welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Thursday, May 29, 2008

విగ్రహం... ఆగ్రహం

వెల్లువెత్తుతున్న'నిలువెత్తు' అభిమానం

* ఒత్తిళ్లకు తలొగ్గుతున్నజీవీఎంసీ విశాఖ నగరంలో ఇక అడుగడుగునా విగ్రహాలేదర్శనమివ్వబోతున్నాయి. ఏ కాస్త కూడలి కనిపించినా అక్కడ తమ అభిమానాన్నిచాటుకునేలా నిలువెత్తు విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు వ్యక్తులు, సంస్థల నుంచి వస్తున్నఒత్తిడికి మహా విశాఖనగరపాలక సంస్థ(జీవీఎంసీ) తలొగ్గుతోంది.ఎడాపెడా విగ్రహాలను ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో ట్రాఫిక్కు పరంగానేకాకుండా ఇతరత్రా ఇబ్బందులూ తలెత్తుతాయని తెలిసినా డజన్లకొద్దీ విగ్రహాలకు జీవీఎంసీ పాలకమండలి అనుమతులిస్తోంది.ఇప్పటికే పెద్దసంఖ్యలో ఉన్న విగ్రహాలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.కనీసం వాటిని ఆరునెలల కోసారైనాశుభ్రం చేసి, అవసరమైన చిన్నచిన్నమరమ్మతులు చేయలేని స్థితిలో జీవీఎంసీ ఉంది. అదిచాలదన్నట్లు కొత్తగా అన్నికూడళ్లలో భారీగా విగ్రహాలను ఏర్పాటు చేయబోతోంది.

ఇప్పటికే వేరే చోట విగ్రహాలున్నవ్యక్తులవీ మళ్లీ మళ్లీ నెలకొల్పబోవడం విమర్శలకుతావిస్తోంది. మహనీయులకు సముచితస్థానం కల్పిస్తూవారి గురించి భవిష్యతరాలకు తెలియజేసేందుకు విగ్రహాలను ఏర్పాటు చేయడం ఎప్పటి నుంచో సంప్రదాయంగా వస్తోంది.కార్పొరేషన్ప్రత్యేక శ్రద్ధతీసుకుని సాగరతీరంవెంబడి 24 మంది మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసింది. పుస్తకాల్లో చూసే మహానుభావుల విగ్రహాలను పిల్లలకు చూపిస్తేవారిలో మన దేశసంస్కృతి, వారిత్యాగనిరతిపై మరింత ఆసక్తి పెరుగుతుందనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటుచేశారు. సుమారు రూ.2 కోట్లుఖర్చు చేసి పెట్టిన విగ్రహాల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. మహనీయుల జయంతిరోజునో, వర్థంతిరోజునో విగ్రహాన్నిశుభ్రం చేసి రాజకీయపార్టీలు, సాహితీసంస్థలు వారికి ఒక పూలమాల వేసినివాళులర్పిస్తుంటాయి.మిగిలిన విగ్రహాలను సంవత్సరాల తరబడి పట్టించుకోవటంలేదు. దీంతో సందర్శకులు సాగరతీరాన సరదాగాగడుపుతున్నారేకానీ ... పక్కనే ఉన్నమహానుభావుల విగ్రహాల వైపుకన్నెత్తిచూడడానికి కూడా ఆసక్తి కనబర్చడంలేదు. మరో 17 విగ్రహాలు ఏర్పాటు... కొత్తగా దివంగత నేతల విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు జీవీఎంసీ ప్రత్యేక కమిటీని నియమించింది. నగరంలోమరో 17 విగ్రహాలకు ఏర్పాటుకు స్థలాలఎంపిక కూడా చేశారు. ఈనిర్ణయాలపై పలుసంఘాలు విమర్శలుచేశాయి.

కొంత మందికి సముచితస్ధానంకల్పించి, కొందరిని విస్మరించారంటూ విమర్శలు వచ్చాయి.ఆయా నాయకులపై నిజమైన ప్రేమాభిమానాలతో కాకుండా ఫలానా వారు ఒక విగ్రహంప్రతిపాదిస్తే తామురెండు అడగాలన్నపట్టుదలతో సంఖ్యనుపెంచుకుంటూ రావడంవిమర్శలకుతావిస్తోంది. పాతవిగ్రహాల మాదిరిగా ఆలనాపాలనా లేకుండా వదిలేయకుండా కొత్తవిగ్రహాల సంరక్షణకుచర్యలు చేపట్టాలనిఈసారి ఏకంగా రూ.2లక్షల ధరావతును చెల్లించాలని జీవీఎంసీ నిబంధనవిధించింది. ఇలావచ్చే ఆదాయంతో ఏటానిర్వహణ పనుల్నిచూస్తామని అధికారులుచెబుతున్నారు. ఇలా చేస్తే మేలు...

* సిరిపురం కూడలిలోఉన్న ద్రోణంరాజుసత్యనారాయణవిగ్రహానికి తప్పమిగిలిన వాటినినిరంతర పర్యవేక్షణలోపిస్తోంది.
* ప్రతీ మూడు నెలలకుఒకసారైనావిగ్రహాలను నీటితోశుభ్రం చేయాలి.
* విగ్రహానికి నీడకల్పించేందుకుపైకప్పునునిర్మించాలి.
* మహనీయుల జయంతి, వర్థంతి రోజుల్లోవారి ప్రత్యేకతనుచాటిచెప్పేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.
* విగ్రహాల నిర్వహణనిమిత్తం కొంతసొమ్ము ప్రత్యేకంగా కేటాయించాలి.
* విగ్రహాన్నిఏర్పాటుచేయించిన వారితోనైనాప్రత్యేక కమిటీఏర్పాటు చేయించి, దాని సాయాన్నితీసుకోవాలి

No comments: