welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Tuesday, July 28, 2009

భారత్‌లో 13 లక్షల సఫాయి కార్మికులు చేతులతోనే మలమూత్రాదుల ఎత్తివేత

నిషేధం మాటున..అమానుష బానిసత్వం!
భారత్‌లో 13 లక్షల సఫాయి కార్మికులు
చేతులతోనే మలమూత్రాదుల ఎత్తివేత
సభ్యసమాజానికే అవమానం
చోద్యం చూస్తున్న ప్రభుత్వాలు


న్యూఢిల్లీ: మూడో తరం ఫోన్‌లు, మునుపెన్నడూ వూహించనంతటి పలుచటి తెర టీవీలు.. ఐమాక్స్, ఐనాక్స్ సాంకేతిక పరిజ్ఞానం సినిమాలు.. ఇలా ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన వస్తువులు, పరిజ్ఞానం గురించి చెప్పుకొంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇంతటి అధునాతన పరిజ్ఞానం మానవ జీవితాల్లో ఉత్కృష్ఠమైన స్థానం సంపాదించుకొన్నా.. నేటికీ భారత సమాజంలో 13 లక్షల మంది సఫాయి కార్మికులు ఉన్నారు. వాస్తవానికి 16 ఏళ్ల కిందటే భారత్‌లో సఫాయి పనిని ప్రభుత్వం నిషేధించింది. అయినా.. వీరు ఇప్పటికీ చేతులను ఉపయోగించే మలమూత్రాదులను తీస్తూ.. పొట్టపోషించుకొనే దుస్థితిలో ఉన్నారు.

దేశంలో చేతులతో సఫాయి పనులు చేయించడాన్ని రెండేళ్ల కిందటే నిర్మూలించాల్సి ఉన్నప్పటికీ సాధ్యపడలేదని.. ప్రస్తుతం మార్చి 2010 కల్లా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి ముకుల్ వాస్నిక్ రాజ్యసభకు తెలిపారు. గతంలో కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 1.15 లక్షల మంది సఫాయి కార్మికులు ఉన్నారు. వీరికోసం కేంద్రం స్వయం ఉపాధి, పునరావాస పథకాన్ని అమలు చేసింది. అయితే ఇదంతా ప్రభుత్వ లెక్కల్లోనే. ఈ విషయమై 'సఫాయి కర్మచారి' ఉపసంఘం కన్వీనర్ బి.విల్సన్ మాట్లాడుతూ.. 'ఈ లెక్కలన్నీ అవాస్తవాలు' అని స్పష్టం చేశారు. దేశంలో ఎంత మంది సఫాయి కార్మికులు ఉన్నారనే విషయమై చాలా కాలంగా జాతీయ స్థాయిలో సరైన సర్వే జరగలేదని తెలిపారు. 'నాలుగేళ్ల కిందట 9 రాష్ట్రాల్లో మేం ఓ సర్వే నిర్వహించాం. దీని ప్రకారం దేశంలో కనీసం 13 లక్షల మంది సఫాయి కార్మికులు ఉన్నట్లు అంచనాకు వచ్చాం' అని వివరించారు. దీనిపై సఫాయి కర్మచారి ఆందోళన్ 2003లో సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఫలితంగా 2007 నుంచి ఈ విషయమై రాష్ట్రాలు కొన్ని చర్యలు చేపడుతున్నాయి. 1993లో కేంద్రం సఫాయి కార్మికులకు ఉపాధి, పాయిఖానా దొడ్ల(డ్రై లెట్రిన్) నిర్మాణ చట్టం రూపొందించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఏడాది జైలు, రూ.2000 జరిమానా లేక రెండూ విధించవచ్చు. దౌర్భాగ్యకరంగా ఇప్పటికీ దేశంలో అనేక మున్సిపాల్టీలు పాయిఖానా దొడ్లను నిర్వహిస్తున్నాయి. ఈ చట్టాన్ని ఉల్లంఘించడంలో భారతీయ రైల్వేలదే ప్రథమ స్థానమని విల్సన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

2007లో కేంద్రం లెక్కల ప్రకారం దేశంలో 3.24 లక్షల సఫాయి కార్మికులు ఉన్నారు. 16,386 మందితో ఒరిస్సా ఈ జాబితాలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. 11 రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రమాణపత్రంలో తమ రాష్ట్రంలో 'సఫాయి కార్మికులు లేరని, ఈ వ్యవస్థను సమూలంగా నిర్మూలించామని' పేర్కొనడం గమనార్హం.

No comments: