welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Thursday, December 23, 2010

మత సామరస్యం

 


మత సామరస్యం

మనమంతా మనుషులం.మానవత్వమే మన మతం.ప్రతి మతంలో కొన్ని సుగుణాలుంటాయి.అలాగే కొన్ని నచ్చని అంశాలూ ఉంటాయి.మంచితనం,మానవత్వం అనే సద్గుణాలు లేని మతం యేదైనా సంస్కరించబడాల్సిందే."మంచి చెడ్డలు రెండె మతములు" అనే సూక్తికి తిరుగు లేదు.మంచి యే మతంలో వున్నాస్వీకరించుదాం.చెడు యే మతంలో వున్నా తిరస్కరించుదాం.మతాన్ని మారణకాండకు సాధనంగా మలచుకొంటున్న రాజకీయ నాయకులు మతాధిపతులు
నరకానికేపొతారు.మంచికి వాడని మతం నిరుపయోగం. ఓర్పు,సహనం,శాంతి,క్షమ,దయ,మనలో వుంటే మత కలహాలు జరగవు.స్వర్గం ఇక్కడే వుంటుంది.పరస్పర ప్రేమ కోసం కృషి చేద్దాం.హిందూ ముస్లిం భాయీ భాయీ.సహించడమే గొప్ప స్వర్గ ద్వారం. ఎదుటి వారిని నొప్పించేది నిజం అయినా అది చెప్పకుండా మౌనం వహించటం మంచిది.అప్పుడెప్పుడో ముందు తరాలు వాళ్ళు చేసిందానికి ఇప్పటి వాళ్ళను బాధ్యుల్ని
చేయద్దు.పూర్వం ఎవరో చేసిన పాడుపనులు ఇప్పటికీ గుర్తుచేసేకంటే మనప్రజలు శాంతిసామరస్యాలకోసం ఇప్పుడు ఏం చెయ్యాలో చెబితే బాగుంటుంది.అన్ని మతాలలోనూ వారి వారి మతాల కోసం అకృత్యాలకు పాల్పడ్డవారున్నారు.ఒక మతం కొమ్ముకాసే వారికి సొంతమతం పేరుతో జరిగే అరాచకాలు పుణ్యకార్యాలుగా కనబడతాయి.నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వమే.పుట్టిన బిడ్డలు ఫలానా మతంలో పుట్టాలని
కోరుకుని పుట్టరు.ఒక మతస్తులు గతంలో అకృత్యాలకు పాల్పడ్డారని ఆమత వారసులందరూ నేరస్తులైనట్లు వారు చేయని నేరానికి వారిని అపరాధభావనకు గురిచెయ్యటం అవమానించటం కూడా అకృత్యమే.శాంతియుత జీవనం గడిపే నేటి ప్రజలకు వారి పూర్వీకుల అకృత్యాలను పదేపదే గుర్తుచేసే మతవాద రచయితలు కూడా ఉగ్రవాదులే.శాంతియుత జీవనం గడుపుతున్న భరతమాత ముద్దుబిడ్డలు ఈ దేశంలో కోట్లాదిమంది
ఉన్నారు.అందరికీ సగౌరవంగా బ్రతికే దారికావాలి.కౌరవ సంతతినైనాసరే నిందించి నలిపి చంపటం కంటే మానవత్వంతో కలుపుకు పోవటమే మంచిది.ఎప్పుడో ఎవరో చేసిన అకృత్యాలను మళ్ళీ మళ్ళీ కొన్ని తరాలపాటు గుర్తుచేసి ఆ మతంలో ఉన్నఈనాటి వారసుల్ని నిందలువేసి అవమానించే వారికి మోక్షం సిద్ధించదు.హింసకు జవాబు హింస కాదు.ఈ దేశంలో పుట్టటమే ఏ మతస్థుడికైనా ఎన్నోజన్మల పుణ్యఫలం.జీనా యహా,
మర్నా యహా, ఇస్కేసివా జానా కహా' అంటూ అజాతశత్రువుల్లా బ్రతకాలి. మన మతంతో పాటు ఇతరుల మతాలను కూడా గౌరవించాలి.వ్యక్తులు చేసే పనులకు మతాన్ని నిందించకూడదు.

ఆదర్శనీయులు

* షహనాయి విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్ ,నేపధ్య గాయకుడు మొహమ్మద్ రఫీ ,సంగీత దర్శకుడు నౌషాద్ ఎన్నో హిందూ భక్తి గీతాలతో దేశప్రజలను అలరించారు.

* మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అన్ని మతాల వారి ఆదరణను పొందారు.
* తమిళ నాడులోని శ్రీరంగం దేవాలయం, భద్రాచలం రాముల వారి దేవాలయంలో సన్నాయి వాయించేది తెలుగు ముస్లింలే.షేక్ చినమౌలానా సుబ్రహ్మణ్యస్వామి భక్తుడు.శ్రీరంగం దేవస్థానంలో స్వర్గీయ షేక్ చినమౌలానా నాదస్వర సేవ చేశాడు.ఆయన మనమడు నేటికీ సేవిస్తున్నాడు.
* పలుదేవాలయాల్లో పూలదండలు సరఫరా చేసేది, మంచి గంధం సప్లై చేసేది ముస్లిములే.
* కేరళలోని మాతా అమృతానందమాయి దేశంలో పలుచోట్ల నిర్మించిన ఆలయాల వాస్తుశిల్పి ముస్లిం.
* భద్రాచలంలోని రాములవారి కల్యాణానికి ఆదినుండి ముత్యాలు నిజాం వంశీయుల నుండి వస్తాయి.
* బీబీ నాంచారమ్మ (వేంకటేశ్వరుని రెండవ భార్య)ముస్లిం స్త్రీ.తిరుమలలో ఆమె దేవాలయం ఉంది.
* షిర్డీ శాయిబాబా ముస్లిం.అతని మసీదు పేరు ద్వారకామాయి శ్రీరామనవమి పండుగ జరిపేవాడు.
* అక్బర్ చక్రవర్తి మీరా బాయి భజనలు వినడానికి వెళ్ళేవాడు.
* శబరిమలై అయ్యప్పస్వామి భక్తులు దానికి దగ్గరలోని దర్గాకు కూడా వెళతారు.
* నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌లో అయ్యప్ప, షిరిడీ సాయి ఆలయాలకు స్థానిక ముస్లింలు తరలివస్తారు.భజనలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు.
* జోధా అక్బర్‌ ,మణిరత్నం "బొంబాయి", కృష్ణవంశీ 'ఖడ్గం' చిత్రాలు కూడా హిందూ ముస్లింలు ఐక్యతగా ఉండాలని చాటిచెప్పేవే.
* చార్మినార్‌ లోని దర్గా శుభ్రతలో చేయూత నిస్తుంది హిందువు. హైదరాబాద్‌ నగరంలో పలు చోట్ల హిందువులు తమలపాకులు, పువ్వులు, అరటిపళ్లు ముస్లింల నుండే కొనుగోలు చేస్తారు.చార్మినార్‌ ప్రక్కనే ఆలయం వుంటుంది.
* పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ లో మీరాసాహెబ్ దుర్గా మాతకు గుడి కట్టి నిష్టతో పూజారిగా ఇప్పటికీ పనిచేస్తున్నాడు.
* నిజామాబాద్‌ జిల్లాలోని భైంసాలో మతకల్లోలాలు జరిగినప్పుడు ఓ సాధారణ హిందూ వనిత దాడికిలోనైన కొందరు ముస్లింలకు ఆశ్రయం యిచ్చింది. *సికింద్రాబాద్‌ లోని టకార్‌ బస్తీవాసి షేక్‌ ఇమ్రానుద్దీన్‌,హనుమాన్‌ జయంతిని ఎంతో భక్తితో జరుపు కుంటాడు.
* హైదరాబాద్‌లో బాలాజీ దేవాలయం సమీపంలోనే హనుమంతుని ఆలయం.స్థానికంగా ఓ ముస్లిం మరణిస్తే, గౌరవ సూచకంగా హనుమజ్జయంతిరోజున హనుమంతుని ఆలయాన్ని మూసివేశారు.
* పాతబస్తీలోని గొల్లా ఖిడ్కీ కాలనిలో ఇతేషామ్‌ ఆలీఖాన్‌ స్థానిక ముస్లింలతో, హిందువులపై దాడిని వారించారు. సుబోధ్‌ కుమార్‌, తనహిందూ మిత్రులతో కలిసి హిందూ ఆందోళన కారులనుండి ముస్లిం సోదరులను కాపాడాడు.
‍*గత 25 సంవత్సరాలుగా బేగం బజారులోని మొహ్మద్‌ ఇస్మాయిల్‌ తనదుకాణం 'హషామ్‌ అండ్‌ సన్స్‌' తలుపులపై హిందువుల దేవతాచిత్రాల బొమ్మలకు అగరుబత్తీలు వెలిగిస్తున్నాడు.
* ఒక ముస్లిమ్ మహిళ పెళ్ళి కోసం భాగ్‌పత్ జిల్లాలోని సున్హెరా గ్రామంలోని హిందువులంతా కలిసి చందాలు వసూలు చేశారు.

కావరియా

*" హిందూ, ముస్లింల సోదరభావానికి, ఐకమత్యానికి ఈ యాత్ర ప్రతీక.ఇటువంటి సద్భావన శిబిరాల వల్ల సామాజిక సామరస్యం మరింత పెరుగుతుంది.కావరియాలు తీసుకొని హరిద్వార్‌కు యాత్ర నిర్వహించే భక్తులకు ముస్లిం వర్గాలు స్వాగతం పలికి సత్కరించడం అనేది దేశ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం" .--ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌

No comments: