వెల్లువెత్తుతున్న విమర్శలు
లండన్: అఫ్గానిస్థాన్‌లో అనాగరిక పాలన యథేచ్ఛగా కొనసాగుతోంది. మహిళలను పురుషుల బానిసలుగా మార్చే మరో కొత్త చట్టానికి ఆ దేశంలో రూపకల్పన జరిగింది. శృంగారానికి నిరాకరించే భార్యకు ఆహారం ఇవ్వకుండా మాడ్చివేసే అధికారాన్ని భర్తకు ఇస్తూ ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించారు. షియా వర్గానికి చెందిన పురుషులకు ఈ కొత్త 'హక్కు'ను కల్పించారని గార్డియన్ పత్రిక వెల్లడించింది. భార్య ఉద్యోగం చేయాలంటే భర్త అనుమతి తప్పనిసరని ఈ చట్టం నిర్దేశిస్తోంది. పిల్లల సంరక్షణ విషయంలో కూడా తల్లిని పక్కనబెట్టి తండ్రికి, తాతకు మాత్రమే పూర్తి హక్కులు ఇచ్చింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చట్టం.. ఓ మహిళపై అత్యాచారం జరిపి కూడా ఎలాంటి శిక్ష పడకుండా తప్పించుకునే వెసులుబాటును కల్పిస్తుందని అమెరికా చారిటీ హ్యూమన్‌రైట్స్ విమర్శించింది. భార్యపై భర్త అత్యాచారం జరిపినప్పటికీ తప్పు లేదంటూ గతంలో అఫ్గానిస్థాన్ ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, బ్రిటన్ ప్రధాని గార్డన్‌బ్రౌన్ సహా పలువురు తీవ్రంగా ఖండించారు. దీంతో కాస్త వెనక్కి తగ్గిన అఫ్గాన్ అధ్యక్షుడు హమీద్ ఖర్జాయ్.. ఎన్నికల నేపథ్యంలో మళ్లీ అదే చట్టాన్ని మరోపేరుతో ముందుకు తెచ్చారు.
Sunday, August 16, 2009
'దానికి' సరేనంటేనే తిండి! అఫ్గానిస్థాన్‌లో మరో అనాగరిక చట్టం
Labels:
know around you
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment