welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Monday, November 09, 2009

ఆడ జన్మకు ఎన్ని శోకాలో

ఆడ జన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
సాగనీ నా పాట ఎటు సాగునో నీ పాట
ఇది కాదా దేవుని ఆట
ఆడ జన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని తాపాలో

మాటాడే నీ కన్నులే నాకవి పున్నమి వెన్నెలే
నీ చిరుబోసి నవ్వురా నాకది జాజి పువ్వురా
వీధినే పడి వాడిపోవును
దైవ సన్నిధినే చేరును ఇక ఏమౌనో

ఆడ జన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
సాగనీ నా పాట ఎటు సాగునో నీ పాట
ఇది కాదా దేవుని ఆట
ఆడ జన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని తాపాలో

No comments: