welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Sunday, February 06, 2011

మంచిమనసుతో జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకూ?

 
చదువురానివాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు?
మంచువంటి మల్లెవంటి మంచిమనసుతో
జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకూ [[చదువు]]

ఏమిచదివి పక్షులు పైగెగురగలిగెను?
ఏ చదువువల్ల చేపపిల్లలీదగలిగెను?
అడవిలోని నెమలికెవడు ఆటనేర్పెను?
కొమ్మపైనికోకిలమ్మకెవడు పాటనేర్పెను? [[చదువు]]

తెలివిలేని లేగదూడ పిలుచును అంబాయని
ఏమెరుగని చంటిపాపఏడ్చును అమ్మా అని
చదువులతో పనియేమి హృదయమున్నచాలు
కాగితంపు పూలకన్న గరికపువ్వు మేలు [[చదువు]]

సి.నారాయణరెడ్డి ఆత్మబంధువు కె.వి.మహదేవన్ 1962

ఎందుకు వల చేవో ఎందుకు వగచేవో

 
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యెన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా

చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో [[మౌనమే]]

కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు [[మౌనమే]]

చిత్రం : గుప్పెడు మనసు
గానం :బాలమురళి కృష్ణ
రచన : ఆత్రేయ
సంగీతం :ఎం.ఎస్.విశ్వనాథన్

నిన్ను ప్రేమింతురే నిన్ను పూజింతురే నన్ను గనినంత నిందింతురే

 
కన్నయ్యా, నల్లని కన్నయ్యా
నిన్ను కనలేని కనులుండునా
నిన్ను ప్రేమింతురే నిన్ను పూజింతురే
నన్ను గనినంత నిందింతురే

గుణమింత లేనింట పడవైతువా
నన్ను వెలివేయువారికే బలిచేతువా
సిరిజూచుకుని నన్ను మరిచేవయా
మంచిగుడి చూచుకొని నీవు మురిసేవయా
బంగారు మనసునే ఒసగినావు
అందు అందాల గుణమునే పొదిగినావు
మోముపై నలుపునే పులిమినావు
ఇట్లు నన్నేల బ్రతికించదలచినావు

చిత్రం : నాదీ ఆడజన్మే
గానం : పి.సుశీల
రచన : శ్రీశ్రీ
సంగీతం: ఘంటసాల




సారే జహాసె అచ్చా - హిందుస్తా హమారా

 
సారే జహాసె అచ్చా - హిందుస్తా హమారా,
హం బుల్ బులే హై ఇస్‌కీ
యే గుల్ సితా హమారా,హమారా.

పర్ బత్ వో సబ్‌సే ఊంచా
హంసాయ ఆస్‌మాకా
వోసంతరీ హమారా - వో పాస్ వా
హమారా,హమారా.

గోదీమె ఖేల్ తీ హై
ఇస్‌కీ హజారో నదియా
గుల్షన్ హై జిన్ కీ దమ్ సే
రష్‌కే జనా హమారా, హమారా.

ఆయె అబ్ రౌద్ గంగా ఓ దిన్ హె యాద్ తుజ్ కో
ఉతారా తేరె కినారే జబ్ కారవా హమారా
మజ్ హబ్ నహీ సిఖాతా
ఆపస్‌మే బైర్ రఖనా
హింధీ హై హం(3) వతన్ హై
హిందూ సితా హమారా,హమారా.

యూనాన్ ఓ మిస్ర్ ఓ రోమా సబ్ మిత్ గయే జహా సే
అబ్ తక్ మగర్ హై బాకీ నామ్ ఓ నిషాన్ హమారా

కుచ్ బాత్ హై కె హస్తి మిఠాతీ నహీ హమారా
సదియో రహా హై దుష్మన్ దౌర్ ఏ జమాన్ హమారా

ఇక్బాల్ కో ఐ మెహ్రామ్ అప్నా నహీ జహా మే
మాలూమ్ క్యా కిసీ కో దర్ద్ ఏ నిహా హమారా

సారే జహాసె అచ్చా...