welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Monday, June 23, 2008

కుల నిర్మూలన

కుల నిర్మూలన :"కులం కార్య విభాగమే, కులాలలొ సమత్వమూ, సమాన గౌరవమూ, ఉన్ననాళ్ళూ నిలిచాయి కులాలు. కార్య విభాగంలొ బేధంగాని, గౌరవంలొ బేధంగాని రాగానే వేరుపురుగు పుట్టిందన్నమాటే. మూఢత్వమూ, అజ్ఞానమూ తగ్గగానే తక్కువజాతి వాళ్ళనే వాళ్ళు మోసం తెలుసుకుని తిరగబడుతున్నారు. స్త్రీ కూడా అంతే. -చలం


భారతీయ సమాజంలో ఒక కులం లేదా మతం మనుషులు మరొక కులం వారి కంటె ఎక్కువ తక్కువని అనుకోవటం వల్ల, మనుషులందరు సమానులు కాదనుకోవటం వల్ల, అంటరానితనాన్ని పాటించటం గతంలోజరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం కులాంతర మతాంతర వివాహాలకు ఇచ్చేప్రోత్సాహక మొత్తాన్ని 25000 నుండి 50000 రూపాయలకు పెంచాలని నిర్ణయించినట్లు కేంద్ర సామాజిక న్యాయశాఖా మంత్రి మీరాకుమారి చేప్పారు.డాక్టర్ అంబేద్కర్ లాంటి అభ్యుదయవాదులు, మానవతావాదులు కులనిర్మూలన కోసం పోరాడుతున్నారు కానీ పెద్దగా ప్రయోజనం లేదు.

రిజర్వేషన్ల కోసం కులపోరాటాలు జరుగుతూ కులాల పిచ్చి ఇంకా పెరిగిపోతున్నది. రాజస్తాన్ లో గుజ్జర్లు తమను షెడూల్డ్ ట్రైబుల్లో చేర్చాలని, మన రాష్ట్రంలో కాపులు తమను వెనుకబడిన కులాల్లో చేర్చాలని పోరాడుతున్నారు.గతంలో కారంచేడు ,నీరుకొండ ,చుండూరు ,పదిరికుప్పం ,లాంటి చోట్ల కులహింస జరగ్గా,మళ్ళీ ఇప్పుడు పొట్టిలంక లో కులఘర్షణ జరిగింది.. ఇటువంటి పరిస్తితుల్లో కులనిర్మూలన ఎలా జరుగుతుంది?. హెచ్చుసంఖ్యలో కులాంతర వివాహాలు జరగటం వల్ల కులనిర్మూలన జరుగుతుంది. రిజర్వేషన్లను కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వారికి మాత్రమే పరిమితం చేస్తే అన్ని కులాలు సంకరమై దీర్ఘకాలంలో కులనిర్మూలన జరిగి ఎవరు ఏ కులమో తెలియని భారతజాతి తయారౌతుంది.కుల నిర్మూన గురించి అంబేద్కర్ మాటలు:కులంవల్ల ఆర్దిక శక్తియుక్తులేమీ సమకూడవు.కులంవల్ల జాతికూడా ఏమీ వికసించదు,వికసించలేదు.కానీ కులం ఒకపని చేసింది.అది హిందువులు నీతినికోల్పోయి పూర్తిగా చిన్నాభిన్నామయ్యేలా చేసింది.

కులాలు ఒక కూటమిగాకూడా ఏర్పడలేవు.ఒక కులం ఇంకొక కులానికి అనుబంధం గా కూడా ఉండదు.ప్రతి కులం మిగతా కులాలనుండి తానొక ప్రత్యేక కులంగా గుర్తింపుకోసం పోరాడుతుంది.కులవ్యవస్థ అందరూ కలిసి పాల్గొనే ఉమ్మడి కార్యక్రమాన్ని అడ్డగిస్తుంది.ఇది మన అందరి పని అనే స్పృహ లేకుండా, హిందువులందరూ ఐఖ్యంకాకుండా చేస్తుంది.కులంఉండటం, కులస్పృహ ఉండటం వల్ల పాత వివక్షలన్నీ గుర్తుకొస్తూ సమైఖ్యత ఆగిపోతున్నది.క్లబ్బు సభ్య త్వంలాగా కులం సభ్యత్వం అందరికీ రాదు.కులంలో సభ్యత్వం కావాలంటే ఆకులంలో పుట్టాలి.అది కులధర్మం.కులాలు స్వయంప్రతిపత్తి గలవి. ఎవరైనా కొత్తవ్యక్తి వస్తే ఒక కులంలోకి చేర్చుకొమ్మని చెప్పే అధికారం ఎవరికీ లేదు. హిందూ సంఘం ఒక కులాల కూటమి. ప్రతి కులం మూసుకుపోయి ఉంటుంది కాబట్టి కులం మారే అవకాశం ఎవరికీ ఉండదు. హిందూసమాజం విస్తరించకుండా ఇతర మతస్థులను కలుపుకోకుండా కులమే అడ్డుపడింది. కులాలున్నంతవరకు హిందూ మతం విశ్వజనీన సేవా మతం కాలేదు.శుద్ధి హాస్యాస్పదం,నిష్ఫలకార్యక్రమం.సదాచార సంపన్నుల చేతిలోని కులం సంస్కర్తలనూ,సంస్కరణలనూ నాశనంచేసే ఆయుధం.తన కులంకాని వాడిలో ఉన్న ప్రతిభను ప్రశంసించే శక్తి హిందువులో ఉండదు.మౌర్యుల కాలంలో చతుర్వర్ణ వ్యవస్థను సమూలంగా తుడిచిపెట్టారు.

Tuesday, June 10, 2008

తెలుగు వెలుగులెప్పుడు!

తెలుగు వెలుగులెప్పుడు!

'తెలుగుకు ప్రాచీనహోదా కావాలని రాష్ట్రప్రజలంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు... కేంద్రప్రభుత్వమూ ఇందుకు సుముఖంగా ఉంది...'- పదకొండు నెలలక్రితం 'తానా' మహాసభలో కేంద్రమంత్రి పురందరేశ్వరి ప్రకటన పాఠమది.

ఇప్పటికీ ఒనగూడని ప్రాచీనహోదా ప్రతిపాదనపైనే దేశరాజధానిలో నేడు కీలకసమావేశం జరగబోతోంది. సాహిత్య అకాడమీ సారథ్యంలో కొలువుతీరనున్న సదస్సు- తెలుగు, కన్నడ భాషల పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించిన చారిత్రక ఆధారాలు నిగ్గుతేల్చి హోంమంత్రిత్వశాఖకు సిఫార్సు చేయాల్సి ఉంది! తమిళానికి ప్రాచీనముద్ర వేయించుకోగలిగిన గౌరవ ప్రజాప్రతినిధులు మరేభాషకూ ఆ హోదా దక్కకుండా అడ్డుపడుతున్నారని కొన్నాళ్లుగా గగ్గోలుపుడుతోంది. తమిళ రాజకీయాన్ని అధిగమించి తెలుగు, కన్నడ భాషలు ప్రాచీనహోదాకు నోచుకుంటాయా లేదా అన్నదే ఇప్పుడు సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ. తెలుగుభాషకు ప్రాచీనహోదా సాధించి తీరతామని గడచిన ఆగస్టులో ముఖ్యమంత్రి వై.ఎస్. గంభీరంగా ఉద్ఘోషించారు. అందుకు గడువేమీ లేనేలేదని కేంద్రసర్కారు మూడు నెలలక్రితం తాపీగా సెలవిచ్చింది. ఆ తరవాతనైనా రాష్ట్రం తరఫున ప్రయత్నాలు ముమ్మరమయ్యాయా? లేదు! సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా కేంద్రమంత్రిని వై.ఎస్. ఫోన్లో అభ్యర్థించినట్లు గుప్పుమంది. తమచేతుల్లో ఏమీ లేదన్నదే ఆయనకు లభించిన సమాధానం! అభ్యర్థనలతోనే సరిపుచ్చే రాష్ట్ర నాయకత్వమంటే, కేంద్రంలోని సొంతపార్టీ నేతలకు సైతం ఎంత లోకువో వేరే ఉదాహరణలెందుకు? 'మాతృభాషా తృణీకారం మాతృదేవీ తిరస్కార'మని ఒకప్పుడు గాంధీజీ చెప్పింది అక్షరసత్యం. తెలుగుకు ప్రాచీనహోదాకోసం అరకొర చర్యలు, ఏలికల నిబద్ధతారాహిత్యానికి ప్రబలదృష్టాంతం. జాతీయభాష కాగల హక్కు ఒక్క తెలుగుకే ఉందన్నది మహాకవి వాక్కు. ఇటీవల కేంద్రం వెలువరించిన నిర్ణయం దాన్ని వెక్కిరించింది. సంస్కృతం, తమిళాల్ని మాత్రమే ప్రాచీనభాషలుగా పరిగణించిన కేంద్రం, వాటి అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరుచేసి- తెలుగుపై హేతుబద్ధ విజ్ఞాపనల్ని పెడచెవిన పెట్టింది. ఈ సవతితల్లి ధోరణిని నిరసిస్తూ వచ్చే సంక్రాంతిలోగా తెలుగుకు ప్రాచీనహోదా ఇవ్వకపోతే సామూహిక నిరశన అనివార్యమని తిరుపతి భాషా బ్రహ్మోత్సవాలు గళమెత్తడం తెలిసిందే.

తెలుగు, తమిళ, కన్నడ భాషలు మూడింటా శతాబ్ది అటూ ఇటూగా సాహిత్యం ఆవిర్భవించిందని చారిత్రకాధారాలు తెలియజెబుతున్నాయి. హరప్పా నాగరికతలో తెలుగువారి ఉనికిని వివిధ పరిశోధనలు చాటుతున్నాయి. తెలుగుకు మూలాధారమంటున్న మధ్య ద్రవిడ భాషాపదాలు ఆఫ్రో ఆసియాటిక్ భాషల్లోను, బౌద్ధకాలంలోను దర్శనమిచ్చిన ఆధారాలున్నాయి. ప్రాచీనతలో తమిళానికి తెలుగు ఏ రకంగానూ తీసిపోదని కాళీపాండ్యన్ లాంటి పరిశోధకులు ఎన్నాళ్లుగానో మొత్తుకుంటున్నారు. తుంగభద్ర లోయలో దొరికిన కొన్ని శాసనాల్లోని భాష ఇప్పటి తెలుగుకు మూలమన్నది వారి వాదన. క్రీస్తుపూర్వం 500 సంవత్సరానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రసక్తి ఉందన్నా- ఆధారాల సేకరణలో మూడడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కి! భాషాభిమానానికి మారుపేరైన తమిళనాయకులు పట్టుపట్టి ప్రాచీనహోదా సంపాదించుకున్నారు. దేశంలోనే మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నేతల్లో ఎక్కడా అలాంటి పట్టుదలే లేదు. తెలుగు విషయంలో రాష్ట్రమంత్రులతోపాటు తక్కిన అమాత్యులు మౌనప్రేక్షకపాత్ర పోషిస్తున్నారన్న యథార్థాన్ని రెండేళ్లక్రితమే కేంద్రమంత్రి ఒకరు కక్కేశారు. అగణిత సంస్కృతి, అపార వైభవం కలిగిన మన తెలుగుభాషకు సముచిత గౌరవం సముపార్జించే చిత్తశుద్ధి, నిబద్ధత కలిగిన నాయకులు అసలు ఎందరున్నారు మనకు?

అయిదు దశాబ్దాలక్రితం రాష్ట్ర శాసనసభాపతిగా అయ్యదేవర కాళేశ్వరరావు పాలన శాసననిర్మాణ విభాగాల్లో తెలుగు వాడకాన్ని పెంపొందించాలని ఎంతగానో తాపత్రయపడ్డారు. తక్కిన నాయకగణం కూడిరాని పర్యవసానంగా ఆయన కృషి ఎలా నీరుకారిపోయిందో రాష్ట్ర పౌరులు నిర్వేదంతో పరికించారు. ఆపై, నానాటికి తీసికట్టు నాగంభట్టు తంతు! తెలుగును అధికారభాషగా అమలుపరచాలన్నది 1966నాటి ఘనతర తీర్మానం. సర్కారీ వ్యవహారాలన్నీ తెలుగులోనే నిర్వహించాలన్నది 1971నాటి మహానిర్దేశం.

అవి కాగితాలకే పరిమితమై తెలుగునాట తెలుగుమాటే అపురూపమయ్యే దుర్భర దురవస్థ దాపురించడానికి ఇన్నేళ్ల నాయకుల నిర్లక్ష్యం, అసమర్థతలే ప్రధాన హేతువులు. 'మన జీతభత్యాలను ప్రజల డబ్బుతో పొందుతున్నందున, ప్రజల తెలుగుభాషనందు కార్యవ్యవహారాలు నిర్వహించడం మన ఉద్యోగధర్మం' తరహా అధికారిక సంకల్పాలెన్నో ఏట్లో కొట్టుకుపోయాయి. తెలుగు వికాసానికి, ప్రాచీనహోదా సాధనకు కంకణం కట్టుకున్నామన్న నేతల ఇబ్బడిముబ్బడి నాటకీయ ప్రకటనలు నీరుకారిపోతున్నాయి. తమిళ, కన్నడ, ఒరియా, మరాఠీ సోదరులు మాతృభాషా పరిరక్షణను మహోద్యమంగా మలచి వ్యూహాత్మకంగా ముందడుగేస్తున్నారు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మాతృభాషను పరిపుష్టీకరించుకుంటేనే వ్యక్తి బహుముఖ వికాసం సుసాధ్యమని ఆకళించుకున్న దేశాలెన్నో సొంత మాధ్యమంలోనే భావితరాలకు చదువుసంధ్యలు నేర్పుతున్నాయి. ఇక్కడేమో ప్రాథమిక దశలోనే ఆంగ్లమాధ్యమాన్ని రుద్దేందుకు సర్కారు ఉరకలెత్తుతోంది. తెలుగునేలపై అత్యధిక విద్యార్థులకిప్పుడు మాధ్యమం ఆంగ్లం, ప్రథమభాష హిందీ, ద్వితీయభాష స్పెషల్ ఇంగ్లిష్! అవసరానుగుణంగా ఆంగ్ల వినియోగాన్ని ఆమోదిస్తూనే, పెచ్చరిల్లుతున్న అన్యభాషా పైత్యాన్ని పరిహరించాల్సిన సర్కారు- చెప్పిందొకటి, చేస్తున్నదొకటి. ప్రజల అర్థవంతమైన తోడ్పాటును కూడగట్టి రాష్ట్రభాషను సుసంపన్నం చేయడంలో, సముచిత గౌరవం సంపాదించిపెట్టడంలో ప్రభుత్వం పురోగమించినప్పుడే- మన తెలుగు మళ్లీ వెలుగులీనేది!

Who is God?

ఆస్ట్రలాయిడ్లు అనే ఆదిమ తెగ వాళ్ళు దేవుడిని "అట్నటు" అంటారు.అంటే "ముడ్డిలేనివాడు","ఎటువంటి అశుద్దాన్నీ విసర్జించని వాడు" అని అర్ధం.

దేవుడంటే ఎవరు? అనే ప్రశ్నకు బమ్మెర పోతన రాసిన ఈ పద్యం చక్కని సమాధానం.అన్ని మతాలవారికీ సరిపోగలదు.

"ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందు;పరమేశ్వరు డెవ్వడు;
మూల కారణం బెవ్వడనాదిమధ్యలయుడెవ్వడు;
సర్వము దానయైన వా డెవ్వడువాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్".

ఈ ఈశ్వరుడినే అరబ్బీ భాషలో అల్లాహ్ అంటారు.ఈశ్వరుడూ అల్లాహ్ ఇద్దరు కాదు ఒక్కడే అనుకుంటే ఏ సమశ్యా లేదు.మనమంతా అల్లా పుట్టించిన పిల్లలం.మనమంతా సమానులమే.

కులాలు మతాలు విగ్రహాలు మనం పుట్టించుకున్నవే.

"చిల్లర రాళ్ళకు మొక్కుతు ఉంటే చిత్తము చెడునుర ఒరే ఒరే
ఒక్కడైన ఆ పరమేశ్వరున కు మొక్కి చూడరా హరే హరే " అనే పాట మన పల్లెటూళ్ళ లో ప్రజలు ఎప్పుడో పాడారు.

ఒక్క డైన ఆ పరమేశ్వరుడంటే ఎవరు?"ఒక్కడైన ఆ పరమేశ్వరుడు"అంటే దేవుడు ఒక్కడే అని ,హరుడు అంటే నాశనం కానివాడు అని అర్థం.

Friday, June 06, 2008

విధురుడి కట్నం --విధవాకట్నం

1.వరకట్నం
వరకట్నం అంటే వధువు తల్లిదండ్రులు వరునికి పెళ్ళి సమయంలో ఇచ్చేరొక్కంగానీ ఆస్తి గానీ .వధుకట్నం అంటేపెళ్ళి చేసుకున్నందుకు వరుడే వధువుకు ఇచ్చేకట్నం .హిందువులు దీనిని కన్యాశుల్కం అంటే ముస్లిములు మహర్ అంటారు ముస్లిముల్లోవరుడు వధువుకే ఈశుల్కం మహర్ చెల్లించాలి.కాబట్టి ఈ వధుకట్నాన్ని వధు శుల్కం అనికూడా అనవచ్చు.వధువుకు కట్నం ధారాళంగా ఇవ్వాలి, ఇచ్చితీరాలి (కురాన్ 2;136,4:19,24)వధువుకు కట్నం ఇవ్వకుండా పెళ్ళి చేయటానికి ఇస్లామ్ లో అనుమతే లేదు(తిర్మిజి :881).వధువుకు ఇచ్చిన కట్నాన్ని ఎట్టి పరిస్తితుల్లో తిరిగి తీసుకోకూడదు..పెళ్ళికూతురు, కన్య అయినా విధవరాలు, వితంతువు అయినా వధువు గానే లెక్కించాలి.అలాగే భార్య చనిపోయిన వ్యక్తి (వెధవ,విధురుడు) మళ్ళీ పెళ్ళి చేసుకున్నప్పుడు ఆవెధవావరుడు విధురుడు కి వధువు ఇచ్చే కట్నాన్ని వెధవాకట్నం విధురుడి కట్నం అనీ,వరుడు విధవా వధువు కు ఇచ్చే కట్నాన్ని విధవాకట్నం అనీ అనొచ్చు.