తమిళులు ఎలా చేస్తే మనమూ అలా చేద్దాం
కోయంబత్తూరులో జరిగిన ప్రపంచ ప్రాచీన తమిళ మహానాడు ఆమోదించిన తీర్మానాలపై ఆ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్ననిర్ణయాలు ఇవి :
*తమిళానికి కేంద్రంలో అధికార భాషా హోదా కల్పించాలి.ఈ అంశంపై పార్లమెంటులో ఓ తీర్మానాన్ని ప్రతిపాదించి దానిపై చర్చించాలి. *మద్రాసు హైకోర్టులో తమిళంలో వాదనలకు అనుమతించాలి.దీనిపై ముఖ్యమంత్రి కరుణానిధి కేంద్ర ప్రభుత్వానికి 2006లోనే లేఖ రాశారు.
*తమిళ భాషాభివృద్ధికి పరిశోధనలకు అవసరమైన రాయితీ నిధులను కేంద్రం ఇవ్వాలి.రాష్ట్రం లో శాసన అధ్యయనా కేంద్రం నెలకొల్పాలి. *తమిళంలో చదువుకున్న అభ్యర్ధులకు ప్రభుత్వ ఉద్యోగావకాశాలు, ప్రాధాన్యత ఇవ్వాలి.
*పాఠశాలలు, కళాశాలల పాఠ్యాంశాల్లో తమిళ ప్రాచీన భాషా శీర్షికను చేర్చాలి.
*తమిళ భాషాభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు ఏర్పరచాలి.
*తమిళంలో ఉత్తమ సాఫ్ట్‌వేర్‌ను ఎంపిక చేసి, దాని రూపకర్తకు కన్యన్‌పూంగుండ్రనాథ్ పేరుతో రూ.1 లక్ష నగదు అవార్డు, ప్రశంసపత్రం ప్రతి సంవత్సరం పంపిణీ చేయాలి.
మన రాష్ట్రం కూడా తెలుగు భాష గురించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాను.
Thursday, December 23, 2010
తమిళులు ఎలా చేస్తే మనమూ అలా చేద్దాం
Labels:
Telugu Special
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment