welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Wednesday, July 02, 2008

సమత లేక సతమతం


సమత లేక సతమతం హిందూ దురహంకారులతో ప్రమాదం భారతీయ ముస్లింలను ద్వేషిస్తుంటారు ఇస్లామిక్ దేశాల విధానం రావాలంటారు రాజ్యాంగ పరిధిలో విభజిత రాజకీయాలు ఇతర మతవర్గాల్లోనూ ఇవే ధోరణులు
విశాల దృక్పథం ఎండమావేనా?

నక్సలైట్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే... మతవాదులు ప్రజాస్వామ్య ప్రక్రియలోనే పనిచేస్తూ దాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. చిగతంలో హిందువులు సాధించారని చెబుతున్న ఘనతలను గుర్తుచేయడమే హిందూత్వ ఉద్దేశమైతే ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. అయితే అది మళ్లీ సాధించాల్సిన విజయం గురించి చెబుతోంది. 'దురదృష్టవశాత్తూ' ఇతర మతస్థుల కుటుంబాల్లో పుట్టిన భారతీయుల హక్కులను లాక్కోవడం ద్వారానే ఆ విజయం వస్తుందనడమే ఆందోళనకరం.

'హిందూత్వ' విజయం సాధించడానికి ఒక కారణం అది విభిన్న గళాలతో మాట్లాడగలడం. వాజ్‌పేయి ఉదారవాదులను సంతృప్తిపరిచేవారు. అద్వానీ అతివాదులను ఆకట్టుకునేవారు. ప్రసుత్తం వాజ్‌పేయి విశ్రాంతి తీసుకోవడంతో ఆయన స్థానంలోకి అద్వానీ వచ్చారు. అతివాద స్థానాన్ని నరేంద్ర మోడీ భర్తీ చేస్తున్నారు.

కొందరు సంఘ్ పరివార్ గురించి చెప్పేటపుడు 'హిందూ జాతీయవాదులు' అని అభివర్ణిస్తుంటారు. ఈ ముద్ర సరైంది కాదు. భారతీయులైన ఇతర మతస్థుల పౌరసత్వాన్ని అంగీకరించని వారిని 'జాతీయవాదులు'గా ఎందుకు పిలవాలి?
రామచంద్ర గుహస్వాత్రంత్యం వచ్చిన నాటిలాగే వామపక్ష తీవ్రవాద సమస్య ఇప్పటికీ కొనసాగుతోంది. అప్పట్లో ఉన్న మతతత్వ అతివాదమూ ఇప్పటికీ సవాళ్లు విసురుతోంది. నక్సలైట్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే... మతవాదులు ప్రజాస్వామ్య ప్రక్రియలోనే పనిచేస్తూ దాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 'హిందూత్వ' పదం స్వాతంత్రోద్యమం నాటి విప్లవవాది వినాయక్ దామోదర్ సావర్కార్‌తో ముడిపడింది. దీన్ని రాజకీయ సిద్ధాంతంగా మలచడంలో ఆయన యువ సహచరుడు మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్ కీలకపాత్ర పోషించారు. ఆయన వాజ్‌పేయి, అద్వానీ వంటి ఎందరో నేతలకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి. ఆయన గ్రంథం 'ఎ బంచ్ ఆఫ్ థాట్స్'లో తన భావజాలాన్ని పూర్తిగా వివరించారు.. ఇది దేశవ్యాప్తంగా సంఘ్ శాఖల్లో ఆయన చేసిన ప్రసంగాల సంకలనం. ఇందులో ఆయన హిందువులను మానవజాతిలోనే ఉన్నతస్థానంలో నిలబెడతారు. 'హిందువులు ఒకప్పుడు ప్రపంచాన్ని పాలించారు.. భవిష్యత్తులో ఆ వైభవాన్ని వారు మళ్లీ సాధించుకుంటారు. పశ్చిమదేశాల శాస్త్ర విజ్ఞానం కంటే వారి శాస్త్రం ఎంతో గొప్పది. (ఒకప్పుడు ఐరోపావాళ్లు పచ్చి ఆహారాన్ని, వండని మాంసాన్ని తినే కాలంలోనే హిందువులు వేదాలు రాస్తున్నారని గోల్వాల్కర్ చెబుతారు) ఆ పరిస్థితి మళ్లీ రావాలి. హిందువులు దేవుడు ఎంచుకున్న ప్రజలు. ఇతర ప్రాంతాలు, ఇతర మతాలవారిని పాలించే బాధ్యతను విధి వారికి అప్పగించింది' అని ఆయన ప్రవచించేవారు. గతంలో హిందువులు సాధించారని చెబుతున్న ఘనతలను గుర్తుచేయడమే హిందూత్వ ఉద్దేశమైతే దాని గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. అయితే అది మళ్లీ సాధించాల్సిన విజయం గురించి చెబుతోంది. 'దురదృష్టవశాత్తూ' ఇతర మతస్థుల కుటుంబాల్లో పుట్టిన భారతీయుల హక్కులను లాక్కోవడం ద్వారానే ఆ విజయం లభిస్తుందని నొక్కిచెబుతుండడమే ఆందోళనకరం. గోల్వాల్కర్ ఓ సందర్భంలో మరింత ముందుకెళ్లి... 'ఈ నేలపై హిందువులే యజమానులు. పార్సీలు, యూదులు అతిథులు. ముస్లింలు, క్రైస్తవులు బందిపోట్లు. అలాంటప్పుడు వీళ్లందరికీ ఈ దేశంలో సమాన హక్కులు ఉంటాయా?' అని ప్రశ్నించారు. గోల్వాల్కర్ భారతీయ క్రైస్తవులను వ్యతిరేకించారు. భారతీయ ముస్లింలను మాత్రం ద్వేషించారు. వారిని మాతృదేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రవర్తించేవారినేగా చూశారు. ఆయన గ్రంథం చివరిలో ఇలా ఉంటుంది... 'మనం దేన్ని విశ్వసిస్తామో ముస్లిం దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాడు. మనం ఆలయంలో ప్రార్థన చేస్తే అతడు దాన్ని అపవిత్రం చేస్తాడు. మనం ఆవును పూజిస్తే... అతడు దాన్ని తినాలనుకుంటాడు. మనం మహిళను మాతృత్వానికి చిహ్నంగా గౌరవిస్తే... అతడు ఆమెను హింసించాలని చూస్తాడు. మతపరంగా, సాంస్కృతికంగా, సామాజికంగా... ఏ కోణంలో చూసినా మన జీవన విధానానికి అతడు బద్ధ వ్యతిరేకి.'

ముస్లింలను దుర్మార్గులుగా చిత్రించడం వెనుక రాజకీయ లక్ష్యాలున్నాయి. 1950ల్లో, మళ్లీ 1960ల్లో గోల్వాల్కర్ గోసంరక్షణ ప్రచారోద్యం నిర్వహించారు. తద్వారా ఐక్య హిందూ ఓటు బ్యాంకు ఏర్పడుతుందని ఆయన ఆశించారు. ఆయన మరణించిన దశాబ్దం తర్వాత బాబ్రీ మసీదు వివాదం రూపంలో ఇదే భావజాలం పురివిప్పింది. ఈ వివాదమే గోల్వాల్కర్ విఫలమైన చోట ఆయన అనుచరులు విజయం సాధించేలా చేసింది. రామాలయ నిర్మాణం పేరుతో జరిగిన ప్రచారం హిందూ అతివాదులను ఒకచోటికి చేర్చింది. నిజానికి వీరు అధిక సంఖ్యాకులైన హిందువుల మనోభావాలకు ప్రతినిధులు కాదు. అయినా మత కలహాలను రెచ్చగొట్టడానికీ, పలు రాష్ట్రాల్లో... చివరికి కేంద్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవడానికి వారికి తగినంత బలం ఉంది. 'హిందూత్వ' విజయం సాధించడానికి ఒక కారణం అది విభిన్న గళాలతో మాట్లాడగలడం. వాజ్‌పేయి ఉదారవాదులను సంతృప్తిపరిచేవారు. అద్వానీ అతివాదులను ఆకట్టుకునేవారు. (ప్రసుత్తం వాజ్‌పేయి విశ్రాంతి తీసుకోవడంతో ఆయన స్థానంలో అద్వానీ వచ్చారు. అతివాద స్థానాన్ని నరేంద్ర మోడీ భర్తీ చేస్తున్నారు.) 1968లో నేటి భాజపాకు పూర్వరూపమైన జనసంఘ్‌ను ఉద్దేశించి మేధావి, రాజనీతివేత్త సి.రాజగోపాలాచారి ఇలా వ్యాఖ్యానించారు. 'ఆ పార్టీలో చక్కటి నేతలు చాలామందే ఉన్నారు. అయితే దానికి కావాల్సింది కేవలం సహనంతో కూడిన విశాల దృక్పథమే కాదు... ముసల్మాన్‌లను, క్రైస్తవులను, పార్సీలను, ఇతరులను కూడా రాజకీయంగా, సాంస్కృతికంగా హిందువులతో సమానంగా చూసే తత్వం.' అయితే 40 ఏళ్ల తర్వాత కూడా హిందూత్వవాదుల మనసులు విశాలం కావడం కోసం భారతీయులు ఎదురుచూస్తూనే ఉన్నారు. అది నెరవేరే అవకాశమూ కనిపించడం లేదు. ఓసారి ఎవరో వాజ్‌పేయిని 'ముసుగు'గా అభివర్ణించారు. కొందరు భాజపా యువనేతలు కూడా ఆయన బాటలోనే ఆధునిక వాదం కింద అతివాద భావాల్ని కప్పిపుచ్చుతున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధర రాజె పారిశ్రామికవేత్తలను పెంచి పోషించారు. గత ఎన్నికల సమయంలో మాత్రం ఆమె ప్రవీణ్ తొగాడియాలాంటి వాళ్లు చేపట్టిన త్రిశూలాల పంపిణీని సమర్థించారు. గుజరాత్‌లో ముస్లింలపై మారణకాండను వెనకేసుకొచ్చిన వ్యక్తి అతి సౌమ్యంగా కనిపించే న్యాయవాది అరుణ్ జైట్లీ కావడం విశేషమే.
కొందరు సంఘ్ పరివార్ గురించి చెప్పేటపుడు 'హిందూ జాతీయవాదులు' అని అభివర్ణిస్తుంటారు. ఈ ముద్ర సరైంది కాదు. భారతీయులైన ఇతర మతస్థుల పౌరసత్వాన్ని అంగీకరించని వారిని 'జాతీయవాదులు'గా ఎందుకు పిలవాలి? పాకిస్థాన్ బాటలోనే భారత్ కూడా మైనారిటీలకు ఉన్నతస్థానాలను కట్టబెట్టకూడదని వీహెచ్‌పీ అగ్రనేత అశోక్ సింఘాల్ ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. నిజానికి హిందూత్వవాదులు తాము నమ్మే నిజమైన భారతీయ దృక్పథాన్ని అంగీకరించని నాలాంటి హిందువులను కూడా శత్రువులుగా చూస్తారు. (ఆర్ఎస్ఎస్ తరహా విద్వేషంతో నిండిన లేఖలతో నా మెయిల్ బాక్స్ నిండిపోయింది.) భారతదేశ గత, భవిష్యత్ గొప్పతనం గురించి వారు చెప్పేదాన్ని బట్టి హిందూత్వమంటే కల్లోలం సృష్టించే దురహంకారమేనన్న అభిప్రాయం కలుగుతుంది. దీనిపై ప్రముఖ కన్నడ రచయిత యు.ఆర్.అనంతమూర్తి ఆసక్తికరమైన వాదన చేస్తారు. సంఘ్ పరివార్‌ను కాషాయ దళంగా పిలవకూడదని ఆయనంటారు. 'కాషాయం అందమైన రంగు. జ్ఞానానికి, త్యాగానికి చిహ్నం. దీనితో మన పురాణగాథలకు, చరిత్రకు ఎంతో అనుబంధం ఉంది. అలాంటి రంగును దురహంకారులకు ఎలా ఆపాదిస్తారు? ప్రేమపూర్వకమైన 'కాషాయాన్ని'గానీ, సమైక్యతను కోరే 'జాతీయవాదాన్ని'గానీ వారితో ముడిపెట్టకూడదు. వారి భావజాలానికి సరైన పదం 'హిందూ దురహంకారం.' వారు రాజ్యాంగ పరిధిలోనే పనిచేస్తున్నప్పటికీ... నక్సల్స్ తరహాలోనే వీరి భావాలు కూడా దానికి విరుద్ధమైనవి. పరివార్ ద్వేషించేది ముస్లింలనేనన్నది స్పష్టం. అయితే నా చరిత్ర అధ్యాపకురాలు ధర్మకుమార్ చెప్పినట్లు... 'వారు అంతర్గతంగా తమ శత్రువులనే ఆరాధిస్తారు. వారినే అనుకరించడానికి ప్రయత్నిస్తారు. భారత్‌ను ఇస్లామిక్ తరహాలో హిందూ రాజ్యంగా నిర్మించాలని భాజపా కోరుకుంటోంది. మధ్యయుగాల నాటి ముస్లిం రాజ్యాల్లో ధిమ్మీ అనే వర్గం ఉండేది. ఇందులో యూదులు, క్రైస్తవులు ఉండేవారు. వీరిని కాఫిర్ల (దేవుడి పట్ల విశ్వాసం లేనివాళ్లు) కంటే కాస్త గౌరవంగానే చూసేవాళ్లు. ధిమ్మీలకు ఉన్నత పదవులు మాత్రం ఇచ్చేవాళ్లు కాదు. వారు పన్నులు చెల్లిస్తూ, ప్రభుత్వానికి లొంగి ఉన్నంతకాలం ప్రశాంతంగా జీవించవచ్చు. కాఫిర్లను శత్రువులుగా చూసేవాళ్లు. ఇదే తరహాలో ఆధునిక భారత్‌లో ఆధ్యాత్మికంగా, రాజకీయంగా మెజారిటీ హిందువుల ఆధిపత్యాన్ని అంగీకరించినంతకాలం ముస్లింలు, క్రైస్తవులు ఏదో ఒకపక్కన జీవించే వ్యవస్థ ఉండాలని సంఘ్ ఆశిస్తోంది. ఈ వర్గాల వారు సమానహక్కులు కోరితే గతంలో కాఫిర్లను శిక్షించిన విధానాన్ని అనుసరించాలన్నది వారి వాదన.

స్పష్టంగా చెప్పాలంటే దేశంలో మరికొన్ని మత ఛాందసవాదాలు కూడా ఉన్నాయి. కొన్ని క్రైస్తవ, ముస్లిం వర్గాలు సంఘ్ తరహా భావజాలంతోనే పనిచేస్తున్నాయి. అయితే ముస్లిం వర్గంపై ఛాందసవాదుల ప్రభావం బలమైంది. వారు ఉదారవాద ముస్లిం మేధావులను కూడా తమ అదుపులోకి తెచ్చుకోగలుగుతారు. ఇక అంటరానితనం నాగరిక సమాజంలో ఆమోదయోగ్యంకాని దురాచారం. శాస్త్రాలు ఏం చెప్పాయన్నది పక్కనబెడితే మన రాజ్యాంగం దీన్ని నిషేధించడం ఆనందించాల్సిన విషయం. దీనివల్ల ఈ దురాచారానికి వ్యతిరేకంగా రాజ్యాంగ రక్షణ పొందొచ్చు. అయితే మహిళలకు సమానహక్కుల కోసం పోరాడే ఒక ముస్లిం మాత్రం మతపరమైన ప్రాథమిక సూత్రాల్లో తన వాదనకు మద్దతిచ్చే అంశాన్ని గుర్తించడం కష్టం. ఆ ప్రయత్నం చేసేవాళ్లు అవే సూత్రాల్లో ఉన్న విరుద్ధమైన అంశాల ముందు తలవంచాల్సి వస్తుంది. ఆధునిక భారతదేశంలో అన్ని విశ్వాసాల్లోనూ మతపరమైన ఛాందసవాదం పెచ్చరిల్లుతోంది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు... చివరికి జైనుల్లోనూ ఇది కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిడివాద ధోరణులు మరింతగా బలపడే సంకేతాలే ఉన్నాయి. సానియా మీర్జా, తస్లిమా నస్రీన్‌లను అవమానించిన ముల్లాలు, దేరా సచ్చా సౌదాపై దాడులకు దిగిన సిక్కు అతివాదుల తీరు భారత రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. ఏదేమైనా దేశంలో 80 శాతం మంది హిందువులే కావడం వల్ల ఈ వర్గంలో తలెత్తే దురహంకార వైఖరే అన్నింటి కంటే అత్యంత ప్రమాదకరం.

-వ్యాసకర్త ప్రముఖ చరిత్రకారుడు.
'ఇండియా ఆఫ్టర్ గాంధీ' గ్రంథ రచయిత

No comments: