అగ్ర కుల ముస్లింల రిజర్వేషన్లని వ్యతిరేకించండి
అగ్ర కుల ముస్లింలు కూడా దళితులనీ, బి.సి.లనీ చిన్న చూపు చూస్తున్నారు కదా. మరి అగ్ర కుల ముస్లింలకి కూడా రిజర్వేషన్లు ఇస్తామంటుంటే మీ దూదేకులవాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు? ముస్లింలలో కూడా కులతత్వం ఉందన్న నిజాన్ని ప్రభుత్వం, ఎం.ఐ.ఎం. కావాలని మరచిపోతున్నాయి.
ఈదేశానికి పట్టిన చీడ కులం.మీ దూదేకులవాళ్ళు అనకు.వచ్చేజన్మలో నేను మీకులంలో పుట్టొచ్చు.దౌర్భాగ్యం ఏంటంటే భారతీయుడు ఏ మతంలోకి వెళ్ళినా కులం ఉంటున్నది.భారతీయ క్రైస్తవుల్లో,ముస్లిముల్లో కూడా కులాలున్నాయి.అగ్ర కుల ముస్లింలకి రిజర్వేషన్లు ఇవ్వలేదు.షేక్ ల రూపంలో దొంగదారిన రిజర్వేషన్ పొందుతున్నారు.పేదరికమే ఈ కక్కుర్తికి కారణం.రిజర్వేషన్ ఇచ్చిన 14 కులాలూ
నికృష్టంగానే ఉన్నాయి.
అసలు దూదేకుల వాళ్ళ మాట ఎక్కడ చెలామణి అవుతుంది?ఈరాష్ట్రంలో దూదేకుల వాళ్ళ సంఖ్య చాలా తక్కువ.బి.సి.ఇ గ్రూపులో దూదేకుల కులస్తులను కలపలేదు.వాళ్ళు బి గ్రూపులో ఉన్నారుగా అని వదిలేశారు.అధికారులు కూడా కొన్నిప్రాంతా ల్లో మతం హిందూ అనీ, కులం దూదేకుల అని సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఇస్లాం-దూదేకుల అని సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు. మసీదుకు వెళ్ళము అని అఫిడవిట్ దాఖలు
చెయ్యాలని ఆంక్షలు పెడుతున్నారు. తల్లిదండ్రులు దూదేకుల వృత్తి చేస్తుంటేనే బీసీ సర్టిఫికెట్ ఇస్తామని చెబుతున్నారు.రాష్ట్రంలోని దూదేకుల కులానికి చెందిన ముస్లింలను దళితులుగా చేయాలని మజ్లీస్ పార్టీ విన్నివించింది .అంటే దూదేకుల వారిని ముస్లిములు దళితులుగా భావిస్తున్నట్లేగా?
ఈ 13 ముస్లిం కులాలు రిజర్వేషన్లకు అర్హులుకాదు:1.సయ్యద్, 2.ముషేక్,3. మొఘల్, 4.పఠాన్, 5.ఇరాని,6. ఆరబ్,7. బొహరా, 8.షియా,9. ఇమామి, 10.ఇష్మాయిల్, 11.కుచిమెమన్,12. జమాయత్,13. నవాయత్లు.వీళ్ళే అగ్ర కుల ముస్లింలు.రోళ్లకు కక్కు కొట్టేవారు,పకీరుసాయిబులు,గారడీ సాయిబులు , పాముల వాళ్లు,అచ్చుకట్లవాండ్లు,అత్తరు సాయిబులు లాంటి వాళ్ళకుకూడా రిజర్వేషన్లు ఇవ్వరా?మతమో మశానమో దళితులకంటే హీనంగా ఉన్న ఈ
మన భారతీయ సోదరులకు మానవహక్కులు అందేదెలా?
Sunday, February 21, 2010
ఈదేశానికి పట్టిన చీడ కులం
Labels:
know around you
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
"We all hear so much about the degradation of India. There was a time when I also believed in it. But today standing on the vantage-ground of experience, with eyes cleared of obstructive predispositions and above all, of the highly-coloured pictures of other countries toned down to their proper shade and light by actual contact, I confess in all humility that I was wrong. Thou blessed land of the Aryas, thou wast never degraded. Sceptres have been broken and thrown away, the ball of power has passed from hand to hand, but in India, courts and kings always touched only a few; the vast mass of the people, from the highest to the lowest, has been left to pursue its own inevitable course, the current of national life flowing at times slow and half-conscious, at others, strong and awakened". - Swami Vivekananda
Post a Comment