భక్తిభావమ్ము పెంపారు బహుళగతులా
ఆత్మచింతన అద్దానికానవాలు
నీచమైనట్టి వృత్తిని పూనికూడా
నమ్మికొలిచిన ఇత్తును మోక్షమ్ము నిజము
శాస్త్రమ్ములెల్లను చదివిన లెస్సయా
మనసువెన్నెలగాగ మసలవలయు
నుదుట విబూదినలదిన పసందౌనా
మదిలోన దయనెంతొ దలచవలయు
తావలమ్ములచేత తడవిన పనియౌనా
చేజాచి దానమ్ము చేయవలయు
సత్యమును గొలిచి ధర్మమ్ము సంతరించి
స్వార్ధమునుచంపి త్యాగభావమ్ము పెంచి
ఈ విధి సంస్కారమను జందెమును దాల్చు
మనుజులెల్లరు విప్రులీ మహిని నిజము
---రఘురామయ్య పద్యాలు,చింతామణి.
No comments:
Post a Comment