welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Monday, January 25, 2010

కంప్యూటర్లో తెలుగు రాయడం

 

1.తెలుగు వికీపీడియాలో టైపు చెయ్యడం సులభంగా వుంది.కాని నెట్లోకి వెళ్ళకుండానే ఎమ్.ఎస్.వర్డ్ లో ఇలా టైపు చెయ్యడం కుదురుతుందా?
2.పి.డి.యఫ్.ఫైళ్ళలోని తెలుగు టెక్స్ట్ ను ఎమ్.ఎస్.వర్డ్ ఫైలులోకి పేస్టు చేసుకో గలమా? __
3.అనూ ఫాంట్లలో ఉన్న పాఠ్యాన్ని (text) యూనికోడ్లోకి మార్చడం ఎలా?

http://omicronlab.com/download/tools/iComplex_2.0.0.exe .. ఇక్కడినుండి ''iComplex_2.0.0.exe''' ఫైల్స్ డౌన్ లోడ్ చేసుకుని మీ సిస్టమ్ లో ఇన్ స్టాల్ చేసుకోండి. ఆపరేటింగ్ సిస్టమ్ XP లో డీఫాల్ట్ గా గౌతమి ఫాంటు ఉంటుంది.వివిధ ఆపరేటింగ్ సిస్టమ్ లలో తెలుగును స్ధాపించడం, రాయడం. చదవడం కొరకు క్రింది వివరాలు పరిశీలించండి.

Win98 --http://etelugu.org/node/207
Win2000 --http://etelugu.org/node/208
Linux --http://etelugu.org/node/210

కంప్యూటర్లో తెలుగు రాయడం
లేఖిని --http://lekhini.org/
గూగుల్ ఇండిక్ లిప్యంతరీకరణ --http://google.com/transliterate/indic/telugu
క్విల్ పాడ్ --http://quillpad.com/telugu/#
స్వేచ్ఛ – http://swecha.org/input/index.html, http://atcweb.atc.tcs.co.in/opensource-downloads
యంత్రం --http://www.yanthram.com/te/
లిపిక్.ఇన్ -- http://lipik.in/telugu.html
ఇన్ స్కిప్ట్ -- http://telugublog.blogspot.com/2006/03/xp.html
బరహా -- http://www.baraha.com/download.htm
అను మాడ్యూలర్ -- http://crossroads.koodali.org/2007/11/18/typing-unicode-telugu-using-other-keyboard-layouts/
అను ఆపిల్ -- http://crossroads.koodali.org/2007/12/25/apple-keyboard-layout/
అక్షరమాల -- http://groups.google.com/group/aksharamala
జనగణమన --- http://www.janaganamana.net/TeluguJgm.aspx
లినక్స్ లో -- http://www.swecha.org/wiki/index.php?title=Input
అక్షర్ ---http://www.kamban.com.au/
TDIL --http://www.ildc.in/Telugu/TLindex.aspx

Microsoft -Indian language input tool--ఇటీవలే విడుదల అయ్యింది.నేరుగా తెలుగులోనే MS word,Excel లలో టైపు చేసుకోవచ్చు.
ఫైర్‌ఫాక్స్ విహారిణిలో
• ఇండిక్ ఇన్‌పుట్ పొడగింత -- https://addons.mozilla.org/en-US/firefox/addon/3972
• పద్మ పొడగింత -- https://addons.mozilla.org/en-US/firefox/addon/873
• తెలుగు టూల్‌బార్ -- http://telugutoolbar.mozdev.org/
• ప్రముఖ్ టైప్ --http://www.vishalon.net/Download/tabid/246/Default.aspx
సిస్టంలో తెలుగు ఎనేబుల్ చేసినా కూడా వార్తాపత్రికలు చదవాలంటే కష్టమే. దీనికి కారణం యూనికోడ్ లో మనమందరం వాడేది గౌతమి ఫాంట్. పేపర్ల ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ని కాపీ చేసుకుని My computer> C > Windows > Fonts లో పేస్ట్ చేయండి. భారతీయ భాషలలోని వార్తా పత్రికలను చదవడానికి :http://uni.medhas.org/
ట్రాన్స్లిటరేషన్ ఉపకరణాలు:

ఇవి మీరు ఇంగ్లీష్ లో టైపు చేస్తూ పోతూ ఉంటే, తెలుగు లోకి మారుస్తాయి. అంటే, "telugu" అని టైపు చేసి స్పేస్ కొట్టగానే "తెలుగు" గా మారుస్తాయి.
1. గూగుల్ ఇండిక్ ట్రాన్స్లిటరేషన్: http://www.google.com/transliterate/indic/telugu
2. క్విల్‌ప్యాడ్: http://www.quillpad.com/telugu/editor.html
3. లేఖిని http://lekhini.org
లేఖిని ఉపకరణాన్ని offline కూడా వాడుకోవచ్చు. లేఖిని ని తిరగేస్తే నిఖిలే . తెలుగు చదవడం రానివారికి తెలుగు సందేశాన్ని నిఖిలే ఇంగ్లీష్ ఉఛ్ఛారణలోకి మార్చి పెడుతుంది.
http://lekhini.org/nikhile.html
4. itrans --http://www.aczoom.com/itrans/html/tlgutx/tlgutx.html
ఇప్పుడు ఇంటర్నెట్ లో అన్ని బ్రౌజరు లు యూనికోడ్ ను అర్ధం చేసుకుంటున్నాయి.కాపీ పేస్టు బాధ లేకుండా, డైరెక్ట్ గా మెయిల్ విండో లోనే, తెలుగు లో టైపు చెయ్యవచ్చు. http://mail.google.com/support/bin/answer.py?hl=en&answer=139576).

http://t13n.googlecode.com/svn/trunk/blet/docs/help_te.html#Store

వర్డ్ డాకుమేంట్ లో తెలుగు ని దాచుకోవడం:

మీరు విండోస్ విస్టా వాడుతున్నట్లయితే, తెలుగు కి సపోర్ట్ దానితోనే వస్తుంది. విండోస్ ఎక్స్ పీ లో ఐతే మాత్రం కాంప్లెక్స్ స్క్రిప్ట్ లని ఎనేబుల్ చేసుకోవాలి. అది ఎలా చెయ్యాలో ఇక్కడ వివరం గా ఉంది: http://employees.org/~praveeng/files/telugudisplay/TeluguEnableScreenShots.htm

లిపులు –లిప్యంతరీకరణ.
అక్షర రూపాల్ని ఫాంట్లు అంటారు. బిట్‌మాప్ (Bit Map), ట్రూ టైప్ (True Type) , ఓపెన్ టైప్ (Open Type)ముఖ్యమైన రకాలు. Akshar Unicode, Code2000 , Gautami, Pothana , RaghuTelugu , Saraswati5, Vemana2000.http://www.wazu.jp/gallery/Fonts_Telugu.html
RTS ,Unicode , ISCII , ITRANS , TSCII , TAB & TAM, ఈనాడు ఫాంటు, వార్తా ఫాంటు, శ్రీలిపి , ఐ-లీప్ , అనుపమ వగైరా వగైరా. ఇలా ఒకటా రెండా, బోల్డన్ని ఫాంట్లు . కానీ ఇప్పుడు యూనీకోడ్ ప్రపంచభాషల్లో చాలావాటికి ప్రామాణికాలేర్పరిచింది. వెన్ననాగార్జున గారు (vnagarjuna@gmail.com) ఫాంట్లన్నిటినీ యూనీకోడ్ కి మార్చేలాగా పద్మ ఉపకరణం తయారుచేశారు. పద్మ అన్ని భారతీయ భాషల్లోనూ కలిపి దాదాపు 80 ఫాంట్లను యూనీకోడ్ కి మార్చగల
సామర్థ్యానికి ఎదిగింది. http://padma.mozdev.org/.
ఈమాట - Non-Unicode Font to Unicode Converter --
http://eemaata.com/font2unicode/index.php5
Anu veekshanam,Anu rahamthulla version,Anu ATA souvenir version,Anu rangesh kona version,Tikkana లాంటి కొన్నిఅను ఫాంట్ల సమశ్య సురేష్ కొలిచాల (suresh.kolichala@gmail.com) గారివల్ల తీరింది.ఇంకా సాక్షి(SW908.TTF), సూరి, కొత్త అను ఫాంట్లు,యూనికోడ్ లోకి మార్చాలి . ఫాంట్లపై పేటెంట్ రైట్లు గల వ్యాపార సంస్థలవారు ఆయా ఫాంట్లను అందరినీ ఉచితంగా వాడుకోనిస్తే ,యూనికోడ్ లోకి మార్చనిస్తే తెలుగు భాషకు సేవ చేసినవారవుతారు.
అనువాద ఉపకరణం
http://docs.google.com/support/bin/static.py?page=faq.html&hl=te
మాన్యువల్ గా తర్జుమా చేయడం కంటే,దీంతో పని తగ్గుతుంది. పైగా విదేశాల్లో, భాషరాని వారికి ఇది బాగా అక్కరకొస్తుంది. ప్రయత్నించి చూడండి. గూగుల్ పత్రాల లో ఎన్ని భాషల్లోకి అనువదించవచ్చో కనబడుతుంది.ఇంకా తెలుగుకి ఇందులో సపోర్ట్ లేదు, త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.

ఇవికూడాచూడండిః
• ఈటీవీ2లో 20.5.2007న "తెలుగు-వెలుగు " కార్యక్రమం లో నా ఇంటర్ వ్యూ http://telugu.fliggo.com/video/GcLNlAgS
• తెలుగు భాష - చర్చా వేదిక వ్యాసం "ఇలా చేస్తే బాగుంటుంది "విపుల నవంబర్ 2007 http://eenadu.net/vipnew3/display.asp?url=vip-kathalu13.htm

నూర్ బాషా రహంతుల్లా డిప్యూటీ కలెక్టర్ విజయవాడ .

No comments: