Sunday, February 06, 2011

మంచిమనసుతో జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకూ?

 
చదువురానివాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు?
మంచువంటి మల్లెవంటి మంచిమనసుతో
జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకూ [[చదువు]]

ఏమిచదివి పక్షులు పైగెగురగలిగెను?
ఏ చదువువల్ల చేపపిల్లలీదగలిగెను?
అడవిలోని నెమలికెవడు ఆటనేర్పెను?
కొమ్మపైనికోకిలమ్మకెవడు పాటనేర్పెను? [[చదువు]]

తెలివిలేని లేగదూడ పిలుచును అంబాయని
ఏమెరుగని చంటిపాపఏడ్చును అమ్మా అని
చదువులతో పనియేమి హృదయమున్నచాలు
కాగితంపు పూలకన్న గరికపువ్వు మేలు [[చదువు]]

సి.నారాయణరెడ్డి ఆత్మబంధువు కె.వి.మహదేవన్ 1962

No comments:

Post a Comment