ఆశావాదిని.
ప్రజల భాషకు పట్టం కట్టడం ఏనాటికైనా తప్పదు.
''మద్రాను లేని తెలుగు రాష్రం తలలేని మొండెం లాంటిది అని అమరజీవి పొట్టి శ్రీరాములు ఎంతగానో వాపోయారు. తెలుగు విద్వాంనులు నంగీత సాహిత్య రంగాలలోనే గాక ఇతర రంగాలన్నింటిలో ఆనాటికే చెన్నైలో చేసిన అభివృద్ధిని మనం వదులుకున్నాం. బళ్ళారి, బరంపురం లాంటి తెలుగు ప్రాంతాలు కూడా కోల్పోయాం. ఆంధ్ర రాష్రం ఏర్పడిన మరునాడే తెలుగు అనెంబ్లీ తరలి పోవాలని, తెలుగువారి రాజధాని
మద్రాసులో ఉండటానికి ఒక్కరోజు కూడా ఆతిద్యం ఇవ్వటం కుదరదని సి. రాజగోపాలాచారి తెగేసి చెప్పాడట. దాంతో తెలుగు నాయకులు కర్నూలుకు వెళ్ళారు. మళ్ళీ అక్కడ్నుంచి హైదరాబాదుకు వెళ్ళారు. ఇలా నిరంతరం వలసలు వెళ్ళే శరణార్థులకు ఆశ్రయ మిచ్చేవారి భాషే వస్తుంది కాని, వారి సొంత భాష వికసించదు. ఏ భాషవారికైతే అత్యధిక నంఖ్యాకులు వారి భాషనే మాట్లాడే సుస్థిర రాజధాని నగరం ఉంటుందో,
వారి భాష కూడా నులభంగా రాజ్యమేలుతుంది. రెండు మూడు భాషలవారు అధికార యంత్రాంగంలో ఉన్నపుడు ఒకరి భాష ఒకరికి అర్థంగాక, ఎవరి భాష పెత్తనం కోనం వారు పెనుగులాడుతుంటే, ఇద్దరినీ మర్ధించే మూడో భాష పెత్తనం చెలాయిన్తుంది.
''భాషను ఆధునిక శాన్త్ర సాంకేతిక పదాలతో పరిపుష్ఠం చేసినపుడే ఆ భాషలో చదివే చదువులు ఉపాధి చూపుతాయి అన్నారు రాష్రపతి అబ్దుల్ కలాం. మన భాషా పాటవంతో చదివినవారికి ఉపాధి రంగంలో రిజర్వేషన్లు ఇచ్చి ప్రోత్సహించినా ఎంతోమంది తెలుగు భాషలోనే శాన్త్ర సాంకేతిక విద్యలు చదవటానికి తరలి వస్తారు. కోటి విద్యలు కూటి కొరకే కదా!---(తెలుగు అధికార భాషకావాలంటే) పుస్తకంలో నా ముందుమాట.
ఖురాన్ సహా అనేక ఇతర ఇస్లామిక్ పుస్తకాలను నెట్ లో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలుగా ఉంచిన TIP పెద్దలకు కృతజ్నతలు.e-హదీసులను కూడా త్వరలో వెలువరిస్తారని ఆశిస్తున్నాను.
TIP వంటి అనేక తెలుగు వెబ్సైట్ల అవసరం ఉన్నది.