welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Monday, October 06, 2008

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం మద్యం నిషిద్ధం అంతా అక్షరాస్యులే రూపాయికే ఫ్లోరైడ్ రహిత నీరు ఇదీ గంగదేవిపల్లి ఘనత

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం మద్యం నిషిద్ధం అంతా అక్షరాస్యులే రూపాయికే ఫ్లోరైడ్ రహిత నీరు ఇదీ గంగదేవిపల్లి ఘనత

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం
మద్యం నిషిద్ధం
అంతా అక్షరాస్యులే
రూపాయికే ఫ్లోరైడ్ రహిత నీరు
ఇదీ గంగదేవిపల్లి ఘనత
వరంగల్ - న్యూస్‌టుడే
మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరించిన వరంగల్ జిల్లా గంగదేవిపల్లి అభివృద్ధి వెనుక 14ఏళ్ల కృషి, 13 అభివృద్ధి కమిటీల శ్రమ ఉంది. ప్రతీ విషయంలో పారదర్శకత, పాలనలో ప్రతీ ఒక్కరికీ బాధ్యత... ఇదే గంగదేవిపల్లిని ఆదర్శ గ్రామంగా నిలిపింది. గంగదేవిపల్లి మొదట్లో మచ్చాపురం పంచాయతీ శివారు గ్రామంగా ఉండేది. 1994లో ప్రత్యేక పంచాయతీగా గుర్తించారు. అప్పటికి ఊళ్లో నాటుసారా ఏరులై పారుతోంది. ఎన్నో జీవితాలు బలయ్యాయి. గ్రామస్థుల్లో ఆలోచన మొదలైంది. నాటుసారా విక్రయాలు నిషేధించారు. ఆరంభంలో ఒడిదుడుకులను అధిగమించారు. ప్రభుత్వం మద్యం అమ్మకాల నుంచి గంగదేవిపల్లిని మినహాయించింది.

ప్రభుత్వం దగ్గర పైసా తీసుకోకుండా స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో రక్షిత మంచినీటి సౌకర్యం ఏర్పాటుచేశారు. 1996 నుంచి డీ-ఫ్లోరైడ్ ప్రాజెక్టు నిరాటంకంగా పనిచేస్తోంది. ఇంటింటికీ 20లీటర్ల మంచినీరు రూపాయికే ఇస్తున్నారు.

1994కు ముందు గ్రామంలో పాఠశాల లేదు. అక్షరాస్యత అంతంత మాత్రమే. అందరికీ విద్య లక్ష్యంతో కమిటీ వేశారు. ప్రతీ 10 మంది నిరక్షస్యురాలకు ఒక వాలంటీర్ నియమించారు. ఎనిమిదేళ్ల కృషి ఫలించింది. 2002 నాటికి నూరు శాతం అక్షరాస్యత సాధించింది. బాల కార్మిక వ్యవస్థ లేదు. బడి ఈడు పిల్లలంతా చదువుకోవాల్సిందే.

గంగదేవిపల్లిలో కేబుల్ ప్రసారాలు ఉచితం. ఒక్కసారి రూ.2,200 చెల్లిస్తే చాలు. వసూలు చేసిన మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, వడ్డీతో గంగా డిష్ కమిటీ పర్యవేక్షిస్తుంది.

ఆరోగ్య కమిటీ, తల్లుల కమిటీ, రుణాల రికవరీ కమిటీ, 'గ్రామాభివృద్ధి కమిటీ'... ఇలా 13 కమిటీలున్నాయి. ప్రతీ ఇంటి నుంచి ఒకరికి ఏదో ఒక కమిటీలో బాధ్యతలుంటాయి. రాజకీయ పార్టీలున్నా అభివృద్ధి నిర్ణయాల్లో అందరిదీ ఒకటే మాట.

గంగదేవిపల్లిలో కుటుంబ సమస్య ఉన్నా పంచాయతీ కార్యాలయం దాటి వెళ్లదు. 14 ఏళ్లలో ఒక్కసారి కూడా పోలీసు రాలేదు. కొట్లాట కేసు కూడా నమోదు కాలేదు.

గంగదేవిపల్లి 2007లో దేశంలోనే ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కాశ్యప్ నేతృత్వంలోని న్యాయ నిర్ణేతల బృందం ఈ ఎంపిక చేసింది. గ్రామీణ భారత అధ్యయనం, పరిశోధనా అకాడమీ ఈ అవార్డును అందించింది. కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్ ముఖ్య సలహాదారు.

గంగదేవిపల్లి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా నిర్మల్ గ్రామ్ పురస్కార్ అందుకుంది.

వరంగల్ జిల్లాలో నాలుగుసార్లు ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. గ్రామంలోని కుటుంబాలన్నీ చిన్న మొత్తాల పొదుపులో చేరినందుకు 1999లో కలెక్టర్ ప్రత్యేక అవార్డు అందించారు.

కెనడా, బంగ్లాదేశ్‌ల నుంచి స్వచ్ఛంద సంస్థలు వచ్చి గంగదేవిపల్లి గ్రామస్వరాజ్యాన్ని అధ్యయనం చేశాయి. తమిళనాడు, పాండిచ్చేరి, రాజస్థాన్ బృందాలూ వచ్చాయి. ఇతర జిల్లాల బృందాలకు లెక్కేలేదు. జిల్లాకు వచ్చే ఐఏఎస్ శిక్షణార్థులంతా ఈ గ్రామం గురించి చదవాల్సిందే.

No comments: