welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Wednesday, July 02, 2008

బంధాన్ని కలిపిన ఔదర్యం


మానసిక రోగిని మనిషిని చేసి...
బంధాన్ని కలిపిన ఔదర్యం
బెంగుళూరు, జూన్ 15 (న్యూస్‌టుడే): నగర వీధుల్లో వస్త్రాలు లేకుండా సంచరిస్తున్న మానసిక రోగి పట్ల ఆ హృదయం స్పందించింది. వైద్యం ఇప్పించి మనిషిని చేయాలనిపించింది. చికిత్స ఇప్పించి రక్తసంబంధీకులతో అతణ్ని కలిపారు నందినిలేఔట్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ రాజణ్ణ. మానసిక రోగి పేరు వెంకటేష్. సొంత ఊరు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా చిల్లమత్తూరు మండలం తుమ్మకుంట గ్రామస్థుడు. గత ఏప్రిల్‌లో నగరంలోని మహాలక్ష్మీలేఔట్, విజయనగర, నందినిలేఔట్ తదితర ప్రాంతాల్లో వస్త్రాలు లేకుండా అతడు సంచరించే వాడు. ఆ మానసిక రోగిని చూసిన ప్రజలు భయపడేవారు.. స్థానిక ఫొటోగ్రాఫర్ రాజణ్ణ చొరవ తీసుకుని అతణ్ని దగ్గర తీశారు. భోజనం పెట్టించి వస్త్రాలు తొడిగించి పంపించారు. అతడు వెళ్లిన నెల తర్వాత మళ్లీ వస్త్రాల లేకుండా సంచరించడం రాజణ్ణ చూశారు. మళ్లీ అతణ్ని దగ్గర తీసి స్నానం చేయించి బట్టలు తొడిగించి నిమ్హాన్ ఆసుపత్రికి తీసుకుపోయారు. అక్కడ ప్రముఖ వైద్యుడు డాక్టర్ సి.ఆర్.చంద్రశేఖర్‌ను కలిశారు. అతడి పరిస్థితిని వివరించారు. మానసిక రోగి పేరు, ఊరు తెలియదు. ఆ వివరాల్ని నోరు విప్పి చెప్పలేని పరిస్థితి అతనిది. వైద్యులు ఆసుపత్రిలో చేర్చుకున్నారు. నెల పాటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స పొందాడు. మామూలు మనిషిగా మారిన తర్వాత నోరు విప్పాడు. పేరు, ఊరు తదితర వివరాలు వైద్యులకు చెప్పాడు. ఆ వివరాల్లో నిజానిజాలు పరిశీలించేందుకు రాజణ్ణ తుమ్మకుంట గ్రామానికి వెళ్లి విచారించగా అతడు వివరించిన విషయాలు నిజమయ్యాయి. రాజణ్ణ అతడి తల్లిదండ్రులకు పరిస్థితి వివరించి నగరానికి తీసుకొచ్చి అప్పగించారు. వెంకటేష్ తన అత్తతో కలిసి తమిళనాడుకు వెళ్లాడు. అక్కడ దేవస్థానాలు సందర్శించాడు. మళ్లీ వచ్చే సమయంలో దారి తప్పి నగరానికి వచ్చాడు. వెంకటేష్ భార్య, ఇద్దరు పిల్లలున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక తదితర ప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో అతడిపై ఆశలు వదులుకున్నారు. రాజణ్ణ చేసిన ఉపకారాన్ని జన్మలో మరిచిపోలేమని వెంకటేష్ తండ్రి గోవిందప్ప తెలిపారు.

No comments: