welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Monday, January 25, 2010

ఏకాభిప్రాయం కుదురుతుందా?

 

సమైక్యాంధ్రుల వాదనలు

* పూర్తిగా అభివృద్ధి చెందిన తెలంగాణా ఇప్పుడు విడగొడితే కోస్తా వనరులన్నీ అటే వెళ్తాయి. దీనివల్ల కోస్తా ప్రాంతంలోని రైతులకు కష్టాలు తప్పవు, కోస్తాంధ్రకు ప్రధాన జలవనరులు కృష్ణా, గోదావరి జలాలు. సమైక్యాంధ్ర నుంచి తెలంగాణాను వేరుచేస్తే కోస్తాఆంధ్ర ఎడారిగా మారుతుంది. తెలంగాణా విడిపోతే ఆ ప్రాంత ప్రజలు కోస్తాంధ్రకు రావాల్సిన నీటిని అడ్డుకుంటారు, ఫలితంగా
వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలు మూతపడి నిరుద్యోగం పెరుగుతుంది. ఖమ్మం జిల్లాలో 256 గ్రామాలు సుమారు లక్ష ఎకరాలు మునిగిపోతాయనే సాకుతో పోలవరం ప్రాజెక్టును కూడా అడ్డుకుంటారు. విద్యుత్తు సరఫరాలో కూడా అంతరాయాలు ఏర్పడతాయి, తెలంగాణా నుంచి కోస్తాంధ్రకు చెందిన ఉద్యోగులను తరిమివేస్తారు. కోస్తాంధ్రకు ఆదాయాలు కూడా తగ్గుతాయి.ఇటు తెలంగాణ, అటు జైఆంధ్ర ఉద్యమం నడుస్తున్న
సమయంలో సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు గట్టిగా కట్టుబడి ఉన్నానని ఇందిరాగాంధీ 21.12.1972న పార్లమెంటులో ప్రకటించారు.చారిత్రకంగా సుదీర్ఘకాలం పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు ఒకే ఛత్రం కింద ఉన్నాయి.తెలుగు మాట్లాడే ప్రజలు విశాలాంధ్ర కోసం అనేక దశాబ్దాలు పోరాడారు.భాషా ప్రయుక్త రాష్ట్రాలనేవి జాతీయ ఉద్యమంలో ఒక భాగం.భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో సహేతుకత
ఉంది.ప్రాంతాల సెంటిమెంట్‌తో కొట్టుకుపోకూడదు.దేశంలో వెనకబడిన ప్రాంతమంటూ లేని రాష్ట్రమేదీ లేదు. తెలంగాణలో కూడా వెనకబడిన ప్రాంతాలు ఉండొచ్చు. కానీ అభివృద్ధి చెందిన ప్రాంతాలూ ఉన్నాయి.ఇలాంటి విభజన కొనసాగిస్తే, విభజన రేఖ ఎక్కడ గీయగలం. ఒక్కో జిల్లా, ఒక్కో రాష్ట్రం కావాలని కోరుకుంటే? మనం పురాతన కాలం నాటి చిన్న చిన్నసంస్థానాధీశులుండే కాలానికి
వెళ్తామా?ప్రత్యేకవాదం సమస్యకు పరిష్కారం కాబోదు. ఇది మరో అతిపెద్ద సమస్యకు ప్రారంభం అవుతుంది. ఇతర రాష్ట్రాలతో పాటు, ప్రత్యేకవాదం గురించి మాట్లాడుతున్న అదే ప్రాంతంలోనూ భవిష్యత్తులో ఈ సమస్య తలెత్తవచ్చు.తెలంగాణ డిమాండ్‌పై ఆంధ్రప్రదేశ్‌లో ఏకాభిప్రాయం లేదు. తెలంగాణ ప్రాంతం రాజధానికి దూరంగా లేదు. అసలు రాజధానే తెలంగాణ ప్రాంతంలో ఉంది.అసెంబ్లీలో తెలంగాణపై
తీర్మానం ఆమోదం పొందలేదు.సమైక్య ఆంధ్ర ద్వారానే ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు. తెలంగాణ రాష్ట్రం అయితే మావోయిస్టుల కేంద్రంగా మారుతుంది. చిన్న రాష్ట్రాలు దేశ ఉనికికి ప్రమాదంగా మారుతాయి. సమైక్యాంధ్ర కొనసాగాలని ఉద్యమించడం ఆంధ్రుల విశాల హృదయాలకు నిదర్శనం.ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి అధికశాతం నిధులు కేటాయించింది.కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల వారు తప్ప తెలంగాణలో
మిగతా జిల్లాల వారు సమైక్యాంధ్రగానే ఉండాలని కోరుకుంటున్నారు.రాష్ట్రాన్ని విభజిస్తే సహించేదిలేదు.తెలుగు మాట్లాడే వారంతా కలిసి ఉంటేనే అభివృద్ధి సాధించవచ్చు.కుటుంబాలను విడదీయొద్దు.ఎన్నో ఏళ్లుగా తెలంగాణ, ఆంధ్ర, సీమ ప్రజలు ఒకరింట్లో ఒకరు వియ్యమొందారు. ఇప్పుడు విభజన చిచ్చుతో ఆ కుటుంబాలను విడదీస్తున్నారు.తెలంగాణ ఉద్యమం నడిపినా ఏ నేతా గెలవలేదు?సీమాంధ్ర
ప్రాంతంలో జరిగిన ఉద్యమం పేదలు, సామాన్యుల నుంచి పుట్టుకొచ్చింది.మేం ఇక్కడ సంపాదించిందంతా తెలంగాణలో పెట్టి అక్కడ ప్రజల అభివృద్ధికి పాటుపడితే ఇప్పుడు సాగర్‌ వద్ద అడ్డుగోడలు కడతారా?అడ్డుగోలుగా మాట్లాడినా, అడ్డుగోడలు కట్టినా అడ్డంగా తిరగబడతాం.యాసకో రాష్ట్రం ఇస్తారా: తెలుగు వారంతా ఒక్కటేనని అంటుంటే మా భాష, యాస వేరంటారేంటి?హైదరాబాద్‌ కోసం చేసిన శ్రమ అంతా
దెబ్బ తింటోంది.హైదరాబాద్‌ చుట్టూ ఉన్న మెదక్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో భూముల విలువలు విపరీతంగా పెరిగి రైతులు లాభపడ్డారు.ఈ కృషి అంతా ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది.ఐటీ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడానికి సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైంది.కొద్దిమంది కోసం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవడం సరైందని కాదు.విభజన
తప్పనప్పుడు రెండే ఎందుకు, నాలుగు రాష్ట్రాలుగా చేస్తే తప్పేమిటి? ఏ ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజించాలి, దానికి పారామీటర్స్‌ ఏమిటి?ప్రజల సెంటిమెంట్‌ ప్రకారం నిర్ణయం తీసుకున్నామని అంటే బోడోల్యాండ్‌, గూర్ఖాల్యాండ్‌ వంటివి చాలా అంశాలున్నాయి.పోనీ వెనుకబాటుతనం ప్రాతిపదికన అనుకున్నా.. ప్రతిచోటా పేద, ధనిక వర్గం ఉంది. కేవలం అభివృద్ధి, సెంటిమెంట్ల ఆధారంగానే
రాష్ట్ర విభజన జరపాలంటే, దేశాన్ని చాలా ముక్కలు చేయాల్సి ఉంటుంది.రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కొద్దిపాటి తేడాలతో సంస్కృతి, అలవాట్లు, భాష ఒకే విధంగా ఉన్నాయి.

