welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Monday, January 25, 2010

e-హదీసులను కూడా వెలువరిస్తారని ఆశిస్తున్నాను

 

 తెలుగుజాతి ఇంగ్లీషు, హిందీ, తదితర జాతులతో సమంగా తలెత్తుకొని తిరిగే వాతావరణం రాష్ట్రంలో కలగాలి. ఎవరి భాషను వారు గౌరవించటం, వారి భాషకు సర్వాధికారాలు కలగాలని కోరుకోవటం తప్పు కాదు కదా? తెలుగుకు రెండవ జాతీయ అధికారభాష హోదా, ప్రాచీన భాష హోదా కల్పించాలని కోరుతుంటే.....గొంతెమ్మ కోర్కెలు మానుకోమనీ, ఉట్టికెక్కలేనమ్మ న్వర్గానికి ఎలా ఎక్కుతుందనీ, ఇంట గెలచి రచ్చ గెలవమనీ,
అత్యాశ పనికి రాదని.....కొందరు తెలుగు పెద్దలే నాకు చెప్పారు. కాని వారికికూడా అంతరంగంలో వారి మాతృభాష ఉట్టికెక్కాలని,ఇంట గెలవాలని,రచ్చలో కూడా గెలవాలనే ఉంది. ఎంతైనా వారూ తెలుగు బిడ్డలే కదా! కాకపోతే ప్రన్తుత పరిస్థితిని చూని ఇవి తీరే కోర్కెలు కావని నిరాశ.ఎప్పటికైనా ఈ కోర్కెలు తీరాలనీ, తెలుగు బ్రతకాలనీ, తెలుగు ఏలాలని, తెలుగుకు సరైన న్యాయం జరగాలనీ నా ఆశ. నేను
ఆశావాదిని.
ప్రజల భాషకు పట్టం కట్టడం ఏనాటికైనా తప్పదు.
''మద్రాను లేని తెలుగు రాష్రం తలలేని మొండెం లాంటిది అని అమరజీవి పొట్టి శ్రీరాములు ఎంతగానో వాపోయారు. తెలుగు విద్వాంనులు నంగీత సాహిత్య రంగాలలోనే గాక ఇతర రంగాలన్నింటిలో ఆనాటికే చెన్నైలో చేసిన అభివృద్ధిని మనం వదులుకున్నాం. బళ్ళారి, బరంపురం లాంటి తెలుగు ప్రాంతాలు కూడా కోల్పోయాం. ఆంధ్ర రాష్రం ఏర్పడిన మరునాడే తెలుగు అనెంబ్లీ తరలి పోవాలని, తెలుగువారి రాజధాని
మద్రాసులో ఉండటానికి ఒక్కరోజు కూడా ఆతిద్యం ఇవ్వటం కుదరదని సి. రాజగోపాలాచారి తెగేసి చెప్పాడట. దాంతో తెలుగు నాయకులు కర్నూలుకు వెళ్ళారు. మళ్ళీ అక్కడ్నుంచి హైదరాబాదుకు వెళ్ళారు. ఇలా నిరంతరం వలసలు వెళ్ళే శరణార్థులకు ఆశ్రయ మిచ్చేవారి భాషే వస్తుంది కాని, వారి సొంత భాష వికసించదు. ఏ భాషవారికైతే అత్యధిక నంఖ్యాకులు వారి భాషనే మాట్లాడే సుస్థిర రాజధాని నగరం ఉంటుందో,
వారి భాష కూడా నులభంగా రాజ్యమేలుతుంది. రెండు మూడు భాషలవారు అధికార యంత్రాంగంలో ఉన్నపుడు ఒకరి భాష ఒకరికి అర్థంగాక, ఎవరి భాష పెత్తనం కోనం వారు పెనుగులాడుతుంటే, ఇద్దరినీ మర్ధించే మూడో భాష పెత్తనం చెలాయిన్తుంది.
''భాషను ఆధునిక శాన్త్ర సాంకేతిక పదాలతో పరిపుష్ఠం చేసినపుడే ఆ భాషలో చదివే చదువులు ఉపాధి చూపుతాయి అన్నారు రాష్రపతి అబ్దుల్ కలాం. మన భాషా పాటవంతో చదివినవారికి ఉపాధి రంగంలో రిజర్వేషన్లు ఇచ్చి ప్రోత్సహించినా ఎంతోమంది తెలుగు భాషలోనే శాన్త్ర సాంకేతిక విద్యలు చదవటానికి తరలి వస్తారు. కోటి విద్యలు కూటి కొరకే కదా!---(తెలుగు అధికార భాషకావాలంటే) పుస్తకంలో నా ముందుమాట.
ఖురాన్ సహా అనేక ఇతర ఇస్లామిక్ పుస్తకాలను నెట్ లో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలుగా ఉంచిన TIP పెద్దలకు కృతజ్నతలు.e-హదీసులను కూడా త్వరలో వెలువరిస్తారని ఆశిస్తున్నాను.


TIP వంటి అనేక తెలుగు వెబ్సైట్ల అవసరం ఉన్నది.


www.islamhouse.com  తెలుగు విభాగంలో

కూడా అమూల్యమైన అనేక తెలుగు పుస్తకాలు, వ్యాసాలు, దివ్యగ్రంథాల అనువాదాలు ఉన్నాయి. వీటిని ఉచితంగా చదువుకోవచ్చును, డౌన్ లోడు చేసుకోవచ్చును. మీరు చెప్పినట్లు వేరే నగరాలలో మన రాజధాని ఉండటమనేది తెలుగు భాష ఎదుగుదలకు ఒక అవరోధంగా నిరూపితమైనది. మనకు ఎదురైన ఈ రెండు చేదు అనుభవాల (మద్రాసు, హైదురాబాదు రాజధానుల నుండి ఖాళీ చేయవలసి రావటం) ద్వారానైనా మనం గుణపాఠం నేర్చుకోవలసి ఉన్నది.1 comment:

Anonymous said...

హైదరాబాదులో మన బాష దుస్థితి వర్ణించలేనటువంటిది. ఇంట గెలిచి రచ్చ గెలవమని సామెత మనకు ఉండనే ఉంది. పార్లమెంటు భవనాలకు కక్రుత్తిపడి హైదరాబాదును రాజధాని చేయకుండా ఉంటె మనకు ఈ పరిస్తితి వచ్చేది కాదు. ఏ వైజాగ్నో ,విజయవాడనో రాజధాని చేసి ఉంటె చాల బాగుండేది. అప్పటి హైదరాబాద్ "కేవలం" ఆ భవంతులతో మిగిలిపోయేది. పదే పదే దిన్ని కారణంగా చూపించే TRS కార్యకర్తలందరు వాటి పైకెక్కి అలవాటు ప్రకారం "దావాత్" చేసుకోనేవాళ్ళు.