిస్తుంది. ''దేవుని విషయంలో నాకంటూ ప్రత్యేకంగా ఇష్టాయిష్టాలేమీ లేవు. మిత్రులతో కలిసి ఎప్పుడైనా గుడికి వెళ్తుంటా. కాకపోతే గాఢమైన భక్తేమీ లేదు. ఓ పక్కన కూర్చుని వచ్చిపోయే వాళ్లని గమనిస్తూ ఉంటా'' అని అంటారు. పెళ్లి సంప్రదాయబద్ధంగా చేసుకుంటారా? లేక రిజిస్ట్రేషన్‌లాంటి పద్ధతుల్లో పయనిస్తారా? అని అడిగితే మొదటి దానికే తన ఓటు అని ఘంటాపథంగా చెప్పారు. ''పెళ్లంటే అమ్మానాన్నా, బంధువులు, స్నేహితులు... వీరందరితో ముడివడిన అంశం. నా ఒక్కడికే పరిమితమైంది కాదు. వాళ్లందరి అభిప్రాయాలను, నమ్మకాలను కాదని నేను వెళ్లను. అందిరినీ కలుపుకొని పోతేనే ఆనందం కదా'' అని తన దృక్పథాన్ని వివరిస్తారు సంపత్.

మార్పు వస్తోంది
ఇప్పటికీ ఎంతో దీక్షగా పూజలు, ఉపవాసాలు చేసే యువతీయువకులూ కొదవ లేదు. నల్గొండకు చెందిన మనోహర్ పొద్దున్నే సూర్యనమస్కారంతోనే దినచర్య ప్రారంభిస్తారు. ప్రతీ శనివారం తప్పకుండా గుడికి వెళ్తారు. జీవితంలో ఏది జరగాలన్నా భగవంతుని కృప ఉండాలనీ, దానికి మన ప్రయత్నం తోడుగా నిలవాలని చెబుతారు. మరోవైపు 'గాఢ భక్తికి కారణం భయమేనంటారు' నిజామాబాద్‌కు చెందిన ఎంఏ విద్యార్థి శ్రీకాంత్‌రెడ్డి. ''దేవుణ్ణి నమ్మకపోతే ఏమైనా అవుతుందేమోనని భయం. ఇటీవల ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్‌కు ముందు పూజలు చెయ్యలేదా? ఆ ప్రయోగం తప్పకుండా విజయవంతం అవుతుందనే నమ్మకమే వాళ్లకు ఉంటే పూజలు చేసేవారా?'' అని ప్రశ్నిస్తారు. విషయం ఏమిటంటే ఆయన కూడా దేవున్ని నమ్ముతారు. మరి, మీకున్న భయమేమిటి అని అడిగితే, ''జీవితంలో ఎలా స్థిరపడతానో అనే భయం. ఆ తర్వాత అనువైన భార్య దొరకాలని, పిల్లలు పుట్టాలని ఇలా... కోరికలు వాటితోపాటే భయాలు వస్తూనే ఉంటాయి'' అని నిర్మొహమాటంగా తన అంతరంగాన్ని వెల్లడిస్తారు. భయం మాటెలా ఉన్నా.. యువతరం భక్తిలో ఆధ్యాత్మికమైన గాఢత లేకపోవటం మాత్రం కొట్టొచ్చినట్టు కనబడుతున్న వాస్తవం. యువత ఆలోచనల్లో వస్తున్న ఇలాంటి మార్పుల వల్లే భక్తి-సంప్రదాయాలు రెండూ ఇప్పుడు వేర్వేరు దార్లుగా మారిపోయాయి.

దేని దారి దానిదే
గతంలో భక్తి, సంప్రదాయం రెండూ కలిసిపోయే ఉండేవి. గుడికి వెళ్లటంలో, పూజలు చేయటంలో ఎంత ఉత్సాహం కనిపించేదో పండగలు, తంతుల్లోనూ అంతగా మమేకమయ్యేవారు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య అవినాభావం తగ్గుతోంది. పరీక్షల సమయంలోనో, ఇంటర్వ్యూకు వెళ్లాల్సి వచ్చినప్పుడో, మరేదైనా సమస్య తలెత్తినప్పుడో తప్ప దైనందిన జీవితంలో దైవానికి తొలిప్రాధాన్యం ఇవ్వటం తక్కువేనంటున్నారు చాలామంది యువకులు. ఆడపిల్లలు మాత్రం ఇందుకు కొద్దిగా భిన్నం. రోజువారీ భక్తిగా ఉండే ఆడపిల్లల సంఖ్య కొంత ఎక్కువగానే కనబడుతోంది. ఈ భక్తి మోతాదు యువతలో ఎలా ఉన్నా.. సంప్రదాయాలకు మాత్రం అంతా పెద్దపీట వేస్తుండటం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గుంటూరుకు చెందిన పీహెచ్‌డీ విద్యార్థి శ్రీనివాస్‌నే తీసుకుంటే... తాను దేవున్ని నమ్మనని, నాస్తికుణ్ణని చెబుతారు. ఏడాది క్రితం ఆయన పెళ్లి మాత్రం సంప్రదాయబద్ధంగానే జరిగింది. పెళ్లితంతుపై నమ్మకం లేనప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు అంటే 'అమ్మానాన్న బాధపడతారు, అందరూ నన్ను దూరంగా ఉంచుతారు. అంత రిస్కు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆ తంతు కాదంటే పెద్ద రభస. అదే తలూపితే.. అంతా ఎంజాయ్ చేస్తారు కదా' అంటారు.

మొత్తానికి వ్యక్తిగత నమ్మకాలెలా ఉన్నా.. సామాజిక జీవనానికి సంప్రదాయాలే ఆలంబనగా నిలుస్తున్నాయన్న విషయం యువత అభిప్రాయాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకూ పాలూనీళ్లలా కలగలిసిపోయిన భక్తి-ఆచారాలను.. నేటి యువత హంసలా నేర్పుగా వేరు చేస్తుండటం విశేషం

Tuesday, November 11, 2008

వెబ్‌లో అంత్యక్రియలు

దహన సంస్కారం.. దేశదేశాలా వీక్షణం వెబ్‌లో అంత్యక్రియలు ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం ఎన్నారైల్లో ప్రత్యేక ఆసక్తి;అయ్యో.. కడసారి చూపైనా దక్కలేదే&; ఆత్మీయులు చనిపోయినప్పుడు దూరప్రాంతాలు, విదేశాల్లోని బంధువులు అనుకునే మాటే ఇది. కానీ.. దీనికీ ఓ అత్యాధునిక పరిష్కారం ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. అంత్యక్రియల తంతు యావత్తూ ఇంటర్నెట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఇప్పుడు చాలా సంస్థలు ముందుకొస్తున్నాయి.

ఇప్పటికే గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో రెండు సంస్థలు ఈ సదుపాయాన్ని ప్రాచుర్యంలోకి తెస్తున్నాయి. విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ప్రసారాలు మున్ముందు మరింతగా విస్తరించటం తథ్యమంటున్నారు పరిశీలకులు.వివేక్ అమెరికాలో ఉంటాడు. గుజరాత్‌లో ఉండే తన అమ్మమ్మ ఓ రోజు హఠాత్తుగా చనిపోయింది. తానున్న పరిస్థితిలో వెంటనే బయలుదేరి రావటం అసంభవం. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు? అయినవాళ్లందరికీ దూరంగా.. ఒక్కరే తమలోతాము కుమిలిపోతారు. కానీ వివేక్ అలా విచారించలేదు. అమెరికాలోనే ఉండి అమ్మమ్మ అంత్యక్రియలను, అక్కడ చేరిన బంధువులందరినీ ప్రత్యక్షంగా చూశాడు. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? అంతా వెబ్‌కాస్ట్; మహిమ. గుజరాత్‌లోని ముక్తిధామ్ శ్మశానవాటిక ఇంటర్‌నెట్ ద్వారా ఈ సౌకర్యాన్ని అందిస్తోంది మరి. దూరప్రాంతాల్లో ఉన్న బంధువుల కోసం దహనక్రియలను ఇలా నెట్‌ద్వారా ప్రసారం చేస్తోంది. దీనికోసం తమ వెబ్‌సైట్ ్ఝ్య్త్మ్ౖట్త్చ్ఝ.్న్్ణలో ప్రత్యేక స్థానాన్ని కేటాయించింది. అంత్యక్రియలకు రాలేకపోయిన బంధువులు, స్నేహితులకు నిజంగా ఇక్కడే, తమవారందరితో ఉన్నామన్న భావన కలిగించడమే దీని ఉద్దేశం; అని అంటున్నారు ఈ ముక్తిధామ్ మేనేజర్ అశోక్ ఆచార్య.

కుమారుడు అమెరికా నుంచి రావటంలో జాప్యం జరగటంతో ఓ వృద్ధుడి శవాన్ని రెండురోజుల వరకు అలాగే ఉంచాల్సి వచ్చింది. అప్పుడే మాకీ ఆలోచన వచ్చింది. స్థానిక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల సాయంతో కొద్దిరోజుల్లోనే దీన్ని ప్రారంభించాం అని చెప్పారు. వారి శ్మశానవాటికలో రెండు వెబ్ కెమెరాలను ఇంటర్నెట్‌కు అనుసంధానం చేశారు. కావలసిన వారంతా పాస్‌వర్డ్ తీసుకుని దేశవిదేశాల్లో ఎక్కడున్నా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. పైగా ఈ సేవ మొత్తం నామమాత్రంగా ఒకే ఒక్క రూపాయికి అందిస్తుండటం విశేషం. మొదట్లో ఇబ్బందులు ఎదురైనా బ్రాడ్‌బ్యాండ్ అందుబాటులోకి రావటంతో ప్రసార నాణ్యత పెరగటమే కాకుండా, దీనికయ్యే ఖర్చూ తగ్గిందనీ, ఇలా ఇప్పటివరకూ 18 దేశాల్లోని బంధువులు 300 మంది అంత్యక్రియలను చూడగలిగారని అశోక్ తెలిపారు. నెలకు దాదాపు 8 అంత్యక్రియలను ఇలా వెబ్ ద్వారా ప్రసారం చేస్తున్నారు.ఇలాంటి శ్మశానవాటికే చెన్నైలో మరోటి ఉంది. మద్రాస్ సెమెటరీస్ బోర్డ్ తమ వెబ్‌సైట్ ద్వారా అంత్యక్రియల ప్రత్యక్ష ప్రసారాలను అందిస్తోంది. క్రైస్తవుల కోసం ఉద్దేశించిన ఈ శ్మశానవాటిక.. ప్రత్యక్షప్రసారంతో పాటు వాటిని రికార్డు చేసి మరీ తమ సైట్‌లో ఉంచుతోంది. కావాలనుకుంటే దాన్ని డీవీడీ రూపంలోనూ తీసుకోవచ్చు.మొత్తానికి వూపందుకుంటున్న ఈ కొత్త ధోరణి.. అంత్యక్రియలకు హాజరుకాలేని కుటుంబ సభ్యులు, బంధువులకు ఎంతో చింత తీరుస్తోంది. ఇక ఇంటర్నెట్లో పెళ్లిచూపులే కాదు.. ఆఖరి చూపులూ చూస్కోవచ్చు!