welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Monday, January 25, 2010

రెండో పాప / బాబును దత్తత తీసుకోండి

 

రెండో పాప / బాబును దత్తత తీసుకోండి

చాలా ఏళ్ల కిందట ఒక మిత్రుడు చెప్పాడు ఈ కాన్సెప్ట్ ను. మొదటి సంతానం కలిగాక అక్కడితో ఆపేసి, రెండో పాప బాబు కావాలనుకున్నపుడు ఒక అనాధను దత్తత తీసుకోవాలి అని చెప్పాడు. దీనివల్ల ఒకరికి పూర్తి స్థాయి జీవితాన్ని ఇవ్వగలిగినవారు అవుతారు. జనాభా సమస్య అరికట్టడానికి వ్యక్తిగత స్థాయిలో కృషి చేసినట్లు అవుతుంది. ఒక అనాథకు జీవితం ఇవ్వడం అంటే వారు ఒక జీవితానికి సరిపడా సేవ
చేసినట్లే అని నా భావన.

అలాగే పిల్లలు లేనివారు ఏళ్ళతరబడి అలా పిల్లలకోసం ఖర్చు పెట్టుకునే బదులు దత్తత తీసుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా ఈ వైద్యం చేయించుకునే క్రమంలో ఆడవారికి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవి మరోరకమైన హింస. వర్తమానాన్ని ఆనందించడం మాని చాలామంది భవిష్యత్తు కోసం బాధ పడుతుంటారు. విసిగివేసారిన దంపతులకు ఆ పాప / బాబు రాక అంతులేని సంతోషాన్ని ఇస్తుంది. దాన్ని ఆస్వాదించాలి.
సమాజం, బంధువులు ఏమనుకుంటారో అన్న ఫీలింగ్ మొదట వదిలేయాలి. మనం జీవిస్తోంది మనకోసం. మనం ఎవ్వరికీ హాని చేయడం లేదు.

ఏమి చేసినా ఎన్ని సాధించినా మనం మూటగట్టుకు పోయేది ఏం లేదు.

పిల్లలు లేని రెండు జంటలకు నేను ఈ విధమైన చైతన్యం కల్పించగలిగాను. రెండో జంటతో ఈ రోజు నేను స్వయంగా అప్లికేషన్ వేయిస్తున్నాను.

వీరికంటే ముందు నేను ఆచరించాను. మా పాప చాలా చాలా యాక్టివ్. మా ఇంటిల్లిపాదీ ఎంతో సంతోషంగా ఉన్నాం.

మీ పరిధిలో పిల్లలు లేని దంపతులకు ఈ రకమైన చైతన్యం కల్పించండి. ప్రతి జిల్లా ప్రధాన కేంద్రంలోని ICDS కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు లేదంటే హైదరాబాద్ లోని శిశువిహార్ కార్యాలయంలో ఇవ్వవచ్చు. కాకపోతే పిల్లలు తీసుకోవడానికి మన వంతు రావాలంటే రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది. అందుకే అప్పటికప్పుడు అని కాకుండా ఒక దరఖాస్తు వేసి, ఈ లోపు పిల్లలు కలిగితే దాన్ని రద్దు
పరచుకోవచ్చు.

1 comment:

Anonymous said...

నాకు ఆ ఆలోచన ఎప్పటి నుండో మదిలో ఉంది, నేను తప్పకుండ అలాగే చేద్దామనుకుంటున్నాను కూడా....! ఇది చాల ఉపయోగకరమైనది. పెద్ద మనసు కలిగి ఉండాలి...!