welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Friday, September 04, 2009

బ్రతుకు పూలబాటకాదు

లేని బాట వెతుకుతున్న పేద వానికి ….
రాని పాట పాడుకున్న పిచ్చివానికి …..
బ్రతుకు పూలబాటకాదు
అది పరవశించి పాడుకునే పాటకాదు
బ్రతుకు పూలబాటకాదు
దోబూచులాడుతుంది విధి మనతో
దొంగాటలాడుతుంది మనసులతో
దోబూచులాడుతుంది విధి మనతో
దొంగాటలాడుతుంది మనసులతో
కనిపించే నవ్వులన్ని నవ్వులు కావు
అవి బ్రతుకు తెరువు కోసం పెదవులాడు కల్లలు
బ్రతుకు పూలబాటకాదు
అది పరవశించి పాడుకునే పాటకాదు
బ్రతుకు పూలబాటకాదు
మాటలతో చిక్కుబడి మనసు నలిగిపోతుంది
మనసులేని మాటలనే మనం నమ్ముతున్నది
పలుకలేని ప్రతి గుండే బాధతో నిండినది
ఒలికే ప్రతి కన్నీటి చుక్క వెచ్చగా ఉంటుంది
బ్రతుకు పూలబాటకాదు
అది పరవశించి పాడుకునే పాటకాదు
బ్రతుకు పూలబాటకాదు
చీకటిలో వెలుగును చూడ నేర్చుకో
చమటలో స్వర్గాన్ని సృష్ఠి చేసుకో
విధి వ్రాసిన వ్రాతలకు విరుగుడొక్కటే
పదిమందితోటి పంచుకునే రోజు వచ్చుటే
ఆ రోజు వచ్చులే …..
బ్రతుకు పూలబాటకాదు
అది పరవశించి పాడుకునే పాటకాదు
బ్రతుకు పూలబాటకాదు

No comments: