welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Saturday, May 29, 2010

తోలుతిత్తి ఇది తూటులు తొమ్మిది తుస్సుమనుట ఖాయం


తోలుతిత్తి ఇది తూటులు తొమ్మిది

తుస్సుమనుట ఖాయం

ఓ జీవా తెలుసుకో అపాయం

ఉబ్బుతబ్బులై ఉరుకులు తీయకు

గబ్బుమేను జీవా అవును గబ్బిలాయి జీవా

ఎంతచెప్పినా ఏమిచెప్పినా

కట్టెలపాలౌ పాడు కట్టెరా [[తోలుతిత్తి]]

మూడురోజులా ముచ్చటరా ఈ చింతకట్టె దేహం

కాయం బుగులిపోవు ఖాయం

నువు కట్టుకుపోయేదొట్టిదిరా

ఈ మట్టినిపుట్టి మట్టిన కలిసే [[తోలుతిత్తి]]

వెలుతురుండగా తెరువు చూసుకో

తలచి రామనామం

జీవా చేరు రంగధామం పట్టుబట్టి

ఈ లోకపు గుట్టూ రట్టు చేసే

ఈ రంగదాసుడూ [[తోలుతిత్తి]]

--పాండురంగమహత్యం 1957

తెలుగు సాహిత్యంలో ముస్లిం కవులు రచయితలు


తెలుగు సాహిత్యంలో ముప్ఫైకి పైగా శతకాలను ముస్లిం కవులు రాశారు.భక్తి, నీతి, తాత్వాక, ప్రబోధాత్మక శతక సాహిత్యంలో ముస్లిం కవులు శతకాలు రాశారు.తెలుగుముస్లిం కవులు రాసిన కొన్ని శతకాలు ;

*ముహమ్మద్‌ హుస్సేన్‌

భక్త కల్పద్రుమ శతకం(1949)

మొక్కపాటి శ్రీరామశాస్త్రితో కలసి రాసిన శతకం ''సుమాంజలి''.

హరిహరనాథ శతకము

అనుగుబాల నీతి శతకము

తెనుగుబాల శతకము

*షేక్‌ దావూద్‌

1963లో రసూల్‌ ప్రభు శతకము

అల్లా మాలిక్‌ శతకము

*సయ్యద్‌ ముహమ్మద్‌ అజమ్‌

సయ్యదయ్యమాట సత్యమయ్య సూక్తి శతకము

*ముహమ్మద్‌ యార్‌

సోదర సూక్తులు

*గంగన్నవల్లి హుస్సేన్‌దాసు

హుస్సేన్‌దాసు శతకము-ధర్మగుణవర్య శ్రీ హుసేన్‌ దాసవర్య

*హాజీ‌ ముహమ్మద్‌ జైనుల్ అబెదీన్‌

ప్రవక్త సూక్తి శతకము,భయ్యా శతకము

*తక్కల్లపల్లి పాపాసాహెబ్‌

వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ

బెండ్లియాడి మతమభేదమనియె

హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల?

పాపసాబు మాట పైడిమూట

*షేక్‌ ఖాసిం

సాధుశీల శతకము

కులము మతముగాదు గుణము ప్రధానంబు

దైవచింత లేమి తపముగాదు,

బాలయోగి కులము పంచమ కులమయా,

సాధులోకపాల సత్యశీల

*షేక్‌ అలీ

గురుని మాట యశము గూర్చుబాట అనే మకుటంతో 'గురుని మాట' శతకం

మానస ప్రబోధము శతకం

*షేక్‌ రసూల్‌

మిత్రబోధామృతము అనే శతకం

*ఉమర్‌ ఆలీషా

బ్రహ్మ విద్యా విలాసము.

"తెలుగు సాహిత్యం-1984 వరకు ముస్లిముల సేవ" అనే సిద్ధాంతవ్యాసానికి అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయ ఆచార్యుడు షేక్ మస్తాన్ గారికి 1991 లో పి.హెచ్.డి వచ్చింది.ఉర్దూ మాతృభాషగా గల ఎందరో ముస్లిములు కూడా తెలుగు సాహిత్యాన్ని ఉత్పత్తి చేశారు.సయ్యద్ నశీర్ అహ్మద్ "అక్షర శిల్పులు" పేరుతో 333 మంది ప్రస్తుత తెలుగు ముస్లిం కవులు రచయితల వివరాలతో పుస్తకం ప్రచురించారు.