welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Showing posts with label TELUGU OLD SONGS. Show all posts
Showing posts with label TELUGU OLD SONGS. Show all posts

Wednesday, August 17, 2011

[జన్మమెత్తితిరా] మనిషియందె మహాత్ముని కాంచగలవురా


జన్మమెత్తితిరా అనుభవించితిరా
బ్రతుకు సమరములో పండిపోయితిరా
మంచి తెలిసి మానవుడుగా మారినానురా [జన్మమెత్తితిరా]

స్వార్థమను పిశాచి మదిని స్వారి చేసెరా
బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయెరా
దైవ శక్తి మృగత్వమునే సంహరించెరా
సమర భూమి నా హృదయం శాంతి పొందెరా [జన్మమెత్తితిరా]

క్రోధ లోభ మోహములే పడగలెత్తెరా
బుసలు కొట్టి గుండెలోన విషము గ్రక్కెరా
ధర్మ జ్యోతి తల్లివోలె ఆదరించెరా
నా మనసె దివ్య మందిరముగా మారిపోయెరా [జన్మమెత్తితిరా]

మట్టియందె మాణిక్యము దాగియుండురా
మనిషియందె మహాత్ముని కాంచగలవురా
ప్రతి గుండెలో గుడిగంటలె ప్రతిధ్వనించురా
ఆ దివ్య స్వరం న్యాయ పధం చూపగలుగురా [జన్మమెత్తితిరా]

--అనిశెట్టి
 

Thursday, December 23, 2010

Akasvani - Audios

 

Friends

It's been a long tiime. Just wanted to let you know, in case any one is interested to listen. I have seen very old telugu dramas, audio recordings from All India Radio here.

Link - http://www.maganti.org/newgen/index1.html

Click on Akasavani section on the left

Best
Murthy

__._,_.___
Recent Activity:
.

__,_._,___

Thursday, October 29, 2009

సతులకే ఎందుకు ఈఘోరశిక్ష

ఊరుమారినా ఉనికి మారునా
మనిషి దాగినా మమత దాగునా
మనిషి దాగినా మమత దాగునా
మరలిరాని పయనంలో మజిలీ లేదు
ఆడదాని కన్నీటికి అంతేలేదు

అనురాగ దీపం అసమాన త్యాగం
స్త్రీజాతికొరకే సృజియించె దైవం
చిరునవ్వులన్నీ పెరవారికొసగి
చీకటులలోనే జీవించు యువతి
తలపులే వీడవు వీడేది మనిషే
వలపులే వాడవు వాడేది తనువే

మగవానికేమో ఒకనాటి సుఖమూ
కులకాంతకదియే కలకాల ధనమూ
తనవాడు వీడా అపవాదు తోడా
పదినెలలమోతా చురకత్తి కోతా
సతులకే ఎందుకు ఈఘోరశిక్ష
సహనమే స్త్రీలకూ శ్రీరామరక్ష
--ఆరుద్ర

మొదటి అడుగు ఎప్పుడూ వొంటరే

ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు
మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరి మొదటి అడుగు ఎప్పుడూ వొంటరే మరి వెనుక వచ్చువాళ్ళకు బాట అయినది ..

ఎవరో ఒకరు !!

కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా అనుకోని కోడి కూత నిదరపోదుగా ..
జగతికి మేలుకొలుపు మానుకోదుగా ..
మొదటి చినుకు సూటికా దూకి రానిదీ ..
మబ్బు కొంగు చాటుగా వొదిగి దాగితే ..
వాన ధారా రాదుగా నేల దారికి ప్రానమంటూ లేదుగా బ్రతకటానికి ..

ఎవరో ఒకరు!!

చెదరక పోదుగా చిక్కని చీకటి మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి ..
దానికి లెక్క లేదు కాళరాతిరి..
పెదవి ప్రమిద నిలపని నవ్వు జ్యోతిని రెప్ప వెనక ఆపని కంటి నీటిని
సాగలేక ఆగితే దారి తరుగునా ?
జాలి చూపి తీరమే దరికి చేరునా ..?

ఎవరో ఒకరు!!

యుగములు సాగిన నింగిని తాకక ఎగసిన అలల ఆస అలసిపోదుగా
ఓటమి ఒప్పుకుంటూ ఆగిపోదుగా ఎంత వేడి ఎండకా ఒళ్ళు మండితే ..
అంత వాడి ఆవిరై వెళ్లి చేరదా అంత గొప్ప సూర్యుడు కళ్లు మూయడా..
నల్ల మబ్బు కమ్మితే చల్లారదా ..?

ఎవరో ఒకరు!!

మూవీ: అంకురం
లిరిక్స్: సిరివెన్నెల

Friday, September 04, 2009

ఆశ జారినా వెలుగు తొలగినా ఆగదు జీవిత పోరాటం

గాలి వానలొ వాన నీటిలో పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం..

ఇటు హోరు గాలి అని తెలుసు
అటు వరద పొంగు అని తెలుసు
హోరుగాలిలో వరద పొంగులో
సాగలేనని తెలుసు

అది జోరు వాన అని తెలుసు
ఇది నీటి సుడులని తెలుసు
జోరు వానలో నీటి సుడులలో
మునగ తప్పదని తెలుసు
అయినా పడవ ప్రయాణం.

ఇది ఆశ నిరాశల ఆరాటం
అది చీకటి వెలుగుల చెలగాటం
ఆశ జారినా వెలుగు తొలగినా
ఆగదు జీవిత పోరాటం

ఇది మనిషీ మనసుల పోరాటం
అది ప్రేమా పెళ్ళి చెలగాటం
ప్రేమ శకలమై మనసు వికలమై
బ్రతుకుతున్న దొక శవం
అయినా పడవ ప్రయాణం