welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Thursday, September 24, 2009

మనం ముస్లిములమా?హిందువులమా?

ఇటీవల ఓ జిల్లా కేంద్రంలో నూర్ బాషాలు అంటే దూదేకుల కులస్థుల సమావేశం జరిగింది. హాజరయిన పెద్దలు "మనం ముస్లిములమా?హిందువులమా?" అనే మీమాంసంలో పడి రసవత్తరమయిన చర్చ జరిపారు.


ఉర్దూ భాష నమాజురాకపోవటం వలన ముస్లిములు తమను చిన్నచూపు చూస్తున్నారని, వాళ్ళ పిల్లలకు తమ పిల్లల్నిచ్చి పెళ్ళిళ్ళు చేయటానికి ముందుకు రావడంలేదని కొందరు ముస్లిం దూదేకుల వారు వాపోయారు. మాకు తెలుగు మసీదులు కావాలన్నారు. నిజంగా హిందూ దేవుళ్ళను నమ్ముకొని తిరుపతికి పోయి గుండు చేయించుకొచ్చినా, సాయిబుల పేర్లుండటం వలన హిందువులు కేటాయించి చూస్తున్నారనీ, షేక్ శ్రినివాసరావు, షేక్ పద్మావతులు గూడా హిందువుల ఆదరణకు నోచుకోవటం లేదని, మరికొందరు హిందూ దూదేకులవారు బాధపడ్డారు. మన విలువ పెరగాలంటే దూదేకుల సిద్ధప్పను తలదన్నే తాత్వికులతో పాటు ప్రత్యేక పూజారులు, పురోహితులు కావాలన్నారు. వే

టపాలెం దగ్గర మా మందంతా క్రైస్తవ మతం పుచ్చుకొని హాయిగా ఉన్నాం. చర్చిలో మమ్మల్ని ముందు వరసలో కూర్చోబెట్టి గౌరవిస్తున్నారు మాకు ఉర్దూ బెడదలేదు. కులం గొడవాలేదని షేక్ ఏసుపాదం, షేక్ దానియేలు లాంటి క్రైస్తవ దూదేకుల వాళ్ళు సెలవిచ్చారు. పైగా త్వరలో స్వంత చర్చి కడతారట. నూతిలో పడతావా? పాతర్లో పడతావా? అన్నట్లయింది సమావేశం. ఎవరి మతాన్ని వారు సమర్ధించుకున్నారు. మనమంతా ఒక కుల పోళ్ళం కాబట్టి మనకందరికీ ఒకే మతం ఉండాలని కొందరు పిడివాద దూదేకులు వాదించారు. ఎవరి మతం ఎవరు విదిచిపెడతారు? ఎవరి మతం వారిదేనని కొందరు ఉదారవాద దూదేకులు ఎదురు తిరిగారు. ఆహా! ఏమీ లౌకికవాదం! ఎంతటి అద్భుతమీ భిన్నత్వంలో ఏకత్వం! సకల మతాల సారాలను ఆచారాలను తనలో ఇముడ్చుకొని సర్దుకొని చక్కగా పోతున్న దూదేకుల ఐకృత వర్ధిల్లాలని కొందరు సెక్యులర్ దూదేకుల వారు అరిచారు. అన్ని మతాల వాళ్ళూ మనల్ని కరివేపాకుల్లాగా వాడు కొని అవతల పారేస్తున్నారు. వెనుకపడిన కులాల జనాభాలో 4 శాతం ఉన్నాం.


