తెలుగుకి, తెలుగు వారికి వెబ్‌లో అందుబాటులో ఉన్న పలు ఉపకరణాలలో అత్యంత ప్రజాదరణ ఉన్న పది
(10)
9. గౌతమి & వేమన 2000 ఫాంట్లు
8. అక్షరమాల
7. టోరి
6. పొద్దు
5. గూగుల్
4. సాహితి ఆర్గ్
3. తేనెగూడు
2. లేఖిని
1. తెవికి
ఐతే, వీటన్నిటికంటే కూడా నిరంతరం తమ సహాయాన్ని పెంచుకుంటూపోయింది మాత్రం ***తెలుగు బ్లాగర్లే*** (వీళ్ళకి ఒకటి కంటే ముందు రాంకు ఇవ్వాలి మరి). తెలుగు బ్లాగర్ల సంఖ్య అప్పుడప్పుడూ ఒకేచోట నిలిచిపోయినా నానటికి పెరుగుతోందనేది వాస్తవం. తద్వార తెలుగోపకరణాలు కూడా బాగా వెలుగులోకి వస్తున్నాయి. ఐతే ఇకపై కొత్త ఉపకరణాలు ఒక పద్ధతిలో తయారు చేయగల్గుతామని ఆశిద్దాం.
పైన పేర్కొన్న జాబితా దాదాపు అన్ని ఉపకరణాలను నిశితంగా పరిశీలించి తయారుచేశాను… విబేధాలు ఉంటే పేర్కొనగలరు! పై జాబితాలో, వార్తల సైట్లను పేర్కొనపోయినప్పటికీ (యూనికోడ్ ను వాడకపోయినా) ఈనాడునే అత్యుత్తమ తెలుగు వార్తల సైటుగా చెప్పుకోవచ్చు.
ఈ ఉపకరణాలను వాడటానికి సహాయపడుతున్న మన యూనీకోడ్ సహిత ఆపరేటింగ్ సిస్టంలను కూడా మరువకూడదు. అందుకు గాను మైక్రోసాఫ్టుకు కృతజ్ఞతలు. ఇప్పుడు లినక్స్, మ్యాక్లలోనూ (OS X) వాడగల్గుతున్నందుకు వారికి కూడా…
నేటినుంచి ఈ ఉత్తమ 10 జాబితా ప్రతి 2 మాసాలకీ విడుదల ఔతుంది. - నా గోల
Tuesday, June 26, 2007
10 ఉత్తమ తెలుగోపకరనాలు
ఫైర్ ఫాక్స్ (రగిలే నక్క) ని ఇంకొంచెం కెలకండి
ఏమీ లేదు.. మీ విహారి లొకేషన్ బార్లో “about:config” టైపు చేయ్యండి, అంతే వచ్చిన ప్రతి వక్యాన్ని మీ ఇష్టం వచ్చినట్టు కెలికి చూడండి, ఏమేమౌతొందో ఒకొక్క మర్పుకీ…
ఐతే నేను ఇక్కడ కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు చెప్తాను, ఉదా:
మీ వెబ్ పేజీలు మరింత వేగంగా తెరుచుకోవాలంటే1. ముందుగా ఫిల్టర్ అని ఉన్న చోట ఈ బొమ్మలో చూపినట్టు “network.http” అని కొట్టండి, ఆపై “network.http.pipelining” అను వాక్యం మీద రెండు క్లిక్కులు నొక్కి, ఆ విలువని “true” గా మార్చండి. (ఫిల్టర్ స్పాట్లైట్ సేర్చ్ “spotlight search” లాగా పనిచేస్తుంది)2. ఇప్పుడు, తదుపరి వాక్యం “network.http.pipelining.maxrequests” ను “10″ చెయ్యండి. ఇప్పుడు మీ విహారిని మళ్ళీ స్టార్ట్ చేస్తే, మీ వెబ్ పేజీలు మునుపటికంటే వేగంగా తెరుచుకోవాలి. ఐతే, ఈ చిట్కా బ్రాడ్‌బాండ్ ఉంటేనే పనిచేస్తుంది.
రెండో బొమ్మలో చూపినట్టుగా సెర్చ్ బార్లో టైపు చేస్తున్నకొద్దీ సలహాలు చెప్తూపోవాలంటే “browser.search.suggest.enabled” విలువను “true” గా మార్చండి.
మీ మంటనక్కలోని ‘spell checker‘ ఆంగ్ల-తెలుగును సరిగ్గా రాస్కోనివ్వకుండా విసికిస్తోంటే, దాని నోరు మూయించడానికి “layout.spellcheckDefault” ను సున్నా “0″ చెయ్యండి.
ఈ కెలుకుడు చాలలేదు అనిపిస్తే మీ ఇష్టం… రెచ్చిపోండి, కొత్తవేమన్న తెలిస్తే మాత్రం నాకు చెప్పడం మర్చిపోవద్దు. ఉంటా మరి!!
ఓపెన్ ఆఫీసులో (open office) తెలుగెలా
విస్టా వాళ్ళకు:
1. ముందుగా మీ ఓపెన్ ఆఫీసుని ఓపెన్ చేసి, అందులో tools>options ని క్లిక్ చెయ్యండి.2. ఇప్పుడు, వచ్చిన విండోలో కింద చూపినట్టుగా కాంప్లెక్స్ టెక్స్ట్ భాషని (enable CTL by checking the shown box) ఎనేబుల్ చెయ్యండి.3. ఆపై కింద చూప్పినట్టుగా CTL (Telugu) నకు సరైన ఫాంటును (in most cases Gautami) కాంఫిగర్ చెయ్యండి. అంతే.
తక్కిన విండోస్‌లలో(like Windows XP) ముందుగా మీ కంప్యూటర్‌కి తెలుగేంటో చెప్పాలి. అదెట్లా చెయ్యాలో ఇక్కడ ఉన్నట్టుగా చేసి, పైన ఉన్న మూడు పనులను మళ్ళా చెయ్యండి. ఇంక మీరు కూడా తెలుగులో డాక్యుమెంట్లు తయారు చెయ్యగల్గుతారు.
పరీక్షించాలంటే, ఈ తెలుగు టెక్స్ట్ ను మీ ఓపెన్ ఆఫీస్‌లోకి పేస్ట్ చేసి చూడండి, ఐపోతుంది! కాంఫిగర్ చేయ్యగానే ఒకసారి ఓపెన్ ఆఫీసుని మూసి మళ్ళా తెరవండి, ఎందుకైనా మంచిది. PDF డాకుమెంట్లు కావాలంటే ఆ బాటన్ ను నొక్కితే, ఫాంట్లు వాటంతటవే అందులో నిర్లిప్తమైపోతాయి. వేరేగా embed చెయ్యాల్సిన పని ఉండదు.
ప్రత్యేక సందేహాలు ఏమన్నా ఉంటే, చెప్పచ్చు.. మొహమాటాలు ఏమీ లేవులే!
Saturday, June 23, 2007
Saakshi
“రేపు ఆఫీస్ లో కలుస్తా గురూ” వినయ్ కి వీడ్కోలు చెప్పి టైం చూసుకున్నాను.
రాత్రి ఒంటి గంట కావస్తోంది.
అమీర్‌పేట్ సత్యం సినిమా హాలునుంచి సెకండ్ షో సినిమా చూసి ఇంటివైపుకు నడుస్తున్న నాకు ఎవరో వెంబడిస్తున్నట్టు అనిపించి వెనక్కి చూశాను.రోడ్డంతా నిర్మానుష్యంగా వుంది.అక్కడక్కడా కుక్కలు మొరుగుతున్న శబ్దాలు తప్పితే అంతా నిశ్శబ్దంగా వుంది.దూరంగా వెలుగుతున్న వీధిదీపాల వెలుగులో ఎవరో ఒక వ్యక్తి నిల్చుని దిక్కులు చూస్తున్నాడు.
ఎందుకో వళ్ళంతా చెమటలు పట్టసాగాయి. పరుగులాంటి నడకతో ఇంటివైపుగా అడుగులేశాను. మరికొంచెం దూరం నడిచి మళ్ళీ వెనక్కి తిరిగి చూశాను….
పిచ్చోడు!
ఇందాక వీధి దీపం వెలుగులో కనిపించిన వ్యక్తి పిచ్చోడిలా వున్నాడు. నేను వెనక్కి తిరిగి చూడడం గమనించి దిక్కులు చూస్తూ నిల్చుండిపోయాడు. మరో పదినిమిషాలు నడిస్తేగానీ ఇల్లు చేరుకోలేను. ఆ పిచ్చోడు నన్నే ఎందుకు వెంబడిస్తున్నాడో అర్థం కాక వేగంగా అడుగులేస్తూ పరుగులాంటి నడకతో ఇంటివైపు దారితీశాను.
స్కూటర్ మీద వచ్చుంటే అసలీ గొడవుండేది కాదు. పిసినారితనంగా దగ్గరే కదా అని నడుచుకొచ్చినందుకు నన్ను నేను మనసులో తిట్టుకున్నాను. మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూసినప్పుడల్లా ఆ పిచ్చోడు నా అంత వేగంగానే నా వెనుక వస్తుంటే నా వెన్నులో వణుకు మొదలయ్యింది.
నా కంటే కొంచెం పొట్టిగానే వున్నా ఖచ్చితంగా నాకంటే బలంగా వున్నాడు.జడలు జడలుగాపెరిగిపోయిన జుట్టు, మట్టికొట్టుకుపోయిన ముఖం, చిరిగిన బట్టలతో అప్పుడే ఏ చెత్తకుండీలోనుంచో లేచి వచ్చినట్టున్నాడు. పైగా తూలుతూ కూడా వున్నాడు.తాగి వున్నాడనుకుంటా!ఇంకో అర కిలోమీటరు నడిస్తే ఇల్లొచేస్తుంది.ఇంతలో ఏదైనా చేసేస్తాడేమోనని భయంతో నా వళ్ళు జలదరించింది.
ఈ పిచ్చోడ్ని చూడడం ఇదే మొదటిసారి కాదు. అమీర్‌పేట్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కోవడం చాలా సార్లు చూశాను. ఆదిగినప్పుడూ చిల్లర లేదన్నవాళని తిట్టడం, శాపాలు పెట్టడం లాంటివి చేస్తుంటాడు. మొన్నొకరోజు ఎవరి మొహానో ఉమ్మేశాడు కూడా! అందుకే నాకింత భయం.
అసలే వీధి దీపాలు కూడ వెలిగి చావడం లేదు. చుట్టూ చీకటీ. మరో వంద మీటర్ల దాకా ఏమీ కనిపించడం లేదు. ఈ చీకట్లో పిచ్చోడు నన్ను తప్పకుండా ఏదో ఒకటి చేస్తాడనిపించింది. ఎలాగోలా వీడి పీడ వదిలించుకోవాలని నిశ్చయించుకుని పక్కనే వున్న టెలిఫోన్ బూత్ వెనక దాక్కున్నాను. పిచ్చోడు నా కోసమే వెతుకుతున్నట్టుగా అనిపించి అదను చూసి వెనుక నుంచి అతని మీద దూకి గొంతు పట్టుకున్నాను.
ఐదు నిమిషాలు ఇద్దరమూ పెనుగులాడుకున్నాక బలంగా కడుపులో రెండు గుద్దులు గుద్దాను.చేతికందిన రాయినొకటి తీసుకోని అతని తలపై గట్టిగా కొట్టాను. దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి.రెండు చేతుల్తో తల పట్టుకుని నన్నొదిలేశాడు. అతని నుంచి వేరుపడి వేగంగా ఇంటివైపు పరిగెడ్తుంటే అతను తిడ్తున్న తిట్లు వినలేక చెవులు మూసుకున్నాను.
గొడవ తర్వాత ఇంటికెప్పుడూవచ్చానో ఎలా చేరుకున్ననో అస్సలు గుర్తు లేదు. ట్రింగ్ ట్రింగ్ మని అలారం మోగడంతో మెలుకువ వచ్చింది.
రాత్రి జరిగిందంతా ఒక కలలా అనిపించింది. జీవితమంతా రోడ్డుమీద ఫుట్‌పాత్ మీద గడీపే ఒక పిచ్చ్చివాడితో నేను గొడవపడతానని నేను కలలోనైనా ఊహించలేదు.
స్నానంచేస్తుంటే తెలిసింది రాత్రి గొడవలో నాకు తగిలిన దెబ్బల గురించి. పెద్ద దెబ్బలేమీ కాకపోయినా మొహం మీద గోళ్ళతో రక్కడం వల్లనేమో గాట్లు బాగానే పడ్డాయి, ఆఫీస్ లో ఏం సమాధానం చెప్పాలో, ఏ కథ అల్లాలో ఆలోచిస్తూ ఎనిమిదిన్నరకల్లా ఆఫీసుకి బయల్దేరాను.
ఇదీ నా కథ. నేను పోలీసులకి చెప్పిన కథ. వాళ్ళు నిజమని నమ్మిన కథ. క్షణాల్లో కథలు అల్లగలిగే నా ప్రతిభకు అద్దంగా నిలిచిన కథ.
అసలు నేనీ కథ పోలీసులకెందుకు చెప్పాల్సి వచ్చిందో, వాళ్ళది నిజమని ఎందుకు నమ్మారో తెలుసుకోవాలంటే ఉందు నా గురించి చెప్పాలి.
నాది మార్కెటింగ్ ఉద్యోగం. ఇన్స్యూరెన్స్ దగ్గర్నంచి పర్సులు, బెల్టులు, సాక్సుల వరకూ ఏదైనా సరే ప్రజలకు అమ్మడమే నా ఉద్యోగం.ఈ మధ్యనే కంప్యూటర్ విడిభాగాలు అమ్ముతున్న ఓ కంపెనీలో చేరాను.నాకు పెళ్ళి ఖూడా అయింది. ఆ పెళ్ళికి విడాకులు కూడా అయ్యాయి. నా తప్పేమీ లేదు. నాకు పిచ్చని చెప్పి నా పెళ్ళాం నన్నొదిలి వెళ్ళిపోయింది. చాలారోజులు బాధపడ్డాను. ఓంతాఋఈ ఝివీటాం ఆడిపాను.కొన్ని రోజులకా జీవితమే అలవాటయిపోయింది.
ఇంత జరిగినా నేను పైకి ఆనందంగానే కనిపిస్తుండేవాడిని. కానీ నా మాజీ బార్య నన్నొదిలి వేరే ఎవరితోనో సంబంధం పెట్టుకోవడమే కాకుండా నాకు పిచ్చని ఊరంతా ప్రచారం చేస్తుండడంతో నా మనసు కోపంతో రగిలిపోయేది. అందుకే బాగ ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాను. ఒక రాత్రి నా పథకాన్ని అమలుపెట్టాను.
ఆ రాత్రి నా భార్యను నేను హత్య చేశాను.
ఆ రోజు సాయంత్రం నా కొలీగ్ వినY సత్యం సినిమా హాలులో సెకండ్ షో సినిమా చూడ్డానికి వెళ్తున్నాడని ముందే తెలుసుకున్న నేను సెకండ్ షో సినిమా టికెట్ కొని సినిమా చూడ్డానికి వెళ్ళకుండా సరాసరి నా మాజీ భార్య ఇంటికెళ్ళను. గంటలో పనైపోయింది. సరిగ్గా ఇంటర్వెల్ సమయానికి గోడదూకి సినిమాహాలోకి దూరాను. అక్కడ క్యాంటిన్ దగ్గర టీ తాగుతున్న వినయ్ ని కలిసి “అరే నువ్వు కూడా వచ్చావా గురూ!” అంటూ ఆశ్చర్యం నటించాను. నేను తెలివిగా ఆ సినిమా ముందే చూసెయ్యడంతో సినిమా గురించి కాసేపు చర్చించి మళ్ళీ హాళ్ళోకి బయల్దేరాం.
సినిమా అయిపోయాక బాత్రూం అద్దంలో నా మొహం చూసుకుంటే తెలిసింది నా మొహం మీద గాయాలు. నా భార్యను హత్య చేసే ప్రయత్నంలో ఆమె నా మొహంపైన గోళ్ళతో రక్కిన గాయాల గురించి పోలీసులకనుమానం రాకుండా చేసే మార్గం నా కళ్ళముందు మెదిలింది. వెంటనే సినిమా హాలు నుంచి బయటపడి, వినయ్‌కి వీడ్కోలు చెప్పి ఇంటివైపుగా బయల్దేరాను. దారిలో ఒక పిచ్చోడు ఎప్పుడు రోడ్డుపై పడుకునివుండడం చాలా సార్లు గమనించాను. ఆ పిచ్చోడుండే చోటు చేరగానే అక్కడున్న ఒక రాయి తీసుకుని ఆ ఇచ్చోడి తలపై మోదాను. కడుపులో రెండు గుద్దులు గుద్ది పారిపోయాను. పాపం మంచి నిద్రలో వున్నట్టున్నాడు. ఊహించని దెబ్బలు బాగ బాధించినట్టున్నాయి. గట్టిగా అతను చేసిన ఆర్తనాదాలు నాకు చాల దూరం వరకూ వినిపించాయి.
అలా వినయ్‌ని, ఆ పిచ్చోడిని నా సాక్ష్యాలుగా ఉపయోగించుకోవడనికి పథకం పన్నాను.
ఆ తర్వాత రోజు ఉదయం ఆఫీసులో అడుగుపెట్టగానే మ బాస్ ఆడిగేశాడు, మొహం మీద గాయం గురించి. ఏదో ఒకటి చెప్పి తప్పించుకుని వినయ్ వద్దకెళ్ళను. నన్ను చూడగానే-
“నిన్నరాత్రి ఫైటింగ్ సినిమా చూసి నువ్వు కూడా ఫఈటింగ్ మొదలు పెట్టావ ఏంటి? ” అడిగాడు వినయ్.
నిజానికి నా మొహం మీది గాయాన్ని సినిమాహాల్లో గమనించాడో లేదో అన్న విషయం నిర్ధారించుడానికే నేను వినయ్ వద్దకెళ్ళింది. వున్న ఒక్క అనుమానం కూడా తీరిపోయింది. ఆ రోజంతా పని హడావుడిలో గడిచిపోయింది.
ఆ సాయత్రం ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో కొత్తగా ప్రారంభించిన బిర్యాని సెంటర్ కనిపించింది. ఆ మధ్య కాలంలో సరైన తిండి తిని చాలా రోజులవడంతో బిర్యానీ పేరు వినగానే నోరూరింది. ఇంటికెళ్ళి స్నానం చేసి కాసేపు రిలాక్సయ్యి వచ్చి బిర్యానీ తినాలని నిర్ణయించుకుని నా పాత డొక్కు స్కూటర్ని ఇంటివైపు పరుగులు తీయించాను.
మా ఇంటి ముందు గుమికూడిన జనాన్ని, పోలీసు జీపుని చూడగానే నా గుండె జల్లుమంది. నేనంతా పథకం ప్రకారమే చేసినా నా మాజీ భార్య చనిపోతే పోలీసులు మొదటగా అనుమానించేది నన్నేనని తెలుసు. కానీ హత్య గురించి పోలీసులకంత తొందరగా తెలిసిపోతుందని నేనూహించలేదు. పోలీసుల్ని చూడగానే భయమేసిన మాట నిజమే కానీ నేను సృష్టించిన సాక్ష్యాలు నన్ను నిందితునిగా నిరూపించలేవనే నమ్మకం నాకు ధైర్యాన్నిచ్చింది. ఆ ధైర్యంతోనే స్కూటరాపి ఆ గుంపు వైపుకి అడుగులేశాను.
అందరికంటే ముందుగా మా పక్కింటి రావు గారు నా వైపు చూపించి పోలీసులకేదో చెప్పాడు. చాలాసార్లు ఆయన పాల ప్యాకేట్లు దినపత్రికలు దొంగలించాననే కోపాన్ని ఇలా తీఇర్చుకున్నాడు రావుగారు. కానీ రావుగారికేం తెలుసు నా టాలెంట్.
“రామకృష్ణ అంటే మీరేనా?” అడిగాడు పోలీస్ ఇన్స్పెక్టర్.
“అవును. ఏం జరిగింది?” అని అడీగాను ఏమీ తెలియనట్టు.
“మీరు మాతో పాటు పోలీస్ స్తేషంకి రావాలి”
“నేనేం చేశానని మీతోపాటు రావాలి” ధైర్యంగా అడిగాను.
“నిన్నరాత్రి మీ భార్యని ఎవరో హత్య చేశారు. దానికి సంబంధించి మిమ్మల్ని పశ్నించాలి” అన్నాడు పోలీస్ ఇన్స్పెక్టర్.
పోలీసు స్తేషనుకు వెళ్ళేదారిలో ఇన్స్పెక్టర్తో చెప్పాను నేనూ నా భార్య విడాకులు పొంది రెండేళ్ళయిందని.జీవితంలో మొదటిసారి పోలీస్‌స్టేషన్‌కి రావడంతో కాస్త ఇబ్బందిగానే అనిపించింది.
సినిమాల్లో చూపించినట్టు మొహంమీద లైటేసి నీళ్ళు కొట్టి చితక్కొడతారేమోనని భయమేసింది. తీసుకెళ్ళి నన్నొక గదిలో కూర్చోబెట్టారు. తుప్పు పట్టిపోయిన ఇనుప టేబుల్, కుర్చీలు తప్ప మరేమీ లేవా గదిలో. టెన్షన్‌తో గొంతెండిపోయింది. దాహం వేస్తుంది. నీళ్ళు కావాలని కానిస్టేబుల్ ఒకతన్ని అడిగాను. పాపం మంచోడిలా ఉన్నాడు. బాటిల్ నిండా నీళ్ళు తెచ్చిచ్చాడు.
చాలాసేపటి తర్వాత పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి నాకెదురుగా వున్న కుర్చీలో కూర్చున్నాడు.
“చూడండి రామకృష్ణ గారూ! ఈ మర్డర్ మీరే చేసారని నేనటం లేదు. అలాగని చెయ్యలేదని కూడా అనటం లేదు. అనుమానం వున్న వారిని ప్రశ్నించే హక్కు మాకుంది. అందువలన మీరూ మా ప్రశ్నలకు సమాధానమిచ్చి సహకరిస్తే బావుంటుంది.
పోలీసాయన అలా అడిగాడో లేదో ఇంతకు ముందు మీకు చెప్పిన కథనే ఉన్నదున్నట్టు చెప్పేశాను.
నేననుకున్నంత సులభంగా పోలీసులు నా కథ నమ్మలేదు. వినయ్‌ని పిలిపించి అడిగారు. వినయ్ చెప్పిన సాక్ష్యంతో నా మీదున్న అనుమానం కాస్త తగ్గి నన్ను కాస్త గౌరవంగా చూడసాగారు. కానీ నేను చెప్పిన పిచ్చోఈ విషయమే నాకు పెద్ద తలనొప్పయి కూర్చుంది. ఒక ఇల్లు, వాకిలీ లేని ఆ పిచ్చోడూ ఎక్కడూన్నాడో వెతికి పట్టుకోడానికి పోలీసుల ప్రాణం తోకకొచ్చింది.
చాలాసేపు నన్ను పోలీస్ జీపులో ఎక్కించుకుని హైదరాబాదులో సగం తిప్పారు పోలీసోళ్ళు. చివరకు ఎర్రగడ్డ హాస్పిటల్ దగ్గర తలకు కట్టు కట్టుకుని ఫుట్‌పాత్‌పై పడుకుని కనిపించాడు.
అతన్ని జీపులో ఎక్కించుకుని పోలీస్ స్టేషంకి తీసుకొచ్చారు. అతనే చెప్తాడో అని నాక్కంచెం భయం వేసినా పిచ్చోడి మాటలకంటె నా మాటలకే విలువిస్తారని నమ్మకం కలిగింది. అంతకు ముందు వినయ్ చెప్పిన సాక్ష్యంతో పోలీసులకు నా మీద చాలావరకూ అనుమానం తీరిపోయింది.
ఆ పిచ్చొడు నిజంగానే పిచ్చోడూ. ఫొలీసుల్ని మూడు చెరువుల నీళ్ళు తాగించాడూ.వాడ్ని కొట్టింది నేనేనని ఒప్పుకున్నాడు.కానీ నన్ను గోళ్ళతో రక్కలేదన్నాడు. ఆ విషయం విన్న పోలీసులకు నా మీద మళ్ళీ అనుమానం మొదలయింది. వాడ్ని మరోసారి ప్రశ్నించారు. ఈ సారి విచిత్రంగా నేనతన్ని కొట్టలేదన్నాడు.కానీ నన్ను గోళ్ళతో రక్కింది మాత్రం నిజమేనని ఒప్పుకున్నాడు.వాడికి నేను కొట్టిన దెబ్బతో పిచ్చి ముదిరినట్టుంది.
నాలుగైదు సార్లు అడిగిన ప్రశ్నలే అడిగినా ఒక్కోసారి ఒక్కోరకంగా జవాబిస్తున్న ఆ పిచ్చోడి మాటలకు పోలీసులక్కూడా పిచ్చెక్కిపోయి నన్ను విడుదల చేశారు.
నేను హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. పోలీస్ స్టేషన్లో నేను ప్రదర్శించిన ధైర్యం, వినయ్ నాకనుకూలంగా చెప్పిన సాక్ష్యం, పిచ్చోడి పిచ్చి సమాధానాలు, అతని తలపై నేను చేసిన గాయం, కడుపులో గుద్దిన గుద్దులు సంగతులన్నీ కలిపి పోలీసులు నన్ననుమానించకుండా చేశాయి. పథకం ప్రకారమే అంతా జరిగిందన్న ఆనందంతో హాయిగా ఇంటివైపు బయల్దేరాను.
పోలీస్ స్టేషన్లో లోపల్లోపల నేను పడ్డ టెన్షన్ కి నాకు నవ్వొచ్చింది. అప్పటికే అలసిపోయి వున్న నేను ఎప్పుడూ నిద్రపోయానో కూడా తెలియదు. చాలా ర్ఫ్జుల తర్వాత సుఖంగా నిద్రపోయాను ఆ రోజు.
అదండీ కథ, ఇప్పుడు చెప్పండి. నా మాజీ భార్య ప్రచారం చేసినట్టు నాకు పిచ్చా? పిచ్చోళ్ళెక్కడయినా ఇలా తెలివిగా ఒక హత్య చేసి తప్పించుకోగలరా?
ధభ్..ధభ్….
ఒక్క నిమిషం. ఎవరో వచ్చినట్టున్నారు!
కాలింగ్ బెల్ నొక్కాలనే జ్ఞానం కూడా లీని ఆ మూర్ఖులెవరో చూసి వస్తాను. మీరెక్కడికీ వెళ్ళకండి. ఇపుడే వచ్చేస్తాను.
ఫోలీసులు!
అయ్యో! ఇప్పుడెలా?
దయచేసి ఈ రహస్యం పోలీసులకు చెప్పకండి…ప్లీజ్…
“యు ఆర్ అండర్ అరెస్ట్!”
“నన్ను నమ్మండి సార్. నాకేమీ తెలియదు. నా మాజీ భార్యను నేను చంపలేదు”
నేను చెప్పేది పచ్చి అబధ్ధమని నాకూ తెలుసు, మీకూ తెలుసు. కానీ పోలీసులకి తెలియదు. ప్లీజ్ మీరూ చెప్పకండి.
“మిమ్మల్ని అరెస్ట్ చేసేది మీ మాజీ భార్య హత్యకెసు గురించి కాదు. రోడుపై తిరిగే ఒక అనామకుడ్ని రాయితో దారుణంగా గాయపరిచి అతని మరణానికి కారణమయినందుకు”
డామిట్! కథ అడ్డం తిరిగింది!
మీరేంటి? ఆ చూపేంటి? ఆ చూపుకు అర్థమేంటి?
నన్ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తుంటే మీకు పాట పాడాలనిపిస్తుందా? నమ్మక ద్రోహి. ఇప్పటివరకూ హాయిగా నేను చెప్పిన కథ విని “అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటి” అంటూ పాడుకుంటూ నీ దారిన నువ్వెళ్ళిపోతావా?
హెల్ప్!
ప్లీజ్ హెల్ప్!
……..హెల్ఫ్,ప్లీజ్ హెల్ప్!
మన జీవితంలో మనమెన్నో కథలు, కథానికలు, పద్యాలు, కవితలు, పాటలు పుస్తకాలు చదువుతుంటాము. కొన్ని నచ్చుతాయి. కొన్ని నచ్చవు. కాని నచ్చిన వాటిల్లో కొన్ని చిరకాలం గుర్తుండిపోతాయి. కొన్ని చదివి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి కూడా; బాధతో కాదు సుమా! గుండెలనావరించిన ఆనందం అక్కడ పట్టలేక ఆనందభాష్పాలుగా కనుకొనలనుండి మెల్లగా జారి తిరిగి హృదయాన్ని చేరుతాయి.నా జీవితంలో ఇలా జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నా ఇక్కడ కొన్నింటిని ఉదహరించడానికి ప్రయత్నిస్తాను. ముందుగా సీతాకోకచిలుక గురించి ‘అరుణ్ కొలాత్కర్ ‘ రచించిన ఈ కవిత చదవండీ.
The Butterfly
It is split like a second.
It hinges around itself.
It has no future.
It is pinned down to no past.
It’s a pun on the present.
Its a little yellow butterfly.
It has taken these wretched hillsunder its wings.
Just a pinch of yellow,it opens before it closesand it closes before it owhere is it?
పై కవితలోని ప్రత్యేకతను మీరిప్పటికే గ్రహించి ఉంటారు. ఒక క్షణం మన కళ్ళముందుంటూనే, లిప్త పాటు లో మాయమయ్యే సీతాకోకచిలుకను వర్ణిస్తూ ఆయన రాసిన ‘It is Split like a second’ అన్న లైను త్వరలో పాఠకునికెదురవ్వబోయే ఆశ్చర్యాన్ని సూచిస్తుంది.ఇలా చిన్న కవిత లోనే ఎంతో చెప్పే ప్రయత్నం ఒక ఎత్తైతే ‘and it closes before it o’ అన్న లైనులో,”అరే, ఇప్పటిదాకా ఇక్కడే ఉంది.ఇంతలోనే ఏమైపోయిందన్న ఆశ్చర్యానికి అక్షర రూపమిచ్చి అద్భుతమైన ప్రయోగం చేశారనిపించింది.
ఇలాంటి మరో ఉదాహరణ సిరివెన్నెల సీతారాం శాస్త్రి రచించిన ఒక సినిమా పాట.
“ఓ చిన్నారి చిలుకమ్మా, నువ్వు కరిగేది ఎప్పుడమ్మా” అన్న ఈ పాట ఏ సినిమాలోదో తెలియదు కానీ ఈ పాటలో వచ్చే ఒక లైను నా పై చాలా ప్రభావం చూపింది.
“నీళ్ళల్లోని చేపకు కన్నీళ్ళొస్తున్నాయని చెప్పేవారు చూపేవారు ఎవరమ్మా, తన తడి తెలియదె తనకైన” అంటూ సాగే ఆ పాట అత్యున్నత సృజనాత్మకతకు తార్కాణం. శితారామశాస్త్రి గారి ఎన్నో పాటలు నాకు నచ్చినప్పటికీ ఈ పాట నాకు అత్యంత ఇష్టం.
పైనుదహరించిన వాటి లాగే నన్ను బాగా కదిలించిన మరో లైను A K Ramanujan ఇంగ్లీషులో రచించిన ఒక కవితలో వచ్చే ఈ లైను-”If there is nothing you see on the tree , it is the chameleon you are seeing”.
నేనెన్నో కవితలు చదివాను గాని ఒక రోజు సాయంత్రం హైదరాబాదులో ఈ లైను చదివినప్పుడు నేను పొందిన ఆనందం వర్ణనాతీతం. అది దివ్యానుభూతి. ఆ ecstacy నుంచి బయటపడడానికి నాకు షుమారు రెండు రోజులు పట్టిందంటే నమ్మండి.
ఇలాంటివి చదివినప్పుడల్లా ,”ఛీ, మనమూ రాస్తున్నాము. ఎందుకు పరమ దండగ!” అని ఒక వైపు దిగులేసినా , మరోవైపు ఇంకా బాగా రాయాలనే ఉత్సాహమూ కలుగుతుంది. ఏదేమైనప్పటికి తమ సృజనాత్మకతతో పాఠకుల కళ్ళెదుట కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించగలిగిన వారే నిజమైన కళాకారులు!
The Encounters
విశ్వం తన శక్తినంతా కూడగట్టుకుని పరిగెడ్తున్నాడు.
చుట్టూ దట్టంగా పెరిగిన పొదల్లోంచి ఎగిరెగిరి దూకుతున్నాడు.
అతని దూకుడుకి అక్కడక్కడా దాక్కుని ఉన్న కుందేళ్ళు అతనితో పాటే పరుగెత్తి పొదల్లోకి మాయమవుతున్నయి.
వెనక్కి తిరిగి చూడడంలేదతను.
కొద్ది దూరంలోనే వినిపిస్తున్న బూట్ల సవ్వడి అతనికి తుపాకీ మోతల్లా చెవుల్లో మారుమోగతోంది.
కాళ్ళకి చెప్పులైనా లేకపోవడంతో ముల్లు గుచ్చుకుని కాలినుండి తలవరకూ భరించలేని బాధ కలిగిస్తున్నా అతని వేగం మాత్రం తగ్గలేదు. ప్రాణాలమీద ఆశకన్నా తన ప్రాణాలన్ని పెట్టుకున్న కూతుర్ని, తనపైనే ప్రాణాలు నిల్పిన భార్యను తలచుకుని క్షణక్షణానికి రెట్టించిన వేగంతో పరిగెట్టసాగాడు.
అతని పరుగుల సవ్వడికి అడవిలోని చెట్లపై విశ్రమిస్తున్న పక్షులు గాల్లోకెగిరి రెక్కలు తతపలాడించాయి.
ఎండుటాకులపై అతని పాదాల సవడి గలగలమని విటశబ్దాలౌ చేసాయి.
ఏపుగా ఎదిగిన చెట్లలోంచి పరిగెడ్తున్న విశ్వం చేతుల టాకిడికి చిన్న చిన్న ఎండుకొమ్మలు విరిగి చిటపటలాడాయి.
విశ్వాన్ని వెంటాడుతూ వెనుకనే వస్తున్న బూట్ల సవ్వడీ మరో కొట్ట తాళంలో పలికాయి.
ఇంతలో వీచిన గాలి సవ్వడికి చెట్లు తలలాడించి వింత ధ్వనినేదో వెలువరించి భీకర సంగీతాన్ని పలికించాయి మిగిలిన శబ్దాలతో కలిసి.
ఇవేమీ తనకు పట్టనట్టు పడగెత్తి కోరగా చూసిందో త్రాచు పాము. నాకేం భయం లేదన్నట్టు నీలుక్కోని చూస్తున్న ఆ నాగు విశ్వం అడుగుల సవ్వడికి ఉలిక్కిపడీ విశ్వాన్ని ఎదుర్కోబోయి మెరుపులా మాయమయిన అతనెక్కడ అని దిక్కులు చూస్తూ నిల్చుండీపోయింది.
ఎంత పరిగెత్తినా బూట్ల సవ్వడి మాత్రం విశ్వం చెవులకు లీలగా వినిపిస్తూనే ఉంది. ఎంతదూరం వెళ్ళినా, ఎక్కడికెల్తున్నాడొ అర్థంకాకఫొయినా ఎక్కడో దగ్గర తను పోలీసులకు దూరమవుతాదేమోనన్న ఆశతో ఆవేశంగా పరిగెట్టాడు విశ్వం. అలుపన్నది ఎరుగక అదే పనిగా పరిగెట్టి చివరకో మైదానం లాంటి ప్రదేశాన్ని చేరుకున్నాడు విశ్వం.
ఖాసేపు కాలికి విశ్రాంతినిచ్చి చుట్టూ చూశడు.
దట్టంగా పెరిగిన ఆడవి. ఆ ఆడవి మధ్యలో విచిత్రమైన ఈ మైదాన ప్రాంతం. ఇన్నాళ్ళ తన జీవితంలో ఎన్నడూ చూడనట్టి ప్రదేశమది. మైదానం మధ్యలో ఒంటరిగా నిల్చుని ఆకాశం వైపు చూశాడు. సూర్యుడు ఇంకాసేపట్లో అస్తమించేలా ఉన్నాడు.
రెండు క్షణాలు ఊపిరి గట్టిగా పీల్చి వదిలాడు. పొంగుకు వస్తున్న ఆయాసాన్ని ఆపుకోడానికి ప్రయత్నించాడూ.ఉబికి వస్తున్న ధుఃఖాన్ని ఆపుకున్నాడు గాని కంట్లోకి చేరిన కన్నీటి చుక్కలు మాత్రం చెంపలపై చేరాయి. కళ్ళనిండా చేరిన నీటితో అతని దృష్టి మసకబారింది.
దూరంగా చెట్లలోపల అలికిడి కావడంతో తలతిప్పకుండానే అటువైపు దృష్టి సారించాడు విశ్వం. చుట్టూ వున్న చెట్లలోంచి పోలీసులు తుపాకీలెక్కుబెట్టి తన వైపే వస్తుండడం గమనించాడు. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా మరలా కాలికి బుధ్ధి చెప్పాడు విశ్వం.
పదులకొద్దీ దూసుకువస్తున్న బుల్లెట్లను వెంట్రుకవాసిలో తప్పించుకుంటూ దారీ తెన్నూ తెలియక అడవిలోకి పరుగు తీసాడు. చీకట్లు అలముకుంటున్న ఆ అడవిలో కంటికి ఎటువంటి దారి కనిపించకున్నా కాళ్ళు ఎటువైపు తీసుకెళ్తే అటువైపుగా పరిగెత్తసాగాడు. ఆ చీకటిలో అతని కాళ్ళే అతని కళ్ళయ్యాయి.
మధ్యాహ్నం నుంచీ పరుగెత్తడంవలన అతనిలో సత్తువ లోపించసాగింది. ఎంత వద్దనుకున్నా ఇంటి గుమ్మం ముందు దీపం కాంతిలో తనకోసమే ఎదురుచూస్తుండే తన భార్య కళ్ళముందు ప్రత్యక్షమవసాగింది. ఆమె పెద్దకళ్ళల్లోని వెలుగు, తనను చూడగానే ఆమె ముఖంపై వికసించే చిరునవ్వే గుర్తుకు రాసాగాయి. ఆ చీకట్లో తన కూతురి బోసినవ్వులు నవ్వి క్షణానికోసారి అడవంతా వెన్నెల కురిసినట్లుగా తోచిందతనికి.
బూట్ల సవ్వడి చేస్తున్న వికృత శబ్దాలకు దూరమై తన కూతురి బోసినవ్వులు వింటూ భార్య ఒడిలో సేదతీరాలనే కోరిక ఎక్కువయియింది అతనిలో. ఆ కోరికతో అత్నిలో నిస్సత్తువ ఆవిరయిపోయింది. ఆశ్చర్యంగా అప్పటివరకూ అక్కడ ఆవరించిన చీకట్లు తొలిగిపోసాగాయి.
రాత్రి మాయమయింది. సుర్యోదయానికి సమయమైంది. దూరంగా కోండల్లోంచి సూర్యుడు అప్పుడే బయటకు వస్తున్నట్టుగా సూచనగా ఆకాశం కాషాయం రంగు పులుముకొంది. విశ్వానికి పగలూ రాత్రితో పనిలేనట్టుగా అదేపనిగా పరిగెత్తాడు.
తన చుట్టూ ఉన్న అడవి, దూరంగా కొండలోల్లోని జలపాతాల గలగల, పచ్చని పచ్చిక అతనికి బాగా పరిచయమే.ఉషోదయ కాంతుల్లో విశ్వం కళ్ళల్లో కొత్తకాంతులు మెరిశయి. ఆగకూండా అతను పెట్టిన పరుగు మరి కొద్ది సేపట్లో అంతం కాబోతుందనే అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
విశ్వం మనసు ఆనందంతో ఊగిసలాడింది.
చేతులు బార్లా చాపి "వస్తున్నా! నేనొచ్చేస్తున్నా! అని చేతులు చాపి ప్రకృతిలో కలిసిపోదామనిపించింది.
ఊరు దగ్గరపడ్తున్న కొద్దీ అతను వేగాన్ని రెట్టించాదు. దూరంగా బూట్ల సవ్వడీ రెట్టింపవుటోంది.
ఒక్కసారి తన భార్య చిరునవ్వు చూడాలి. తన ఒక్కగానొక్క కూతురి లేతఆదాలను ముద్దాడాలి.కోరిక, ఆశ, ఆవేశం, ఆత్రుత, భయంలతో కూడుకున్న తెలియని భావమొకటి అతని మదిలో మెదిలింది. ఆనందం అంతలోనే భయంకర విషాదం.
ఊరు దగ్గరవుతున్న కొద్దీ అతని గుండె రెట్టింపు వేగంతో కొట్టుకోసాగింది. దూరంగా బూట్ల సవ్వడీ రెట్టింపవుతోంది. క్షణక్షణానికి దగ్గరవుతున్నాయి. ఒకటికాదు, రెండుకాదు వేలకోదీ పోలీసూలు తన వైపే దూసుకువస్తున్నారు. చేతిలో తుపాకీలు. కళ్ళల్లో క్రౌర్యం. తన చావి ఖాయం అనుకున్నాడు విశ్వం.
కళ్ళముందు ఊరి పిలిమేరలు కనిపిస్తూ ఉన్నాయి.
ఇంక రెండు నిమిషాలు. ఈ పొలంగట్టు దాటి ఎడం వైపు ఉన్న రెండో సందులోనే తన ఇల్లు.
వచ్చేస్తోంది.
ఊరు!
ఇల్లి!
దగ్గరకొచ్చేస్తోంది!
అతని గుండే ఎప్పుడూ లేనంత వేగంగా కొట్టుకోంటోంది.
చనిపోయిన తన అమ్మ గుర్తుకొచ్చింది విశ్వానికి.
చిన్నప్పుడు రోజంతా పొలల్లో బురదలో ఆదుకొని, పక్కనున్న యేట్లో స్నానం చేయడం గుర్తొచ్చింది. అక్కడే చేపలు పట్టడం, సాయంత్రమేఫ్ఫుడొ ఇంటికి వెళ్ళడం,ఆక్లేసి అమ్మపెట్టె చివాట్లతోపాటు అన్నంకోసం ఇంటి వైపు పరిగెత్తడం గుర్తుకొచ్చింది విశ్వానికి.
"అమ్మా నేనొచ్చేశను!" అప్రయత్నంగా అతని గొంతు పలికింది.
"రా బాబూ!" అంటూ చేతులు చాపి ఎదురుచూస్తున్నట్టుగా తన ఊరు అమ్మలా స్వాగతించింది.
తన గమ్యమైతే చేరుకుంటున్నాడు గాని, పట్టు వదలని విక్రమార్కులలా తననే వెంటాడుతున్న పోలీసుల గురించే విశ్వానికి అర్థంకాలేదు.అయినా పరుగాపలేదు.
ఊరి పొలిమేరలు దాటాడు.తన స్నేహితుడు రాము వుండే మొదటి వీధి దాటేసాడు. రెండో వీధి మొదట్లోకి చేరుకున్నాడు. అక్కడ్నుంచి అతని ఇల్లు స్పష్టంగా కనిపించింది.
తన చిన్న ఇల్లు. ఇంటిముందు తన భార్య.
పాపం రాత్రంతా తనకోసం ఎదురుచూస్తూ కూర్చున్నట్టుంది. అరుగుమీద గుడ్డీగా వెలుగుతున్న దీపం ఆర్పేసి ఇంట్లోనుంచి కుండలో నీళ్ళు తెచ్చి గడపపై పెట్టింది. తన కూతుర్ని తెచ్చి గడపలో చాపపై పడుకోబెట్టింది.
అడుగులో అడుగువేస్తూ ఇంటికి దగ్గరవుతున్న కొద్దీ విశ్వం ఆనందం ఆపుకోలేక పోయాడు. ఇంకా రెండు అడుగులు వేస్తే తన భార్య కళ్ళముందుంటాడనే నిజం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది.
అతని భార్య కుండలోని నీళ్ళు చెంబుతోతీసి ఇంటిముందు చల్లబోతుందగా అక్కడకు చేరుకున్నాడు విశ్వం.
చల్లని నీళ్ళు అతని మొహంపై చిలరింపబడడంతో ఉలిక్కిపడ్డడు విశ్వం.
కళ్ళలోకి చేరిన నీళ్ళను తుడుచుకోని కళ్ళుతెరిచి చూసిన విశ్వం ఒక్కసారిగా అవాక్కయ్యాడు.
అతని కళ్ళ ముందు కనిపించిన దృశ్యం అతనిలో భయంకర విషాదం కలుగచేసింది.
తను చూసింది నమ్మ లేనట్టుగా కళ్ళు మరోసారి తుడుచుకోన్నాడూ. తల విదిలించాడు. కళ్ళు తెరిచి చూశాడు. అయినా అక్కడ దృశ్యం ఏ మాత్రం మారలేదు.
ఎదురుగా నీళ్ళ సీసాతో నిలబడి మరోసారి తన మొహంపై నీటిని చిలకరించబోయిన పోలీసోడిని చూసి బిత్తరపోయాడు విశ్వం.
"ఏంటి పగటి కలలు కంటున్నావా?" పద పద నీ తైమొచ్చేసింది!" అంటూన్న పోలీసు మాటలతో తిరిగి ఈ లోకంలోకి వచ్చిపడ్డడు విశ్వం.
పోలీసుల దెబ్బలకు సృహ తప్పిపడిపోయిన విశ్వానికి అప్పటివరకూ తను కల కన్నాడని అర్థమయ్యి కంటినిండా నీళ్ళు ఉబికివచ్చాయి. నిజంలా తోచిన కలను తలచుకుంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు.
దూరంగా ఇద్దరు పోలీసులు సిగరెట్టు కాలుస్తూ నిల్చున్నారు. మరో పోలీసు జీపులోనే కూర్చుని తమాషా చూస్తున్నాడు. మరొక పోలీసు విశ్వం కట్లు విప్ప సాగాడు.
ఆడవితల్లి సాక్షిగా అక్కడ మరో బూటకపు ఎంకౌంటర్ రంగం సిధ్ధమయ్యింది. పోలిసుల తుపాకీ గుళ్ళు రెండు ప్రాణాలను అన్యాయంగా బలి తీసుకున్నాయి. అడవి బిడ్డలిద్దరు అడవిలోనే ప్రాణాలొదిరారు. సాటి జీవులకు జరుగుతున్న అన్యాయానికి మూగసాక్షులయ్యాయి అక్కడి చెట్లు, పక్షులు.
రేపటి ఉదయం వర్తాపత్రికల్లొ రాబోయే కథనమేంటో మాకూ తెలుసని ఈ నాటి వార్తా పత్రిక గాలిలో రెపరెపలాడింది.
ఆకాశం ఎర్రని రంగునలముకుంది.
సూర్యుడు అస్తమించాడు.
Oka Prema katha
ఆరున్నరకల్లా గ్రీన్ పార్క్ హోటల్ కి వచ్చెయ్. కారుపంపించనా ఆఫీసుకి” అడిగాడు నవీన్.
“వద్దులేరా.నేనే ఆటోలో వచ్చేస్తా!” అని ఫోను పెట్టేసి టైం చూసుకున్నాను.మూడు నలభై కావొస్తోంది.వున్న పని కాస్త ముగించుకుని ఇంటికి బయల్దేరాను.
“అప్పుడే వెళ్ళిపోతున్నావా?” ఆడిగాడు పక్క సీట్లో కూర్చున్న కార్తీక్.
“ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలి పెళ్ళికి వెళ్ళాలి” అని చెప్పి ఆఫీసు నుంచి బయటపడ్డాను. ఆటో ఎక్కి అమీర్ పేట అని చెప్పాను.
“జ్యోతి వెడ్స్ వినయ్”. చేతిలో ఉన్న శుభలేఖను తెరిచి చూశాను. నవీన్ వాళ్ళ బాబాయ్ కూతురు జ్యోతి. బెంగుళూరులో ఏదో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం. పెళ్ళికొడుకు కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగమే చేస్తున్నాడట.
అశ్విని కూడా పెళ్ళికొస్తుందని చెప్పాడు నవీన్ ఇందాక ఫోన్లో. ఆరునెలల తర్వాత మొదటిసారి అశ్వినిని కలుసుకునే అవకాశం వస్తుందని ఒకవైపు మనసులో ఆనందంగా ఉన్నా మరోవైపు తెలియని భయం.
యూనివర్శిటిలో చదివేరోజుల్లో పరిచయం మాఇద్దరిది. నేను ఎం.సి.ఏ రెండో సంవత్సరంలో వుండగా ఎం.ఏ సోషియాలజీలో చేరింది తను. నాచిన్ననాటి స్నేహితుడైన నవీన్ తనకి క్లాస్ మేట్. నేను నవీన్ చిన్నప్పటినుంచి కలిసి చదువుకున్నాము. ఇంటర్ తర్వాత నేను సైన్స్ గ్రూప్ , వాడు ఆర్ట్స్ గ్రూప్ తీసుకుని చదువుల దారుల్లో వేరుపడ్డా మా దోస్తీ మాత్రం ఎప్పటిలానే సాగిపోయింది.
డిగ్రీ పూర్తయ్యాక నేను ఎం.సి.ఏ లో చేరడం, నవీన్ ఒక సంవత్సరంపాటు ఎవో చిన్నా చితకా ఉద్యోగాలు చేసి చివరకు విసుగుచెంది నేను చదివే యూనివర్శిటిలోనే ఎం.ఏ సోషియాలజీ లో చేరడం జరిగిపోయాయి. నవీన్ తోపాటు ఒకే క్లాసులో ఉండడంతో అప్పుడప్పుడు అతన్ని కలవడనికి వెళ్ళినప్పుడూ కనిపిస్తుండేది అశ్విని.
ఒక్కసారిచూసి తలతిప్పుకోలేని అందం ఆమెది. ఆమెను చూసిన ప్రతివారు మరోసారి తలతిప్పి ఆమెను చూడాల్సిందే! గల గల పారే సెలయేరులా ఎప్పుడు చిరునవ్వునలంకరించుకుని అందరితో కలుపుగోలుగా మాట్లాడుతూ తిరిగే అశ్వినిని చూస్తే ఒక్కోసారి పురివిప్పిన నెమలిలానో, చెంగుచెంగున ఎగిరే లేడిపిల్లలానో ఉండేది.అందుకే ఆమెను చూస్తూండడంలో చాల థ్రిల్ కలిగేది. అలా చూస్తూచూస్తూనే ఆమెతో ప్రేమలో పడిపోయాను నేను. ఎప్పుడైనా నవ్విందంటే చాలు, ఆ నవ్వుల సవ్వడి వీనుల విందైన సంగీతంలా నా మనసుకి తోచేది. మిగిలిన వాళ్ళకు ఆమె చేష్టలు, నవ్వులు ఎలా అనిపించేవో, ఎలా వినిపించేవో నాకయితే తెలియదు.
యూనివర్శిటిలో చేరిన ఆరు నెలల్లోనే నవీన్, అశ్వినిలు మంచి స్నేహితులయ్యారు.
నవీన్ నాకు దూరమవుతున్నందుకో, అశ్విని నాకు దగ్గర కానందుకో లేక నవీన్, అశ్వినిలు దగ్గరయ్యి తనకు దూరమవుతున్నందుకో తెలియదుకాని రోజు రోజుకి నా మనసు చెప్పలేని బాధతో నిండిపోయేది.
“మీ ఫ్రెండ్ నన్నెందుకలా తినేశాలా చూస్తుంటాడు?” అని నవీన్‌ని అడిగిందట అశ్విని.నవీన్ గాడు అదేదో పెద్ద జోకులా నాతో చెప్తే నా కళ్ళల్లో నీళ్ళు తిరగడం నాకింకా గుర్తుంది.
నవీన్ తో పనిఉన్నా లేకపోయినా అశ్వినిని చూడలన్న నెపంతో రోజుకు రెండుసార్లయినా సోషియాలజీ క్లాసురూముల వైపు వెళ్ళేవాడిని. నవీని గాడికి కొన్ని రోజులకి విషయం అర్థమైపోయింది. ఒకరోజు నన్ను క్యాంటీన్‌కి తీసుకెళ్ళి అడిగేశాడు.
“అశ్విని అంటే ఇష్టమా?” అని సూటిగా అడిగేసరికి సమాధానం ఏం చెప్పాలో తెలియక బిక్కమొహం వేసీ నన్ను చూసి పడిపడి నవ్వాడు.
నాకు చాలా కోపమొచ్చింది. నవీన్‌ని చెడామడా తిట్టేశాను. నాకీ ప్రేమలు, అమ్మాయిలతో పరిచయాలు కొత్తేమీ కాకపోయినా అంతకుముందు నేను ప్రేమించాననుకున్న రోజుల్లో లేని ఏదో కొత్తదనం ఆ రోజుల్లో వుండేది. అంతకుముందు నాకెదురైన అనుభవాలు ప్రేమకాదని అశ్వినితో నేను అనుభవిస్తున్నదే నిజమైన ప్రేమని నవీన్‌కి చెప్పాను.
నేను ప్రేమలో పడ్డా ప్రతిసారీ ఇలాగే చెప్తానని నేను జీవితాంతం ఎఫ్ఫుడూ ఎవరో ఒక అమ్మాయిని గాఢంగా, లోతుగా ప్రేమిస్తూనే వుంటానని జోక్ చేశాడు. నేను మాత్రం ధృడ నిశ్చయంతో చెప్పేశాను. నేను ప్రేమించేది, పెళ్ళంటూ చేసుకుంటే అది అశ్విని ఒక్కదాన్నే అని.
నా సీరియస్‌నెస్ చూసి వాడికి నవ్వాగలేదు.అసలు తప్పంతా నాదే అనిపించింది. నా సొంత విషయాలన్నీ నవీన్‌కి పూసగుచ్చినట్టు చెప్పడం, వాడూ నన్ను ఎప్పట్లానే ఏడిపించడం, మరోసారి నా విషయాలేవీ నవీంకి చెప్పకూడదనుకోవడం, వాడీ దగ్గర ఏ విషయమూ దాచకపోవడం మా మధ్య సర్వసాధారణమైపోయింది.
“ఏడిపించడం మాని వీలయితే సహాయం చెయ్యరా” అని ప్రాధేయపడ్డాను.
గ్రీన్‌పార్క్ హోటల్లో పార్టీ ఇస్తానంటే సరే అన్నాడు. నవీన్ సహాయంతో అశ్విని మనసు ఎలాగైనా గెలుచుకోవచ్చనే సంతోషంతో మనసు కొంచెం కుదుట పడింది.
అప్పటికే లంచ్ టైం కావస్తుండడంతో అందరూ క్యాంటిన్ వైపు రావడం మొదలుపెట్టారు. అశ్విని కూడా వచ్చి మాతోపాటే కూర్చుంటే బవుండునని మనసులో అనుకున్నానో లేదో “హాయ్, నవీన్” అంటూ నా ఎదురుగుండా కుర్చీలో కూర్చుంది తను.
నవీన్ స్నేహితురాలయినప్పటికీ నేనెప్పుడూ ఆమెను పలకరించను కూడా లేదు.పార్టికి కక్కుర్తి పడి అయినా నన్ను అశ్వినికి పరిచయం చేస్తాడేమోనని నేను ఆతృతగా ఎదురు చూస్తుంటే “తినడానికేమైనా తెస్తా” అంటూ మమ్మల్నిద్దరినీ ఒంటరిగా వదిలి క్యాంటీన్ లోపలికెళ్ళిపోయాడు మా ప్రాణ మిత్రుడు నవీన్.
అమ్మాయిల్తో మాట్లాడడం నాకు కొత్త కాకపోయినా అశ్విని ముందు ముడుచుకు కూర్చుండిపోయానారోజు. అసహనంగా నేను అటు ఇటు ఇబ్బందిగా కదుల్తుంటే అడిగింది అశ్విని, “మీకు పెళ్ళయిందా?” అని.
ఇరవై రెండేళ్ళకే పెళ్ళయిపోయిన అంకుల్ లా కనిపిస్తున్నానా? అని నామీద నాకే అనుమానం వచ్చింది. తమని ఇష్టపడే అబ్బాయిలంటే అమ్మాయిలకింత చులకన భావమెందుకో అర్థం కాలేదు. యినా కూడా ఆడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలన్న సంస్కారంతో “నాకు పెళ్ళికాలేదు” అని చెప్పి అక్కడ్నుంచి లేవబోతుంటే నా కళ్ళలోకి సూటిగా చూస్తూ మరో ప్రశ్న విసిరింది.
“అసలు జీవితంలో పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన వుందా?” అని
రోజు ఆమెను ఆరాధనతో చూడడం మూలానే ఆమె తనను వేలాకోలం చేస్తుందనుకున్నాను.ఆమెపై ఎక్కడలేని కోపమొచ్చింది. పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఖచ్చితంగావుంది. కానీ నీలాంటి కఠిన హృదయం కలిగిన దానిని మాత్రం కాదని చెప్పాలనిపించింది. ధైర్యం చాలక అవునన్నట్టుగా తలూపి మౌనంగా ఉండిపోయాను.
“మరి నన్ను పెళ్ళి చేసుకుంటావా?” అని ఆటంబాంబు పేల్చినట్టు మూడొప్రశ్న వేసి సమాధానం కోసం ఎదురుచూడకుండా పరుగులాంటి నడకతో అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.
ఇంతలో చేతిలో రెండూ ప్లేట్లతో ప్రత్యక్షమయ్యాడు నవీన్.
“ఏంట్రా! కొంపతీసి ఐ లవ్ యూ అని చెప్పేసావా?” ఆదిగాడు నవీన్.
“సార్ లెఫ్టా రైటా?” అని ఆటోడ్రైవర్ సడన్ బ్రేక్‌వేసి అడగడంతో నా జ్ఞాపకాలకొక బ్రెక్ పడింది. మళ్ళి ఈ లోకంలోకి వచ్చిపడ్డాను.
రెండు నిమిషాల్లో ఇల్లొచ్చేసింది.ఎంత వద్దనుకున్నా అశ్విని ఆలోచనలే మనసంతా అలుముకోనిపోయాయి.
షవర్ కింద స్నానం చేస్తుంటె మేమిద్దరం వర్షంలో నడుస్తూ గంటలు గంటలు గడిపిన రోజులు గుర్తొచ్చాయి.
స్నానం ముగించి బట్టలేసుకుంటూ నవీన్ కి ఫోన్ చేశాను. నాక్కొంచెం పనూందని రావడం కుదరదేమోనని చెప్పాను. అలా అయితే జీవితంలో నా మొహం చూడనని టక్కున ఫోన్ పెట్టేశాడు. నేనక్కడికి వెళితే పాతస్నేహితుల మధ్యలో నేను అశ్విని మాట్లాడుకోకుండా ఇబ్బందిగా ఉండాల్సిరావడం ఊహించుకుంటె అసలు పెళ్ళికి వెళ్ళకపోతేనే మంచిదనిపించింది.
అప్పటికింకా టైం ఐదే అయ్యింది. పెళ్లికింకా గంటన్నర టైం వుంది. సోఫాలో కూలబడి టివిపెట్టి అట్నుంచి అటూ, అట్నుంచి ఇటూ చానెల్స్ అన్నీ ఒకసారి చూసి టివి కట్టెశను. వెళ్ళాలా? వద్దా? అనే ఆలోచనల్తో మనసంతా గందరగోళంగా తయారయింది. ఆరునెలల్లో ఇదే మొదటిసారి అశ్వినిని కలుసుకోవడం.
మొదటిసారి మేమిద్దరం మనసు విప్పి మాట్లాదుకొన్న రోజు గుర్తొచ్చింది. ఒక అమ్మాయి నా దగ్గర్కొచ్చి పెళ్ళిచేసుకుంటావా అని అడిగితే అది నిజమా అబధ్ధ్మా అని తేల్చుకోవడానికి రెండు రోజులు పట్టింది. రెండు రోజులు క్లాసులెగ్గొట్టి మరీ తీవ్రంగా ఆలోచించి ఇంటిదగ్గర్లోవున్న కనకదుర్గమ్మ గుడి దగ్గరకెళ్ళి ఒక పసుపుతాడూ ఒక పసుపుకొమ్ము కొని సినిమా హీరోలాగా యూనివర్శిటీకి బయల్దేరాను.
ఆ రోజు నాకంత ధైర్యమెలా వచ్చిందో నాకిప్పటికీ అర్థంకాదు.
సోషియాలజీ క్లాసుకెళ్ళి అశ్వినిని బయటకు పిలిచాను. అయటకు రాగానే పెళ్ళిచేసుకుందామా అని జేబులోంచి పసుపుతాడు తియ్యడంతో కంగారు పడీపోయింది. అశ్విని వెనకాలే క్లాసులోంచి బయటకు వచ్చిన నవీన్ నా ధైర్య సాహసాల్ని చూసి శిలాప్రతిమలా నిల్చుందిపోయాడు.
స్వతహాగా ధైర్యవంతుడినయిన నేను అంతకు ముందు రెండు మూడు సార్లు ధైర్యంగా వ్యవహరింపబట్టే అమ్మయిలు నా ప్రేమనంగీకరించారు. అప్పుడూ కూడా అలాగే జరుగుతుందనే నమ్మకంతో ధైర్యె సాహస లక్ష్మీ అనుకుని ఆ సాహస కార్యానికి తలపడ్డాను.
ముందు షాక్ తిన్నా తర్వాత నాకు షాక్ తినిపించింది అశ్విని. హేండ్బ్యాగ్ లోంచి ఒక గ్రీటింగ్‌కార్డ్ తీసి నాకిచ్చింది. నల్ల బ్యాక్‌గ్రౌండ్ పై ఎర్ర అక్షరాలతో ‘ఐ లవ్ యూ’ అని ముద్రించి వుంది.
పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమించినమ్మాయినే చేసుకుంటానని ఎప్పుడూ ఫ్రెండ్స్‌కి ఛాలెంజ్ చేసి చెప్పేవాడిని. నేనెంతో ఇష్టపడిన అశ్విని నా జీవితంలోకి రావడంతో నా మాట కాస్త నిజమయ్యే రోజు దగ్గర పడిందనే ఆనందంతో నా మనసు పరవళ్ళు తొక్కింది.
అలా సినిమాటిక్ గా జరిగిన మా పరిచయం చాలా మందికి వింతగా తోచింది. మా ఇద్దరి వింత చేష్టలను క్యాంపస్ మొత్తం కథలు కథలుగా చెప్పుకున్నారారోజుల్లో. అలా మేమిద్దరం అనుకోకుండా అందరి దృష్టిలో పడిపోయాము. దానికి తోడు ప్రతిరోజు యూనివర్శిటిలో కనీసం నాలుగ్గంటలు, ఇంటికొచ్చాక మరో రెండూ మూడూ గంటాలు మాట్లాడుకోందే రోజు గడిచేది కాదు.దాంతో మా విషయం ఇంట్లో తెలిసిపోయింది.
ప్రేమ పెళ్ళిళ్ళకు ఎన్ని అడ్డంకులుండాలో అన్నీ మా ప్రేమకూ ఉండేవి. మా కులాలు వేరు. స్థితిగతులు వేరు. ఇవన్నీ వేరైనా ప్రెమ పెళ్ళిళ్ళను వ్యతిరేకించడంలో మా ఇద్దరి కుటుంబాల అభిప్రాయాలు మాత్రం ఒక్కటే. వీటన్నింటినీ అధిగమించి మేమిద్దరం ఒకటి కావాలనుకుని కలలు కనే వాళ్ళం.
ఒకతిన్నర సంవత్సరం పాటు మా ప్రేమకు హద్దులు లేకుండా పోయాయి.
మధ్య మధ్యలో చిన్న చిన్న అభిప్రాయ బేధాలు, తిట్టుకోవడాలు, అలగడాలు, బుజ్జగించుకోవడాలు వున్నా కూడా అవ్న్నీ ప్రేమలో భాగంగా భావించేవాళ్ళం.
విచ్చ్లవిడీగా హైదరాబాదు వీధుల్లో ప్రేమించేసుకుంటున్న మా గురించి ఇద్దరి ఇళ్ళల్లోనూ గొడవలు మొదలయ్యాయి. తమ కొడుకు తమ కులంకాని అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసి ఒక మధ్య తరగతి కుటుంబంలో ఎంత గొడవ జరగాలో అంత గొడవ మా ఇంట్లోనూ జరిగింది.
నేను మాత్రం ఎప్పటిలానే మా అమ్మానాన్నల తిట్లు భరించానే కానీ వాళ్ళకి ఎదురు చెప్పి మాత్రం మాట్లాడలేదు.నాకు తెలిసినంత వరకూ వాళ్ళకు తప్పుగా అనిపించే విషయాలు నాకు తప్పని అనిపించకపోవచ్చు. వాళ్ళకు మంచి అనిపించే విషయాలు నాకు మంచి అనిపించకఫోవచ్చని కూడా తెలుసు. అందుకు కారణాలు ఎన్నో. వయసులో తేడా, పెరిగిన సమాజంలో తేడా, అన్నింటికీ మించి తరతరాలకీ వున్న ఆలోచనా విధానంలో తేడా. ఇన్ని తేడాలతో తల్లిదండ్రులు, పిల్లలు ఒక విషయాన్ని అభిప్రాయభేదాలు లేకుండా అంగీకరించగలరని నేనెప్పుడూ అనుకోలేదు.
అందుకే వాల్లెంత అరిచి గీపెట్టినా నేను నమ్మిన సిధ్ధాంతాలను నేను వదులుకోలేదు. అది వారి మీద ప్రేమ, గౌరవం లేక మాత్రం కాదు. వారు నమ్మిన సిధ్ధాంతాల ప్రకారం ప్రేమ పెళ్ళిల్లు తప్పు. నాకు తెలిసినంత వరకూ ప్రేమించిన అమ్మాయినే వెళ్ళిచేసుకోవడం కరెక్ట్.
తరానికీ తరానికీ మధ్య వుండే జనరేషన్ గ్యాప్‌ని పూడ్చడం ఎవ్వరివల్లా కాదని కూడా తెలుసు.
అశ్విని వాళ్ళింట్లో ఇంతకంతే పెద్ద గొడవే జరిగింది. అశ్విని మాత్రం చెరగని చిరునవ్వుతో ఆ గొడవ జరగనట్టే కనిపించేది. తన వాళ్ళని ఎలా అయినా ఒప్పించి తీరాలన్న సంకల్పంతో ఎన్నో విధాలా ప్రయత్నించేది. అలా రోజూ గొడవలతో గందరగోళంగా మారిపోయిన మా ఇద్దరి ఇళ్ళల్లోనూ మా బాధాకర హృదయాలు చూసి కరిగిపోయారో లెక మా ప్రేమకు అడ్డు చెప్పి మమ్మల్ని బాధించకూడదనుకున్నారో తెలియదు కానీ, కొన్ని రోజులకు మా ఇద్దరి ఇళ్ళల్లోనూ మా ప్రేమకు ఓకే చెపేసారు. పెళ్ళి పెళ్ళంటూ మా వెంటపడ్డారు.
నా ఎం.సి.ఎ కూడా పూర్తయ్యి మంచి కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించడంతో మా పెళ్ళికి ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయినట్టయింది. అశ్విని ఎం.ఏ పూరయిఓవడంతో ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టింది.
యూనివర్శిటీ నుంది బయటపడ్డప్పటినుంచీ ఇద్దరి మధ్యా దూరం ఎక్కువయింది. రోజూ ఫోన్లో మాట్లాడుకుంటూనే వున్నా, ప్రతి ఆదివారం ఎవరో ఒకరి ఇంట్లో కలుస్తూనె ఉన్నా ఎదో తెలియని దూరం మమ్మల్నిద్దరిని వేర్వేరుగా ఉంచసాగింది.
అంతకుముందు ఎన్నో చిన్న గొడవల్ని విజవంతంగా సర్దుబాటు చేసుకున్న మేము రాను రాను వ్హీటికీ మాటికీ గొడవలు పెట్టుకుని ఒకరితో ఒకరం కొన్ని రోజులు పాటు మాట్లాదుకోకుండా గడీపే వాళ్ళం.
ఆఫీసు పనిమీద నన్ను ఆరునెలల కోసం బెంగుళూరు పంపించడంతో అంతవరకూ మనసుల్లోనే ఉన్న దూరం నిజంగానే మమ్మల్నిద్దరినీ దూరం చేసింది. దానికి తోడు అశ్విని అభ్యుదయ భావాలు కలిగిన మహిళా సంఘంలో సభ్యురాలిగా చేరి స్త్రీ స్వాతంత్ర్యం గురించి, స్త్రీలపై జరుగుతున్న అన్యాలని ఎదురించే పోరాతాంలో సభలూ, ప్రసంగాలంటూ నా కోసం సమయం కేటాయించేది కాదు. ఎప్పుడైనా బెంగుళూరు నుంచి ఫోన్ చేసినా కూడా తన మహిళా సంఘం గురించో, తాము చేస్తున్న కార్యక్రమాల గురించో చెప్పి బోర్ కొట్టించేది.
మా ఇద్దరి కుటుంబాలలో మా మధ్య పెరుగుతున్న దూరాన్ని గమనించారో ఎమో, పెళ్ళి పెళ్ళీ అంటూ తొందర పెట్టాడం మెదలుపెట్టారు.
నాకూడా పెళ్ళయితే అన్ని విషయాలు సర్దుకుంటాయనిపించింది. అందుకే ఒక రాత్రి బెంగుళురు నుంచి అశ్విని వాళ్ళింటికి ఫోన్ చేశాను. వాళ్ళ బావతో సినిమాకెళ్ళిందని చెప్పారు నాక్కాబోయే అత్తగారు. ఎంత చదువుకున్నా, ఎన్ని అభ్యుదయ భావాలున్నా, నక్కాబోయే భార్య వేరొక మగవాడితో సినిమాలెళ్ళిందని తెలిసి మనసులోనెఏ కొంచెం బాధపడ్డాను. అయినా నా బాధను బయటకు కనిపించకుండానే ఆ తరవాతి రోజు ఫోన్ చేసి మాములుగానే మాట్లాడాను.
మాట్లాడినంత సేపూ తనకు కొత్తగా పరిచయమైన మరో ఫ్రెండ్ గురించే చెప్పింది.మగవాడైనా స్త్రీ హక్కుల గురించి, స్త్రీ స్వాతంత్ర్యం గురించి అతనికున్న ఉన్నతమైన అభిప్రాయాల గురించి అరగంటసేపు చెప్పడంతో నాకు వళ్ళుమండిపోయింది.
త్వరగా పెళ్ళిచేసుకోవడమే ఈ సంస్యలన్నింటికీ పరిష్కారమని నవీన్ సలహా ఇవ్వడంతో వారంరోజుల తర్వాత బెంగుళురునుంచి హైదరాబాదు వచ్చేశాను. ఆదివారం నెక్లెస్ రోడ్డూలో కూర్చోబెట్టి నాక్కాబోయే భార్య ఎలా వుండాలో ఏ విధంగా నడుచుకోవాలో అశ్వినికి విడమరిచి చెప్పాను.
అంతా విని నాక్కావలిసింది ఇంట్లో కూర్చ్ని వంట పని, ఇంటిపని చేసే పనిమనిషి అని, అందుకు తను సిధ్ధంగా లేనని, స్త్రీలకు కూడా ఒక జీవితముంటుందనీ, జీవితంలో ఏదో సాధించాలనే కలలుంటాయని, వాటి సాధన కోసం స్త్రీకి స్వాతంత్ర్యం కావాలని, ఆ స్వాతంత్ర్యం దొరకని చోటు తనకవసరం లేదని చెప్పి కోపంతో వెళ్ళిపోయింది.
ఆ రోజు నుండీ ఈ రోజు వరకూ ఒకరి మొహం ఒకరు చూసుకోలెదు సరికదా కనీసం ఫోన్లో అయినా మాట్లాడుకోలేదు. మా ఇంట్లో వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత సర్ది చెప్పినా ఎవ్వరం వినలేదు. మా ప్రేమకథ ఎంత విచిత్రంగా మొదలయిందో అంతే చిత్రంగా ముగిసిపోయింది.
ఆ రోజు తర్వాత మళ్ళి ఈ రోజు అశ్వినిని కలుసుకోవలసి వస్తుండడంతో మనసంతా అల్లకల్లోలమైపోయింది.
ట్రింగ్…ట్రింగ్..మని ఫోన్ మోగడంతో కంగారుగా టైం చూసుకున్నాను. ఆరు నలభై అయ్యింది. అవతలివైపు నవీన్ తిడుతున్నాడు నేనింకా బయల్దేరనందుకు. ఇప్పుడే బయల్దేరుతున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటపడ్డాను.
గ్రీన్‌పార్క్ హోటల్ దగ్గరే కావడంతో అశ్విని ఆలోచనల్తో భారమైన మనసుని మోసుకుంటూ కాలినడకనే అటువైపుగా కదిలాను.
ఈ మధ్య పెళ్ళిళ్ళు హోటళ్ళాలో ఏర్పాటు చేయడం ఫ్యాషన్ అయినట్టుంది.మా పెళ్ళి ఖూడా ఎదో ఒక మంచి హోటాళ్ళోనే ఏర్పాటు చేయాలని ఆ రోజుల్లో అశ్విని నాన్నగరంటే నాకవన్నీ ఇష్టముండదనీ, ఎదో ఒక గుళ్ళో చేసేసుకుంటామని చెప్తే, అదేం కుదరదని ఒక్కగానొక్క కూతురి పెళ్ళి గొప్పగా చెయ్యాలని చెప్పడం గుర్తొచ్చింది.
నాకోసమే ఎదురు చూస్తున్నారు మా మిత్రబృందమంతా. పెళ్ళి వేకువజామునెప్పుడో! కాకపోతే ముంది వింది భోజనం వుందట. అందరిని ఒక సారి పలకరించి చుట్టూ చూశాను. అశ్విని ఇంకా వచ్చినట్టులేదు. ఆశగా వెతుకుతున్న నాకు “మీ ఫ్రెండ్ ఇంకా రాలేదురా, వెతుక్కోకు” అంటు చెవిలో చెప్పాడు నవీన్.
వాళ్ళందరి ముందు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. టైం ఇంకా ఏడే అవడంతో అప్ప్పుడే భోజనాలు చేసే ఆలోచనేమీ లేదని అందరూ చెప్పేసారు. మరేం చెయ్యాలని అందరూ ఆలోచనల్లో పడి ఒక్కొక్కరొక సలహా పడేశారు.
బంధువుల హడావుడిలో నవీన్ అందరినీ పలకరిస్తూ మొహంమీద ఒక నవ్వు పులుముకిని అటూ ఇటూ తిరుగుతున్నాడు. మూలగా దిగులుగా కూర్చున్న ఒక వ్యక్తి వద్దకెళ్ళి ఏదో చెప్తూ నా వైపు చూశాడు. ఆ చూపుకర్థమేమిటో నాకర్థం కాలేదు.కొంచెంసేపు ఆ కొత్త వ్యక్తితో కూర్చుని ఎదో మాట్లాడి అతన్ని మా వైపే తీసుకొచ్చాడు.
ఈ మధ్య కాలంలో రోజూ అద్దంలో నా దిగులు మొహం చూసుకుని నాకంటే దిగులుతో వున్న ఆ కొత్త వ్యక్తి మొహాన్ని చుసి జాలివేసింది. అతని పేరు ఆనంద్ అట. ఒకప్పూడూ ఆనందంగానే వుండేవాడాట. అతని విషాదానికి కారణం చెప్పాడు నవీన్.
ఆనంద్, మరి కొద్దిగంటాల్లో వేరొకరి భార్య కాబోయే జ్యోతి మూడెళ్ళగా ప్రేమించుకున్నారటా. ఇద్దరి కులాలు వేరవడం, ఇంట్లోవాళ్ళు ఒప్పుకోకపోవడం, ఆనంద్ కి ఆత్మహత్య చేసుకోవాలనిపించడం, రొటీన్ తెలుగు సినిమా కథలానే వుంది ఆనంద్ ప్రేమ కథ కూడా!
నవీన్ ఇదంతా నాకెందుకు చెప్పాడో అర్థం కాలేదు. సినిమాల్లోలాగా చివరి నిమిషంలో “ఈ పెళ్ళి జరగడానికి వీళ్ళేదు” అని మేమందరం కలిసి పెళ్ళి ఆపుచేసి జ్యోతి, ఆనంద్ ల ప్రేమను పెళ్ళివరకూ తీసుకెళ్తే బాగుంటుంది కానీ, నిజ జీవితంలో అది ఎంతవరకూ సాధ్యమో తెలియలేదు.
నేను కూడా ప్రేమలో విఫలమై వున్న కారణంగా, నాఅగే ధైర్యంగా జీవితంలో ముందుకు సాగిపోవడనికి ఏదైనా సలహా ఇస్తానేమోనని ఆనంద్‌ని నాకు పరిచయం చేసి అతని ప్రేమ గాథను నాకు వినిపించాడని నవీన్ చెప్పడంతో నాకు నవ్వొచ్చింది.
అశ్విని దూరమయ్యి నేను పడుతున్న వేదన వీళ్ళకేం తెలుస్తుందనిపించిచంది. నేను డిగ్రిళొ వుండగా, తను ప్రేమించిన అమ్మాయికి వేరొకరితో పెళ్ళయిపోగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రవి, చిన్నప్పుడూ మాఊళ్ళో ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట , ఇప్పుడిక్కడ ప్రేమలో ఓడిపోయిన మరోప్రియుడు….వీళ్ళందరినీ తలుచుకుంటే మన జీవితంలో ప్రేమ, ప్రేమ తర్వాత పెళ్ళి ఎంత ముఖ్యమైన ఘట్టాలో అర్థమయింది.
ప్రేమవివాహం!
ప్రేమ, వివాహం. రెండు వేర్వేరు విషయాలైనప్పటికీ అవి రెండూ కలిసి ప్రేమ వివాహమయితే అంతకంటే ఆనందించదగ్గ విషయం మరొకటుండదేమోనని ఆలోచనళ్ళొ మునిగిపోయి వుండగా అశ్విని వచ్చింది.
ఆరునెలల్లో ఇదే మొదటిసారి తనని చూడడం. ఒకవైపు సంతోషం మరోవైపు భయం. భవిష్య్త్తులో అశ్విని కూడా వేరొకరిని పెళ్ళి చేసుంటుంటే నేను ఖూడా ఆనంద్ లా పెళ్ళిపందిరిలో మూల కూర్చుని “ఎకాడ వున్నా నీ సిఖమే కోరుకున్నా” అని ఆశీర్వదించి వెళ్ళిపోవాల్సిందేనా అనిపించింది.
ఏదో ఒకటి చేసి అశ్వినిని తిరిగి నా దగ్గరకు చేర్చుకోవాలనిపించింది. నాకు తనంటే ఇష్టం. నేనంటే తనకు ఇష్టం. ఇద్దరి ఇళ్ళాల్లోనూ కష్టపడి మా పెళ్ళికి ఒప్పించిన తర్వాత అర్థం లేని అభిప్రాయ బేధాలతో విడిపోయిన మా ఇద్దరిణి తలుచుకుంటే నవ్వొచ్చింది. అన్ని ప్రేమకథల్లోలాగా మా ప్రేమకథలోనూ విలన్స్ ఉన్నారు. ఆ విలన్స్ మేమే అవ్వడమే విచిత్రం. మా ప్రేమకు మేమే అడ్డాంకులై కూర్చున్నాము.
మారుతున్న సమాజంలో స్త్రీ స్వాతంత్ర్యం, హక్కులు, సమానత్వం గురించి అశ్విని అడిగిన మాటల్లో తప్పేమీలేదని అనిపించింది. ఆ విషయం నాకిప్పటివరకూ ఎందుకు తోచలేదో నాకర్థంకాలేదు. అహంభావం. పురుషాహంకారం కావొచ్చనిపించింది. మంచి ఉద్యోగం చేస్తూ, సూటూ బూటూ వేసుకుని ఆధునికత ముసుగులో నేనింకా పాతతరం మనిషినే అనిపించింది.
నాకింకేమీ ఆలోచించాలనిపించలేదు.దూరంగా నిల్చుని స్నేహితులతో మాట్లాడుతున్న అశ్విని దగ్గరకెల్లి “పెళ్ళెప్పుడూ చేసుకుందాం?” అని సూటిగా ఆదిగేశాను. చుట్టూ వున్న వాళ్ళంతా ఖంగుతిని మాఇద్దరివైపు మర్చి మార్చి చూశరు.
ఆమె మొహంలో ఎప్పటిలానే ప్రశాంతత. హ్యాండ్‌బ్యాగ్ లోంచి ఎదో చిన్న డబ్బాలాంటిది తీసింది తను. అందులోంచి తాళిబొట్టు టీసి “ఆరునెలల నుంచి మోసుకుని తిరుగుతున్నాను. నా మెడలో వుండాల్సిన దీన్ని ఎన్ని రోజులు హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకుని తిరగను? అని నన్ను ఎదురు ప్రశ్నించింది.
సరిగ్గా రెండునెలల తర్వాత అదే హోటాల్లో పెళ్ళి పీటల మీద కూర్చున్నప్పుడు అశ్విని అంది, తన స్వాతంత్ర్యం వేరొకరి బాధకు కారణమయినప్పుడు ఆ స్వాతంత్ర్యం తనకవసరంలేదనీ, ఇక ఎల్లప్పటికీ నాకు జీవిత ఖైదీగానే వుండిపోతుందనీ.
మరొకరి మనసు నొప్పించే స్వాతంత్ర్యం కంటే ఒకరికోసం ఒకరు జీవితాంతం బందీగా వుండడంలోనే సుఖముందని మేమిద్దరం అంగీకరించడంతో మా ప్రెమ పెళ్ళి వరకూ వచ్చింది. పెళ్ళి తర్వాత కూడా మా మధ్య గొడవలు రావని గ్యారంటి ఏమీ లేదు. అప్పుడూ ఇంకో కథ చెబుతాను. అప్పటివరకు…..ప్రేమాయనమః
Friday, June 22, 2007
Telugu Cinema websites
Internet పుణ్యమా అని ప్రపంచం మన ఇంట్లో వాలింది. ప్రపంచం లో ఏక్కడ ఏమి జరిగినా క్షణాల్లో మనకి వార్తలు అందచేయడంలో internet ముందుంటుంది. అలాగే సినిమా ప్రపంచంలోని వార్తలు, విశేషాల్ని ఏప్పటికప్పుడు మనకి అందచేయడానికి మనకేన్నో websites ఉన్నాయి. అందులో కొన్నిwww.idlebrain.com,www.greatandhra.com,www.telugucinema.com,www.oniondosa.blogspot.com,www.cinegoer.com,www.totaltollywood.com,www.teluguone.com.
ఈ websites అన్నీ మొదట్లో మంచి ఉద్దేశంతో స్థాపించినప్పటికీ రాను రాను quality దిగజారి పొతుంది. ఆసలే నానాటికి దిగజారిపోతున్న తెలుగు సినిమాకి పునర్జన్మనివ్వగల సత్తా కలిగిన ఈ websites ఇప్పుడు కేవలం హీరోయిన్ల అర్థనగ్న చిత్రాల ప్రదర్శన కొరకు, మరియు సినిమాల ద్వారా కొద్దో గోప్పో పేరు తెచ్చుకున్న హీరోయిన్ల ,హీరోల వ్యక్తిగత విషయాలను బహిరంగం చేసి,సామాన్య ప్రజల బలహీనతలను సోమ్ము చేసుకునే సాధనాలుగా తయారయ్యాయి.ఇలాంటి దిగజారుతనం ప్రదర్శిస్తున్న websites లో అన్నింటికన్న ముందున్నది,www.greatandhra.com.ఏప్పుడో పది సంవత్సరాల నాడు పాత పత్రికలలో వచ్చిన లిసా రే,శిల్ప శెట్టి అర్ధనగ్న చిత్రాలను ఇప్పుడు తమ website లో ప్రచురించడంలో అర్థం ఏమిటో వారికే తేలియాలి.
తెలుగు లో అత్యంత ప్రజాదరణ కలిగిన మరో website www.idelbrain.com.వీళ్ళు మొదట్లో కాస్తంత నాణ్యమైన విషయాలను ప్రచురించే ప్రయత్నాలు చేసినప్పటికి, గత కొద్ది కాలంగా వీరీ content కూడ పలచబడి పోయింది. ఒకప్పుడు ఈ site లోని సినిమా సమీక్షలు చదివిన తర్వాత మాత్రమే ప్రేక్షకులు సినిమా చూడాలా వద్దా అని నిర్ణయించుకునే వారంటే అతిసయోక్తి కాదు. కారణాలు ఏమయినప్పటికీ ప్రస్తుతం వీరు రాసే సినిమా సమీక్షలు కేవలం మొక్కుబడిగా రాసినట్టున్నాయి తప్ప ఒక కార్యదీక్షతో రాస్తున్నట్టుగా అనిపించవు.
కంచిభొట్ల శ్రీనివాస్, మట్టి లో మాణిక్యాలు, వెలుగు నీడలు శీర్షికల ద్వారా తన విశ్లేషణల తో కొన్ని రోజులు ఓక ఊపు ఊపినప్పటికీ, అటువంటి quality రచనలు తరచుగా లేకపోవడం వలన idlebrain కూడా చివరికి అర్థం లేని రచనలు,open letters, advertisements తో నిండిపోయిన web pages, అంతా కలిపి చివరికి మిగిలిందేమిటో idlebrain site ను మొదటి నుంచి అనుసరిస్తున్న వాళ్ళందరికీ విధితమే!
ఇక పోతే మొదటి నుంచి ఏకరీతిగా తమ పని తాము చేసుకుంటూ, తమకు సాధ్యమైనంత గా మంచి content ను ప్రజలకు అందించడంలో కొద్దొ గొప్పో సఫలం అయిన sites లో www.telugucinema.com ఒకటి.అంతమాత్రాన వీళ్ళు తెలుగు సినిమా కు గొప్ప సేవ చేసిన వాళ్లగా గుర్తించలేము.
సినిమాల గురించి అర్థరహితమైన సమీక్షలు, విశ్లేషణలు చేయడం కష్టతరమైన పని. నిజానికి మన సినిమాల్లో అంత తీవ్రంగా విశ్లేషణ చేయడానికి ఏమీలేకపోయినప్పటికి ,ఎందుకు మన సినిమాలకు ఈ గడ్డు కాలం వచ్చిందో ప్రజలకి తెలియచేయడానికి ఈ websites ఒక మంచి సాధనంగా ఉపయోగపడవచ్చు.
మూస చిత్రాల వెల్లువలొ కొట్టుకుపోతున్న French సివిమా పరశ్రమని new-wave సినిమా ద్వారా మరో మలుపు తిప్పి గట్టున పడేయడంలో French సినిమా పత్రిక ‘Cahiers du cinema’ పాత్ర గురించి తెలిసిన వారెవరైనా, ఈ websites కు గల శక్తిని తక్కువగా అంచనా వేయరు అని నా అభిప్రాయం.
ఇప్పటి వరకూ English లో మాత్రమే రచనలు కలిగి ఉన్న ఈ websites తమ రచనల్ని తెలుగులో ప్రచురించ గలిగితే ఎంతో మంది ఔత్సాహిక రచయితలు తమ రచనలు ఈ websites ద్వారా ప్రచురించగలిగే అవకాశం లభిస్తుంది.
మారుతున్న సమాజానికి అనుగుణంగా మని సినిమాలు మారాలి. అందుకు ఈ websites ద్వారా చేయగలిగింది ఏంతో ఉందని తెలుసుకోవడం మేలు.
Joost-The new sensation
Monday, June 11, 2007
Great Indians
FOUNDER OF ATOMIC THEORYAs the founder of "Vaisheshik Darshan"- one of six principal philosophies of India - Acharya Kanad was a genius in philosophy. He is believed to have been born in Prabhas Kshetra near Dwarika in Gujarat. He was the pioneer expounder of realism, law of causation and the atomic theory. He has classified all the objects of creation into nine elements, namely: earth, water, light, wind, ether, time, space, mind and soul. He says, "Every object of creation is made of atoms which in turn connect with each other to form molecules." His statement ushered in the Atomic Theory for the first time ever in the world, nearly 2500 years before John Dalton. Kanad has also described the dimension and motion of atoms and their chemical reactions with each other. The eminent historian, T.N. Colebrook, has said, "Compared to the scientists of Europe, Kanad and other Indian
FATHER OF PLASTIC SURGERYA genius who has been glowingly recognized in the annals of medical science. Born to sage Vishwamitra, Acharya Sudhrut details the first ever surgery procedures in "Sushrut Samhita," a unique encyclopedia of surgery. He is venerated as the father of plastic surgery and the science of anesthesia. When surgery was in its infancy in Europe, Sushrut was performing Rhinoplasty (restoration of a damaged nose) and other challenging operations. In the "Sushrut Samhita," he prescribes treatment for twelve types of fractures and six types of dislocations. His details on human embryology are simply amazing. Sushrut used 125 types of surgical instruments including scalpels, lancets, needles, Cathers and rectal speculums; mostly designed from the jaws of animals and birds. He has also described a number of stitching methods; the use of horse's hair as thread and fibers of bark. In the "Sushrut Samhita," and fibers of bark. In the "Sushrut Samhita," he details 300 types of operations. The ancient Indians were the pioneers in amputation, caesarian and cranial surgeries. Acharya Sushrut was a giant in the arena of medical science.
EMINENT ASTROLOGER AND ASTRONOMERArenowned astrologer and astronomer who was honored with a special decoration and status as one of the nine gems in the court of King Vikramaditya in Avanti (Ujjain). Varahamihir' s book "panchsiddhant" holds a prominent place in the realm of astronomy. He notes that the moon and planets are lustrous not because of their own light but due to sunlight. In the "Bruhad Samhita" and "Bruhad Jatak," he has revealed his discoveries in the domains of geography, constellation, science, botany and animal science. In his treatise on botanical science, Varamihir presents cures for various diseases afflicting plants and trees. The rishi-scientist survives through his unique contributions to the science of astrology and astronomy.
FATHER OF YOGAThe Science of Yoga is one of several unique contributions of India to the world. It seeks to discover and realize the ultimate Reality through yogic practices. Acharya Patanjali, the founder, hailed from the district of Gonda (Ganara) in Uttar Pradesh. He prescribed the control of prana (life breath) as the means to control the body, mind and soul. This subsequently rewards one with good health and inner happiness. Acharya Patanjali's 84 yogic postures effectively enhance the efficiency of the respiratory, circulatory, nervous, digestive and endocrine systems and many other organs of the body. Yoga has eight limbs where Acharya Patanjali shows the attainment of the ultimate bliss of God in samadhi through the disciplines of: yam, niyam, asan, pranayam, pratyahar, dhyan and dharna. The Science of Yoga has gained popularity because of its scientific approach and benefits. Yoga also holds the honored place as one of six philosophies in the Indian philosophical system. Acharya Patanjali will forever be remembered and revered as a pioneer in the science of self-discipline, happiness and self-realization.
Saturday, June 09, 2007
రేగుపళ్ళ ముసలమ్మ
ఆ మధ్య ఎక్కడో చదివిన జోకు ఒకటి
బాబు: మామ్మా రూపాయికి ఎన్ని రేగుపళ్ళు?
ముసలమ్మ: రూపాయికి పాతిక.
బాబు: అదేంటి మొన్న యాభై ఇచ్చావుగా?
ముసలమ్మ: సరే నీ కోసం ఇస్తాలే..యాభై తీసుకో, ఏదీ రెండు చేతులూ పట్టు, నీ చేతిలో రేగుపళ్ళు పోస్తా..యాభై లెక్ఖెట్టు
బాబు: సరే ఇదిగో రూపాయి. పొయ్యి మరి
ముసలమ్మ: లాభం, రెండు, మూడు
ముసలమ్మ: బాబూ నీకెన్నేళ్ళు?
బాబు: నాకా? ఏడేళ్ళు.
ముసలమ్మ: ఏడా..ఎనిమిది,తొమ్మిది, పది పదకొండు, పన్నెండు..అయితే మీ అమ్మకి ఎన్నేళ్ళు బాబూ?
బాబు: మా అమ్మకా? ఏమో ఇరవై ఏడో ఏమో.
ముసలమ్మ: ఓ ఇరవై ఏడా, ఇరవై ఎనిమిది,ఇరవై తొమ్మిది, ముప్ఫై...మరి మీ నాన్నకి?
బాబు: నాన్నకా? ముప్ఫై ఐదు
ముసలమ్మ: ఓ ముప్ఫై ఐదా..ముప్ఫై ఆరు, ముప్ఫై ఏడు..మరి మీ పెద్ద మావయ్యకి?
బాబు: ఏమో..నలభై ఐదు ఏమో..
ముసలమ్మ: ఓ ...నలభై ఐదు, నలభై ఆరు, నలభై ఏడు, నలభై ఎనిమిది, నలభై తొమ్మిది, ఇదిగో యాభై...ఇదిగో బాబూ ఆ రేగుపళ్ళు కింద పడేసుకునేవు..చక్కగా కడుక్కుని తినెయ్యి..మళ్ళీ రేపు వస్తాను...
బాబు: సరే మామ్మా...
Airtel introduces SMS service in Telugu
Hyderabad, June 8 (PTI): Airtel has introduced SMS option in Telugu for its customers in Andhra Pradesh.
The new service option is aimed at addressing the need of customers to communicate with their near and dear ones in their mother tongue, Bharat Airtel Ltd., Andhra Pradesh circle Chief Executive Officer, T Elango, told reporters today.
"It would be very relevant and handy for all customers who choose to communicate with each other in Telugu," he added.
To avail this service, Airtel customers need to download and activate a free-of-cost application on to their handset through 'Airtel Live', the company's entertainment portal.
Due to the unique key-entry and rendering mechanism in this application, customers can conveniently type an SMS in Telugu, Elango explained.
This service also has a one touch help function, which provides a guide on how to use the english and numeric keyboard to type Telugu letters.Courtesy: The Hindu
Wednesday, June 06, 2007
Mana Telugu begins full testing ahead of launch
Testing for Aapna Channel can be viewed in the following way:
- Using your Sky Digi remote, go to Services Menu- System Setup (4)- Add Channels (4)- Enter the frequency: 11.260 (V), FEC 2/3, Symbol Rate 27500- Find Channels and Press SELECT- Highlight "52160" service and press Yellow button.- Return to Services Menu- Other Channels (6) on STB / (8) on Sky+- "52160" should be listed and available
Telugu The Language, People And The Land Through Ages
India officially has only 23 recognized languages, but these have given birth to more than 1700 mother tongues that have evolved over time from these different language families. Telugu, one of these 23 official languages is not only the largest spoken Dravidian language, but also the second largest spoken language after Hindi.
More than 80 million people across the world (Bahrain, Fiji, Malaysia, Mauritius, United Arab Emirates and the United States), including 66 million native speakers in India, Andhra Pradesh and Pondicherry (where it is the official language of the state), and Tamil Nadu, Karnataka, Maharashtra, Orissa, and Chhattisgarh also know how to speak, read or write in this beautiful, culturally rich and evolved over ages language. Telugu like Hindi, Bengali, Marathi and Gujrati, is also considered as another shudh bhasha.
In India, 40% of the population or a vast majority speaks Hindi, either as the mother tongue or the second language. Also, only 0.5% of educated society also uses English as a second language and as a medium for research and official communication between inter-lingual cultures. In contrast, though Telugu is the most frequently spoken Dravidian language (like Bengali, Marathi or Tamil), only 6.0 to 8.0 % of the population speaks or understands it. Carnatic Music, the Classical music of South India is expressed through Dravidian languages, including Telugu as its medium of expression. Presently, though Tamil Nadu represents the centre for Carnatic culture, most Carnatic songs are written and sung in Telugu. One need not go far to find the reason for it. Telugu was the principal court language when Carnatic Music evolved. Besides, Telugu is a language that ends in vowels, which is suitable to express music well.
One word Telugu represents all the language, the people who speak it and the land where they live. The actual land of Telugu people is bounded by three mountains Kalesvara, Srisaila, and Bhimeshvara that form the geographical boundary of Telugu region, where it is believed Lord Shiva descended. Thus, the word Telugu, many claim is derived from the word trilinga, which is synonymous with Lord Shiva.
Some other scholars associate Telugu as originating from a frequently used Sanskrit word Kalinga or Kling, which in Puranas and Ashok's inscriptions depicted people of Continental India as it is even today in the Malay language.
The word Telugu, still others claim has originated either from the word talaing - few people who conquered Andhra region, or from tenunga - refering to white or fair-skinned people (or people of the South). However, Andhra seems to be the old Aryan name for Telugu country.
Telugu is one of the few languages that has borrowed and absorbed everything from every language of the period it evolved and grew in. Telugu script or characters closely resemble Kannada and there now seems to be evidence that they were derived from the Kannada writing of the Calukya dynasty.
Coexistence of Buddhism in the ancient Telugu country, where it was widely practiced and Jainism in the Kannada country, where it flourished is another evidence of Telugu script and alphabets evolving from Kannada. The close ties between the two spread the Jain traditions in the Telugu country. Though, both religions had influence in their respective territory, Jain gurus were preferred and often taught even Telugu children.
Later, between 10th and 14th centuries, when Shivism became wide spread in the Telugu country, Shivites, instead of Jains were now the preferred religious leaders and teachers and initiated prayers and imparted knowledge. But the Jain traditions had taken deep roots and did not die away easily. The initiation prayer over the years which then was in the form of O-Na-Ma-See-Vaa-Yaa-See-Dham-Namaha continued. The alphabets that were learnt with this prayer came to be called O-na-ma-lu.
Onamaalu, or the Telugu alphabet consist of 60 symbols - 16 vowels, 3 vowel modifiers, and 41 consonants have almost 1-to-1 correspondence with Sanskrit alphabets, yet another proof of its influence on its evolution. A blank space separates two words. Telugu, like most other languages is written from left to right and consists of sequences of simple and/or complex characters made from these 60 symbols.
Telugu script is syllabic. In other words, syllables that form the basic units of writing Telugu are composed of more basic units: vowels (achchu or swar) and consonants (hallu or vyanjan). Consonants are pure consonants, i.e., without any vowel sound. However, like in Hindi or other Indian languages, consonants are read and written with an implied sound of the vowel a. When consonants combine with other vowel signs, the vowel part is indicated orthographically using maatras signs. Each maatra has a definite shape, different from the shape of the corresponding vowel.
The earliest entirely Telugu inscriptions are not found before the 6th century. Literary texts, however begin to appear only later in the 11th century. Much like the other major Dravidian languages, the Telugu script has a very marked distinction between its formal / literary and colloquial language and social dialect.
Though no inscriptions in Telugu language (as it is written/ spoken today) have been found prior to the period 200 BC 500 AD, inferences to the existence of Telugu during that time can be made from the frequent use of words of that period found in the Telegu region found on Parakrit (Sanskrit) inscriptions and also in anthology of poems in Parakrit language, collected by the Satavahna dynasty King all point to existence of Telugu and Telugu people in that period between the Krishna and Godavri rivers basin. Thus, we can safely presume Telugu to have originated earlier than 200 BC.
Besides, Sanskrit words are imbedded into the language. Urdu and Turk languages, as the court language during Mogul domination (especially in Hyderabad) have left their imprint on its vocabulary. It was only much later, when the movement began to cleanse Telugu language that use of pure Telugu and sanskritised words began to be used. Period after 575 AD marks the development and evolution of Telugu script.
Under Chola kings around that period broke the tradition of writing Telugu in Sanskrit. Instead, they began to insist on making inscriptions and royal proclamations in their local language only. The other kings too picked up this tradition and it soon spread across everywhere. Breaking away from the use of Sanskrit, this period marks the growth of Telugu language and literature, which first appeared as inscriptions and poetry in courts and later in written works.
Growth of literature also is one parameter in the language life cycle. The spoken language of commons at this time begins to differ from the literary one and the two take off on different growth trajectories. Thus, grew the spoken Telugu and the literary Telugu. 1100-1900 AD marks the period of beginning of Muslim influence on Telugu language. First Muslim ruled state Telangana is established. This brings further sophistication in Telugu language.
After 1600 AD, Telugu undergoes dramatic change towards modernization. Moguls establishing the princely state of Hyderabad again increase Muslim influence on Telugu (especially in Hyderabad), which is felt on Telugu prose. Muslim influence on Telugu creates a distinctive dialect out of the Telengana Telugu, whereas pure Telugu elsewhere (Vijayanagar empire in Rayalseema region) bloomed and experienced its golden era.
The authors in Rayalseema region were forbidden to use commonly used spoken words in prose and poetry. English armies and British Empires victory after 1900 marks a period of English influence on Telugu language. Telugu is popularized through mass media - press, television and films bring Telugu closer to the common people.
Telugu is also started as a subject and is taught in schools. After independence, Telugu people migrating abroad and settling in those areas has further enriched the language through intermingling of people and cultures. Thus, today, Telugu with Sanskrit, Muslim and English influence and Kannada script is far richer in context, literature, prose and poetry. Even the script of late has undergone change. Few vowels that are randomly used have been discarded to make language simpler.