welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Tuesday, October 21, 2008

గోంగూర పచ్చడి gongura pachhadi

గోంగూర పచ్చడి రుచి తెలియనివారు ఆంధ్ర లో ఉండరు. ప్రతి సుభా కార్యామునకు గోంగూర పచ్చడి సుబాసుచికము.

కావలసిన పదార్థాలు :

గోంగూర... రెండు కట్టలు(లేత)
పచ్చిమిరపకాయలు... తగినన్ని
ఎండుమిరపకాయలు... పోపుకు సరిపడా
నూనె... సరిపడా
ఉల్లిపాయలు... రెండు
వెల్లుల్లిపాయలు... గుప్పెడు రేకలు
కరివేపాకు... పోపుకు సరిపడా
మెంతులు... కాసిన్ని
ఆవాలు, జీలకర్ర... పోపుకు సరిపడా
ఉద్దిపప్పు, శనగపప్పు... పోపుకు సరిపడా
ఇంగువ పొడి... చిటికెడు

తయారీ విధానం :
ముందుగా గోంగూరను విడిపించుకుని, నీటిలో రెండు లేదా మూడుసార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కావాల్సినన్ని పచ్చిమిరపకాయలను తొడిమలు తీసి పక్కన ఉంచుకోవాలి. వెడల్పు బాణలిలో కాస్తంత నూనె వేసి వేడిచేయాలి. అందులో ముందుగా పచ్చిమిర్చి వేసి, కాసేపు వేగిన తరువాత గోంగూరను వేసి మూత పెట్టి సన్నని మంటపై ఉడికించాలి.

ఆవిరికి ఉడికి గోంగూర బాగా దగ్గరై ముద్దగా వచ్చిన తరువాత దించేసి పక్కన వేడి పోయేంతదాకా ఆరబెట్టుకోవాలి. తరువాత గోంగూర ముద్దకు ఉప్పు కలిపి మిక్సీలో కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.

తాలింపు పెనంలో కాస్తంత ఎక్కువగానే నూనె వేసి కాగిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉద్దిపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువపొడి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కలిపి పోపు పెట్టుకోవాలి.

పోపుగింజలు, వెల్లుల్లిపాయలు బాగా వేగిన తరువాత మిక్సీలో రుబ్బుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలియబెట్టాలి. ఉప్పు సరిపోయేంత ఉందో, లేదో చూసుకుని ఆయిల్ పైకి తేలేంతదాకా సన్ననిమంటపై కాసేపు ఉంచాలి. అంతే పుల్ల పుల్లని గోంగూర పచ్చడి రెడీ.

తెలుగువారి లోగిళ్ళలో ప్రతి ఇంట్లోనూ తప్పక ఉండే ఈ గోంగూర పచ్చడిని వేడివేడి అన్నానికి కమ్మటి నేతిని కలుపుని తింటే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఈ ఆనందం మీకు కూడా అనుభవంలోకి రావాలంటే వెంటనే గోంగూర పచ్చడిని తయారు చేసేందుకు ప్రయత్నిస్తారు కదూ...!

గమనిక :పచ్చడిలో వేసి అందులోనేఆనియన్ ముక్కలు కలిపి తింటే వావ్ భలేరుచి :)
(
నేనైతే కొన్ని ఎండు మిర్చిని చేత్తో నులిపి కలుపుతాను :)
English :
Gongura Chutney

this is most favorable food in andhra . i think every one in andhra pradesh are in found of taste with it. so i am helping for some self cooking NRi by this post.

Recipe:

I bunch of gongura - Leaves plucked and washed
1 big onion - cut into big chunks
8 green chillies
¼ tsp of salt
2 teaspoons of peanut oilIn an iron skillet, heat peanut oil. Add and saut? the onion chunks and green chillies to light brown color on medium-high heat.

remove to a plate.In the same skillet, add gongura leaves and stir-fry them on medium-high for few minutes until they come together and lose their bright green color. Remove to a plate and let cool.Take them all in a mortar, add salt and with a pestle grind them to a coarse consistency.Serve with rice, dal and a curry with little bit of ghee sprinkled on, for a traditional Andhra meal.


Monday, October 20, 2008

మనసు మంచి 'ముత్యం'

మనసు మంచి 'ముత్యం'
బస్టాండ్‌లు.. రైల్వేస్టేషన్‌లు.. చెత్తకుప్పలు... ఆస్పత్రులు.. గుళ్లు.. ఇలా ఎక్కడెక్కడో వదిలేసిన నెలల శిశువులను అక్కున చేర్చుకుంటుందామె. పురిటిబిడ్డలను పొదివిపట్టుకుని పెంచిందామె. లాలపోసింది... బువ్వపెట్టింది... పెద్దయ్యాక విద్యాబుద్ధులు చెప్పించి, పెళ్లిళ్లు చేసే బాధ్యతకూడా తానే స్వీకరించింది.

పొత్తిళ్లలో శిశువులుగా ఆమె నీడన చేరిన ఎందరో నేడు పట్టభద్రులయ్యారు. ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడ్డారు. అయినా, ఆమెతో అనుబంధాన్ని మాత్రం వీడలేదెవరూ. ఇంతకీ ఈమె ఎవరంటారా! కర్నూలు జిల్లాకు చెందిన ముత్తులక్ష్మి. ఇరవై ఎనిమిదేళ్లుగా ఇదే సేవలో తరిస్తోంది. ముత్తులక్ష్మి పెళ్లే చేసుకోలేదు. చేసుకునే ఉద్దేశమే ఆమెకు కలుగలేదు. మదర్ థెరిస్సానే స్ఫూర్తి అంటుందామె.

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామంలో ముత్తులక్ష్మి ఆశ్రమం ఉంది. ముత్తులక్ష్మి స్వగ్రామం మంత్రాలయం మండలం ఖగ్గలు. ముంబాయిలో ఉండేవారామె తలిదండ్రులు. అప్పుడే ఆమెలో ఈ సేవాతత్పరతకు బీజం పడింది. 'పదకొండేళ్ల వయసులో ఉన్నప్పుడు మా బడికి మదర్ థెరిస్సా వచ్చారు. పిల్లలందరినీ ముద్దాడిన మదర్ నన్ను మాత్రం పట్టించుకోనేలేదు. ఎంతో చిన్నబుచ్చుకున్నాను. బోలెడంత ఏడుపొచ్చింది. కనీసం ఆమె చేతిస్పర్శ భాగ్యం కూడా కలగలేదే.. ఎందుకిలా జరిగిందని నాలో నేనే కుమిలిపోయా. అయితే, మదర్ వీడ్కోలు తీసుకునేముందు నవ్విన నవ్వు మరచిపోలేకపోయాను. ఆమె చూపు నన్ను వెన్నాడుతూనే ఉండేది. ఆ తర్వాత కొన్నిరోజులకు మా సొంతూరికి వెళ్లాల్సి వచ్చింది. రైల్వేఫ్లాట్‌ఫారమ్‌పై ఉన్నప్పుడు వినపడిన పసిపాప ఆక్రందన నన్ను కదిలించింది. వెతగ్గా ప్లాట్‌ఫారంపై ఎవరో వదిలి వెళ్లిన పసిగుడ్డు కనిపించింది. చుట్టూ ఎవరూ లేరు. అప్పుడర్థమైంది. ఇక నుంచి నేనాచరించాల్సిన ధర్మం అదేనని. మదర్ సందేశం కూడా అదేనేమో..' అంటుందామె 28 ఏళ్లనాటి అనుభవాన్ని గుర్తుకుతెచ్చుకుంటూ... తర్వాతే జ్యోతిఆశ్రమం ఏర్పాటైంది. దాని నిర్వహణకోసం ముత్తులక్ష్మి ఎవరి పైనా ఆధారపడాలనుకోలేదు. కూలీ డబ్బులతోనే ఉన్నంతలో అందరికీ భోజనం పెట్టగలిగింది. ధర్మాత్ములందించిన సాయంతో శక్తిమేరకు పిల్లలకు విద్యాబుద్ధులూ చెప్పించింది. తానేదో ఘనకార్యం చేశాననుకోవడం లేదంటుందామె. ఉన్నంతలో ఆర్తులకు సాయపడ్డానన్న సంతృప్తి చాలు అంది 'వసుంధర'తో. ఉడతాభక్తిన సాటిమానవులకు ఆమె చేస్తున్న సాయం అభినందనీయం కాదంటారా!
- ఎస్. రవీందర్‌రావు,

భయపెడుతున్న భాష!

భయపెడుతున్న భాష! ఉద్యోగులకూ ఇంగ్లిషు పాట్లు-స్వల్పకాల కోర్సులు నిష్ఫలం-గ్రామీణులకు పెద్ద బెంగ ఒకప్పుడు భారతీయుల్ని ఇంగ్లిషు వారు 'విభజించి' పాలించారు. ఇప్పుడా పని ఇంగ్లిష్ చేస్తోంది. ఈ భాషపై పట్టున్నవారు చదువుల్లో, ఉద్యోగాల్లో రాకెట్ వేగంతో పైపైకి దూసుకుపోతుంటే.. లేనివారు ఎక్కడికక్కడే చతికిలపడుతున్నారు.


కార్పొరేట్ సంస్కృతి పెరుగుతున్న కొద్దీ వీరు తీవ్రమైన న్యూనతలోకీ జారిపోతున్నారు. దీనంతటికీ చిన్నతనం నుంచీ సరైన ఆంగ్ల బోధన లేకపోవడమే ప్రధాన కారణమంటున్నారు విశ్లేషకులు. ఇంగ్లిష్ అంటే ఒకప్పుడు విద్యార్థులకు మాత్రమే భయం. కానీ ఇటీవలి కాలంలో చాలా మందిని ఇది జీవితాంతం వెన్నాడుతోంది. ముఖ్యంగా ఉద్యోగార్థులకు కునుకు పట్టనీయడంలేదు. ఇంటర్వ్యూల్లో, ఉద్యోగాల్లో, పదోన్నతుల్లో ప్రతి చోటా ఇంగ్లిష్ ప్రావీణ్యం తప్పనిసరవుతోంది. ఫలితంగా ఎంతో మంది ప్రతిభ ఉండీ, కేవలం ఇంగ్లిష్‌లో వెనకబడిన కారణంగా పైకెదగలేకపోతున్నారు. లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయడంతో రెండుసార్లు పదోన్నతి వచ్చింది. ఇప్పుడు మా సంస్థ తరపున పొరుగు రాష్ట్రాలకూ వెళ్తున్నా.


కానీ, ఇంగ్లిష్ అంతగా రాకపోవడంతో సరిగా మాట్లాడలేకపోతున్నా. కేవలం ఇంగ్లిష్ రావడం వల్లే మా సహచరుడొకరు చాలా పేరు తెచ్చుకున్నాడు. చివరికి హోటళ్లలో వెయిటర్లు కూడా ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంటే నాకు ఎంత నామోషీగా ఉంటుందో అంటున్నారు బీమా కంపెనీ ఉద్యోగి శివలింగం. ఎలాగైనా ఇంగ్లిష్‌ను దారిలోకి తెచ్చుకోవాలని ఓ 'స్పోకెన్ ఇంగ్లిషు కోర్సు'లో చేరారాయన. అలాగే ఇటీవలే నార్కట్‌పల్లి నుంచి వచ్చిన వెంకటేశ్ ఓ హెచ్ఆర్ ట్రైనీ ఇంటర్వ్యూకి వెళ్లాడు. అక్కడ వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ యూ ఆర్ డూయింగ్ అనే వాక్యాల్లో వ్యాకరణం పరంగా ఏది సరైనదో చెప్పమంటే తేల్చుకోలేకపోయాడు. ఉద్యోగం చేజారింది. ఇలాంటి చిన్నచిన్న తేడాలను గుర్తుపట్టడం కూడా ఎందుకంత కష్టంగా మారుతోంది? దీనికి, చిన్నతనం నుంచీ సరైన ఆంగ్లబోధన లేకపోవడం, చుట్టుపక్కల ఈ భాష మాట్లాడే వాతావరణం కొరవడడం, తెలుగులో ఆలోచించి ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించడమే కారణం అంటున్నారు 'రమేశ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్' డైరెక్టర్ సంజయ్. వీటన్నింటినీ మించి ఆత్మవిశ్వాసం లేకపోవటం పెద్ద అవరోధంగా నిలుస్తోంది. నల్గొండలో ఎంబీఏ చేశా. ఇంటర్వ్యూల్లో ఇంగ్లిష్‌లోనే వివరాలు చెప్పమంటున్నారు. మాట్లాడితే ఎక్కడ తప్పులు దొర్లుతాయేమోనని, నవ్వుతారేమోనని భయం అంటున్నాడు 26 ఏళ్ల ఎం.శ్రీనివాస్.

ఇలా ఇంగ్లిష్, సాఫ్ట్‌స్కిల్స్‌లో నైపుణ్యం కొరవడడం వల్ల.. ఐటీ, ఐటీ ఆధారిత ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్న ఇంజినీరింగ్ అభ్యర్థుల్లో 65%-75% మంది, ఇతర అభ్యర్థుల్లో 83% మంది ఎంపిక కావడం లేదని 'నాస్కామ్స్ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్' కూడా తేల్చింది. వీరందరికీ ప్రస్తుతం ఆంగ్ల భాషణ శిక్షణ సంస్థలే పెద్ద దిక్కుగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు గ్రామీణ విద్యార్థులే ఎక్కువగా చేరేవాళ్లు. కానీ ఇప్పుడు మా దగ్గరకు వస్తున్నవారిలో 95% మంది ఉద్యోగార్థులే అంటున్నారు హైదరాబాద్‌లో రామకృష్ణమఠం నడిపే లాంగ్వేజ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ స్వామి అనుపమానంద. ఇంగ్లిష్ కోసం ఏటా 12 వేల మంది ఈ సంస్థను ఆశ్రయిస్తుండడం విశేషం. మరో సంస్థ రస్సెల్స్‌లో కూడా స్పోకెన్ ఇంగ్లిషు కోసం వచ్చేవారి సంఖ్య ఏటా 25% పెరుగుతోంది. గత రెండేళ్లలో పరిస్థితి చాలా మారిందంటున్నారు సంస్థ ప్రతినిధి.

ఇప్పుడు చాలా సంస్థలు 'కార్పొరేట్ ఇంగ్లిష్', సాఫ్ట్ స్కిల్స్ కలిపి నేర్పించే కోర్సుల మీద దృష్టిపెడుతున్నాయి. చిన్నతనం నుంచీ పిల్లలకు స్కూళ్లలో సరైన ఆంగ్లబోధన లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఏ భాషనైనా పూర్తిస్థాయిలో నేర్చుకోవడానికి ఆరేళ్లు చాలు. అందుకే మన దగ్గర పదో తరగతి దాకా తృతీయ భాషగా ఉన్న ఇంగ్లిష్‌ని ఇంటర్మీడియట్‌లో ప్రథమ భాషగా చేశారు. అంటే 5 నుంచి పదోతరగతి పూర్తయ్యేసరికి ఇంగ్లిష్‌లో నైపుణ్యం సాధిస్తారన్నదే మూల భావన. కానీ, ఫలితాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. పదో తరగతిలో 90% మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు కూడా ఇంటర్‌లో ఇంగ్లిష్ అంటేనే బెంబేలెత్తుతున్నారు. గ్రామీణ విద్యాసంస్థల్లో బోధనా సౌకర్యాలు కొరవడడం, నైపుణ్యంగల ఉపాధ్యాయులు లేకపోవడం, పిల్లలు కూడా ఆ సమయంలో ఇంగ్లిషు ప్రాధాన్యాన్ని అంతగా గుర్తించకపోవడం ఈ పరిస్థితికి కారణమని విశ్లేషిస్తున్నారు స్వామి అనుపమానంద.


ఇలాంటి వాతావరణంలో చదువుకున్నవారే డిగ్రీ పూర్తయినా ఉద్యోగాల దగ్గరకు వచ్చేసరికి ఇంగ్లిష్ కారణంగా బోల్తా పడుతున్నారు. వెంటనే నేర్చేసుకోవాలని 'క్రాష్ కోర్సుల'ను ఆశ్రయిస్తున్నా.. నిజానికి అప్పటికప్పుడు ఇంగ్లిషు మాట్లాడడం అసాధ్యం. స్వల్పకాలిక కోర్సుల వల్ల అభ్యర్థులకు వచ్చేది నాలుగు ఇంగ్లిషు పదాలే తప్ప భాష కాదు అన్నది నిపుణుల వాదన. అందుకే వీరిలో చాలా మంది అక్కడా ఇమడలేక ఆ కోర్సులను మధ్యలోనే మానేస్తుంటారు. నేను మూణ్నెళ్ల స్పోకెన్ ఇంగ్లిషు కోర్సులో చేరా. గ్రామర్ అర్థమవుతున్నట్టున్నా మాట్లాడటం రాలేదు. ఇక నా వల్ల కాదని మానేశా అంటున్నారు మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీహరి. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో ఉద్యోగం చేస్తున్నారు. చిన్నతనం నుంచీ ఇంగ్లిష్ పట్ల ప్రత్యేక శ్రద్ధతో పత్రికలు, పుస్తకాలు చదవడం, బాగా వినడం, తోచిన ఆలోచనలను సొంతంగా రాయడం, బెరుకులేకుండా ఎక్కువగా మాట్లాడేందుకు ప్రయత్నించడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.(

సమతతో సమృద్ధా? మతంతో పతనమా?

సమతతో సమృద్ధా? మతంతో పతనమా?
గురుచరణ్‌దాస్
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇస్లామిక్ ఛాందసవాదుల బాంబు దాడులు, ఒరిస్సాలో క్రైస్తవులపై హిందూ మౌఢ్యుల దాడులు పాతగాయాలను రేపాయి. మనల్ని మళ్లీ రెండు వర్గాలుగా చీలుస్తున్నాయి. అంతర్జాతీయ సంక్షోభంతో పాటు స్వదేశంలో మత ఛాందసవాదం కూడా భారత ఆర్థికాభివృద్ధికి సవాళ్లు విసురుతోంది. మనం ఆశిస్తున్న భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేస్తోంది. భారత్ శాంతియుతంగా కొనసాగించే ఆర్థికాభివృద్ధి 21వ శతాబ్దపు విజయగాథగా నిలుస్తుందా? లేదా మత యుద్ధాలతో మన భవిష్యత్తు గాడి తప్పుతుందా?

ఆధునిక, సంపన్న, ప్రజాస్వామిక దేశంగా భారత్ మారడాన్ని ఎవరూ ఆపలేరన్నది నా విశ్వాసం. ఇస్లామిక్, హిందూ అతివాదాలు అరాచక సంస్కృతికి రెండు భిన్న ముఖాలు. కాలక్రమేణా అవి ప్రాధాన్యాన్ని కోల్పోతాయి. కొంతకాలం తర్వాతైనా ఛాందసవాదులు మంచి ఉద్యోగాలను, ఇళ్లను, తమ పిల్లలకు చక్కటి పాఠశాలలను పొందుతారు. యుద్ధం కంటే శాంతికి మద్దతు పెరుగుతుంది. అనుకున్నది సాధించడానికి పోరాటం కంటే వ్యాపారమే మంచి సాధనం అవుతుంది. విశ్వాసం, సహకారం ముందు హింస తలవంచుతుంది. తద్వారా రాజకీయ ఇస్లాంవాదం, రాజకీయ హిందూవాదం విఫలమవుతాయి. ఈ వాదనను చరిత్ర నిరూపించింది. గత రెండు శతాబ్దాల్లో సానుకూల సామాజిక వ్యవస్థలన్నింటినీలోనూ ప్రజాస్వామ్యం, మార్కెట్ ఆర్థిక విధానాల కలయిక విజయవంతమైంది. భూస్వామ్యం, రాజరికం, నియంతృత్వం, కమ్యూనిజం తదితర వ్యవస్థలపై ఉదార ప్రజాస్వామ్యం పైచేయి సాధించింది. శతాబ్దం క్రితం ప్రపంచంలో 10 ప్రజాస్వామ్య దేశాలుండగా ఇప్పుడు 120 ఉన్నాయి.

భవిష్యత్తు సంక్షోభాలు దేశాల మధ్య కాకుండా మత, సాంస్కృతిక నాగరకతల మధ్య తలెత్తుతాయని 'ద క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్' అనే గ్రంథంలో రాజకీయ శాస్త్రవేత్త శామ్యూల్ హంటింగ్టన్ వాదించారు. ఎదుగుతున్న ఇస్లామిక్‌వాదం, బలమైన శక్తిగా మారుతున్న చైనాతో చేతులు కలిపి పశ్చిమదేశాలకు సవాలు విసురుతుందని ఆయన అంచనా వేశారు. అయితే కమ్యూనిజం పతనమయ్యాక చాలా దేశాల్లో పెట్టుబడిదారీ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడతాయని 'ది ఎండ్ ఆఫ్ హిస్టరీ' అనే గ్రంథంలో ఫ్రాన్సిస్ ఫుకుయామా సూత్రీకరించారు. తద్వారా ప్రపంచం శాంతియుతంగా మారతుందని అభిప్రాయపడ్డారు. మనుషులు సంపన్నులయ్యాక ఒకానొక దశలో షాపింగ్‌మాళ్లు, వినియోగ సంస్కృతి పట్ల విసుగుచెందుతారనీ, కొత్తరకమైన సంతృప్తి కోసం మతాన్ని, యుద్ధాన్ని ఆశ్రయిస్తారని విశ్లేషించారు. అమెరికాలో క్రైస్తవం పునరుజ్జీవం పొందడం ఇందుకు నిదర్శనంగా భావించవచ్చు. దీన్ని 'ద నెక్ట్స్ క్రిస్టెన్‌డమ్: ద రైజ్ ఆఫ్ గ్లోబల్ క్రిస్టియానిటీ' పేరుతో ఫిలిప్ జెంకిన్స్ గ్రంథస్తం చేశారు. విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ, రాజకీయంగానూ కీలకపాత్ర పోషించే సరికొత్త మిషనరీ క్రైస్తవత్వాన్ని గుర్తించారు. ఈ కొత్త మిషనరీలు భారీగా సాగిస్తున్న మత మార్పిడులే భారత్‌లో హిందూ అతివాదవర్గాల ప్రతిఘటనకు కారణమా అన్నది సందేహం.

తీవ్ర ఇస్లామిక్‌వాదం లేదా జిహాదిజం మతపరమైన సిద్ధాంతంగా కంటే రాజకీయ భావనగానే కనిపిస్తోంది. సయ్యిద్ కుతుబ్, బిన్ లాడెన్‌లు రాజకీయ హింసావాదాన్ని ఉపయోగించుకున్నారు. ఇది ఇస్లాం నుంచి వచ్చింది కాదు. ఐరోపాలోని అతివాద, అరాచక సిద్ధాంతాల నుంచి పుట్టుకొచ్చింది. ఈ ప్రమాదకర ధోరణి తన రాజకీయ లక్ష్యాల కోసం ఇస్లాంను ఉపయోగించుకుంది. పశ్చిమ దేశాలకు దూరంగా ఉండే అరబ్, ఐరోపా ముస్లింలలో దీనికి పట్టు దొరికింది. ఇక ఉగ్రవాద సవాలు నుంచి భారత ఉదార ప్రజాస్వామ్యాన్ని ఎలా రక్షించుకోవాలన్నది ప్రశ్న. ఈ విషయంలో ఇప్పటివరకు మనం అమెరికా కంటే చక్కటి పరిణతితోనే ప్రతిస్పందించాం. వారి తరహాలో అందరినీ అనుమానించే తీరును మనం అనుసరించలేదు. ఇది ఉగ్రవాదుల స్త్థెర్యాన్ని దెబ్బతీసి ఉండాలి. అయితే అనేకమంది ఉదార ముస్లింల మధ్యలో ఉన్న అతి కొద్దిమంది ఉగ్రవాదులను పట్టుకోవడంలో మన భద్రతా సంస్థలు విఫలమయ్యాయి. మరో 9/11 దాడి జరగకుండా నివారించిన అమెరికా తరహాలో మనం వ్యవహరించలేకపోయాం. దీన్నుంచి పాఠాలు నేర్చుకోవాలి. పౌరులకు మత, కులపరమైన గుర్తింపును కొనసాగించడం ద్వారా వ్యక్తులుగా వారి ఔన్నత్యాన్ని నిలబెట్టడంలో ప్రభుత్వంకూడా విఫలమైంది. మన రాజ్యాంగం ప్రకారం ఒక సమూహంకంటే వ్యక్తి ఔన్నత్యాన్ని కాపాడడమే ప్రభుత్వ ప్రాధాన్యంకావాలి. అయితే ఓటు బ్యాంకు వ్యవస్థలో ఇదేమంత సులభం కాదు. ఆధునిక లౌకికవాద రాజకీయాలు రాత్రికిరాత్రి పుట్టుకురాలేదు. పశ్చిమదేశాల్లో దీనికి కొన్ని శతాబ్దాలు పట్టింది. ఈ విషయంలోనే ఇస్లామిక్ ప్రపంచం సమస్యను ఎదుర్కొంటోంది. ఇక భారత్‌లో ప్రజాస్వామిక పెట్టుబడిదారీ విధానం కొనసాగుతుందని నేను ఇప్పటికీ విశ్వసిస్తున్నాను. మన ఉదార ప్రజాస్వామ్యం మతతీవ్రవాదంపై విజయం సాధిస్తుంది. చివరికి బహుళత్వ, లౌకిక, శాంతియుతభారతం సాకారమవుతుంది.
-వ్యాసకర్త ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియాకు మాజీ ఛైర్మన్, ఎండీ.
'ముక్తాభారత్' గ్రంథ రచయిత.

humanism can be written as religion

In India, atheism finds its voice Team DNA Monday, October 13, 2008 03:29 IST

Atheists — traditionally defined as those who disbelieve in God or religion — have found their voice in the wake of the religious tension riving the globe's societal fabric.

Across the planet, the number of atheist organisations has increased, and India has been no exception to this trend. The Federation of Indian Rationalist Associations that started in 1997, is an umbrella body comprising more than 50 rationalist and atheist organisations.

These organisations believe in the supremacy of humanism above religion, and are committed to spreading this message. The Science and Rationalists' Association of India is one such organisation, based in Kolkata, that has waged the battle to make Humanism a viable and legally recognised ideology, and won. The association' s founder, Prabir Ghosh, says, "In 1993, we won the case in court, and now 'humanism' can be written, wherever one's religion needs to be stated." Elaborating on his faith in humanism, he says, "I have read a lot about religion, and I realised that none of them tell the truth. All religions believe they are the most superior and this results in fights. I then recognised humanism as the most important:

Think about your fellow human beings and treat them as equal." The Atheist Centre, one of the oldest atheist organisations in India, started in 1940 in Andhra Pradesh. This organisation was started by Goparaju Ramachandra Rao and Saraswathi Gora to initiate social change in rural India, and they also were an active part of the national movement. Dr Vijayam, the executive director of the Centre, says, "Saraswathi Gora was initially a believer. Once when there was an eclipse, she saw only Hindus hide while Christians and Muslims were moving about freely. She then started questioning old beliefs and that subsequently led to the founding of the Atheist Centre."

According to Dr Vijayam, religion is only equated with houses of worship. He says, "Only three times in life does religion really holds any importance: Birth, marriage and death. The biggest problems are religious groups and politicians. Everyone became a part of the freedom movement, irrespective of caste or religion. Now we are divided on religious lines and that is the reason for the communal tension." He also strongly advocates that State should be separated from religion.


This is a view shared by many, including social acitivist, Teesta Setalvad. "There should be a common gender code that takes the best practices from all religions, and politicians should be completely barred from using religion as a means to gather votes." She adds that the spiritual aspect of religion is completely forgotten, with emphasis being laid only on ritual aspects. Most atheists, however, agree that an increasing number of youth are moving away from religion. Talking of the destruction that religion can cause, Megh Raj Mitter, founder of Tarksheel Sanstha, in Punjab, says, "I have talked to people of all religions, and they agree that humanity is the most important thing. But they still go around killing people. Countlesss people have been killed in the name of religion in India." A non-religious State, according to atheists, is the best solution. "Religion should be banned. It becomes uncontrollable. Religion has nothing to do with morality or moral values. If it did, then in a country like India where religion is so important would have no corruption or crime," says Mitter.

Monday, October 06, 2008

నాన్నకు వద్దా సెలవు? 'సంరక్షణ' ఎవరిది?

నాన్నకు వద్దా సెలవు? 'సంరక్షణ' ఎవరిది?

నాన్నకు వద్దా సెలవు?
'సంరక్షణ' ఎవరిది?
కొత్త సెలవులపై రేగుతున్న చర్చ
పిల్లల పెంపకం ఎవరి బాధ్యత? దీనిపై దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినులకు రెండు సంవత్సరాల శిశు సంరక్షణ సెలవు(చైల్డ్ కేర్ లీవ్) ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటమే ఈ తాజా చర్చకు మూలం. దీనివల్ల తల్లులకు పిల్లల్ని దగ్గరుండి చూసుకునే వెసులుబాటు లభిస్తుందని ఓవైపు సంతోషం వ్యక్తమవుతుండగా.. మరోవైపు పిల్లల సంరక్షణ, పెంపకం పూర్తిగా ఆడవారి బాధ్యతేనా? మగవారికి ఇందులో ఏ పాత్రా లేదా? ఈ సెలవులతో పిల్లల పెంపకమన్నది కేవలం స్త్రీల బాధ్యతేనని అధికారికంగా కూడా గుర్తించినట్టు కాదా?.. ఇలాంటి చిక్కుప్రశ్నలెన్నో రేగుతున్నాయి.

రోజంతా రకరకాల పనులతో అలసిపోయి ఇంటికొచ్చే ఉద్యోగినుల కోసం.. ఇంటి దగ్గరా గంపెడు చాకిరీ ఎదురుచూస్తుంటుంది. పిల్లల హోంవర్కులూ, చదువుల 'బాధ్యత'లూ వీటికి అదనం. ఇటీవల 'అసోచామ్' నిర్వహించిన సర్వేలో కూడా పిల్లలతో గడపడం, దగ్గరుండి వారిని చదివించటం వంటి బాధ్యతలన్నీ స్త్రీలవేనని ఎంతోమంది పురుషులు అభిప్రాయపడుతున్నట్టు వెల్లడైంది. 4% మంది తండ్రులే వాటిలో తమకూ బాధ్యత ఉందని అంగీకరిస్తున్నారు. మిగిలిన వారిలో 7% మంది ఎప్పుడన్నా ఓసారి హోంవర్క్‌లో సాయం చేస్తుంటే.. 24% మంది తండ్రులు 'పిల్లలు మమ్మల్ని అడిగినప్పుడు చూస్తాం' అనీ.. గరిష్ఠంగా 65% మంది 'అసలు పట్టించుకోం' అని చెప్పడం పరిస్థితికి అద్దంపడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్త్రీలకే పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చెయ్యటం.. ఈ అస్తవ్యస్త సామాజిక విధానాన్ని సమర్థించినట్టు కాదా? అంటున్నారు కొందరు.

నిజానికి పిల్లల పెంపకంలో మన దగ్గర మొదట్నించీ పురుషుల పాత్ర నామమాత్రమే. డబ్బు సంపాదించడంతోనే తన పని అయిపోయిందనుకునే 'మగమహారాజు'లే ఎక్కువ. ''మావారు పిల్లాడికి బట్టలూ, బొమ్మలూ బాగానే కొనిస్తారు. వాడి స్కూలు వ్యవహారాలు చూడమంటే మాత్రం విసుక్కుంటారు. జబ్బు చేస్తే ఆసుపత్రికి కూడా నన్నే తీసుకెళ్లమంటారు'' అంటారు ఓ బ్యాంకు ఉద్యోగిని వసంత. అయితే, ఇప్పుడీ పరిస్థితిలో కొద్దిగానైనా మార్పువస్తోంది. ఇంటి పనుల్లో తామూ ఓ చేయి వేయాలని, వంటలోనూ సాయం చేయాలనుకునే పురుషుల సంఖ్య పెరుగుతోంది. ''పిల్లలను చదివించడం, పరీక్షలకు సిద్ధం చేయడం, జబ్బు చేసినపుడు సేవలు చేయడం వంటివి కేవలం ఆడవారి మీదే వేయటమెందుకు? అంతకన్నా ఆ బాధ్యతలను సమానంగా మోసేలా చేయడం మేలు కదా'' అంటారు ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కృష్ణమూర్తి. అయితే... ''పిల్లల సంరక్షణ సెలవు వల్ల తల్లులకు ఆ మేరకు ఒత్తిడి తగ్గుతుందనడంలో సందేహమేం లేదు. దీంతో ఉద్యోగభారం తగ్గి పూర్తిగా పిల్లల మీదే దృష్టి కేంద్రీకరించే అవకాశం కలుగుతుంది'' అని చెబుతున్నారు న్యాయనిపుణులు మాడభూషి శ్రీధర్. ఇది చట్టపరంగా ఆడవారికి లభిస్తున్న ఓ బాసటే తప్ప.. పిల్లల సంరక్షణలో మగవారి పాత్రను చర్చించడానికి దీన్ని వేదికగా చేయరాదంటారాయన.

నాన్నల తోడూ కావాలి: శిశువులకు మొదటి ఆర్నెల్లూ కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే ప్రభుత్వం నాలుగున్నర నెలల మాతృత్వ సెలవులను ఆర్నెల్ల వరకూ పొడిగించింది. ఇప్పుడు ప్రకటించిన పిల్లల సంరక్షణ సెలవులు వీటికి అదనం. ''దీనివల్ల తల్లులకు ఎంత ఊరట లభిస్తుందో మాటల్లో చెప్పలేను. కానీ, ప్రసవానంతరం బయటి పనులు చూసుకునేందుకు భర్తలు తోడుంటే ఇంకా బాగుంటుంది'' అన్నది ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి అనుభవం. నిజానికి పిల్లల సంరక్షణలో తండ్రులూ పాలు పంచుకుంటే ఎంతోమేలు జరుగుతుందని, అలా పెరిగే పిల్లలు చదువుల్లోనూ బాగా రాణిస్తారని బెంజమిన్ స్పాక్స్ వంటి విఖ్యాత శిశు మనస్తత్వవేత్తలు మూడు దశాబ్దాల క్రితమే గుర్తించారు. దీనివల్ల కేవలం పిల్లల భవిష్యత్తు మెరుగుపడటమే కాదు, భార్యాభర్తల మధ్య అన్యోన్యతా పెరుగుతుంది. ''మా వారు ఆఫీసు నుంచి రాగానే పాపను ఆడిస్తారు, దగ్గరుండి చదివిస్తారు. సెలవురోజుల్లో పార్కులు, మ్యూజియానికి తీసుకెళ్తారు. పరీక్షల సమయంలో పాపతో మరికాస్త సమయం గడిపే వీలుంటే బాగుండని ఎన్నోసార్లు అంటుంటారు. అందుకే పురుషులకూ సెలవులిస్తే మంచిది'' అంటారు హైదరాబాద్‌లోని ఓ గృహిణి భవాని. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవుల సదుపాయం ఉంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఈ సెలవులు ఇస్తున్నాయి. ఇవేకాకుండా, పురుషులకూ 'పిల్లల సెలవులు' ఇవ్వాలని చాలామంది కోరుతున్నారు. కాలంతో పాటే ప్రజల అభిప్రాయాలూ మారుతున్నాయి. వాటిని సమాజ అవసరాలకు అనుగుణంగా ప్రోత్సహించేలా విధానాలు రూపొందాలి.. అప్పుడే మరింత పురోగతి దిశగా అడుగులు పడతాయి. కాదంటారా?

దైవభక్తులు ఉత్తములు! నిజాయతీ, ఔదార్యం కలిగి ఉంటారు

దైవభక్తులు ఉత్తములు! నిజాయతీ, ఔదార్యం కలిగి ఉంటారు

దైవభక్తులు ఉత్తములు!
నిజాయతీ, ఔదార్యం కలిగి ఉంటారు
లండన్: దైవభక్తి ఉన్న ప్రజలు ఉత్తములని పరిశోధకులు చెబుతున్నారు. నాస్తికులకు కోపం తెప్పించినా ఇది నిజమేనని వారు పేర్కొంటున్నారు. బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ అంశంపై అధ్యయనం చేశారు. దేవుడిపై నమ్మకం ఉండి, తరచూ దైవ సంబంధమైన కార్యకలాపాల్లో పాల్గొనేవారు నిజాయతీ, ఔదార్యం, అవతలివారికి సాయపడేతత్వాన్ని కలిగి ఉంటారని వారు వివరించారు.. ఇందులో ఆసక్తికరమైన అంశమేమిటంటే.. వీరి మంచితనానికి కారణం స్నేహితుల్లో పేరు ప్రతిష్ఠలు పెంచుకోవడమేట.

ఈ పరిశోధనకు ఆరా నోరెంజయాన్ నేతృత్వం వహించారు. మతం.. ఒక వ్యక్తి వ్యవహారశైలిపై ప్రభావం చూపుతుందా? అన్నది శాస్త్రీయంగా తేల్చేందుకు ఈ పరిశోధన నిర్వహించినట్లు చెప్పారు. మతపరమైన, ఆధ్యాత్మికమైన ఆలోచనలు.. క్రీడల్లో మోసాన్ని తగ్గించడంతోపాటు అపరిచితుల మధ్య నమ్మకాన్ని కూడాపెంచుతోందని తెలిపారు. అధ్యయనంలో భాగంగా నోరెంజయాన్ బృందంకొంతమంది ఔత్సాహికులను ఎంపిక చేసుకొని, వారికి అనేక పరీక్షలు నిర్వహించి ఈ విషయాన్ని ధ్రువపరచింది.

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం మద్యం నిషిద్ధం అంతా అక్షరాస్యులే రూపాయికే ఫ్లోరైడ్ రహిత నీరు ఇదీ గంగదేవిపల్లి ఘనత

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం మద్యం నిషిద్ధం అంతా అక్షరాస్యులే రూపాయికే ఫ్లోరైడ్ రహిత నీరు ఇదీ గంగదేవిపల్లి ఘనత

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం
మద్యం నిషిద్ధం
అంతా అక్షరాస్యులే
రూపాయికే ఫ్లోరైడ్ రహిత నీరు
ఇదీ గంగదేవిపల్లి ఘనత
వరంగల్ - న్యూస్‌టుడే
మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరించిన వరంగల్ జిల్లా గంగదేవిపల్లి అభివృద్ధి వెనుక 14ఏళ్ల కృషి, 13 అభివృద్ధి కమిటీల శ్రమ ఉంది. ప్రతీ విషయంలో పారదర్శకత, పాలనలో ప్రతీ ఒక్కరికీ బాధ్యత... ఇదే గంగదేవిపల్లిని ఆదర్శ గ్రామంగా నిలిపింది. గంగదేవిపల్లి మొదట్లో మచ్చాపురం పంచాయతీ శివారు గ్రామంగా ఉండేది. 1994లో ప్రత్యేక పంచాయతీగా గుర్తించారు. అప్పటికి ఊళ్లో నాటుసారా ఏరులై పారుతోంది. ఎన్నో జీవితాలు బలయ్యాయి. గ్రామస్థుల్లో ఆలోచన మొదలైంది. నాటుసారా విక్రయాలు నిషేధించారు. ఆరంభంలో ఒడిదుడుకులను అధిగమించారు. ప్రభుత్వం మద్యం అమ్మకాల నుంచి గంగదేవిపల్లిని మినహాయించింది.

ప్రభుత్వం దగ్గర పైసా తీసుకోకుండా స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో రక్షిత మంచినీటి సౌకర్యం ఏర్పాటుచేశారు. 1996 నుంచి డీ-ఫ్లోరైడ్ ప్రాజెక్టు నిరాటంకంగా పనిచేస్తోంది. ఇంటింటికీ 20లీటర్ల మంచినీరు రూపాయికే ఇస్తున్నారు.

1994కు ముందు గ్రామంలో పాఠశాల లేదు. అక్షరాస్యత అంతంత మాత్రమే. అందరికీ విద్య లక్ష్యంతో కమిటీ వేశారు. ప్రతీ 10 మంది నిరక్షస్యురాలకు ఒక వాలంటీర్ నియమించారు. ఎనిమిదేళ్ల కృషి ఫలించింది. 2002 నాటికి నూరు శాతం అక్షరాస్యత సాధించింది. బాల కార్మిక వ్యవస్థ లేదు. బడి ఈడు పిల్లలంతా చదువుకోవాల్సిందే.

గంగదేవిపల్లిలో కేబుల్ ప్రసారాలు ఉచితం. ఒక్కసారి రూ.2,200 చెల్లిస్తే చాలు. వసూలు చేసిన మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, వడ్డీతో గంగా డిష్ కమిటీ పర్యవేక్షిస్తుంది.

ఆరోగ్య కమిటీ, తల్లుల కమిటీ, రుణాల రికవరీ కమిటీ, 'గ్రామాభివృద్ధి కమిటీ'... ఇలా 13 కమిటీలున్నాయి. ప్రతీ ఇంటి నుంచి ఒకరికి ఏదో ఒక కమిటీలో బాధ్యతలుంటాయి. రాజకీయ పార్టీలున్నా అభివృద్ధి నిర్ణయాల్లో అందరిదీ ఒకటే మాట.

గంగదేవిపల్లిలో కుటుంబ సమస్య ఉన్నా పంచాయతీ కార్యాలయం దాటి వెళ్లదు. 14 ఏళ్లలో ఒక్కసారి కూడా పోలీసు రాలేదు. కొట్లాట కేసు కూడా నమోదు కాలేదు.

గంగదేవిపల్లి 2007లో దేశంలోనే ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కాశ్యప్ నేతృత్వంలోని న్యాయ నిర్ణేతల బృందం ఈ ఎంపిక చేసింది. గ్రామీణ భారత అధ్యయనం, పరిశోధనా అకాడమీ ఈ అవార్డును అందించింది. కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్ ముఖ్య సలహాదారు.

గంగదేవిపల్లి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా నిర్మల్ గ్రామ్ పురస్కార్ అందుకుంది.

వరంగల్ జిల్లాలో నాలుగుసార్లు ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. గ్రామంలోని కుటుంబాలన్నీ చిన్న మొత్తాల పొదుపులో చేరినందుకు 1999లో కలెక్టర్ ప్రత్యేక అవార్డు అందించారు.

కెనడా, బంగ్లాదేశ్‌ల నుంచి స్వచ్ఛంద సంస్థలు వచ్చి గంగదేవిపల్లి గ్రామస్వరాజ్యాన్ని అధ్యయనం చేశాయి. తమిళనాడు, పాండిచ్చేరి, రాజస్థాన్ బృందాలూ వచ్చాయి. ఇతర జిల్లాల బృందాలకు లెక్కేలేదు. జిల్లాకు వచ్చే ఐఏఎస్ శిక్షణార్థులంతా ఈ గ్రామం గురించి చదవాల్సిందే.