ఎప్పుడన్నా మనకు ఎమ్మెల్యే పదవిచ్చారా? ఒక్క దూదేకుల వాడైనా ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అయ్యాడా? ఆర్ధికాభివృద్ధి లేకుండా ఈ మతాలెందుకు? అని కొందరు హేతువాద దూదేకులు ఆక్రోశించారు.దూదేకటం అనే వృత్తి పోయింది. ఇప్పుడెవరూ ఆ వృత్తి చేయటం లేదు. ఇక మీదట ఆ వృత్తినే చేసి బ్రతికే అవకాశమూ లేదు. ఇంకా ఆ వృత్తి పేరుతోనే కులం పేరు ఎందుకు? మన కులానికి మరేదయినా మంచి పేరు పెట్టాలని కొందరు సంస్కరణవాదులు మాట్లాడారు. కూటికీ గుడ్డకూ రాని బ్యాండు మేళాలు,సన్నాయి వదిలేసి సాంకేతిక విద్యలు చదవాలనీ, ప్రభుత్వాన్ని భూములడగాలనీ కొందరు కమ్యూనిస్టు దూదేకులవారు డిమాండ్ చేశారు. బంతికే రావద్దంతే విస్తరాకు తెమ్మన్నట్టుంది మీ వ్యవహారం. ఏదో ఒక మత గుంపులో చేరితే తప్ప బెదురు తీరని బడుగు జీవులం మనం. ఏమతంలో చేరితే మన పేదరికం అంతరిస్తుంది? ఏ మతంలో చేరితే మన పిల్లల భ్వష్యత్తుకు భధ్రత కలుగుతుంది?

ఏ మతంలో చేరితే వాళ్ళ పిల్లల్ని మన పిల్లలకిచ్చి పెళ్ళిళ్ళు చేసి మనల్ని హృదయ పూర్వకంగా కలుపుకుంటారు? మనం దాడిచేసేవాళ్ళం కాదు ఎప్పుడూ దాడులకు గురవుతున్న వాళ్ళం. ఇప్పుడు కావలసింది మన ఆత్మల రక్షణ కాదు. మన ప్రాణాలకు భౌతిక రక్షణ, ఆర్ధిక రక్షణ, సాంఘిక రక్షణ, ఏ మతంలో దొరుకుతుంది? కుల విచక్షణ చూపకుండా మానవతాభావంతో కరుణ రసాన్ని కురిపించి మనపట్ల సమ గౌరవం చూపే మతమేది? ఆ మనవతా మత మేది? అంటూ కొందరు సభ లోనే అన్వేషించారు. కానీ ఫలితం కానరాలేదు.రాజ్యాంగం రాసినవాడే కులాంతర, మతంతర వివాహాలకు మాత్రమే రిజర్వేషన్లను పరిమితం చేసినా ఈ 53 ఏళ్ళలో కులమత ప్రసక్తిలేని, ఏ కులమో చెప్పలేని భారత జాతి గణనీయంగా పెరిగి కుల, మత కలహాలను సమసింపజేసి ఉండేది.

Friday, September 04, 2009

సృష్టి చేసినది దేవుడైన మరి నాశము నేల సృజించే

కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని
భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని
మనసున నిండి పలుకగరాని తలపులున్నవి కొన్ని
సృష్టి చేసినది దేవుడైన మరి నాశము నేల సృజించే
పలుకు నొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించే
కనుల నొసగినది దేవుడైన మరి అంధులనేల సృజించే
వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటినేల సృజించే
పెను చీకటినేల సృజించే

వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం
అల్పబుద్దితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం … సలుపకు పరిహాసం
బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం
బదులు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం

కనుల నీరు చిందితే మనసు తేలికౌనులే

ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు
ఊరు విడచి వాడ విడచి ఎంత దూరమేగినా
సొంతవారు ఐనవారు అంతరాన ఉందురోయ్ .. అంతరాన ఉందురోయ్
పెంచుకున్న కొలది పెరుగు తీయని అనుబంధము
గాయపడిన హృదయాలను జ్ఞాపకాలే అతుకునోయ్… జ్ఞాపకాలే అతుకునోయ్
కనుల నీరు చిందితే మనసు తేలికౌనులే
తనకు తనవారికి ఎడబాటే లేదులే .. ఎడబాటే లేదులే
ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు
ఎక్కడికీ పోదు … ఎక్కడికీ పోదు

కరుణలేని ఈజగానా కలతనిదురే మేలురా

నిద్దురపోరా తమ్ముడా నిద్దురపోరా తమ్ముడా
నిదురలోనా గతమునంతా నిముషమైనా మరచిపోరా
కరుణలేని ఈజగానా కలతనిదురే మేలురా నిద్దురపోరా తమ్ముడా
కలలుపండే కాలమంతా కనులముందే కదలిపోయే
లేతమనసుల చిగురుటాశ పూతలోనే రాలిపోయే నిద్దురపోరా తమ్ముడా
జాలితలిచి కన్నీరు తుడిచే దాతలే కనరారే
చితికిపోయిన జీవితమంతా ఇంతలో చితిఆయే
నీడజూపే నెలవుమనకూ నిదురయేరా తమ్ముడా నిద్దురపోరా తమ్ముడా

ఏ కన్నీరైనా వెచ్చగ ఉంటుంది ... అది కలిమిలేములను మరిపిస్తుంది

కలువకు చంద్రుడు ఎంతో దూరం.. కమలానికి సూర్యుడు మరీ దూరం..
దూరమైన కొలదీ పెరుగును అనురాగం
విరహం లోనే ఉన్నది అనుబంధం.(కలువకు)
నవ్వు నవ్వుకు తేడా ఉంటుంది.. నవ్వే అదృష్టం ఎందరికుంటుంది
ఏ కన్నీరైనా వెచ్చగ ఉంటుంది ... అది కలిమిలేములను మరిపిస్తుంది (కలువకు)
వలపు కన్నా తలపే తీయన .. కలయిక కన్నా కలలే తీయన
చూపుల కన్నా ఎదురు చూపులే తీయనా .. నేటి కన్నా రేపే తీయనా (కలువకు)
మనసు మనిషిని మనిషిగ చేస్తుంది .. వలపా మనసుకు అందాన్నిస్తుంది
ఈ రెండూ లేక జీవితమేముంది .. ఆ దేవుడికీ మనిషికీ తేడా ఏముంది ......

ఆశ జారినా వెలుగు తొలగినా ఆగదు జీవిత పోరాటం

గాలి వానలొ వాన నీటిలో పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం..

ఇటు హోరు గాలి అని తెలుసు
అటు వరద పొంగు అని తెలుసు
హోరుగాలిలో వరద పొంగులో
సాగలేనని తెలుసు

అది జోరు వాన అని తెలుసు
ఇది నీటి సుడులని తెలుసు
జోరు వానలో నీటి సుడులలో
మునగ తప్పదని తెలుసు
అయినా పడవ ప్రయాణం.

ఇది ఆశ నిరాశల ఆరాటం
అది చీకటి వెలుగుల చెలగాటం
ఆశ జారినా వెలుగు తొలగినా
ఆగదు జీవిత పోరాటం

ఇది మనిషీ మనసుల పోరాటం
అది ప్రేమా పెళ్ళి చెలగాటం
ప్రేమ శకలమై మనసు వికలమై
బ్రతుకుతున్న దొక శవం
అయినా పడవ ప్రయాణం

ముగిసిన గాధ మొదలిడదు దేవుని దర్శనలతో

తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు
తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు

ముగిసిన గాధ మొదలిడదు దేవుని దర్శనలతో
మొదలిడు గాధ ముగిసేదెపుడో మనుజుల బ్రతుకులలో
తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు
మనసున కెన్నో మార్గాలు కనులకు ఎన్నో స్వప్నాలు
ఎవరొస్తారో ఎవరుంటారో ఏమౌనో మన కలలు

మనసున కెన్నో మార్గాలు కనులకు ఎన్నో స్వప్నాలు
ఎవరొస్తారో ఎవరుంటారో ఏమౌనో మన కలలు
ఎదలో ఒకరే కుదిరిన నాడు మనసే ఒక స్వర్గం
ఒకరుండగ వేరొకరొచ్చారా లోకం ఒక నరకం
తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు

ప్రేమ పవిత్రం పెళ్ళి పవిత్రం ఎది నిజమౌ బంధం
ఎది అనురాగం ఎది ఆనందం బ్రతుకున కేది గమ్యం
మంచి చెడు మారేదే మనదన్నది మాటే ఇదే
ఇది సహజం ఇది సత్యం ఎందులకీ ఖేదం
తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు

అందరు నడిసొచ్చిన తోవ ఒక్కటె

యాతమేసి తోడినా ఏరు ఎండదు

పొగిలి పొగిలి ఎడ్చిన పొంతనిండదు [ యా ]

దేవుడి గుడిలొదైనా పూరిగుడిసెలోదైనా

గాలి ఇసిరి కొడితే......

