Friday, November 06, 2009

మనసుతోటి ఆడకు యిరిగిపోతె అతకదు మళ్ళా

 
మానూ మాకును కాను రాయీ రప్పను కానే కానూ
మామూలు మనిషిని నే నేను నీ మనిషిని నేను

నాకూ ఒక మనసున్నాదీ నలుగురిలా అసున్నాదీ
కలలు కనే కళ్ళున్నాయీ అవి కలత పడితే నీళ్ళున్నాయీ IమానూI

ప్రమిదను తెచ్చీ వొత్తిని వేసీ
చమురును పోసీ భ్రమ చూపేవా
ఎంత చేసీ వెలిగించెందూకూ యెనక మూందూలాడేవా IమానూI

మనిసితోటి యేళాకోళం ఆడుకుంటె బాగుంటాది
మనసుతోటి ఆడకు మామా యిరిగిపోతె అతకదు మళ్ళా IమానూI
---ఆత్రేయ

No comments:

Post a Comment