తెలంగాణా వాదుల వాదనలు

* ఇది ఆత్మ గౌరవ సమశ్య.మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాము.పెద్దమనుషుల ఒప్పందాన్ని ఏనాడూ ఆంధ్రులు అమలు చేయలేదు.ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వటంలేదు.కృష్ణా గోదావరి నదుల పరివాహక ప్రాంతం 80 శాతం మాదైతే 88 శాతం నీళ్ళు వాళ్ళవి.కరెంటు70 శాతం ఉత్పత్తి మాది. 80 శాతం పంట ఋణాలు వాళ్ళవి.మూడొంతుల ఉద్యోగాలు వాళ్ళవి.తెలంగాణా ఆంధ్రుల వలస కేంద్రంగా మారింది.ఇక్కడ సెటిల్ అయిన ఆంధ్రవాళ్ళు
ఇక్కడే ఉండి పోటీ చేసి గెలవండి..పొట్టకూటికోసంవచ్చిన వాళ్ళను వెళ్ళీపొమ్మనము గానీ మా పొట్ట కొట్టేటోళ్ళనే వెళ్ళిపొమ్మంటున్నాం.శాంతియుతంగా అన్నదమ్ముల్లా విడిపోదాం.హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమే.స్థానికేతరులకు భయం వద్దు.తెలంగాణ వద్ద ఉన్న వనరులతో ఆంధ్ర ప్రాంతం ఇప్పటికే చాలా ప్రయోజనం పొందింది.తెలంగాణ ఏర్పడితే మావోయిస్టులు అక్కడ పాగా వేస్తారనీ, సాగునీటి
కోసం ఆంధ్ర ప్రాంతం అల్లాడిపోతుందనీ జరుగుతున్న ప్రచారం వాస్తవరహితం.ప్రత్యేక తెలంగాణం.. స్వాభిమానానికి ప్రతీక.ప్రత్యేక తెలంగాణాపై యాభై ఏళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇది ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టింది. స్వాభిమానానికి సంబంధించినది. ఉనికి, వివక్ష, దోపిడీలతో ముడిపడింది.రాజ్యాంగం ప్రకారం చూసినా రాష్ట్రాల ఏర్పాటు అనేది కేంద్ర పరిధిలోని అంశం. అసెంబ్లీలో
తీర్మానం అవసరం లేదు. అది లేకుండానూ కేంద్రం ఆమోదించవచ్చు. ఇలాంటి విషయాల్లో ఏకాభిప్రాయం ఎన్నడూ కుదరదు.స్వార్థపరశక్తులు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తెచ్చాయి.వాస్తవంగా ప్రజల్లో ఆందోళన లేదు. ఉన్నా పరిష్కరించుకోవచ్చు. నష్టపోతున్నవారే లేనిపోని ప్రచారం చేస్తున్నారు. దోచుకోవడం కుదరదన్న ఉద్దేశంతోనే భయాందోళనలు కలిగిస్తున్నారు. తెలంగాణాలో స్థిరనివాసం ఉంటున్న వారి
విషయంలో కొన్ని సందేహాలుంటాయి. వీటిని సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు.తెలంగాణాలో స్థిరపడిన ప్రజలకు ఎలాంటి హానీ జరగదు. పెట్టుబడిదారుల ఆస్తులే గానీ ప్రజల ఆస్తులు చర్చనీయాంశం కాదు. ప్రజలు స్వేచ్ఛగా జీవించవచ్చు. ఇది రాష్ట్ర విభజన మాత్రమేనని అందరూ గుర్తించాలి. తమిళనాడుకే తెలుగుగంగ నీళ్లు ఇస్తున్నప్పుడు తెలంగాణా నుంచి ఆంధ్రకు నీళ్లు అందకుండా చేస్తారని
అనుకోవడం సరికాదు.ఎవరికి ఎన్ని నీళ్లో.. చెప్పేందుకు ట్రైబ్యునళ్లు ఉన్నపుడు భయపడాల్సింది లేదు.రాజకీయ, భౌగోళిక, చారిత్రక కోణాల్లో ఎలా చూసినా హైదరాబాద్‌ తెలంగాణాలో అంతర్భాగమే. అది తెలంగాణా రాజధానిగా ఉండాల్సిందే. అన్నదమ్ముల్లా విడిపోవడం ఉత్తమం. తెలంగాణా రాష్ట్రాన్ని ఆంధ్రతో బలవంతంగా కలిపారు.విలీనం నాటికి తెలంగాణాయే పారిశ్రామికంగా ముందుండేది. గత యాభై
ఏళ్లుగా తెలంగాణా చాలా త్యాగాలు చేసింది.ఆంధ్ర అభివృద్ధిలో ఎక్కువ భాగాన్ని ఆంధ్రలోని సంపన్నులు తీసుకున్నారు. తెలంగాణ వివక్షకు గురైంది. సింగరేణిలో, సచివాలయంలో అన్నిచోట్లా కోస్తావారే ముఖ్యమైన ఉద్యోగాల్లో ఉన్నారు. ఇది ఆర్థిక అసమానతలకు దారి తీసింది.బడ్జెట్‌ కేటాయింపులోనూ ఆంధ్రాకే అగ్రస్థానం.సహజవనరులు, నీళ్లు లేక తెలంగాణాలో ఆత్మహత్యలు జరిగాయి.చిన్న
రాష్ట్రాలు ఏర్పడ్డాక జార్ఖండ్‌, ఛత్తీస్‌గడ్‌లలో పరిపాలన యంత్రాంగం బలోపేతమైంది.ఆంధ్ర, తెలంగాణా విడిపోయాక రెండు రాష్ట్రాలూ అభివృద్ధి చెందుతాయి, దానికి తగ్గ వనరులు ఇరు ప్రాంతాల్లోనూ ఉన్నాయి.

ప్రత్యేకాంధ్రుల వాదనలు

* విభజన వలన కాక, కలిసి ఉండటం వల్లనే ఆంధ్ర ప్రాంతం ఎక్కువ అభివృద్ధి చెందుతుందని ఎలా చెప్పగలరు?కోస్తా, సీమ ప్రాంతాల అభివృద్ధి కన్నా, హైదరాబాద్‌లో సొంత ఆస్తుల పరిరక్షణకే 'సమైక్యవాదం' చేపట్టారు.సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్‌ ఫ్రీ జోన్‌గా ఉండాలి.సీమ, కోస్తాల్లోని వెనకబడిన ప్రాంతాలు తెలంగాణతో సమానంగా అభివృద్ధి చెందలేదు.తెలంగాణలోనే ఎక్కువ అభివృద్ధి జరిగితే
సమైక్య రాష్ట్రాన్ని ఎలా సమర్థిస్తారు?610 జీవో వల్ల ఆంధ్రా ప్రాంతం వారికి జరుగుతున్న నష్టాల గురించి ఏనాడైనా స్పందించారా? సామాన్యుడి అవస్థల కన్నా హైదరాబాద్‌లో మీ ఆస్తులు రక్షణకే సమైక్య రాష్ట్రాన్ని కోరుతున్నారు. హైదరాబాద్‌పై కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన పట్టణాల అభివృద్ధిని గురించి ఎన్నడైనా ఆలోచించారా? సమైక్య రాష్ట్రంలోనే అభివృద్ధి సాధ్యమనుకుంటే
ఇంతవరకు ఇతర నగరాలు ఎందుకు అభివృద్ధి చెందలేదు? రెండు లేదా మూడు తెలుగు రాష్ట్రాలు ఉంటే తప్పేంటి? దేశంలో చిన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందటం లేదా? 42 మంది ఎంపీలు ఉన్న మన రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి సాధించింది ఏమిటి ? తక్కువ ఎంపీలున్న చిన్న రాష్ట్రాలు సాధించలేనిది ఏమిటి?హైదరాబాద్‌ చుట్టూ కేంద్రీకృతమైన తమ ఆస్తులను కాపాడుకునేందుకే కొందరు సమైక్య వాదం
పేరిట ప్రజలను రెచ్చగొడుతున్నారు.విడిపోవడం ద్వారానే అభివృద్ధి సాధ్యపడుతుంది.భాగో అనిపించుకునే ఖర్మ మనకెందుకు?ఆత్మాభిమానం నిలుపుకునే విడిపోదాం.హైద్రాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలి.1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రెండు ప్రాంతాల మధ్య భావ సమైక్యత లేదు. తెలంగాణ ఉద్యమం నిన్నా ఉంది.. నేడూ ఉంది... రేపూ ఉంటుంది. వాళ్లు మమ్మల్ని
వెళ్లిపొమ్మని అంటున్నప్పుడు... ఆత్మాభిమానం ఉన్న మాకు పట్టుకుని వేలాడాల్సిన అవసరం లేదు.ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ నగరాన్ని అందరం కలిసి అభివృద్ధి చేశాం కాబట్టి దీనిని వదిలిపెట్టడం ఎలాగ?ఈ రాజధాని నాది అనుకుని ఆ ప్రాంతాల్లోని ప్రతి గ్రామం నుంచి కనీసం ఒక్కరైనా ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. నగర అభివృద్ధిలో మేమూ భాగస్వాములమే... దీన్ని పెంచాం..
హైదరాబాద్‌ మనది అనుకున్నారు. 1972 నాటికి హైదరాబాద్‌పై ఇంత మమకారం లేదు. ఇవాళ ఎంతో చేశాక... నగరంతో మమేకం అయ్యాక వెళ్లిపోవాలంటే బాధగా ఉంటుంది కదా... ఆ రోజు ముల్కీ నిబంధన కారణంగా వెళ్లిపోతామన్నారు... ఇప్పుడు ఇంతకాలం ఇక్కడే ఉన్నందున కలిసే ఉందామంటున్నారు.విభజన జరిగినంత మాత్రాన ఇక్కడున్న 30 లక్షల మంది వెళ్లిపోవలసిన అవసరం లేదు. ఇక్కడున్న వారంతా తెలంగాణవారే అవుతారు.
వాళ్లు, వీరూ మమేకమై జీవితాలు గడుపుతారు.మనం ఇక్కడి నుంచి ఆత్మాభిమానంతో వెళ్లిపోతే ఏ సమస్యా ఉండదు. తెలంగాణ ప్రజలంతా విడిపోవాలని కోరుకుంటున్నప్పుడు కాదు.. కలిసే ఉందామనడం సమంజసం కాదు.హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి, ప్రత్యేకాంధ్రకు తగిన నిధులు తెచ్చుకుని ఆత్మగౌరవం కోసం మనం విడిపోదాం జై ఆంధ్రా.

