welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Monday, August 09, 2010

అందరికీ ఒక్కడే దేవుడు

అందరికీ ఒక్కడే దేవుడు
కొందరికి రహీము కొందరికి రాముడు
ఏ పేరున పిలిచినా దేవుడు ఒక్కడే దేవుడొక్కడే [[అందరికీ]]
పూలలో ఉన్నాయి వేలరకాలు
పక్షులలో ఉన్నాయి లక్షవిధాలు
రేకులు ఉంటేనే పువ్వంటాము
రెక్కలు ఉంటేనే పక్షంటాము
మతాలు ఏవైనా కులాలు వేరైనా
మంచిమనసు ఉంటేనే మనిషంటాము
మనుషులమై మనమంతా కలిసుంటాము [[అందరికీ]]
పై వేషం చూసి నీవు భ్రమపడరాదు
మేడిపండు మెరుగంతా మేలిమికాదు
ఎక్కడో దేవునికై ఎందుకు వెదికేవు?
పక్కనున్న మానవుని ఎందుకు మరిచేవు?
మానవసేవే మాధవ సేవ
బాధపడే సోదరులను ఆదుకునేను
మనుషులమై మనమంతా కలిసుంటాము [[అందరికీ]]

కష్టపడే నీతిపరుని కడుపు నిండదు
దోచుకునే దొరగారికి తృప్తి ఉండదు
స్వార్ధపరుల ఆట మనం కట్టిస్తాము
శ్రమజీవుల కష్తఫలం ఇప్పిస్తాము
అహింస బోధిస్తాం ప్రశాంతి సాధిస్తాం
లోకంలో ఆకలే లేకుండా చేస్తాము
మనుషులమై మనమంతా కలిసుంటాము [[అందరికీ]]
--- ఒకటే కుటుంబం

Tuesday, August 03, 2010

విశాల విశ్వంలో నా భారతదేశం ఉన్నతం

శిరా రావు గారికి ధన్యవాదాలతో.ఇక్బాల్ గారి "సారే జహాసే అచ్చా" కి తెలుగు అనువాదగీతం.

విశాల విశ్వంలో నా భారతదేశం ఉన్నతం
సుస్వరాలమూ మేమూ మధుర వీణ నాదేశం దేశం [[విశాల]]

ధృఢమైన పర్వతములతో ఆకాశాన్నందే నగం
ఆ నగం మాదే ఆ హిమనగం మాదే మాదే [[విశాల]]

ఈదేశ మాత ఒడిలో పారులేవేళ నదులూ
ఈ సుందరనందన వనమే
స్వర్గానికన్న మిన్న మిన్నా [[విశాల]]

ఏమతమైనా కానీ కలహించడమూ నేర్పదూ
భారతీయులం మనమూ భారతదేశం మనదీ అనాదీ[[విశాల]]