కుల నిర్మూలన :"కులం కార్య విభాగమే, కులాలలొ సమత్వమూ, సమాన గౌరవమూ, ఉన్ననాళ్ళూ నిలిచాయి కులాలు. కార్య విభాగంలొ బేధంగాని, గౌరవంలొ బేధంగాని రాగానే వేరుపురుగు పుట్టిందన్నమాటే. మూఢత్వమూ, అజ్ఞానమూ తగ్గగానే తక్కువజాతి వాళ్ళనే వాళ్ళు మోసం తెలుసుకుని తిరగబడుతున్నారు. స్త్రీ కూడా అంతే. -చలం
భారతీయ సమాజంలో ఒక కులం లేదా మతం మనుషులు మరొక కులం వారి కంటె ఎక్కువ తక్కువని అనుకోవటం వల్ల, మనుషులందరు సమానులు కాదనుకోవటం వల్ల, అంటరానితనాన్ని పాటించటం గతంలోజరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం కులాంతర మతాంతర వివాహాలకు ఇచ్చేప్రోత్సాహక మొత్తాన్ని 25000 నుండి 50000 రూపాయలకు పెంచాలని నిర్ణయించినట్లు కేంద్ర సామాజిక న్యాయశాఖా మంత్రి మీరాకుమారి చేప్పారు.డాక్టర్ అంబేద్కర్ లాంటి అభ్యుదయవాదులు, మానవతావాదులు కులనిర్మూలన కోసం పోరాడుతున్నారు కానీ పెద్దగా ప్రయోజనం లేదు.
రిజర్వేషన్ల కోసం కులపోరాటాలు జరుగుతూ కులాల పిచ్చి ఇంకా పెరిగిపోతున్నది. రాజస్తాన్ లో గుజ్జర్లు తమను షెడూల్డ్ ట్రైబుల్లో చేర్చాలని, మన రాష్ట్రంలో కాపులు తమను వెనుకబడిన కులాల్లో చేర్చాలని పోరాడుతున్నారు.గతంలో కారంచేడు ,నీరుకొండ ,చుండూరు ,పదిరికుప్పం ,లాంటి చోట్ల కులహింస జరగ్గా,మళ్ళీ ఇప్పుడు పొట్టిలంక లో కులఘర్షణ జరిగింది.. ఇటువంటి పరిస్తితుల్లో కులనిర్మూలన ఎలా జరుగుతుంది?. హెచ్చుసంఖ్యలో కులాంతర వివాహాలు జరగటం వల్ల కులనిర్మూలన జరుగుతుంది. రిజర్వేషన్లను కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వారికి మాత్రమే పరిమితం చేస్తే అన్ని కులాలు సంకరమై దీర్ఘకాలంలో కులనిర్మూలన జరిగి ఎవరు ఏ కులమో తెలియని భారతజాతి తయారౌతుంది.కుల నిర్మూన గురించి అంబేద్కర్ మాటలు:కులంవల్ల ఆర్దిక శక్తియుక్తులేమీ సమకూడవు.కులంవల్ల జాతికూడా ఏమీ వికసించదు,వికసించలేదు.కానీ కులం ఒకపని చేసింది.అది హిందువులు నీతినికోల్పోయి పూర్తిగా చిన్నాభిన్నామయ్యేలా చేసింది.
కులాలు ఒక కూటమిగాకూడా ఏర్పడలేవు.ఒక కులం ఇంకొక కులానికి అనుబంధం గా కూడా ఉండదు.ప్రతి కులం మిగతా కులాలనుండి తానొక ప్రత్యేక కులంగా గుర్తింపుకోసం పోరాడుతుంది.కులవ్యవస్థ అందరూ కలిసి పాల్గొనే ఉమ్మడి కార్యక్రమాన్ని అడ్డగిస్తుంది.ఇది మన అందరి పని అనే స్పృహ లేకుండా, హిందువులందరూ ఐఖ్యంకాకుండా చేస్తుంది.కులంఉండటం, కులస్పృహ ఉండటం వల్ల పాత వివక్షలన్నీ గుర్తుకొస్తూ సమైఖ్యత ఆగిపోతున్నది.క్లబ్బు సభ్య త్వంలాగా కులం సభ్యత్వం అందరికీ రాదు.కులంలో సభ్యత్వం కావాలంటే ఆకులంలో పుట్టాలి.అది కులధర్మం.కులాలు స్వయంప్రతిపత్తి గలవి. ఎవరైనా కొత్తవ్యక్తి వస్తే ఒక కులంలోకి చేర్చుకొమ్మని చెప్పే అధికారం ఎవరికీ లేదు. హిందూ సంఘం ఒక కులాల కూటమి. ప్రతి కులం మూసుకుపోయి ఉంటుంది కాబట్టి కులం మారే అవకాశం ఎవరికీ ఉండదు. హిందూసమాజం విస్తరించకుండా ఇతర మతస్థులను కలుపుకోకుండా కులమే అడ్డుపడింది. కులాలున్నంతవరకు హిందూ మతం విశ్వజనీన సేవా మతం కాలేదు.శుద్ధి హాస్యాస్పదం,నిష్ఫలకార్యక్రమం.సదాచార సంపన్నుల చేతిలోని కులం సంస్కర్తలనూ,సంస్కరణలనూ నాశనంచేసే ఆయుధం.తన కులంకాని వాడిలో ఉన్న ప్రతిభను ప్రశంసించే శక్తి హిందువులో ఉండదు.మౌర్యుల కాలంలో చతుర్వర్ణ వ్యవస్థను సమూలంగా తుడిచిపెట్టారు.
Monday, June 23, 2008
కుల నిర్మూలన
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment