welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Showing posts with label know around you. Show all posts
Showing posts with label know around you. Show all posts

Thursday, December 23, 2010

అనితర సాధ్యమైన అక్షరశిల్పులు -మంచి పుస్తకం

 



అనితర సాధ్యమైన అక్షరశిల్పులు

మంచి పుస్తకం

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ మంచి రచయితగా, పరిణతి చెందిన పాత్రికేయునిగా చిరపరిచితులు. భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిములు నిర్వహించిన పాత్రను వివరిస్తూ ఆయన రాసిన పరిశోధనా వ్యాసాలు పుస్తకాలుగా వెలువడి పాఠకాదరణ పొందాయి. ముస్లిం స్వాతంత్య్ర సమర యోధుల గురించిన సమాచారం సేకరించడానికి ఎంతో కష్టపడిన నశీర్‌ అహమ్మద్‌ ఇప్పుడు మరింత క(ఇ)ష్టపడి 'అక్షరశిల్పులు' అనే గ్రంథాన్ని అందించారు.




ఇందులో రాష్ట్రం నలుమూలలా ఉన్న 333 మంది ముస్లిం కవులు, రచయితలు, అనువాదకులను పరిచయం చేస్తూ, వారు చేసిన, చేస్తున్న సాహితీ సేవను పాఠకుల ముందుంచారు. ఆయా కవులు, రచయితలు, అనువాదకుల పరిచయాలు, వారు చెక్కిన సాహితీ శిల్పాల గురించి క్లుప్తంగానే చెప్పినప్పటికీ, తనకు అంది (తెలిసి)నంత వరకూ వారి చిరునామాలు, టెలిఫోన్‌ నంబర్లను సేకరించడానికి చేసిన కృషి, వారి గురించి రాసిన ప్రతి అక్షరంలోనూ సాటి ముస్లింల పట్ల గల ప్రేమాభిమానాలు, వారిని పదిమందికీ పరిచయం చేయడానికి పడ్డ తపన సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి.




పాత్రికేయ ప్రముఖులు పొత్తూరి వెంకటేశ్వరరావుగారన్నట్లు ఈ పుస్తకం తెలుగు సాహిత్య పరిశోధకులకు, రచయితలకు మార్గదర్శివంటిదని చెప్పవచ్చు. అయితే ఇంకా ఇందులో సంకలన కర్త దృష్టిలోకి రాని ముస్లిం పాత్రికేయులు, రచయితలు మరెందరో ఉండి ఉండవచ్చు. తమ వివరాలను వెల్లడించడానికి ఇష్టపడని వారు కూడా ఉండి ఉండవచ్చు. అయినప్పటికీ ఇటువంటి పుస్తకం ఒకదానిని తీసుకు రావాలన్న నశీర్‌ అహమ్మద్‌ ఆలోచన ను మెచ్చుకోక తప్పదు.




అక్షరశిల్పులు (ముస్లిం కవులు- రచయితల

సంక్షిప్త పరిచయం)

కూర్పు: సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

పుటలు: 180, వెల రూ. 150

ప్రతులకు: ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌, శివప్రసాద్‌ వీధి, కొత్తపేట, వినుకొండ- 522 647, గుంటూరు జిల్లా మరియు అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.

సోల్‌ డిస్ట్రిబ్యూషన్‌: తెలుగు బుక్‌హౌస్‌, 3-3-862,

కాచిగూడా ఎక్స్‌రోడ్స్‌, హైదరాబాద్‌- 500 027.




- డి.వి.ఆర్‌. భాస్కర్‌ (సాక్షి 10.7.2010)

మత సామరస్యం

 


మత సామరస్యం

మనమంతా మనుషులం.మానవత్వమే మన మతం.ప్రతి మతంలో కొన్ని సుగుణాలుంటాయి.అలాగే కొన్ని నచ్చని అంశాలూ ఉంటాయి.మంచితనం,మానవత్వం అనే సద్గుణాలు లేని మతం యేదైనా సంస్కరించబడాల్సిందే."మంచి చెడ్డలు రెండె మతములు" అనే సూక్తికి తిరుగు లేదు.మంచి యే మతంలో వున్నాస్వీకరించుదాం.చెడు యే మతంలో వున్నా తిరస్కరించుదాం.మతాన్ని మారణకాండకు సాధనంగా మలచుకొంటున్న రాజకీయ నాయకులు మతాధిపతులు
నరకానికేపొతారు.మంచికి వాడని మతం నిరుపయోగం. ఓర్పు,సహనం,శాంతి,క్షమ,దయ,మనలో వుంటే మత కలహాలు జరగవు.స్వర్గం ఇక్కడే వుంటుంది.పరస్పర ప్రేమ కోసం కృషి చేద్దాం.హిందూ ముస్లిం భాయీ భాయీ.సహించడమే గొప్ప స్వర్గ ద్వారం. ఎదుటి వారిని నొప్పించేది నిజం అయినా అది చెప్పకుండా మౌనం వహించటం మంచిది.అప్పుడెప్పుడో ముందు తరాలు వాళ్ళు చేసిందానికి ఇప్పటి వాళ్ళను బాధ్యుల్ని
చేయద్దు.పూర్వం ఎవరో చేసిన పాడుపనులు ఇప్పటికీ గుర్తుచేసేకంటే మనప్రజలు శాంతిసామరస్యాలకోసం ఇప్పుడు ఏం చెయ్యాలో చెబితే బాగుంటుంది.అన్ని మతాలలోనూ వారి వారి మతాల కోసం అకృత్యాలకు పాల్పడ్డవారున్నారు.ఒక మతం కొమ్ముకాసే వారికి సొంతమతం పేరుతో జరిగే అరాచకాలు పుణ్యకార్యాలుగా కనబడతాయి.నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వమే.పుట్టిన బిడ్డలు ఫలానా మతంలో పుట్టాలని
కోరుకుని పుట్టరు.ఒక మతస్తులు గతంలో అకృత్యాలకు పాల్పడ్డారని ఆమత వారసులందరూ నేరస్తులైనట్లు వారు చేయని నేరానికి వారిని అపరాధభావనకు గురిచెయ్యటం అవమానించటం కూడా అకృత్యమే.శాంతియుత జీవనం గడిపే నేటి ప్రజలకు వారి పూర్వీకుల అకృత్యాలను పదేపదే గుర్తుచేసే మతవాద రచయితలు కూడా ఉగ్రవాదులే.శాంతియుత జీవనం గడుపుతున్న భరతమాత ముద్దుబిడ్డలు ఈ దేశంలో కోట్లాదిమంది
ఉన్నారు.అందరికీ సగౌరవంగా బ్రతికే దారికావాలి.కౌరవ సంతతినైనాసరే నిందించి నలిపి చంపటం కంటే మానవత్వంతో కలుపుకు పోవటమే మంచిది.ఎప్పుడో ఎవరో చేసిన అకృత్యాలను మళ్ళీ మళ్ళీ కొన్ని తరాలపాటు గుర్తుచేసి ఆ మతంలో ఉన్నఈనాటి వారసుల్ని నిందలువేసి అవమానించే వారికి మోక్షం సిద్ధించదు.హింసకు జవాబు హింస కాదు.ఈ దేశంలో పుట్టటమే ఏ మతస్థుడికైనా ఎన్నోజన్మల పుణ్యఫలం.జీనా యహా,
మర్నా యహా, ఇస్కేసివా జానా కహా' అంటూ అజాతశత్రువుల్లా బ్రతకాలి. మన మతంతో పాటు ఇతరుల మతాలను కూడా గౌరవించాలి.వ్యక్తులు చేసే పనులకు మతాన్ని నిందించకూడదు.

ఆదర్శనీయులు

* షహనాయి విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్ ,నేపధ్య గాయకుడు మొహమ్మద్ రఫీ ,సంగీత దర్శకుడు నౌషాద్ ఎన్నో హిందూ భక్తి గీతాలతో దేశప్రజలను అలరించారు.

* మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అన్ని మతాల వారి ఆదరణను పొందారు.
* తమిళ నాడులోని శ్రీరంగం దేవాలయం, భద్రాచలం రాముల వారి దేవాలయంలో సన్నాయి వాయించేది తెలుగు ముస్లింలే.షేక్ చినమౌలానా సుబ్రహ్మణ్యస్వామి భక్తుడు.శ్రీరంగం దేవస్థానంలో స్వర్గీయ షేక్ చినమౌలానా నాదస్వర సేవ చేశాడు.ఆయన మనమడు నేటికీ సేవిస్తున్నాడు.
* పలుదేవాలయాల్లో పూలదండలు సరఫరా చేసేది, మంచి గంధం సప్లై చేసేది ముస్లిములే.
* కేరళలోని మాతా అమృతానందమాయి దేశంలో పలుచోట్ల నిర్మించిన ఆలయాల వాస్తుశిల్పి ముస్లిం.
* భద్రాచలంలోని రాములవారి కల్యాణానికి ఆదినుండి ముత్యాలు నిజాం వంశీయుల నుండి వస్తాయి.
* బీబీ నాంచారమ్మ (వేంకటేశ్వరుని రెండవ భార్య)ముస్లిం స్త్రీ.తిరుమలలో ఆమె దేవాలయం ఉంది.
* షిర్డీ శాయిబాబా ముస్లిం.అతని మసీదు పేరు ద్వారకామాయి శ్రీరామనవమి పండుగ జరిపేవాడు.
* అక్బర్ చక్రవర్తి మీరా బాయి భజనలు వినడానికి వెళ్ళేవాడు.
* శబరిమలై అయ్యప్పస్వామి భక్తులు దానికి దగ్గరలోని దర్గాకు కూడా వెళతారు.
* నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌లో అయ్యప్ప, షిరిడీ సాయి ఆలయాలకు స్థానిక ముస్లింలు తరలివస్తారు.భజనలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు.
* జోధా అక్బర్‌ ,మణిరత్నం "బొంబాయి", కృష్ణవంశీ 'ఖడ్గం' చిత్రాలు కూడా హిందూ ముస్లింలు ఐక్యతగా ఉండాలని చాటిచెప్పేవే.
* చార్మినార్‌ లోని దర్గా శుభ్రతలో చేయూత నిస్తుంది హిందువు. హైదరాబాద్‌ నగరంలో పలు చోట్ల హిందువులు తమలపాకులు, పువ్వులు, అరటిపళ్లు ముస్లింల నుండే కొనుగోలు చేస్తారు.చార్మినార్‌ ప్రక్కనే ఆలయం వుంటుంది.
* పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ లో మీరాసాహెబ్ దుర్గా మాతకు గుడి కట్టి నిష్టతో పూజారిగా ఇప్పటికీ పనిచేస్తున్నాడు.
* నిజామాబాద్‌ జిల్లాలోని భైంసాలో మతకల్లోలాలు జరిగినప్పుడు ఓ సాధారణ హిందూ వనిత దాడికిలోనైన కొందరు ముస్లింలకు ఆశ్రయం యిచ్చింది. *సికింద్రాబాద్‌ లోని టకార్‌ బస్తీవాసి షేక్‌ ఇమ్రానుద్దీన్‌,హనుమాన్‌ జయంతిని ఎంతో భక్తితో జరుపు కుంటాడు.
* హైదరాబాద్‌లో బాలాజీ దేవాలయం సమీపంలోనే హనుమంతుని ఆలయం.స్థానికంగా ఓ ముస్లిం మరణిస్తే, గౌరవ సూచకంగా హనుమజ్జయంతిరోజున హనుమంతుని ఆలయాన్ని మూసివేశారు.
* పాతబస్తీలోని గొల్లా ఖిడ్కీ కాలనిలో ఇతేషామ్‌ ఆలీఖాన్‌ స్థానిక ముస్లింలతో, హిందువులపై దాడిని వారించారు. సుబోధ్‌ కుమార్‌, తనహిందూ మిత్రులతో కలిసి హిందూ ఆందోళన కారులనుండి ముస్లిం సోదరులను కాపాడాడు.
‍*గత 25 సంవత్సరాలుగా బేగం బజారులోని మొహ్మద్‌ ఇస్మాయిల్‌ తనదుకాణం 'హషామ్‌ అండ్‌ సన్స్‌' తలుపులపై హిందువుల దేవతాచిత్రాల బొమ్మలకు అగరుబత్తీలు వెలిగిస్తున్నాడు.
* ఒక ముస్లిమ్ మహిళ పెళ్ళి కోసం భాగ్‌పత్ జిల్లాలోని సున్హెరా గ్రామంలోని హిందువులంతా కలిసి చందాలు వసూలు చేశారు.

కావరియా

*" హిందూ, ముస్లింల సోదరభావానికి, ఐకమత్యానికి ఈ యాత్ర ప్రతీక.ఇటువంటి సద్భావన శిబిరాల వల్ల సామాజిక సామరస్యం మరింత పెరుగుతుంది.కావరియాలు తీసుకొని హరిద్వార్‌కు యాత్ర నిర్వహించే భక్తులకు ముస్లిం వర్గాలు స్వాగతం పలికి సత్కరించడం అనేది దేశ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం" .--ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌

చట్టాల తర్జుమా

 


ఈ 17 చట్టాలను తెలుగు లోకి తర్జుమా చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.G.O.Ms.No Law (D) Department103/28-07-2010
1. The Andhra Pradesh Assigned Lands (Prohibition of Transfers) (Amendment)
Act, 2008 (Act No.21 of 2008)
2. The Industrial Disputes (Andhra Pradesh Amendment) Act, 2008 (Act No.22 of
2008)
3. The Andhra Pradesh Land Acquisition (Andhra Pradesh Amendment) Act, 2008
(Act No.23 of 2008)
4. The Andhra Pradesh Advocates 'Clerks' Welfare Fund (Amendment) Act, 2008
(Act No.24 of 2008)
5. The Andhra Pradesh Land Reforms (Ceiling on Agricultural Holdings) (Second
Amendment) Act, 2008 (Act No.25 of 2008)
6. The Andhra Pradesh Tax on Entry of Motor Vehicles into Local Areas
(Amendment) Act, 2008 (Act No.26 of 2008)
7. The Andhra Pradesh Entertainments Tax (Amendment) Act, 2008 (Act No.27 of
2008)
8. The Andhra Pradesh Universities (Amendment) Act, 2008 (Act No.29 of 2008)
9. The Andhra Pradesh Excise (Amendment) Act, 2008 (Act No.33 of 2008)
10. The Andhra Pradesh Rural Electric Co-operative Societies (Temporary Provisions)
(Amendment) Act, 2008 (Act No.34 of 2008)
11. The Hyderabad Metropolitan Development Authority (Amendment) Act, 2008
(Act No.35 of 2008)
12. The Andhra Pradesh Vaidya Vidhana Parishad (Amendment) Act, 2008 (Act
No.36 of 2008)
13. The Andhra Pradesh Municipalities (Amendment) Act, 2008 (Act No.37 of 2008)
14. The Andhra Pradesh Fiscal Responsibility and Budget Management (Amendment)
Act, 2008 (Act No.39 of 2008)
15. The Andhra Pradesh Education (Amendment) Act, 2008 (Act No.40 of 2008)
16. The Andhra Pradesh Farmer's Management of Irrigation Systems (Amendment)
Act, 2008 (Act No.41 of 2008)
17. The Andhra Pradesh Municipal Laws (Fourth Amendment) Act, 2008 (Act No.42
of 2008)

Sunday, February 21, 2010

విచ్చల విడిగా ఖర్చు చేయడమేనా జీవిత పరమార్థం?

ఆస్ట్రియాలో అభినవ బుద్ధుడు
కోరికలు దుఃఖానికి హే తువని గౌతమ బుద్ధుడు ప్రవచిస్తే, సంపదలే విషాదానికి కారణమని ఎలుగెత్తి చాటుతున్నాడు అభినవ బుద్ధుడు!
ఆస్తిపాస్తులన్నీ పేదల ఉద్ధరణకే అర్పించి సామాన్యునిలా జీవిస్తున్న కుబేరుడు
గాంధీజీ 'ధర్మకర్తృత్వ' సిద్ధాంతాన్ని ఆచరించి చూపిన ఏకైక వ్యక్తి

లండన్‌: కోరికలు దుఃఖానికి హే తువని గౌతమ బుద్ధుడు ప్రవచిస్తే, సంపదలే విషాదానికి కారణమని ఎలుగెత్తి చాటుతున్నాడు అభినవ బుద్ధుడు! నాటి గౌతముడు రాజభోగాలను త్యజించినట్టే, నేటి కార్ల్‌ రాబేదర్‌ సంపదలన్నీ పేదలకే అర్పించి, కుటీరంలో తలదాచుకుంటున్నాడు. 'డబ్బు ఆనందానికి అడ్డంకి. అన్నీ పోవాల్సిందే....అన్నీ....అన్నీ' అంటూ, సర్వం పేదలకు అర్పించేసాడు, ఆస్ట్రియా సంపన్నుడు
రాబేదర్‌. ఆల్ప్స్‌ పర్వతాల్లోని అత్యంత విలాసవంతమైన అద్భుత హర్మ్యాన్ని, సువిశాలమైన సుందరమైన ఫార్మ్‌ హౌస్‌ని, అధునాతన మైన ఆడి ఏ-8 కారును అమ్మకానికి పెట్టేసాడు. ఇంటీరియర్‌ డెకరేషన్లు, ఫర్నిచర్‌, ఫ్లవర్‌వాజ్‌లు, వాటిలోని కృత్రిమ పుష్పాలను సైతం అమ్మేశాడు. గ్లైడింగ్‌ అంటే మహా ఇష్టమైనా, గ్లైడర్‌లను కూడా ఉంచుకోలేదు. అన్నీ వదిలాక, 'అమ్మయ్య ఇప్పటికి నా గుండె
బరువు తీరింది' అని సంతృప్తి వ్యక్తం చేశాడు!

ఫైవ్‌స్టార్‌ హోటల్లో జ్ఞానోదయం
ఇన్స్‌బ్రక్‌ కొండలలో అడవుల మధ్యన ఓ చిన్న కుటీరంలోనో, లేక ఓ చిన్న అపార్ట్‌మెంట్‌ గదిలోనో శేష జీవితాన్ని గడిపేయాలని కోరుకుంటున్న రాబేదర్‌, జీవితమంటే విరక్తి కలిగిన వృద్ధుడూ కాడు, ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవాలనీ కోరుకోవడమూ లేదు. అర్థవంతమైన, నిజమైన జీవితం కోసం తపిస్తున్నాడు. సంపాదనకోసం పరుగులు తీస్తూ, విచ్చలవిడి గా ఖర్చుచేస్తూ నలభై ఏడేళ్లకే విసిగి
వేసారి పోయాడు. అలా అని రాబేదర్‌, బుద్ధునిలా ఆగర్భ శ్రీమంతుడు కాడు. పేదరికంలో పుట్టి, శ్రమించి పైకొచ్చిన వాడు. వస్తు వినియోగ వ్యసనానికి బానిసగామారి, విచ్చల విడిగా ఖర్చు చేయడమేనా జీవిత పరమార్థం? అనే ప్రశ్న నీడై వెన్నాడగా 'సిద్ధార్థుడ'య్యాడు. అది కూడా... విందు విలాసాల్లో మునిగి తేలుతుండగా!

కులాసాగా గడపడంకోసం హవాయి దీవులకు వెళ్లిన రాబేదర్‌, మూడు వారాల్లో ఎంత డబ్బు తగలేయడానికి వీలవుతుందో అంతా తగలేశాడు. అంతలోనే.... తన చుట్టూ ఉన్న అతి«థులు, నౌకర్లూ చాకర్లూ, అందరూ... తాను కూడా, అంతా నటులమేనని, నిజం మనుషులం కామని తోచింది. నటనతో నిండిన ఆ జీవితానికి అర్థమే లేదని అనిపించింది. రాబేదర్‌, అంతకు ముందు దక్షిణ, మధ్య అమెరికా దేశాలలోని పేదరికాన్ని, దైన్యాన్ని చూసి
కలత చెందాడు. అదంతా ఇప్పుడు, ఆ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో తిరిగి కళ్ల ముందు మెదలాడింది. ఇబ్బందిగా ఫీలై.. ఫీలై...చివరికి విషాదమూర్తి అయ్యాడు. రాబేదర్‌, కార్ల్‌ మార్క్స్‌ను చదువుకున్నాడో లేదో తెలీదు. తన సంపదలకు, అక్కడి పేదరికానికి ఏదో సంబంధం ఉందని అనిపించసాగింది. అంతే, సర్వ సంపదల పరిత్యాగానికి సిద్ధమయ్యాడు.

నిజమైన గాంధేయవాది
ఒక ధార్మిక సంస్థను ఏర్పాటు చేశాడు. తన సర్వస్వాన్ని, (23 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులను) ఆ సంస్థ పరం చేశాడు. అది, లాభాపేక్షలేని ఒక మైక్రోఫైనాన్స్‌ సంస్థను నడుపుతోంది. ఎల్‌సాల్వడార్‌, హాండ్యురాస్‌, బొలీవియా, పెరు, అర్జెంటినా, చిలీ దేశాలలో పేదరిక నిర్మూలనకు, అభివృద్ధికి కృషి చేస్తుంది. స్వయం ఉపాధి పథకాలను చేపడుతుంది. రాబేదర్‌, ఆ సంస్థలో జీతం భత్యంలేని
ఉద్యోగి! 'సంపన్నులు, ప్రజల ఆస్తులకు ధర్మకర్తలు మాత్ర మే' అన్న గాంధీజీ సూక్తిని ఆచరించిన వారు బహుశా ఈ ప్రపంచంలో ఎవరూ లేరు.....ఒక్క రాబేదర్‌ తప్ప. 'ది డైలీ టెలిగ్రాఫ్‌'తో మాట్లాడుతూ రాబేదర్‌ అన్న మాటలు, ఈ అభినవ బుద్ధుని వ్యక్తిత్వానికి అద్దం పడతాయి....'ఎవరికైనాగాని సందేశాన్ని ఇచ్చే హక్కు నాకు లేదు. ఏదో నా అంతరాత్మ ఆదేశాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను
అంతే!

ఈదేశానికి పట్టిన చీడ కులం

అగ్ర కుల ముస్లింల రిజర్వేషన్లని వ్యతిరేకించండి
అగ్ర కుల ముస్లింలు కూడా దళితులనీ, బి.సి.లనీ చిన్న చూపు చూస్తున్నారు కదా. మరి అగ్ర కుల ముస్లింలకి కూడా రిజర్వేషన్లు ఇస్తామంటుంటే మీ దూదేకులవాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు? ముస్లింలలో కూడా కులతత్వం ఉందన్న నిజాన్ని ప్రభుత్వం, ఎం.ఐ.ఎం. కావాలని మరచిపోతున్నాయి.


ఈదేశానికి పట్టిన చీడ కులం.మీ దూదేకులవాళ్ళు అనకు.వచ్చేజన్మలో నేను మీకులంలో పుట్టొచ్చు.దౌర్భాగ్యం ఏంటంటే భారతీయుడు ఏ మతంలోకి వెళ్ళినా కులం ఉంటున్నది.భారతీయ క్రైస్తవుల్లో,ముస్లిముల్లో కూడా కులాలున్నాయి.అగ్ర కుల ముస్లింలకి రిజర్వేషన్లు ఇవ్వలేదు.షేక్ ల రూపంలో దొంగదారిన రిజర్వేషన్ పొందుతున్నారు.పేదరికమే ఈ కక్కుర్తికి కారణం.రిజర్వేషన్ ఇచ్చిన 14 కులాలూ
నికృష్టంగానే ఉన్నాయి.

అసలు దూదేకుల వాళ్ళ మాట ఎక్కడ చెలామణి అవుతుంది?ఈరాష్ట్రంలో దూదేకుల వాళ్ళ సంఖ్య చాలా తక్కువ.బి.సి.ఇ గ్రూపులో దూదేకుల కులస్తులను కలపలేదు.వాళ్ళు బి గ్రూపులో ఉన్నారుగా అని వదిలేశారు.అధికారులు కూడా కొన్నిప్రాంతా ల్లో మతం హిందూ అనీ, కులం దూదేకుల అని సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఇస్లాం-దూదేకుల అని సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు. మసీదుకు వెళ్ళము అని అఫిడవిట్ దాఖలు
చెయ్యాలని ఆంక్షలు పెడుతున్నారు. తల్లిదండ్రులు దూదేకుల వృత్తి చేస్తుంటేనే బీసీ సర్టిఫికెట్‌ ఇస్తామని చెబుతున్నారు.రాష్ట్రంలోని దూదేకుల కులానికి చెందిన ముస్లింలను దళితులుగా చేయాలని మజ్లీస్ పార్టీ విన్నివించింది .అంటే దూదేకుల వారిని ముస్లిములు దళితులుగా భావిస్తున్నట్లేగా?

ఈ 13 ముస్లిం కులాలు రిజర్వేషన్లకు అర్హులుకాదు:1.సయ్యద్, 2.ముషేక్,3. మొఘల్, 4.పఠాన్, 5.ఇరాని,6. ఆరబ్,7. బొహరా, 8.షియా,9. ఇమామి, 10.ఇష్మాయిల్, 11.కుచిమెమన్,12. జమాయత్,13. నవాయత్లు.వీళ్ళే అగ్ర కుల ముస్లింలు.రోళ్లకు కక్కు కొట్టేవారు,పకీరుసాయిబులు,గారడీ సాయిబులు , పాముల వాళ్లు,అచ్చుకట్లవాండ్లు,అత్తరు సాయిబులు లాంటి వాళ్ళకుకూడా రిజర్వేషన్లు ఇవ్వరా?మతమో మశానమో దళితులకంటే హీనంగా ఉన్న ఈ
మన భారతీయ సోదరులకు మానవహక్కులు అందేదెలా?

Monday, January 25, 2010

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు

 

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు
ఏర్పడిన సంవత్సరం ↓ జిల్లా ↓ జిల్లాకేంద్రం ↓ జనాభా (2001) ↓ వైశాల్యం (km²) ↓ జనసాంధ్రత (/km²) ↓ జిల్లావెబ్ సైట్ ↓
1905 అదిలాబాద్ జిల్లా అదిలాబాద్ 2,479,347 16,105 154 http://adilabad.nic.in/
1881 అనంతపూర్ జిల్లా అనంతపూర్ 3,639,304 19,130 190 http://anantapur.nic.in/
1911 చిత్తూరు జిల్లా చిత్తూరు 3,735,202 15,152 247 http://chittoor.nic.in/
1802 తూర్పు గోదావరి జిల్లా కాకినాడ 4,872,622 10,807 451 http://eastgodavari.nic.in/
1794 గుంటూరు జిల్లా గుంటూరు 4,405,521 11,391 387 http://guntur.nic.in/
1978 హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ 3,686,460 217 16,988 http://hyderabad.nic.in/
1910 కడప జిల్లా కడప 2,573,481 15,359 168 http://kadapa.nic.in/
1905 కరీంనగర్ జిల్లా కరీంనగర్ 3,477,079 11,823 294 http://karimnagar.nic.in/
1953 ఖమ్మం జిల్లా ఖమ్మం 2,565,412 16,029 160 http://khammam.nic.in/
1925 కృష్ణా జిల్లా మచిలీపట్నం 4,218,416 8,727 483 http://krishna.nic.in/
1949 కర్నూలు జిల్లా కర్నూలు 3,512,266 17,658 199 http://kurnool.nic.in/
1870 మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ 3,506,876 18,432 190 http://mahabubnagar.nic.in/
1956 మెదక్ జిల్లా సంగారెడ్డి 2,662,296 9,699 274 http://medak.nic.in/
1953 నల్గొండ జిల్లా నల్గొండ 3,238,449 14,240 227 http://nalgonda.nic.in/
1906 నెల్లూరు జిల్లా నెల్లూరు 2,659,661 13,076 203 http://nellore.nic.in/
1876 నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ 2,342,803 7,956 294 http://nizamabad.nic.in/
1970 ప్రకాశం జిల్లా ఒంగోలు 3,054,941 17,626 173 http://prakasam.nic.in/
1978 రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ 3,506,670 7,493 468 http://rangareddy.nic.in/
1950 శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం 2,528,491 5,837 433 http://srikakulam.nic.in/
1950 విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం 3,789,823 11,161 340 http://visakhapatnam.nic.in/
1979 విజయనగరం జిల్లా విజయనగరం 2,245,103 6,539 343 http://vizianagaram.nic.in/
1905 వరంగల్ జిల్లా వరంగల్ 3,231,174 12,846 252 http://warangal.nic.in/
1926 పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు 3,796,144 7,742 490 http://wgodavari.nic.in/
విశేషాలు

* అనంతపురం జిల్లా కంటే వైశాల్యంలో చిన్న దేశాలు : మాల్టా,గ్రెనెడా,ఆండొర్రా,బహ్రైన్,బ్రూనే,కేప్వర్ద్,సైప్రస్,డొమినికా,ఫిజీ,గాంబియా,జమైకా,కువైట్,లెబనాన్,లక్సెంబర్గ్,మారిషస్,పోర్టోరికో,కతార్,సీషెల్స్,సింగపూర్,

స్వాజీలాండ్,టాంగో.ట్రినిడాడ్,టుబాగో,వనౌటూ.

విజయవాడ వద్ద కృష్ణా నదిపై 5 ప్రతిపాదనలు

 
1.ప్రకాశం బ్యారేజి మూసివేసినందువల్ల ట్రాఫిక్ సమశ్య పెరిగింది.విజయవాడ-తాడేపల్లి మధ్య కృష్ణా నదిపై ఉన్న పాత రైలు బ్రిడ్జిని ఊడదీశారు.తాడేపల్లి ఈమధ్య మునిసిపాలిటీ అయ్యింది.ఈ వంతెనను సైకిళ్ళు పాదచారుల కోసం రెండు మునిసిపాలిటీలు వుడా వారు కలిసి పునరుద్ధరిస్తే రెండుజిల్లాల మధ్య ట్రాఫిక్ సమస్య కొంతవరకైనా తగ్గుతుంది.
2.ప్రకాశం బ్యారేజి నుండి లీక్ అయ్యే నీరు వృధాగా పోతోంది.విజయవాడ-తాడేపల్లి మునిసిపాలిటీలు వుడా వారు కలిసి కనకదుర్గ వారధి వద్ద 1గజం ఎత్తున అడ్డుగోడ నిర్మిస్తే నీళ్ళు నిలబడి పర్యాటకులకు అహ్లాదకరంగా ఉంటుంది.భూగర్భజలాలలో ఉప్పు శాతం తగ్గి మంచి నీరు దొరుకుతుంది.నదీ గర్భంలో ఆక్రమణలు తగ్గుతాయి.భక్తుల పుణ్యస్నానాలకు మరింత చోటులభిస్తుంది.
3.ప్రకాశం బ్యారేజిపై నుండి ఆర్టీసీ మినీ బస్సులు నడిపించాలి.
4.కనకదుర్గ వారధి నుండి ప్రకాశం బ్యారేజివరకు కృష్ణానది రెండువైపులా కరకట్టలను రహదారులుగా మార్చాలి.
5.గ్రేటర్ విజయవాడలో కేవలం ౩కి.మీ దూరంలో గుంటూరుజిల్లాలో ఉన్నకృష్ణాకెనాల్ జంక్షన్, తాడేపల్లి మునిసిపాలిటీని కూడా కలిపి జంట నగరాలుగా అభివృద్ధి చెయ్యాలి.

Sunday, August 16, 2009

దయచేసి తినండి...పారేయకండి

దయచేసి తినండి...పారేయకండిఏటా రూ.58 వేల కోట్ల విలువైన ఆహారం వృథా.మన దేశంలో ముప్పై కోట్ల మందికి ఒకే ఒక కోరిక ఉంటుంది. రోజూ కడుపు నిండా తిండి తినాలని. అయితే మాకేంటి అనుకోకండి. వారందరికీ అన్నం పెట్టకున్నా ఫర్వాలేదు కానీ మీరు తిండిని మాత్రం వృథా చేయకండి.కడుపులో మంట... వికారం... నీరసం... తెలియని వాళ్ళు మన దేశంలో చాలా తక్కువ. ఆకలి బాధతో అలమటిస్తున్న వారు మాత్రం మన దేశ జనాభాలో సుమారుగా ముప్పై కోట్ల మంది ఉన్నారు. రాజధానిలో వీరి సంఖ్య రెండు లక్షలకు పైనే. ఈ ఆకలి బాధ నుంచి బయట పడటానికి ఏంతో మంది కష్టపడుతుంటే మరికొందరు తప్పు దోవ పడుతున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలిసినా శుభకార్యాల పేరిట పుట్టిన రోజు పేరిట, హోటళ్లలో మితిమీరి ఆర్డర్ చేయడం అలవాటైంది. దాన్ని పూర్తిగా తింటున్నారా అంటే అదీ లేదు. ఆహారం రుచిగా లేదని కొందరు, ఇష్టం లేదని మరికొందరు దాన్ని వృథా చేస్తున్నారు.

చెత్తనుండి మేలు

చెత్త పెద్ద సమస్యగా మారింది.రోజూ వేల టన్నుల ఉత్పత్తి జరుగుతోంది.ఖర్చుతోపాటు తరలింపునకు స్థలం కరవు ఔతోంది. చెత్తే కదా.. బయట పడేసిరా అని మనం తేలిగ్గా చెబుతాం. కానీ, మునిసిపాలిటీలకు అదే పెద్ద గుడిబండగా మారింది. మనం వేసిన చెత్తను ఎక్కడికి తరలించాలన్నది తలనొప్పిగా తయారైంది. దీనిని ఎక్కడ వేద్దామన్నా ఆ పరిసర ప్రాంతాల వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.చెత్త వేయటానికి అనువైన ప్రదేశం దొరకటం లేదు. ఫలితంగా డంపర్‌బిన్లు నిండిపోయి వ్యర్థపదార్థాలు ఆచుట్టుపక్కల పడుతున్నాయి. జనావాసాల మధ్య దుర్వాసన వెదజల్లుతోంది. చెత్త వేయటానికి వెసులుబాటు లేక అధికారులు కూడా డంపర్ బిన్లు తీసుకెళ్లటం లేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. భవిష్యత్తులో మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంది.చెత్తను తొలగించటానికి కోట్లరూపాయలు ఖర్చు అవుతున్నది. నగరంలో ఉన్న చెత్త తీసుకొచ్చి పోయటం వల్ల వ్యాధులు వస్తాయని ఎక్కడికక్కడ ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఉత్పత్తి అవుతున్న చెత్తను ఎక్కడ పోసినా తగాదాలు జరుగుతున్నాయి.చెత్తను నిర్వీర్యం చేయటం పెద్ద సమస్యే. వాస్తవానికి దానిని సేకరించిన తర్వాత సరైన పద్ధతిలో భూస్థాపితం చేయాలి. లేకుంటే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.ఉన్న ఖాళీలో పోసి వస్తున్నారు తప్పించి.. సరైన విధానాన్ని పాటించటం లేదు. దీంతో సమీప ప్రాంతాల్లో దుర్వాసన.. చర్మ సంబంధ వ్యాధులు వస్తున్నాయి.చెత్తనుండి మేలుహైదరాబాద్‌లో వ్యర్ధ పదార్థాల నుంచి వర్మీ కంపోస్టు తయారు చేస్తున్నారు. దీనివల్ల కార్పొరేషన్‌కు రెండు విధాలా లాభం ఉంది. చెత్త వేయటానికి ఉన్న స్థలం ఎక్కువ కాలం ఉపయోగంలో ఉండటం.. తయారైన వర్మీ కంపోస్టును విక్రయించటం ద్వారా ఆదాయం.. ఇలా రెండు విధాలా లబ్ధి చేకూరుతుంది.ఇతర కార్పొరేషన్లు వ్యర్థ పదార్థాలను ఒక పద్ధతి ప్రకారం భూమిలో పాతిపెట్టే పనిచేస్తున్నాయి. ఇక్కడ కూడా ఒక పొర వ్యర్థ పదార్థాలు వేసిన తర్వాత.. గ్రావెల్ వేయాలి. ఇలా చేస్తే త్వరగా భూమిలో కలిసిపోతాయి. వ్యాధులు ప్రబలే అవకాశం ఉండదు. కనీసం రెండుమూడు రోజులకోసారి అక్కడ బ్లీచింగ్ పౌడర్‌ను చల్లాల్సి ఉంది.కొన్ని చోట్ల సేకరించిన చెత్తను అక్కడే తగులబెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలా తరచూ చేయటం వల్ల సమీప ప్రాంతాల ప్రజలకు ఆస్త్మా వచ్చే అవకాశం ఉంది.పనికి రాదని పడేసే చెత్త నుంచి ఉపయోగపడే వాటిని విడదీసి ఆదాయం ఆర్జించేందుకు ఉద్దేశించిన వినూత్న పథకానికి విశాఖపట్నంలో ఇండియన్ టొబాకో కంపెనీ శ్రీకారం చుట్ట్టింది.చెత్తలో 30% వరకు ఉండే పొడిచెత్త, కాగితాలు, ప్లాస్టిక్, ఇనుము, ఇతర లోహ వస్తువులను ప్రత్యేక సంచుల్లో నిల్వ ఉంచితే వాటి బరువు ప్రకారం డబ్బు చెల్లించి నిర్ణీత కాల వ్యవధుల్లో తీసుకువెళతారు.ఈ పథకం వల్ల 30% చెత్తను డంపింగ్ యార్డుకు తరలించకుండా ఆదా చేసినట్లే, తద్వారా అక్కడ అంతమేర స్థలం మిగులుతుంది.ఈ పథకం వల్ల మునిసిపాలిటీపై ఒక్క పైసా భారం లేకపోగా 30% చెత్త తరలింపునకు అయ్యే ఇంధన వ్యయం, సమయం వంటివన్నీ ఆదా అవుతాయి.పొడిచెత్తకు కిలో రూ.2 నుంచి రూ.4 వరకు చెల్లించి, ఇళ్ల వద్దే కొనుగోలు చేస్తారు.కాగితాన్ని పునర్వినియోగం చేయడం ద్వారా విలువైన వృక్షాలను కాపాడి పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుతారు.

'దానికి' సరేనంటేనే తిండి! అఫ్గానిస్థాన్‌లో మరో అనాగరిక చట్టం

వెల్లువెత్తుతున్న విమర్శలు
లండన్: అఫ్గానిస్థాన్‌లో అనాగరిక పాలన యథేచ్ఛగా కొనసాగుతోంది. మహిళలను పురుషుల బానిసలుగా మార్చే మరో కొత్త చట్టానికి ఆ దేశంలో రూపకల్పన జరిగింది. శృంగారానికి నిరాకరించే భార్యకు ఆహారం ఇవ్వకుండా మాడ్చివేసే అధికారాన్ని భర్తకు ఇస్తూ ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించారు. షియా వర్గానికి చెందిన పురుషులకు ఈ కొత్త 'హక్కు'ను కల్పించారని గార్డియన్ పత్రిక వెల్లడించింది. భార్య ఉద్యోగం చేయాలంటే భర్త అనుమతి తప్పనిసరని ఈ చట్టం నిర్దేశిస్తోంది. పిల్లల సంరక్షణ విషయంలో కూడా తల్లిని పక్కనబెట్టి తండ్రికి, తాతకు మాత్రమే పూర్తి హక్కులు ఇచ్చింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చట్టం.. ఓ మహిళపై అత్యాచారం జరిపి కూడా ఎలాంటి శిక్ష పడకుండా తప్పించుకునే వెసులుబాటును కల్పిస్తుందని అమెరికా చారిటీ హ్యూమన్‌రైట్స్ విమర్శించింది. భార్యపై భర్త అత్యాచారం జరిపినప్పటికీ తప్పు లేదంటూ గతంలో అఫ్గానిస్థాన్ ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, బ్రిటన్ ప్రధాని గార్డన్‌బ్రౌన్ సహా పలువురు తీవ్రంగా ఖండించారు. దీంతో కాస్త వెనక్కి తగ్గిన అఫ్గాన్ అధ్యక్షుడు హమీద్ ఖర్జాయ్.. ఎన్నికల నేపథ్యంలో మళ్లీ అదే చట్టాన్ని మరోపేరుతో ముందుకు తెచ్చారు.

Tuesday, July 28, 2009

భారత్‌లో 13 లక్షల సఫాయి కార్మికులు చేతులతోనే మలమూత్రాదుల ఎత్తివేత

నిషేధం మాటున..అమానుష బానిసత్వం!
భారత్‌లో 13 లక్షల సఫాయి కార్మికులు
చేతులతోనే మలమూత్రాదుల ఎత్తివేత
సభ్యసమాజానికే అవమానం
చోద్యం చూస్తున్న ప్రభుత్వాలు


న్యూఢిల్లీ: మూడో తరం ఫోన్‌లు, మునుపెన్నడూ వూహించనంతటి పలుచటి తెర టీవీలు.. ఐమాక్స్, ఐనాక్స్ సాంకేతిక పరిజ్ఞానం సినిమాలు.. ఇలా ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన వస్తువులు, పరిజ్ఞానం గురించి చెప్పుకొంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇంతటి అధునాతన పరిజ్ఞానం మానవ జీవితాల్లో ఉత్కృష్ఠమైన స్థానం సంపాదించుకొన్నా.. నేటికీ భారత సమాజంలో 13 లక్షల మంది సఫాయి కార్మికులు ఉన్నారు. వాస్తవానికి 16 ఏళ్ల కిందటే భారత్‌లో సఫాయి పనిని ప్రభుత్వం నిషేధించింది. అయినా.. వీరు ఇప్పటికీ చేతులను ఉపయోగించే మలమూత్రాదులను తీస్తూ.. పొట్టపోషించుకొనే దుస్థితిలో ఉన్నారు.

దేశంలో చేతులతో సఫాయి పనులు చేయించడాన్ని రెండేళ్ల కిందటే నిర్మూలించాల్సి ఉన్నప్పటికీ సాధ్యపడలేదని.. ప్రస్తుతం మార్చి 2010 కల్లా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి ముకుల్ వాస్నిక్ రాజ్యసభకు తెలిపారు. గతంలో కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 1.15 లక్షల మంది సఫాయి కార్మికులు ఉన్నారు. వీరికోసం కేంద్రం స్వయం ఉపాధి, పునరావాస పథకాన్ని అమలు చేసింది. అయితే ఇదంతా ప్రభుత్వ లెక్కల్లోనే. ఈ విషయమై 'సఫాయి కర్మచారి' ఉపసంఘం కన్వీనర్ బి.విల్సన్ మాట్లాడుతూ.. 'ఈ లెక్కలన్నీ అవాస్తవాలు' అని స్పష్టం చేశారు. దేశంలో ఎంత మంది సఫాయి కార్మికులు ఉన్నారనే విషయమై చాలా కాలంగా జాతీయ స్థాయిలో సరైన సర్వే జరగలేదని తెలిపారు. 'నాలుగేళ్ల కిందట 9 రాష్ట్రాల్లో మేం ఓ సర్వే నిర్వహించాం. దీని ప్రకారం దేశంలో కనీసం 13 లక్షల మంది సఫాయి కార్మికులు ఉన్నట్లు అంచనాకు వచ్చాం' అని వివరించారు. దీనిపై సఫాయి కర్మచారి ఆందోళన్ 2003లో సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఫలితంగా 2007 నుంచి ఈ విషయమై రాష్ట్రాలు కొన్ని చర్యలు చేపడుతున్నాయి. 1993లో కేంద్రం సఫాయి కార్మికులకు ఉపాధి, పాయిఖానా దొడ్ల(డ్రై లెట్రిన్) నిర్మాణ చట్టం రూపొందించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఏడాది జైలు, రూ.2000 జరిమానా లేక రెండూ విధించవచ్చు. దౌర్భాగ్యకరంగా ఇప్పటికీ దేశంలో అనేక మున్సిపాల్టీలు పాయిఖానా దొడ్లను నిర్వహిస్తున్నాయి. ఈ చట్టాన్ని ఉల్లంఘించడంలో భారతీయ రైల్వేలదే ప్రథమ స్థానమని విల్సన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

2007లో కేంద్రం లెక్కల ప్రకారం దేశంలో 3.24 లక్షల సఫాయి కార్మికులు ఉన్నారు. 16,386 మందితో ఒరిస్సా ఈ జాబితాలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. 11 రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రమాణపత్రంలో తమ రాష్ట్రంలో 'సఫాయి కార్మికులు లేరని, ఈ వ్యవస్థను సమూలంగా నిర్మూలించామని' పేర్కొనడం గమనార్హం.

Tuesday, July 07, 2009

భారమైన బాధ్యత

భారమైన 'బాధ్యత'!

ఆన్‌లైన్, జీడిమెట్ల కాటికి కాళ్లు చాచిన ఆ తండ్రి కొడుకులకు భారమయ్యాడు. జీవిత చరమాంకంలో ఆలనా పాలనా దగ్గరుండి చూడాల్సిన కుమారులే.. బాధ్యతల నుంచి తప్పించుకున్నారు. లోకం తెలియని వయస్సు నుంచి సొంత కాళ్లపై నిలబడేందుకు అనుక్షణం తపించిన తండ్రిని భరించలేక బస్టాండ్‌లో వదిలేశారు. దారిన పోయే వారు ఇచ్చే తినుబండారాలతో కాలం గడుపుతూ చావు కోసం ఎదురుచూసేలా విషమ పరీక్ష పెట్టారు. ఓ వైపు సహకరించని శరీరం మరోవైపు చచ్చుబడిన కాళ్లు, నడవడానికి కూడా ఓపిక లేక పదిరోజులుగా నానా యాతన పడుతున్న పండు ముదుసలిని చూసి ఓ స్త్రీ మూర్తి హృదయం ద్రవించింది. తనకు తెలిసిన వృద్ధాశ్రమానికి సమాచారమిచ్చింది. నీ లాంటి వాళ్ల కోసమే మేమున్నా మంటూ ఆశ్రమవాసులు అక్కున చేర్చుకున్నారు. హృదయాలు బరువెక్కే ఈ సంఘటన కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని ఐడీపీఎల్‌లో చోటుచేసుకుంది.

పదిరోజులుగా కుత్బుల్లాపూర్ సర్కిల్‌పరిధిలోని ఐడీపీఎల్ చౌరస్తాలో ఉన్న బస్టాండ్‌లో ఓ వృద్ధుడు అచేతనంగా పడి ఉన్నాడు. రోజూ అక్కడే బస్సు ఎక్కే బాలానగర్‌కు చెందిన ఎల్ఐసీ ఉద్యోగి జ్యోతికి అతనిపై జాలేసింది. వృద్ధుడి వివరాల కోసం స్థానికులతో కలిసి ప్రయత్నించింది. తనపేరు నారాయణ అని, కన్న కొడుకులే తీసుకొవచ్చి బస్టాండ్ లో వదిలేశారని మాత్రమే చెప్పాడు. మిగతా కుటుంబ వివరాలు చెప్పడానికి నిరాకరించాడు. తనకు పరిచస్తురాలైన శ్రీదేవి దుండిగల్ సమీపంలో 'పల్లవి' వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న విషయం జ్యోతికి స్ఫురణకు వచింది. ఆదివారం సాయంత్రం ఆమెకు సమాచారమందించింది.

వెంటనే స్పందించిన శ్రీదేవి సోమవారం ఉదయం తమ ఆశ్రమ సిబ్బందితో జీడిమెట్ల పోలీసుస్టేషన్ చేరుకుని అతడిని ఆశ్రమానికి తీసుకువెళ్తున్నట్లు తెలిపింది. వారి సహాయాన్నిఅభినందించిన జీడిమెట్ల ఎస్సై ప్రవీందర్‌రావు అతడిని ఆశ్రమానికి చేర్చడానికి ప్రయాణ ఏర్పాట్లు చేశాడు. నిలబడే శక్తికూడా లేని అతడిని శ్రీదేవి ఆటోలో ఆశ్రమానికి తీసుకెళ్లింది. వృద్ధులకు సేవలందిస్తున్న శ్రీదేవిని స్థానికులు అభినందించారు. అనాథలను అక్కున చేర్చుకుని సేవలందిస్తున్న శ్రీదేవికి, సాటివారి దయనీయ స్థితిపై జాలిపడి ఆశ్రమానికి దారి చూపిన జ్యోతికి 'ఆన్‌లైన్' హ్యాట్సాఫ్ చెబుతోంది.

Thursday, December 18, 2008

దుఃఖానికి ఆమడ దూరం?

దుఃఖానికి ఆమడ దూరం?
మారుతున్న ధోరణి
'నాగరికత' తెస్తున్న మార్పు
దిగమింగుకోవడం సరికాదు
సంతోషం ఒక్కటే కాదు.. ఎంత వద్దనుకున్నా మన జీవితాల్లో దుఃఖానిదీ పెద్ద పాత్రే. కట్టలు తెంచుకుని ఉబికివచ్చే దుఃఖాన్ని బయటకు వదిలేస్తే.. మనసు తేలిక పడుతుంది. గుండెబరువు దిగుతుంది. కానీ కాలంతో పాటే ఇప్పుడు 'దుఃఖం' తీరుతెన్నులూ మారిపోతున్నాయి. నేడు ఎంతో మంది ఆత్మీయులో, బంధువులో చనిపోయినప్పుడు కూడా ఏడ్వటం, కాస్త బిగ్గరగా దుఃఖించడాన్ని 'అనాగరికమైన' వ్యవహారంగా భావిస్తున్నారు.

ఆత్మీయతలు కొరవడుతుండడం, ఆర్థిక అసమానతలు, మనుషులు దూరందూరంగా జీవిస్తుండడం లాంటి అంశాలు నేటి తరాన్ని మానసికంగా బాగా ప్రభావితం చేస్తున్నాయి. దీంతో సహజంగానే దుఃఖం గాఢత తగ్గిపోతోంది. మరోవైపు ఏడ్వటాన్ని చిన్నతనంగా భావిస్తూ దుఃఖాన్ని లోలోపలే దాచుకుంటున్నవారి సంఖ్యా పెరుగుతోందనీ, ఇదంతా నాగరికత ఫలితమేననీ చెబుతున్నారు సామాజిక విశ్లేషకులు.

''మా తాతయ్య చనిపోయినప్పుడు నాన్నమ్మతో పాటు ఇంట్లో అందరం తల్చుకుని తల్చుకుని మరీ చాలా రోజులు ఏడ్చాం. దాన్ని ఆపుకోలేకపోయేవాళ్లం. చుట్టుపక్కల వాళ్లు కూడా దాన్ని సహజంగానే పరిగణించేవారు. ఇప్పుడా వాతావరణాన్ని ఊహించడం కూడా కష్టం. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ఎవరైనా చనిపోతే ఆ దుఃఖం, ఏడుపులు ఆ రోజుకే.. ఇంకా చెప్పాలంటే ఆ కొద్ది గంటలకే పరిమితవుతున్న ఉదాహరణలు ఎన్నో'' అని గతాన్నీ, వర్తమానాన్నీ విశ్లేషిస్తున్నారు 50 ఏళ్ల వీరాంజనేయులు. బాధను వ్యక్తీకరించే తీరులో కూడా కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయని చెప్పటానికి ఆయన తరం అనుభవాలే సాక్ష్యం. ''ఇటీవల మా పిన్ని చనిపోయినప్పుడు ఆమె కూతుళ్లు మాట వరసకైనా ఏడ్వకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది. నా ఉద్దేశం వాళ్లు ఏడ్వాలని కాదుగానీ వారిలో ఆ బాధ, భావన కనబడకపోవటం చిత్రమనిపించింది'' అని తన అనుభవాన్ని వివరించారు మహబూబ్‌నగర్‌కి చెందిన ఎస్.బుచ్చిరెడ్డి. ఆత్మీయులు పోయినప్పుడు ఎవరికైనా అప్రయత్నంగానే ఏడుపు ముంచుకొస్తుంది. ఒకప్పుడు ఆత్మీయులంతా కన్నీరుమున్నీరవుతున్న దృశ్యాలు ప్రతిచోటా కనబడేవి. కానీ, ఇప్పుడిలాంటి వాతావరణం కేవలం గ్రామాలకే పరిమితమవుతోంది. పట్టణాల్లోని ఇరుకిరుకు అపార్టుమెంట్ జీవితాల్లో 'సభ్యత' పెద్ద అడ్డుగోడగా నిలుస్తోందని బాధపడ్డారు హైదరాబాద్‌లో నివసించే శ్రీనివాసరావు. రోజురోజుకీ నగర జీవితాలు బిజీగా మారుతుండడం, రెక్కలు రాగానే దారులు వేరైపోతుండటం లాంటివి అనుబంధాలనూ, ఆత్మీయతలనే కాదు, దుఃఖాన్నీ పల్చన చేస్తున్నాయి.

''మొన్న మా మామయ్య చనిపోయారు. ఆయనకి సంతానం లేదుగానీ తన ఒక్కగానొక్క తమ్ముడిని ఆయనే పెంచి పెద్దచేసి ఉద్యోగం కూడా ఇప్పించారు. ఆయన పోయినప్పుడు చెన్నై నుంచి ఆ తమ్ముడు వచ్చాడుగానీ కంట చుక్క నీరు కూడా కనబడకపోవటం ఆశ్చర్యమనిపించింది'' అని వివరించారు నల్గొండ జిల్లాకు చెందిన కె.నర్సింహ. ఆత్మీయులతో ఉండే అనుబంధాలను, జ్ఞాపకాలను అంత తేలికగా తుడిచేసుకోవటం ఆయనకు ఎక్కడలేని విస్మయాన్ని కలిగించింది. ''ఒకప్పుడు అన్నదమ్ములు విడిపోయినా అంతా దగ్గరగానే ఉండేవారు. ఒకరి అవసరానికి ఒకరు తోడుగా నిలిచేవారు. అనుబంధాలూ సజీవంగా ఉండేవి. కాబట్టే, దగ్గరివాళ్లు పోయినప్పుడు సహజంగానే దుఃఖం వచ్చేది'' అని వివరిస్తున్నారు నెల్లూరుకు చెందిన జి.భవాని. బాబాయి చనిపోతే ఆమె ఇటీవలే తమ ఊరు వెళ్లివచ్చారు. ఉద్యోగరీత్యా మర్నాడే తిరిగి వచ్చేయాల్సి వచ్చింది. ''వస్తూనే నెత్తిన వెయ్యి పనులు. ఇక అందరితో కలిసి ఆ దుఃఖాన్ని పంచుకునేదిమాత్రం ఏముంటుంది'' అని ప్రశ్నిస్తున్నారామె. దూరంగా ఉండటం, బిజీ జీవితాలవల్లనే కాబోలు.. తాను వెంటనే రోజువారీ పనుల్లో మునిగిపోయానని చెబుతారామె.

నిజానికి ఒక్క మరణ సందర్భాల్లోనే కాదు.. మొత్తమ్మీదే దుఃఖం తగ్గిపోయిందంటున్నారు ఖమ్మం జిల్లా వాసి మాధవి. ''మా అమ్మాయి అత్తారింటికి వెళ్లేటప్పుడు నాకు ఏడుపొస్తుందిగానీ.. తను మాత్రం నిబ్బరంగానే ఉంటుంది. పైగా రోజూ ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటాం కదా, ఆ మాత్రం దానికి ఏడుస్తావెందుకని నాకే ధైర్యం చెబుతుంది'' అంటారామె. అలాగని తన మనసులో బాధ లేదనుకోవటం లేదనీ, దాన్ని తను బయటకు వ్యక్తం చేయటం లేదంటారామె. ఇలా నేటి యవతరంలో మనసులోని భావాలను దాచుకోవటం, అణచిపెట్టుకోవటం పెరుగుతున్న మాట వాస్తవమేనంటూ ఇది విపరీతమైన ఫలితాలకు దారి తీస్తుందని సూచిస్తున్నారు క్లినికల్ సైకాలజిస్టు కె.నిరంజన్‌రెడ్డి. ''ప్రెషర్ కుక్కర్‌లో సేఫ్టీవాల్వ్ లాగానే... మనసులోని బాధని బయటకు పంపిచడానికి ఏడుపు కూడా ఒక మార్గంగా పనిచేస్తుంది. దీన్ని లోలోనే అణచుకుంటే నిద్ర సరిగా పట్టకపోవటం, దిగులు ఎక్కువ కావటం, ఆకలి తగ్గడం, బలహీనత, భయంకరమైన కలలు వంటివన్నీ మొదలవుతాయి'' అని ఆయన చెబుతున్నారు.

ఎవరైనా చనిపోయినప్పుడు కొన్నిరోజుల పాటు సంతాప దినాలుగా పాటించడం, అంతా ఊరడించటం తదితర సంప్రదాయాలన్నీ మనసులోని దుఃఖాన్ని పారదోలే ప్రయత్నాలే. వీటివల్ల దుఃఖంలో ఉన్నవారికి 'అందరూ తమ వెంటే ఉన్నారన్న' భావన కలుగుతుంది. ఒక రకంగా ఏడుపు కూడా 'సామాజిక భద్రత'లో భాగమే. అందుకే ఇది కొరవడటం సమాజానికే మంచిది కాదంటున్నారు విశ్లేషకులు. ఒకప్పుడు ఆత్మీయులు పోతే ఏడ్చేందుకు రాజులు అద్దె మనుషులను పెట్టుకునేవారు. రాజులమైన తాము ఏడవటమేంటని బింకాలు పోయేవారు. రాజులే పోయాక మనకెందుకీ డాంబికాలు 

Thursday, November 13, 2008

నేటి తెలుగుకు మేటి వెలుగు - అద్భుత


తెలుగు భాష ప్రాచీనమైందంటూ రాజముద్ర ఎట్టకేలకు పడింది. అసలు అధ్యాయం మొదలైంది. ప్రాచీన హోదా కిరీటమొక్కటే తెలుగుభాషను బతకించజాలదు. అమ్మకు అమ్మ ఉండేదని అంగీకరించినంత మాత్రాన ఒనగూడే ప్రయోజనం నామమాత్రమే. ఆత్మగౌరవం ఆయువు పోసుకుంది- అంతే! ఎంతసేపూ గతంలో గెంతులువేసి బావుకొనేదేం ఉండదు. తాతలు తాగిన నేతి వాసనల్ని చర్చకు పెట్టి లాభంలేదు. చెట్టుపేరు చెప్పుకొని కాయలు అంటగట్టలేం.

ప్రాచీనహోదా ఇచ్చినందుకు మహా అయితే ఏటా కొన్ని కోట్ల రూపాయల నిధులు ముట్టచెబుతారు. ఆ మొత్తంతో ఏం వెలగబెడతారన్నదే అసలు ప్రశ్న. పొరుగు రాష్ట్రంలోలాగా మనకంటూ పకడ్బందీ అనువాద విభాగం లేదు. అముద్రిత గ్రంథాలెన్నో శిథిµలావస్థకు చేరుతున్నాయి. ఆ జాబితా మన చేతుల్లో లేదు. పోనీ అకాడమీలను పునరుద్ధరిద్దామంటే- గతంలోని చేదు అనుభవం మనల్ని వెంటాడుతోంది. రచయితమ్మన్యులు తమ ప్రాపకం కోసం అకాడమీలను భ్రష్టుపట్టించి ఆధిపత్యపోరుకు తెరతీసిన నీచచరిత్ర ఇటీవలి మాటే. సాహిత్య అకాడమీ, సంగీత అకాడమీలను ఎన్టీఆర్ ఉన్నపళంగా రద్దు చేశారనటం నిజం కాదు. వాటి రద్దుకు దారితీసేలా కుళ్లు రాజకీయాలు రాజ్యమేలాయన్నది నిన్నటి సూర్యాస్తమయం అంతటి ఎర్రని నిజం!

ప్రస్తుత శుభసందర్భంలో తెలుగుభాష విశిష్టత గురించి వూరూరా సభలు పెట్టి వూదరకొట్టినందువల్ల ఉపయోగం శూన్యం. ఆంధ్రత్వ మాంధ్రభాషాచ నల్పస్య తపసఃఫలమ్ (ఆంధ్రులుగా పుట్టడం, ఆంధ్రభాష వ్యవహరించడం తపస్సిద్ధి పుణ్యమే) అంటూ ఢిల్లీ పాదుషాను మెప్పించిన గోదావరి వాసి అప్పయ్యదీక్షితులు ఏనాడో తెలుగుభాషకు జేజేలు పలికారు. అంతక్రితమే 'క్రీడాభిరామ' కర్త 'దేశభాషలందు తెనుగులెస్స' అంటూ తెలుగుకు పట్టం కట్టాడు. 'తెనుగు' అన్నమాట పరిమితమైన అర్థంలో భాషాపరంగానే చెలామణిలో ఉన్నందువల్ల దాన్ని తెలుగుగా మార్చి ఆముక్తమాల్యద కర్త 'దేశ భాషలందు తెలుగు లెస్స' అన్నాడు. తమిళకవి సుబ్రమణ్య భారతి 'సుందర తెనుంగు' అన్నాడని మురిసిపోనక్కరలేదు. అచ్చులతో అంతమయ్యే అరుదైన పదసంపద కలిగి- డాంటీ, పెట్రార్క్, బొకాసియోలు మెరుగులు దిద్దిన ఇటాలియన్ భాషతో మన భాషని పోల్చి, 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్'గా వినుతికెక్కేట్టు చేసిన నావికుడు నికొలయ్ కోంటి పేరు తలచుకుంటే ఒరిగేదేం లేదు. దేశానికి హిందీ, ఆంగ్లభాషలతో పాటు అధికారభాష కాదగ్గ అర్హత తెలుగుభాషకుందని ఆంగ్లశాస్త్రవేత్త హాల్డేన్ భావిస్తే ఏముంది... మన పాలకులకు ఆపాటి స్పృహ ఉండాలిగాని! పాత అణాలపై ఆనాటి ఆంగ్ల పాలకులు 'ఒక అణా' అంటూ ఆంగ్ల, హిందీ, బెంగాలీ, తెలుగు భాషల్లో ముద్రించిన ముచ్చట్లు స్వపరిపాలకులు మరిచారు.

రాజకీయ గ్రహణం పట్టి భాషల ఉనికి మసకబారిపోతోంది. ప్రపంచీకరణ పుణ్యమా అని ఎన్నో ప్రాంతీయ భాషలు, ముఖ్యంగా ఆఫ్రికన్ భాషలు మట్టికొట్టుకుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అయిదువేల భాషలు వ్యవహారంలో ఉన్నాయని అంచనా. నేడు రమారమి రెండువేల భాషల రెక్కలు విరిగి ప్రపంచభాషల సంఖ్య మూడువేలకు పడిపోయింది.

ఇప్పుడు మనముందున్న సమస్యల్లా- నేటి అవసరాలకు సరిపడేలా తెలుగు భాషను రూపొందించేందుకు త్వరపడటం. ప్రాచీనత విషయం పక్కన ఉంచి ఆధునికతవైపు మనం దృష్టి సారించాలి. ఆధునిక భాషగా తెలుగు మనగలిగేలా మనం నడుం బిగించాలి. తెలుగు మాధ్యమంలో చదివిన సిసలైన భాషాభిమానుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి. పీజీ స్థాయిలో తెలుగును అభ్యసించిన వాళ్లకు ఉపాధి అవకాశాలు అందివచ్చేలా హామీ ఇవ్వగలగాలి. ప్రహసనంగా మారిన జిల్లాకో విశ్వవిద్యాలయం ప్రణాళికలో ఎం.ఎ. (తెలుగు) కోర్సుకు అంతంతమాత్రం చోటుండటం ఆలోచించాల్సిన విషయం. ఎం.ఎ (తెలుగు)లో పత్రికారచనను రెండు పేపర్లుగా, ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు పాఠ్యప్రణాళికను కొత్త విశ్వవిద్యాలయాలు సిద్ధం చేసుకోలేకపోవటం అంతుబట్టని విషయం. ఓవైపు ఆరువేల బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో సీబీయస్ఈ కోర్సును ప్రవేశపెడుతున్న మన సర్కారు, ఆధునికభాషగా తెలుగును ఏ మేరకు నిలబెడుతుందన్న విషయంలో సవాలక్ష సందేహాలున్నాయి. యాభైఆరు అక్షరాల తెలుగు వర్ణమాల విషయంలో ప్రామాణికత సాధించాల్సి ఉంది. ప్రాచీన ద్రావిడ మాతృకలో పదహారు హల్లులూ, పది అచ్చులూ మాత్రమే ఉన్నాయి. క్రీ.శ. ఏడో శతాబ్ది తెలుగులో పది అచ్చులూ, ఇరవైఒక్క హల్లులూ ఉండగా కాలక్రమంలో సంస్కృత ప్రభావంతో మహాప్రాణ వర్ణాలు పది (శ, ష, హ...) వచ్చి చేరాయి. ప్రాకృతం నించీ 'ఱ' ప్రవేశించింది. మరీ ఎక్కువగా తెలుగులోకి యాభైవేలకుపైగా సంస్కృత పదాలు చేరి అచ్చతెలుగు కనుమరుగైంది. తెలుగు భాషకు అడ్డుగోడగా ఆంగ్లమే కాకుండా సంస్కృతమూ వచ్చి చేరింది. ఇంటర్మీడియట్ స్థాయిలో కార్పొరేట్ కళాశాలల్లో సంస్కృతం స్థానంలో ద్వితీయభాషగా తెలుగును కనీసమాత్రంగానైనా అధికారభాషా సంఘం ఎందుకని అమలు చేయలేకపోతోందో చూడాలి. తెలుగు మీడియం పొత్తాల్లో తెలుగుపాలు ఎంతన్నది ఓ ధర్మసందేహం. సకశేరుకాలు (వెన్నెముక కలిగిన జీవులు), అకశేరుకాలు (వెన్నెముక లేని ప్రాణాలు)... వంటివి ఏ ఒక్కరికైనా బోధపడతాయా అన్నది ప్రశ్న. తెలుగులో సంతకంచేయని ఆచార్యులున్న భాషమనది. ఆంగ్లమాధ్యమంలో తరించిన సుపుత్రులున్న తెలుగు భాషోద్యమకారులు మనసొత్తు. ఇన్ని వైరుధ్యాల నడుమ తెలుగుభాష నడుం బెణక్కుండా ఆధునిక భాషగా రాణించటానికి పెద్దపెట్టున కృషి జరగాలి. అందుకు మన మనసుల విస్తీర్ణం పెరగాలి.

విషయ పరిజ్ఞానం లేని శుంఠలకు కూడా ఉద్యోగాలు వస్తాయా?


సంస్కృతం,తమిళం తో పాటు తెలుగు కన్నడ భాషలను కూడా ప్రాచీన భాషలు గా కేంద్రం ప్రకటించింది. ప్రాచీన హోదాతో వచ్చే నిధుల్ని ఆధునిక అవసరాలకు వినియోగించాలనే వాదనలు అప్పుడే మొదలయ్యాయి.చైనా భాష తమిళం కంటే ప్రాచీనం.వారు లిపిఆధునిక అవసరాలకు అనువుగాలేదని చాలా సార్లు సంస్కరించుకున్నారు.మనం కుండపెంకుల మీద, బండరాళ్ల మీద రాసుకుంటున్న రోజులలో ఒక లిపి సహితం లేని రష్యా వాళ్లు, జపాన్ వాళ్లు వారి భాషలను ఆధునిక అవసరాలకు అనువుగా మార్చారు.మన లిపిని మనం ఎందుకు మార్చుకోలేము? జాతి ఎదుగుదలకు కావలసింది వారి భాష ప్రాచీనహోదాతో పాటు ఆభాషను ఆధునిక అవసరాలకు కూడా సరిపడేలా తీర్చిదిద్దుకోవటం.భాషాభిమానంతో పాటు ప్రజల నిత్య జీవి తానికి సంబంధించిన పాలనా వ్యవహారాలలో స్వభాష పెత్తనం చేయాలి.

తెలుగు అధికార భాష చట్టం 1966లో వచ్చింది.ఉర్దూ హైదరాబాద్, అనంత పురం, కర్నూలు, కడప, గుంటూరు, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలలో రెండవ అధికార భాష అన్న సవరణ 1996లో జారీ అయింది. ప్రభుత్వం జారీ చేసే చట్టాలూ ఆదేశాలూ నియమాలూ, ప్రభుత్వం ఇతర సంస్థలతో జరిపే ఉత్తరప్రత్యుత్తరాలూ అధికార భాషలలోనే ఉండాలనీ చట్టంలో ఉంది,కానీఉర్దూలోకానీ తెలుగులోకాని అనే అమలు కావటంలేదు.ఇద్దరికీ ఇంగ్లీషే శరణ్యమయ్యింది.1988 నవంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ ఉత్తర్వులూ ఉత్తర ప్రత్యుత్త రాలూ తెలుగులోనే ఉండాలనీ, ఇంగ్లీష్ కేవలం కేంద్ర ప్రభుత్వంతో, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడే భాష అని జీవో జారీ అయ్యింది. ప్రభుత్వ ఉత్తర్వులు ఉత్తర ప్రత్యుత్త రాలు ప్రజలకు అందుబాట్లో ఉంచాలని, వారి అభిప్రాయాలు అభ్యంతరాలు వినడానికి బహిరంగ విచారణ జరపాలనీ చట్టం అంటుంది. కానీ అవి ప్రజలకర్థమయ్యే భాషలో ఉండటంలేదు. ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆ పని మాత్రం చేయటంలేదు.అలాగే న్యాయస్థానాలలో స్థానిక భాష వాడటంలేదు.తెలుగు ప్రజల జీవితాలు, ఆస్తులు, కుటుంబ వ్యవహారాలకు సంబం ధించిన వ్యాజ్యాలలో విచారణ, వాదోపవాదాలు తమకు అర్థం కాని భాషలో జరుగుతుంటే తెలుగు ప్రజలు నోరు వెళ్ల బెట్టుకొని చూస్తున్నారు.ఇది మన జాతికి అవమానకరం. తమిళులు 1976 నుంచి క్రిమినల్ కేసులు సెషన్స్ కోర్టు దాకా,1982 నుంచి సివిల్ కేసులు పూర్తిగా తమిళంలోనే జరుపుతున్నారు.

హిందీ రాష్ట్రాలు హిందీలోనూ గుజరాత్, బెంగాల్ రాష్ట్రాలుహైకోర్టుల్లో తప్ప మిగతా అన్ని కోర్టుల్లో తమ తమ భాషలలోనే న్యాయవ్యవస్థను నడుపుతున్నాయి. మనకు మెజిస్ట్రేట్ కోర్టులలో కూడా ఇంగ్లీషే.తమిళం ఇంగ్లీష్తో పోటీపడి ఎదుగుతున్నది .వత్తులు గుణింతాలు అన్నీ పక్కపక్కనే ఇంగ్లీష్లో లాగా ఒక వరసలో యంత్రానికి అనుకూలంగా తమిళ లిపి వారికి వరంగా మారింది."అరవమున డెమ్మీ ఫారము ముద్రణకు నాలుగు రూపాయలు చార్జి చేయగా తెలుగునకదేమాదిరి ఫారమునకు ఎనిమిదిరూపాయలు చార్జి చేయుచున్నారు.ఇట్లు ధర తక్కువయగుటకు కారణము అరవ లిపిలో సంకేతముల సంఖ్య మిక్కిలి తక్కువగా నుండుట.తెలుగచ్చును కంపోజిటర్లు నేర్చుకొనుటకు ఆరునెలలు పడితే అరవము ఒక నెలలో నేర్చుకొన వచ్చును.తెలుగు లిపిని గూర్చుట జాల జాగగును.గంటకు ఒక గాలీ అరవము కూర్చగలుగగా తెలుగున అరగాలీ మాత్రమే కుర్చగలము.అచ్చునకే ఇన్ని చిక్కులుండగా నింక టైపురైటింగు కుదురునా?" అని వేటూరి ప్రభాకర శాస్త్రి వాపోయారు.ఇంగ్లీషున అరవమున ఉన్నట్లు లిపి సంకేతములు ప్రక్కప్రక్కనే (ఒకదానిక్రిందనొకటి యుండకుండుట) యుండవలెనని ఆయన కోరారు.రాజీవ్ గాంధీ హత్య కేసు కూడా తమిళంలోనే జరి గిందట. అప్పీలును విచారించే సుప్రీంకోర్టు తమిళంలో ఉన్న పత్రాలన్నిటినీ ఇంగ్లీష్‌లోకి అనువాదం చేయించుకొని అప్పీల్ వింది. ఇంగ్లీష్ వచ్చిన వారికే మంచి ఉద్యోగాలు వస్తున్నందు వల్ల ప్రభుత్వ పాఠశాలలలో కూడ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నారు.పిల్లలు కొత్త భాషలు సునాయాసంగా నేర్చుకుటారని వాదిస్తున్నారు.మాతృభాషలో విద్యా బోధనే పిల్లల కు మంచిదంటే హేళనచేస్తున్నారు.మీపిల్లలు ఏ మాధ్యమం లో చదువుకుంటున్నారని ఎదురు ప్రశ్నిస్తున్నారు.పిల్లలందరినీ ఆంగ్ల మాధ్యమం లో పడేస్తే నిజంగానే గొప్పఅవకాశాలొస్తాయా? ఉద్యోగాలు వస్తున్నది ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం వల్లనా లేక విషయవిజ్ఞానం వల్లనా? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళలోకూడా విషయ పరిజ్ఞానం లేని శుంఠలకు కూడా ఉద్యోగాలు వస్తాయా?భాష నేర్చుకోవడం వేరు, భాషలో చదువు నేర్చుకోవడం వేరు.పర భాషలో చదువుపిల్లలకు హింసే. పిల్లలందరినీ ఇంగ్లీష్ మీడియంలోకి నెట్టడంకంటే ప్రైవేట్ పాఠశాలలు కూడా మాతృభాషలోనే చదువు నేర్పటం తప్పనిసరి చేయాలి. ఇంగ్లీష్‌ను కేవలం ఒక భాషగా నేర్పాలి.

లిపిసంస్కరణ కోసం ప్రాచీన హోదా నిధుల్ని వినియోగించాలి.

సంస్కృతం,తమిళం తో పాటు తెలుగు కన్నడ భాషలను కూడా ప్రాచీన భాషలు గా కేంద్రం ప్రకటించింది. ప్రాచీన హోదాతో వచ్చే నిధుల్ని ఆధునిక అవసరాలకు వినియోగించాలనే వాదనలు అప్పుడే మొదలయ్యాయి.చైనా భాష తమిళం కంటే ప్రాచీనం.వారు లిపిఆధునిక అవసరాలకు అనువుగాలేదని చాలా సార్లు సంస్కరించుకున్నారు.మనం కుండపెంకుల మీద, బండరాళ్ల మీద రాసుకుంటున్న రోజులలో ఒక లిపి సహితం లేని రష్యా వాళ్లు, జపాన్ వాళ్లు వారి భాషలను ఆధునిక అవసరాలకు అనువుగా మార్చారు.

మన లిపిని మనం ఎందుకు మార్చుకోలేము? జాతి ఎదుగుదలకు కావలసింది వారి భాష ప్రాచీనహోదాతో పాటు ఆభాషను ఆధునిక అవసరాలకు కూడా సరిపడేలా తీర్చిదిద్దుకోవటం.భాషాభిమానంతో పాటు ప్రజల నిత్య జీవి తానికి సంబంధించిన పాలనా వ్యవహారాలలో స్వభాష పెత్తనం చేయాలి. తెలుగు అధికార భాష చట్టం 1966లో వచ్చింది.ఉర్దూ హైదరాబాద్, అనంత పురం, కర్నూలు, కడప, గుంటూరు, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలలో రెండవ అధికార భాష అన్న సవరణ 1996లో జారీ అయింది. ప్రభుత్వం జారీ చేసే చట్టాలూ ఆదేశాలూ నియమాలూ, ప్రభుత్వం ఇతర సంస్థలతో జరిపే ఉత్తరప్రత్యుత్తరాలూ అధికార భాషలలోనే ఉండాలనీ చట్టంలో ఉంది,కానీఉర్దూలోకానీ తెలుగులోకాని అనే అమలు కావటంలేదు.ఇద్దరికీ ఇంగ్లీషే శరణ్యమయ్యింది.

1988 నవంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ ఉత్తర్వులూ ఉత్తర ప్రత్యుత్త రాలూ తెలుగులోనే ఉండాలనీ, ఇంగ్లీష్ కేవలం కేంద్ర ప్రభుత్వంతో, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడే భాష అని జీవో జారీ అయ్యింది. ప్రభుత్వ ఉత్తర్వులు ఉత్తర ప్రత్యుత్త రాలు ప్రజలకు అందుబాట్లో ఉంచాలని, వారి అభిప్రాయాలు అభ్యంతరాలు వినడానికి బహిరంగ విచారణ జరపాలనీ చట్టం అంటుంది. కానీ అవి ప్రజలకర్థమయ్యే భాషలో ఉండటంలేదు. ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆ పని మాత్రం చేయటంలేదు.అలాగే న్యాయస్థానాలలో స్థానిక భాష వాడటంలేదు.తెలుగు ప్రజల జీవితాలు, ఆస్తులు, కుటుంబ వ్యవహారాలకు సంబం ధించిన వ్యాజ్యాలలో విచారణ, వాదోపవాదాలు తమకు అర్థం కాని భాషలో జరుగుతుంటే తెలుగు ప్రజలు నోరు వెళ్ల బెట్టుకొని చూస్తున్నారు.ఇది మన జాతికి అవమానకరం.

తమిళులు 1976 నుంచి క్రిమినల్ కేసులు సెషన్స్ కోర్టు దాకా,1982 నుంచి సివిల్ కేసులు పూర్తిగా తమిళంలోనే జరుపుతున్నారు. హిందీ రాష్ట్రాలు హిందీలోనూ గుజరాత్, బెంగాల్ రాష్ట్రాలుహైకోర్టుల్లో తప్ప మిగతా అన్ని కోర్టుల్లో తమ తమ భాషలలోనే న్యాయవ్యవస్థను నడుపుతున్నాయి. మనకు మెజిస్ట్రేట్ కోర్టులలో కూడా ఇంగ్లీషే.తమిళం ఇంగ్లీష్తో పోటీపడి ఎదుగుతున్నది .వత్తులు గుణింతాలు అన్నీ పక్కపక్కనే ఇంగ్లీష్లో లాగా ఒక వరసలో యంత్రానికి అనుకూలంగా తమిళ లిపి వారికి వరంగా మారింది."అరవమున డెమ్మీ ఫారము ముద్రణకు నాలుగు రూపాయలు చార్జి చేయగా తెలుగునకదేమాదిరి ఫారమునకు ఎనిమిదిరూపాయలు చార్జి చేయుచున్నారు.ఇట్లు ధర తక్కువయగుటకు కారణము అరవ లిపిలో సంకేతముల సంఖ్య మిక్కిలి తక్కువగా నుండుట.తెలుగచ్చును కంపోజిటర్లు నేర్చుకొనుటకు ఆరునెలలు పడితే అరవము ఒక నెలలో నేర్చుకొన వచ్చును.తెలుగు లిపిని గూర్చుట జాల జాగగును.గంటకు ఒక గాలీ అరవము కూర్చగలుగగా తెలుగున అరగాలీ మాత్రమే కుర్చగలము.అచ్చునకే ఇన్ని చిక్కులుండగా నింక టైపురైటింగు కుదురునా?" అని వేటూరి ప్రభాకరశాస్త్రి, వేటూరి ప్రభాకరశాస్త్రి వాపోయారు.
ఇంగ్లీషున అరవమున ఉన్నట్లు లిపి సంకేతములు ప్రక్కప్రక్కనే (ఒకదానిక్రిందనొకటి యుండకుండుట) యుండవలెనని ఆయన కోరారు.రాజీవ్ గాంధీ హత్య కేసు కూడా తమిళంలోనే జరి గిందట. అప్పీలును విచారించే సుప్రీంకోర్టు తమిళంలో ఉన్న పత్రాలన్నిటినీ ఇంగ్లీష్‌లోకి అనువాదం చేయించుకొని అప్పీల్ వింది. ఇంగ్లీష్ వచ్చిన వారికే మంచి ఉద్యోగాలు వస్తున్నందు వల్ల ప్రభుత్వ పాఠశాలలలో కూడ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నారు.పిల్లలు కొత్త భాషలు సునాయాసంగా నేర్చుకుటారని వాదిస్తున్నారు.మాతృభాషలో విద్యా బోధనే పిల్లల కు మంచిదంటే హేళనచేస్తున్నారు.మీపిల్లలు ఏ మాధ్యమం లో చదువుకుంటున్నారని ఎదురు ప్రశ్నిస్తున్నారు.పిల్లలందరినీ ఆంగ్ల మాధ్యమం లో పడేస్తే నిజంగానే గొప్పఅవకాశాలొస్తాయా? ఉద్యోగాలు వస్తున్నది ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం వల్లనా లేక విషయవిజ్ఞానం వల్లనా? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళలోకూడా విషయ పరిజ్ఞానం లేని శుంఠలకు కూడా ఉద్యోగాలు వస్తాయా?భాష నేర్చుకోవడం వేరు, భాషలో చదువు నేర్చుకోవడం వేరు.పర భాషలో చదువుపిల్లలకు హింసే. పిల్లలందరినీ ఇంగ్లీష్ మీడియంలోకి నెట్టడంకంటే ప్రైవేట్ పాఠశాలలు కూడా మాతృభాషలోనే చదువు నేర్పటం తప్పనిసరి చేయాలి. ఇంగ్లీష్‌ను కేవలం ఒక భాషగా నేర్పాలి.ఇంగ్లీషు,తమిళ భాషల లాగా మన తెలుగులిపి సంకేతములు ప్రక్కప్రక్కనే కూడా ఉండేలా లిపిసంస్కరణ (ఇంకా రాయలేదు లిపిసంస్కరణ కోసం ప్రాచీన హోదాద్వారా వచ్చే నిధుల్ని వినియోగించాలి.

చక్కని తెలుగుకు చాంగుభళా!

చక్కని తెలుగుకు చాంగుభళా!
- రావూరి ప్రసాద్
మేడలా, మిద్దెలా, కరెన్సీ నోట్లా, కనకాభరణాలా... ఏది నిజమైన ఆస్తి?

ఆరుద్ర మాటల్లో చెప్పాలంటే-
'ఎవరికైనా ఆస్తిఏముంటుంది?
సంగీతంలో సప్తస్వరాలు
సాహిత్యంలో యాభైరెండు అక్షరాలు!'

నిజం. అసంఖ్యాకమైన రాగాలకు ఊపిరిలూదిన ఏడంటే ఏడు స్వరాలకంటే, అసమానమైన రసరమ్య కావ్యాలెన్నింటికో రెక్కలు తొడిగిన యాభైరెండు అక్షరాలకంటే వేరే కలిమి ఎవరికైనా ఏముంటుంది?

అవును. అజరామరమైన ఆ సప్తస్వరాలే తెలుగువాడిగా నా ఆస్తి! అక్షయమైన ఆ యాభైరెండు అక్షరాలే తెలుగువాడిగా నా ఆస్తి!

పట్టుతేనెలోని మధురిమను చిలకరించే నా తెలుగు అక్షరాలకు సాటిరాగల మేడలేవి?

వెన్నెల జలపాతాన్ని కురిపించే నా తెలుగు పదం వన్నెచిన్నెలకు ఏ కనకాభరణాల మిలమిలలు సరితూగగలవు?

నింగీ, నేలా నడుమ నిలువెత్తు సంతకమై నిలిచిన నా తెలుగు వాక్యం ఠీవికి ఏ ఆకాశహర్మ్యం సొగసులు దీటు కాగలవు?

ఆమని సౌందర్యాన్ని తన అక్షరాల్లో సాక్షాత్కరింపజేసే నా తెలుగు 'సరస్వతమ్మ' పలుకుల కలరవాలకు ఎన్ని కరెన్సీ నోట్ల రెపరెపలు సరిపోలగలవు?

రామకథా 'రాగసుధాపానముచేసి' తెలుగు మనసు రంజిల్లడానికి త్యాగయ్య నాదమయం చేసిన సంగీతార్ణవంలోని సప్తస్వరాల క్షీరధారలు నా తెలుగు అక్షరాలు-

తెలుగునేల చీకట్లను పారదోలడానికి వేల సంకీర్తనల్లో అన్నమయ్య వెలిగించిన 'వెన్నెలవంటి శ్రీవేంకటేశు మంత్రము'లోని మణిదీప్తులు నా తెలుగు అక్షరాలు-

మాధవస్వామికి క్షేత్రయ్య అలదిన మధుర పద భక్తిచందనంలోని పరిమళాలు నా తెలుగు అక్షరాలు-

ప్రభువులు సాక్షాత్తు దైవాంశ సంభూతులేనని భావించే కాలంలోనే 'ఇమ్మనుజేశ్వరాధములు' అంటూ 'పాలక దేవుళ్ల' నిజరూపాన్ని బయటపెట్టిన పోతన ధిక్కార గళంలోని రణన్నినాదాలు నా తెలుగు అక్షరాలు-

'రాజుల్ మత్తులు' అంటూ ఆ రోజుల్లోనే ఎలుగెత్తిన ధూర్జటి ఘంటారావంలోని గర్జనలు నా తెలుగు అక్షరాలు-

'మనుష్యుడే నా సంగీతం, మానవుడే నా సందేశం' అని చాటి దోపిడీలకు, అసమానతలకు, దౌర్జన్యాలకు తావులేని 'మరో ప్రపంచం' వైపు పదండి ముందుకు అంటూ శ్రీశ్రీ క్రాంతి గానం మీటిన కత్తి అంచులమీది తళతళలు నా తెలుగు అక్షరాలు-

'ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది' అంటూ వైతాళికుడు గురజాడ వందేళ్ల క్రితమే నినదించిన భవిష్య వాక్కులు నా తెలుగు అక్షరాలు-

నన్నెచోడుని నుంచి నవయుగ కవిచక్రవర్తి జాషువా దాకా, కవిత్రయం నుంచి కృష్ణశాస్త్రి దాకా, వేమన నుంచి విశ్వనాథ దాకా ఎందరెందరో సాహితీ సారస్వతమూర్తులు తమ అమృత కరస్పర్శతో సుసంపన్నం చేసిన తెలుగు అక్షర భాండాగారం మన ఆస్తి!

ద్వారం వెంకటస్వామి నుంచి జనార్దన్ వరకు, ఈమని శంకరశాస్త్రి నుంచి షేక్ చినమౌలానా వరకు; బాలమురళీకృష్ణ నుంచి నూకల చినసత్యనారాయణ వరకు ఎందరో నాద, గాన యోగులు తమ వేళ్ల కొసలతో, గాత్రమాధుర్యంతో సంపద్వంతం చేసిన సంగీత రసధుని మన ఆస్తి!

ఈ ఆస్తిని కాపాడుకోవాలంటే నిరంతరం తెలుగు అక్షరాలు వెలుగుతుండాలి. తెలుగు పదాలు పల్లవిస్తుండాలి. తెలుగు శబ్దాలు వేదాలై, నాదాలై ప్రతి గుండెలో ప్రతిధ్వనిస్తుండాలి. 'జాను తెనుగే మేము- జాతి ఘనతే మేము' అంటూ మల్లాది రామకృష్ణశాస్త్రి మోగించిన తెలుగు జయభేరిని సగౌరవంగా అందుకుంటూ తెలుగువారిలో ప్రతి ఒక్కరూ సగర్వంగా ముందుకు సాగాలి

నలుగురి కోసం 'నారాయణ'

నలుగురి కోసం 'నారాయణ'
సామాజిక సంబంధాలకే పెద్దపీట
అందరినీ కలుపుకుపోవడమే ఉత్తమం
మారుతున్న యువత ధోరణి
గుడికి వెళతారు.. కానీ పెద్దగా భక్తి లేదు. అర్చనలు చేస్తుంటారు.. కానీ అంత ఆసక్తితో కాదు. నేటి యువతలో భక్తి కొరవడుతోందని ఓవైపు.. లేదు మళ్లీ పెరుగుతోందని మరోవైపు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువతను పలకరిస్తే.. ''భక్తిమాటెలా ఉన్నా 'సంప్రదాయాలను' మాత్రం వదులుకోం'' అని స్పష్టంగా చెబుతుండటం విశేషం!

''దేవునిపై నాకు ప్రత్యేకంగా నమ్మకం లేదు. అలాగని అపనమ్మకమూ లేదు. ఒక రకంగా ఆ విషయానికి నేను అంత ప్రాధాన్యం ఇవ్వను. సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడు అమ్మానాన్నలతోపాటు పండగలు జరుపుకుంటాను. బంధువులతో కలిసి చర్చికి వెళ్తా'' అని చెబుతారు కేరళకు చెందిన చైత్ర. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ చేస్తున్నారామె. భగవంతునిపై అంతగా నమ్మకం లేనప్పుడు చర్చికి ఎందుకు వెళతారు అని అడిగితే.. అందరితో కలవటం కోసం అని అంటారు! వెళ్లకపోతే అందరికీ దూరంగా విడిగా ఉండాల్సి వస్తుంది, అలా ఉండటం నాకు ఇష్టం లేదని చెబుతున్నారు చైత్ర. నేటి యువత ఆధ్యాత్మిక విషయాలు, ఆచార వ్యవహారాలను వేర్వేరుగా చూస్తున్నారనటానికి చైత్ర ఓ నిదర్శనం. ఈ ధోరణి కొద్దిమందికే, కొన్ని ప్రాంతాలకే పరిమితం కాలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ ఇంగ్లిష్ చేస్తున్న సంపత్‌ను కదిలించినా ఇలాంటి అభిప్రాయమే వినిపిస్తుంది. ''దేవుని విషయంలో నాకంటూ ప్రత్యేకంగా ఇష్టాయిష్టాలేమీ లేవు. మిత్రులతో కలిసి ఎప్పుడైనా గుడికి వెళ్తుంటా. కాకపోతే గాఢమైన భక్తేమీ లేదు. ఓ పక్కన కూర్చుని వచ్చిపోయే వాళ్లని గమనిస్తూ ఉంటా'' అని అంటారు. పెళ్లి సంప్రదాయబద్ధంగా చేసుకుంటారా? లేక రిజిస్ట్రేషన్‌లాంటి పద్ధతుల్లో పయనిస్తారా? అని అడిగితే మొదటి దానికే తన ఓటు అని ఘంటాపథంగా చెప్పారు. ''పెళ్లంటే అమ్మానాన్నా, బంధువులు, స్నేహితులు... వీరందరితో ముడివడిన అంశం. నా ఒక్కడికే పరిమితమైంది కాదు. వాళ్లందరి అభిప్రాయాలను, నమ్మకాలను కాదని నేను వెళ్లను. అందిరినీ కలుపుకొని పోతేనే ఆనందం కదా'' అని తన దృక్పథాన్ని వివరిస్తారు సంపత్.

మార్పు వస్తోంది
ఇప్పటికీ ఎంతో దీక్షగా పూజలు, ఉపవాసాలు చేసే యువతీయువకులూ కొదవ లేదు. నల్గొండకు చెందిన మనోహర్ పొద్దున్నే సూర్యనమస్కారంతోనే దినచర్య ప్రారంభిస్తారు. ప్రతీ శనివారం తప్పకుండా గుడికి వెళ్తారు. జీవితంలో ఏది జరగాలన్నా భగవంతుని కృప ఉండాలనీ, దానికి మన ప్రయత్నం తోడుగా నిలవాలని చెబుతారు. మరోవైపు 'గాఢ భక్తికి కారణం భయమేనంటారు' నిజామాబాద్‌కు చెందిన ఎంఏ విద్యార్థి శ్రీకాంత్‌రెడ్డి. ''దేవుణ్ణి నమ్మకపోతే ఏమైనా అవుతుందేమోనని భయం. ఇటీవల ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్‌కు ముందు పూజలు చెయ్యలేదా? ఆ ప్రయోగం తప్పకుండా విజయవంతం అవుతుందనే నమ్మకమే వాళ్లకు ఉంటే పూజలు చేసేవారా?'' అని ప్రశ్నిస్తారు. విషయం ఏమిటంటే ఆయన కూడా దేవున్ని నమ్ముతారు. మరి, మీకున్న భయమేమిటి అని అడిగితే, ''జీవితంలో ఎలా స్థిరపడతానో అనే భయం. ఆ తర్వాత అనువైన భార్య దొరకాలని, పిల్లలు పుట్టాలని ఇలా... కోరికలు వాటితోపాటే భయాలు వస్తూనే ఉంటాయి'' అని నిర్మొహమాటంగా తన అంతరంగాన్ని వెల్లడిస్తారు. భయం మాటెలా ఉన్నా.. యువతరం భక్తిలో ఆధ్యాత్మికమైన గాఢత లేకపోవటం మాత్రం కొట్టొచ్చినట్టు కనబడుతున్న వాస్తవం. యువత ఆలోచనల్లో వస్తున్న ఇలాంటి మార్పుల వల్లే భక్తి-సంప్రదాయాలు రెండూ ఇప్పుడు వేర్వేరు దార్లుగా మారిపోయాయి.

దేని దారి దానిదే
గతంలో భక్తి, సంప్రదాయం రెండూ కలిసిపోయే ఉండేవి. గుడికి వెళ్లటంలో, పూజలు చేయటంలో ఎంత ఉత్సాహం కనిపించేదో పండగలు, తంతుల్లోనూ అంతగా మమేకమయ్యేవారు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య అవినాభావం తగ్గుతోంది. పరీక్షల సమయంలోనో, ఇంటర్వ్యూకు వెళ్లాల్సి వచ్చినప్పుడో, మరేదైనా సమస్య తలెత్తినప్పుడో తప్ప దైనందిన జీవితంలో దైవానికి తొలిప్రాధాన్యం ఇవ్వటం తక్కువేనంటున్నారు చాలామంది యువకులు. ఆడపిల్లలు మాత్రం ఇందుకు కొద్దిగా భిన్నం. రోజువారీ భక్తిగా ఉండే ఆడపిల్లల సంఖ్య కొంత ఎక్కువగానే కనబడుతోంది. ఈ భక్తి మోతాదు యువతలో ఎలా ఉన్నా.. సంప్రదాయాలకు మాత్రం అంతా పెద్దపీట వేస్తుండటం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గుంటూరుకు చెందిన పీహెచ్‌డీ విద్యార్థి శ్రీనివాస్‌నే తీసుకుంటే... తాను దేవున్ని నమ్మనని, నాస్తికుణ్ణని చెబుతారు. ఏడాది క్రితం ఆయన పెళ్లి మాత్రం సంప్రదాయబద్ధంగానే జరిగింది. పెళ్లితంతుపై నమ్మకం లేనప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు అంటే 'అమ్మానాన్న బాధపడతారు, అందరూ నన్ను దూరంగా ఉంచుతారు. అంత రిస్కు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆ తంతు కాదంటే పెద్ద రభస. అదే తలూపితే.. అంతా ఎంజాయ్ చేస్తారు కదా' అంటారు.

మొత్తానికి వ్యక్తిగత నమ్మకాలెలా ఉన్నా.. సామాజిక జీవనానికి సంప్రదాయాలే ఆలంబనగా నిలుస్తున్నాయన్న విషయం యువత అభిప్రాయాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకూ పాలూనీళ్లలా కలగలిసిపోయిన భక్తి-ఆచారాలను.. నేటి యువత హంసలా నేర్పుగా వేరు చేస్తుండటం విశేషం

Thursday, July 03, 2008

Am I a Hindu??


Dear all - interesting reading - a bit long (it is not my story)

Four years ago, I was flying from JFK NY Airport to SFO to attend a meeting at Monterey, CA.
An American girl was sitting on the right side, near window seat.

It indeed was a long journey - it would take nearly seven hours!
*I was surprised to see the young girl reading a Bible - unusual of young
Americans! (Later I came to know that September 11 has changed mind-set of
lot of US citizens. They suddenly turned religious, it seemed.)
After some time she smiled and we had few acquaintances talk. I told her
that I am from India.
*
*Then suddenly the girl asked: 'What's your faith?'
'What?' I didn't understand the question.
'I mean, what's your religion? Are you a Christian? Or a Muslim?'
'No!' I replied, 'I am neither Christian nor Muslim'..
Apparently she appeared shocked to listen to that.
'Then who are you…?'
'I am a Hindu', I said.
She looked at me as if she is seeing a caged animal.
She could not understand what I was talking about.
*
*A common man in Europe or US know about Christianity and Islam, as they are
the leading religions of the world today.
*
*But a Hindu, what?
I explained to her - I am born to a Hindu father and Hindu mother.
Therefore, I am a Hindu by birth.*

*'Who is your prophet?' she asked.
'We don't have a prophet,' I replied.
'What's your Holy Book?'
'We don't have a single Holy Book, but we have hundreds and thousands of
philosophical and sacred scriptures,' I replied.
'Oh, come on…at least tell me who is your God?'
'What do you mean by that?'*


*'Like we have Yahweh and Muslims have Allah - don't you have a God?'*

*I thought for a moment. Muslims and Christians believe one God (Male God)
who created the world and takes an interest in the humans who inhabit it.
Her mind is conditioned with that kind of belief.
*

* **According to her (or anybody who doesn't know about Hinduism), a
religion need to have one Prophet, one Holy book and one God. The mind is so
conditioned and rigidly narrowed down to such a notion that anything else is
not acceptable. I understood her perception and concept about faith. You
can't compare Hinduism with any of the present leading religions where you
have to believe in one concept of god.
*

* **I tried to explain to her: 'You can believe in one god and he can be a
Hindu. You may believe in multiple deities and still you can be a Hindu.
What's more - you may not believe in god at all, still you can be a Hindu.
An atheist can also be a Hindu.'
This sounded very crazy to her.
*

*She couldn't imagine a religion so unorganized, still surviving for
thousands of years, even after onslaught from foreign forces.*


* **'I don't understand…but it seems very interesting. Are you religious?'
What can I tell to this American girl?
*

*I said: 'I do not go to temple regularly. I do not make any regular
rituals. I have learned some of the rituals in my younger days. I still
enjoy doing it sometimes.'
'Enjoy? Are you not afraid of God?'*


*'God is a friend. No- I am not afraid of God. Nobody has made any
compulsions on me to perform these rituals regularly.'*


* **She thought for a while and then asked: 'Have you ever thought of
converting to any other religion?'
*

*'Why should I? Even if I challenge some of the rituals and faith in
Hinduism, nobody can convert me from Hinduism. Because, being a Hindu allows
me to think independently and objectively, without conditioning… I remain as
a Hindu never by force, but choice.' I told her that Hinduism is not a
religion, but a set of beliefs and practices. It is not a religion like
Christianity or Islam because it is not founded by any one person or does
not have an organized controlling body like the Church or the Order, I
added. There is no institution or authority. *

*'So, you don't believe in God?' she wanted everything in black and white.
*

*'I didn't say that. I do not discard the divine reality. Our scripture, or
Sruthis or Smrithis - Vedas and Upanishads or the Gita - say God might be
there or he might not be there. But we pray to that supreme abstract
authority (Para Brahma) that is the creator of this universe.'*


* **'Why can't you believe in one personal God?'
*

* **'We have a concept - abstract - not a personal god. The concept or
notion of a personal God, hiding behind the clouds of secrecy, telling us
irrational stories through few men whom he sends as messengers, demanding us
to worship him or punish us, does not make sense. I don't think that God is
as silly as an autocratic emperor who wants others to respect him or fear
him.' I told her that such notions are just fancies of less educated human
imagination and fallacies, adding that generally ethnic religious
practitioners in Hinduism believe in personal gods. The entry level Hinduism
has over-whelming superstitions too. The philosophical side of Hinduism
negates all superstitions.
*

* **'Good that you agree God might exist. You told that you pray. What is
your prayer then?'
'Loka Samastha Sukino Bhavantu. Om Shanti, Shanti, Shanti,'
'Funny,' she laughed, 'What does it mean?'
*

*'May all the beings in all the worlds be happy. Om Peace, Peace, Peace.'*

*'Hmm…very interesting. I want to learn more about this religion. It is so
democratic, broad-minded and free…' she exclaimed.
*

*'The fact is Hinduism is a religion of the individual, for the individual
and by the individual with its roots in the Vedas and the Bhagavad-Gita. It
is all about an individual approaching a personal God in an individual way
according to his temperament and inner evolution - it is as simple as that.'
*


* **'How does anybody convert to Hinduism?'
*

*'Nobody can convert you to Hinduism, because it is not a religion, but a
set of beliefs and practices.. Everything is acceptable in Hinduism because
there is no single authority or organization either to accept it or to
reject it or to oppose it on behalf of Hinduism.'*

*I told her - if you look for meaning in life, don't look for it in
religions; don't go from one cult to another or from one guru to the next.
*

* **For a real seeker, I told her, Bible itself gives guidelines when it
says 'Kingdom of God is within you.' I reminded her of Christ's teaching
about the love that we have for each other. That is where you can find the
meaning of life.
*

* **Loving each and every creation of the God is absolute and real.
'Isavasyam idam sarvam' Isam (the God) is present (inhabits) here everywhere
- nothing exists separate from the God, because God is present everywhere.
Respect every living being and non-living things as God. That's what
Hinduism teaches you.
*

* **Hinduism is referred to as Sanathana Dharma, the eternal faith. It is
based on the practice of Dharma, the code of life. The most important aspect
of Hinduism is being truthful to oneself. Hinduism has no monopoly on ideas.
It is open to all. Hindus believe in one God (not a personal one) expressed
in different forms. For them, God is timeless and formless entity.
*
*Ancestors of today's Hindus believe in eternal truths and cosmic laws and
these truths are opened to anyone who seeks them. But there is a section of
Hindus who are either superstitious or turned fanatic to make this an
organized religion like others. The British coin the word 'Hindu' and
considered it as a religion.
*

* **I said: 'Religions have become an MLM (multi-level-marketing) industry
that has been trying to expand the market share by conversion. The biggest
business in today's world is Spirituality. Hinduism is no exception…'
*

* **I am a Hindu because it doesn't condition my mind with any faith
system.............
*



--
Make a list of important things to do today. At the top, put 'eat
chocolate'. Now, you'll get at least one thing done today.

Wisdom is having a lot to say and not always saying it. Think before you
act; think twice before you speak.

An eye for an eye leaves the whole world blind

Winners make things happen, losers let things happen.

I am too blessed to be stressed and too annointed to be disappointed.

Knowledge is information. Wisdom is knowing what to do with the information
you have.

Wednesday, July 02, 2008

బంధాన్ని కలిపిన ఔదర్యం


మానసిక రోగిని మనిషిని చేసి...
బంధాన్ని కలిపిన ఔదర్యం
బెంగుళూరు, జూన్ 15 (న్యూస్‌టుడే): నగర వీధుల్లో వస్త్రాలు లేకుండా సంచరిస్తున్న మానసిక రోగి పట్ల ఆ హృదయం స్పందించింది. వైద్యం ఇప్పించి మనిషిని చేయాలనిపించింది. చికిత్స ఇప్పించి రక్తసంబంధీకులతో అతణ్ని కలిపారు నందినిలేఔట్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ రాజణ్ణ. మానసిక రోగి పేరు వెంకటేష్. సొంత ఊరు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా చిల్లమత్తూరు మండలం తుమ్మకుంట గ్రామస్థుడు. గత ఏప్రిల్‌లో నగరంలోని మహాలక్ష్మీలేఔట్, విజయనగర, నందినిలేఔట్ తదితర ప్రాంతాల్లో వస్త్రాలు లేకుండా అతడు సంచరించే వాడు. ఆ మానసిక రోగిని చూసిన ప్రజలు భయపడేవారు.. స్థానిక ఫొటోగ్రాఫర్ రాజణ్ణ చొరవ తీసుకుని అతణ్ని దగ్గర తీశారు. భోజనం పెట్టించి వస్త్రాలు తొడిగించి పంపించారు. అతడు వెళ్లిన నెల తర్వాత మళ్లీ వస్త్రాల లేకుండా సంచరించడం రాజణ్ణ చూశారు. మళ్లీ అతణ్ని దగ్గర తీసి స్నానం చేయించి బట్టలు తొడిగించి నిమ్హాన్ ఆసుపత్రికి తీసుకుపోయారు. అక్కడ ప్రముఖ వైద్యుడు డాక్టర్ సి.ఆర్.చంద్రశేఖర్‌ను కలిశారు. అతడి పరిస్థితిని వివరించారు. మానసిక రోగి పేరు, ఊరు తెలియదు. ఆ వివరాల్ని నోరు విప్పి చెప్పలేని పరిస్థితి అతనిది. వైద్యులు ఆసుపత్రిలో చేర్చుకున్నారు. నెల పాటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స పొందాడు. మామూలు మనిషిగా మారిన తర్వాత నోరు విప్పాడు. పేరు, ఊరు తదితర వివరాలు వైద్యులకు చెప్పాడు. ఆ వివరాల్లో నిజానిజాలు పరిశీలించేందుకు రాజణ్ణ తుమ్మకుంట గ్రామానికి వెళ్లి విచారించగా అతడు వివరించిన విషయాలు నిజమయ్యాయి. రాజణ్ణ అతడి తల్లిదండ్రులకు పరిస్థితి వివరించి నగరానికి తీసుకొచ్చి అప్పగించారు. వెంకటేష్ తన అత్తతో కలిసి తమిళనాడుకు వెళ్లాడు. అక్కడ దేవస్థానాలు సందర్శించాడు. మళ్లీ వచ్చే సమయంలో దారి తప్పి నగరానికి వచ్చాడు. వెంకటేష్ భార్య, ఇద్దరు పిల్లలున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక తదితర ప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో అతడిపై ఆశలు వదులుకున్నారు. రాజణ్ణ చేసిన ఉపకారాన్ని జన్మలో మరిచిపోలేమని వెంకటేష్ తండ్రి గోవిందప్ప తెలిపారు.