Sunday, February 06, 2011

నిన్ను ప్రేమింతురే నిన్ను పూజింతురే నన్ను గనినంత నిందింతురే

 
కన్నయ్యా, నల్లని కన్నయ్యా
నిన్ను కనలేని కనులుండునా
నిన్ను ప్రేమింతురే నిన్ను పూజింతురే
నన్ను గనినంత నిందింతురే

గుణమింత లేనింట పడవైతువా
నన్ను వెలివేయువారికే బలిచేతువా
సిరిజూచుకుని నన్ను మరిచేవయా
మంచిగుడి చూచుకొని నీవు మురిసేవయా
బంగారు మనసునే ఒసగినావు
అందు అందాల గుణమునే పొదిగినావు
మోముపై నలుపునే పులిమినావు
ఇట్లు నన్నేల బ్రతికించదలచినావు

చిత్రం : నాదీ ఆడజన్మే
గానం : పి.సుశీల
రచన : శ్రీశ్రీ
సంగీతం: ఘంటసాల




No comments:

Post a Comment