ఐఏఎస్‌ ఐపిఎస్‌ల భయం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారందరిలో ఎక్కువ శాతం కొత్తగా ఏర్పాటు అయ్యే ఆంధ్ర రాష్ట్రా సర్వీసుల్లోకి వెళ్ళాలి.ఒక వేళ గ్రేటర్‌ హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినట్లయితే కేంద్ర సర్వీ సులకు చెందిన అధికారులను మూడుగా విభజిస్తారు.హైదరాబాద్‌ ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించినట్లయితే గ్రేటర్‌
హైదరాబాద్‌ పరిధి లోకి వచ్చేందుకు కేంద్ర సర్వీసు అధికారులు విముఖత చూపుతున్నారు. ఎందుకంటే యూనియన్‌ టెరిటరీ కేడర్‌లోకి వచ్చినట్లయితే ఇకపై వారి బదిలీలన్నీ కేంద్ర పాలిత ప్రాంతాలకే పరిమితమవుతాయి. దీని వల్ల హైదరాబాద్‌ యూనియన్‌ టెరిటరీ(కేంద్ర పాలిత ప్రాంతం) నుంచి వేరొక చోటకు బదిలీ కావాలంటే మరొక కేంద్ర పాలిత ప్రాంతానికే బదిలీ కావా ల్సి ఉంటుంది.
తెలుగు సినీ పరిశ్రమ భయం

మద్రాసు నుండి హైదరాబాద్‌కు తరలివచ్చిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన నిర్మాతలు రామకృష్ణ సినీ స్టుడియో, అన్నపూర్ణ సినీ స్టుడియో, రామానాయుడు స్టుడియో, పద్మాలయా స్టుడియో, రామోజీ ఫిలింసిటీ స్టుడియోలు నిర్మించారు. కె.రాఘవేంద్ర రావు, అక్కినేని నాగార్జునకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. పద్మాలయా స్టుడియో లోని కొంత భాగాన్ని ఇతరులకు విక్రయించిన వ్యవహారం పై టిఆర్‌ఎస్‌
కోర్టుకెళ్ళింది. తమ ప్రాంతంలో పేదలకు పంపిణీ చేయవలసిన భూములను ఆంధ్రా ప్రాంతానికి చెందిన సినీవర్గాలకు ఇచ్చారన్న వివాదం మొదలయింది.

No comments: