welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Monday, October 20, 2008

మనసు మంచి 'ముత్యం'

మనసు మంచి 'ముత్యం'
బస్టాండ్‌లు.. రైల్వేస్టేషన్‌లు.. చెత్తకుప్పలు... ఆస్పత్రులు.. గుళ్లు.. ఇలా ఎక్కడెక్కడో వదిలేసిన నెలల శిశువులను అక్కున చేర్చుకుంటుందామె. పురిటిబిడ్డలను పొదివిపట్టుకుని పెంచిందామె. లాలపోసింది... బువ్వపెట్టింది... పెద్దయ్యాక విద్యాబుద్ధులు చెప్పించి, పెళ్లిళ్లు చేసే బాధ్యతకూడా తానే స్వీకరించింది.

పొత్తిళ్లలో శిశువులుగా ఆమె నీడన చేరిన ఎందరో నేడు పట్టభద్రులయ్యారు. ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడ్డారు. అయినా, ఆమెతో అనుబంధాన్ని మాత్రం వీడలేదెవరూ. ఇంతకీ ఈమె ఎవరంటారా! కర్నూలు జిల్లాకు చెందిన ముత్తులక్ష్మి. ఇరవై ఎనిమిదేళ్లుగా ఇదే సేవలో తరిస్తోంది. ముత్తులక్ష్మి పెళ్లే చేసుకోలేదు. చేసుకునే ఉద్దేశమే ఆమెకు కలుగలేదు. మదర్ థెరిస్సానే స్ఫూర్తి అంటుందామె.

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామంలో ముత్తులక్ష్మి ఆశ్రమం ఉంది. ముత్తులక్ష్మి స్వగ్రామం మంత్రాలయం మండలం ఖగ్గలు. ముంబాయిలో ఉండేవారామె తలిదండ్రులు. అప్పుడే ఆమెలో ఈ సేవాతత్పరతకు బీజం పడింది. 'పదకొండేళ్ల వయసులో ఉన్నప్పుడు మా బడికి మదర్ థెరిస్సా వచ్చారు. పిల్లలందరినీ ముద్దాడిన మదర్ నన్ను మాత్రం పట్టించుకోనేలేదు. ఎంతో చిన్నబుచ్చుకున్నాను. బోలెడంత ఏడుపొచ్చింది. కనీసం ఆమె చేతిస్పర్శ భాగ్యం కూడా కలగలేదే.. ఎందుకిలా జరిగిందని నాలో నేనే కుమిలిపోయా. అయితే, మదర్ వీడ్కోలు తీసుకునేముందు నవ్విన నవ్వు మరచిపోలేకపోయాను. ఆమె చూపు నన్ను వెన్నాడుతూనే ఉండేది. ఆ తర్వాత కొన్నిరోజులకు మా సొంతూరికి వెళ్లాల్సి వచ్చింది. రైల్వేఫ్లాట్‌ఫారమ్‌పై ఉన్నప్పుడు వినపడిన పసిపాప ఆక్రందన నన్ను కదిలించింది. వెతగ్గా ప్లాట్‌ఫారంపై ఎవరో వదిలి వెళ్లిన పసిగుడ్డు కనిపించింది. చుట్టూ ఎవరూ లేరు. అప్పుడర్థమైంది. ఇక నుంచి నేనాచరించాల్సిన ధర్మం అదేనని. మదర్ సందేశం కూడా అదేనేమో..' అంటుందామె 28 ఏళ్లనాటి అనుభవాన్ని గుర్తుకుతెచ్చుకుంటూ... తర్వాతే జ్యోతిఆశ్రమం ఏర్పాటైంది. దాని నిర్వహణకోసం ముత్తులక్ష్మి ఎవరి పైనా ఆధారపడాలనుకోలేదు. కూలీ డబ్బులతోనే ఉన్నంతలో అందరికీ భోజనం పెట్టగలిగింది. ధర్మాత్ములందించిన సాయంతో శక్తిమేరకు పిల్లలకు విద్యాబుద్ధులూ చెప్పించింది. తానేదో ఘనకార్యం చేశాననుకోవడం లేదంటుందామె. ఉన్నంతలో ఆర్తులకు సాయపడ్డానన్న సంతృప్తి చాలు అంది 'వసుంధర'తో. ఉడతాభక్తిన సాటిమానవులకు ఆమె చేస్తున్న సాయం అభినందనీయం కాదంటారా!
- ఎస్. రవీందర్‌రావు,

1 comment:

AKKU said...

TRUE AND THAT IS AANDHRA PRADESH