కళ్ళు తెరువరా నరుడా
నీ ఖర్మ తెలియరా [[కళ్ళు]]
కలిమిలేములకు కష్టసుఖాలకు
కారణమొకటేరా నీ ఖర్మే మూలమురా[[కళ్ళు]]
వేపనువిత్తి ద్రాక్షకోసమై
వేడుక పడుట వెర్రికదా
కాలికి రాయి తగులుటకన్న
రాయికి కాలే తగులునురా [[కళ్ళు]]
కమలనాభుని పదకమలములే
కలుష జలధికీ సేతువురా
కలిమాయలలో కలతజెందినా
ధరణికి అదియే తారకమగురా [[కళ్ళు]]
---పి.సూరిబాబు,వెంకటేశ్వరమహత్యం 1960,పెండ్యాల