ఆ దీపముండదు... ఆ దీపముండదు... [ యాతమేసి ]



పలుపు తాడు మెడకేస్తె పాడి ఆవురా...

పసుపు తాడు ముడులెస్తె ఆడదాయెరా...

కుడితి నీళ్ళు పోసినా... అది పాలుకుడుపుతది...

కడుపు కోత కోసినా... అది మనిషికే జన్మ ఇత్తది

బొడ్డు పేగు తెగి పడ్డ రోజు తలచుకొ

గొడ్డు కాదు అడదనే గుణం తెలుసుకొ [ యా ]



అందరు నడిసొచ్చిన తోవ ఒక్కటె

చీము నెత్తురులు పారె తూము ఒక్కటె

మేడ మిద్దెలొ ఉన్నా..... ఛెట్టు నీడ తొంగున్నా....

నిదర ముదుర పడినాక.....

పాడె ఒక్కటె వల్లకాడు ఒక్కటె.....

కూతనేర్చినోళ్ళ కులం కోకిలంటారా

ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటారా [ యా ]

మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు

చదువు రాని వాడవని దిగులు చెందకు
చదువు రాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు
మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో
మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో
జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకు

ఏమి చదివి పక్షులు పైకెగుర గలిగేను
ఎ చదువు వల్ల చేపపిల్ల లీదగలిగెను
ఏమి చదివి పక్షులు పైకెగుర గలిగేను
ఎ చదువు వల్ల చేపపిల్ల లీదగలిగెను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను
కొమ్మ పైని కోయిలమ్మ కెవడు పాట నేర్పేను
తెలివి లేని లేగ దూడ పిలుచుని అంబా అని

ఎమేరుగని చంటి పాప యేడ్చును అమ్మ అని
తెలివి లేని లేగ దూడ పిలుచుని అంబా అని
యేమెరుగని చంటి పాప యేడ్చును అమ్మా అని
చదువులతో పని యేమి హౄదయం ఉన్న చాలు

నన్ను వెలివేయువారికే బలిచేతువా

కన్నయ్యా, నల్లని కన్నయ్యా
నిన్ను కనలేని కనులుండునా
నిన్ను ప్రేమింతురే నిన్ను పూజింతురే
నన్ను గనినంత నిందింతురే
గుణమింత లేనింట పడవైతువా
నన్ను వెలివేయువారికే బలిచేతువా
సిరిజూచుకుని నన్ను మరిచేవయా
మంచిగుడి చూచుకొని నీవు మురిసేవయా
బంగారు మనసునే ఒసగినావు
అందు అందాల గుణముచే పొదిగినావు
మోముపై నలుపునే పులిమినావు
ఇట్లు నన్నేల బ్రతికించదలచినావు

మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు

వేషము మార్చెను...
భాషను మార్చెను...
మోసము నేర్చెను ....
అసలు తానే మారెను...
అయినా మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు!

మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు!
క్రూరమృగమ్ముల కోరలు తీసెను, ఘోరారణ్యములాక్రమించెను
హిమాలయముపై జండా పాతెను, ఆకాశంలో షికారు చేసెను
అయినా మనిషి మారలేదు, ఆతని కాంక్ష తీరలేదు!
పిడికిలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచెను
వేదికలెక్కెను, వాదము చేసెను, త్యాగమె మేలని బోధలు చేసెను
అయినా మనిషి మారలేదు, ఆతని బాధ తీరలేదు!
వేషమూ మార్చెను, భాషనూ మార్చెను,
మోసము నేర్చెను, తలలే మార్చెను...
అయినా మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు!

పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం

తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం
తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం
గగనాల దాక అల సాగకుంటె మేఘాలరాగం ఇల చేరుకోదా
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా

ప్రతి మదిని లేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏవీ సొంతం కోసం కాదను సందేశం
పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం

ఇది తెలియని మనుగడ కధ దిశలెరుగని గమనము కద
బ్రతుకున లేని శృతి కలదా ఎద సడిలోనే లయ లేదా
బ్రతుకున లేని శృతి కలదా ఎద సడిలోనే లయ లేదా
ఏ కళకైనా ఏ కలకైనా జీవితరంగం వేదిక కాదా
ప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం
కూసే కోయిల పోతే కాలం ఆగిందా
మారే ఏరే పారే మరో పదం రాదా
మురళికిగల స్వరమున కళ పెదవిని విడి పలకదుకద

తలపులు ఎన్నెన్నో కొల్లగ కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు

మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కొల్లగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటకరంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
మౌనమే నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా

కోర్కెల సెలనీవు కూరిమి వలనీవు
ఊహల ఉయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కల్లలుగా కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసాఓ మూగ మనసా

చిత్రం : గుప్పెడు మనసు
గాత్రం : మంగళంపల్లి బాలమురళీకృష్ణ

తలచేది జరుగదు - జరిగేది తెలియదు

బ్రతుకంతా బాధగా ...కలలోని గాధగా
కన్నీటి ధారగా.. కరిగిపోయే
తలచేది జరుగదు - జరిగేది తెలియదు

బొమ్మను చేసి ప్రాణము పోసి
ఆడేవు నీకిది వేడుకా

గారడి చేసి గుండెను కోసి
నవ్వేవు ఈ వింత చాలిక.. (బొమ్మను)

అందాలు సృశ్టించినావు
దయతో నీవు
మరలా నీ చేతితో నీవె
తుడిచేవులే
దీపాలు నీవే వెలిగించినావే
గాఢాంధకారాన విడిచేవులే
కొండంత ఆశ అడియాస చేసి
పాతాళలోకాన త్రోసేవులే.. (బొమ్మను)
ఒకనాటి ఉద్యానవనము
నేడు కనము
అదియే మరుభూమిగా
నీవు మార్చేవులే
అనురాగమధువు అందించి నీవు
హాలాహలజ్వాల చేసేవులే
ఆనందనౌక పయనించు వేళ
శోకాలసంద్రాన ముంచేవులే ..(బొమ్మను)

నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడ ఉన్నాయిగా
భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా

బాధవెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగర మధనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటిన వారికి సొంతమౌతుంది
తెలుసుకుంటె సత్యమిది
తలచుకుంటె సాధ్యమిది

చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో
మారిపోని కధలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు
నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి
నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా
నీ అడుగుల్లో గుడికట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి

తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గము

మనసున మనసై బ్రతుకున బ్రతుకై (2)

తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గము
మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గము


ఆశలు తీరని ఆవేశములో
అశయాలలో ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతములో తోడొకరుండిన
అదే భాగ్యమూ, అదే స్వర్గము

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
నీకోసమె కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన
అదే భాగ్యమూ, అదే స్వర్గము

చెలిమియే కరువై వలపే అరుదై
చెదరిన హృదయమే శిలయై పోగా

నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే తోడొకరుండిన
అదే భాగ్యమూ, అదే స్వర్గము

మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గము

బ్రతుకు కన్నీటి ధారలలొనే బలి చేయకు

కల కానిది విలువైనది బ్రతుకు
కన్నీటి ధారలలొనే బలి చేయకు

గాలి వీచి పూవుల తీగ నేల వాలి పోగా
జాలి వీడి అటులె దాని వదలి వైతువా
చేర దీసి నీరు పోసి చిగురించ నీయవా !కల!

అలముకున్న చీకటిలోనే అలమటించనేల
కలతలకె లొంగి పోయి కలవరించనేల
సాహసమను జ్యొతిని చేకొని సాగిపో !కల!

అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే
ఎది తనంత తానై నీ దరికి రాదు
సొధించి సాధించాలి అదియే ధీర గుణం !కల!


మానవ యత్నం మానకుమా

లేదుసుమా లేదుసుమా
అపజయమన్నది లేదుసుమా
లేదుసుమా లేదుసుమా
అపజయమనేది లేదుసుమా
తోడు నీడ లేదని నీవు మానవ యత్నం మానకుమా
అపజయమన్నది లేదుసుమా
లేదుసుమా లేదుసుమా


పాటే ఎక్కువ మానధనులకు (2)
పాటు పడినచో లోటే రాదు (2)
రెక్కలపైనే బ్రతికే వారు
ఎక్కడనున్నా ఒకటె సుమా(2)
అపజయమన్నది లేదుసుమా
లేదుసుమా లేదుసుమా
అపజయమనేది లేదుసుమా
నేడు నాటిన చిన్న మొలకలే
నీడనొసంగును ఒక నాడు
నేడు నాటిన చిన్న మొలకలే
నీడనొసంగును ఒక నాడు

నవ్విన వూర్లే పట్నాలవురా(2)
సస్యే ఫలే అని మరచిపోకురా
సస్యే ఫలే మరచిపోకురా
లేదుసుమా లేదుసుమా
అపజయమన్నది లేదుసుమా
తోడు నీడ లేదని నీవు మానవ యత్నం మానకుమా
అపజయమన్నది లేదుసుమా(2)

బ్రతుకు పూలబాటకాదు

లేని బాట వెతుకుతున్న పేద వానికి ….
రాని పాట పాడుకున్న పిచ్చివానికి …..
బ్రతుకు పూలబాటకాదు
అది పరవశించి పాడుకునే పాటకాదు
బ్రతుకు పూలబాటకాదు
దోబూచులాడుతుంది విధి మనతో
దొంగాటలాడుతుంది మనసులతో
దోబూచులాడుతుంది విధి మనతో
దొంగాటలాడుతుంది మనసులతో
కనిపించే నవ్వులన్ని నవ్వులు కావు
అవి బ్రతుకు తెరువు కోసం పెదవులాడు కల్లలు
బ్రతుకు పూలబాటకాదు
అది పరవశించి పాడుకునే పాటకాదు
బ్రతుకు పూలబాటకాదు
మాటలతో చిక్కుబడి మనసు నలిగిపోతుంది
మనసులేని మాటలనే మనం నమ్ముతున్నది
పలుకలేని ప్రతి గుండే బాధతో నిండినది
ఒలికే ప్రతి కన్నీటి చుక్క వెచ్చగా ఉంటుంది
బ్రతుకు పూలబాటకాదు
అది పరవశించి పాడుకునే పాటకాదు
బ్రతుకు పూలబాటకాదు
చీకటిలో వెలుగును చూడ నేర్చుకో
చమటలో స్వర్గాన్ని సృష్ఠి చేసుకో
విధి వ్రాసిన వ్రాతలకు విరుగుడొక్కటే
పదిమందితోటి పంచుకునే రోజు వచ్చుటే
ఆ రోజు వచ్చులే …..
బ్రతుకు పూలబాటకాదు
అది పరవశించి పాడుకునే పాటకాదు
బ్రతుకు పూలబాటకాదు

ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు

ఎక్కడో దూరాన కూర్చున్నావు … ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు … తమాష చూస్తున్నావు … సామీ …
ఎక్కడో దూరాన కూర్చున్నావు … ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు … తమాష చూస్తున్నావు … సామీ …
ఎక్కడో దూరాన కూర్చున్నావు
లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు ,,, మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు
లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు ,,, మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు
అంతా మా సొంతమని అనిపిస్తావు ..

అంతలోనే మూడునాళ్ళ ముచ్చటగా …..చేసేస్తావు … సామీ …
ఎక్కడో దూరాన కూర్చున్నావు … ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు … తమాష చూస్తున్నావు … సామీ …
ఎక్కడో దూరాన కూర్చున్నావు
పెరుగుతుంది వయసనీ అనుకుంటాము … కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము
పెరుగుతుంది వయసనీ అనుకుంటాము … కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము
కళ్ళు తెరిచి నిజమేదో తెలిసే లోగా
మా కళ్ళముందు మాయతెరలు … కప్పేస్తావు … సామీ
ఎక్కడో దూరాన కూర్చున్నావు … ఎక్కడో దూరాన కూర్చున్నావు …
ఎక్కడో దూరాన కూర్చున్నావు … సామీ …. ఎక్కడో దూరాన కూర్చున్నావు …