Friday, September 04, 2009

ఆశ జారినా వెలుగు తొలగినా ఆగదు జీవిత పోరాటం

గాలి వానలొ వాన నీటిలో పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం..

ఇటు హోరు గాలి అని తెలుసు
అటు వరద పొంగు అని తెలుసు
హోరుగాలిలో వరద పొంగులో
సాగలేనని తెలుసు

అది జోరు వాన అని తెలుసు
ఇది నీటి సుడులని తెలుసు
జోరు వానలో నీటి సుడులలో
మునగ తప్పదని తెలుసు
అయినా పడవ ప్రయాణం.

ఇది ఆశ నిరాశల ఆరాటం
అది చీకటి వెలుగుల చెలగాటం
ఆశ జారినా వెలుగు తొలగినా
ఆగదు జీవిత పోరాటం

ఇది మనిషీ మనసుల పోరాటం
అది ప్రేమా పెళ్ళి చెలగాటం
ప్రేమ శకలమై మనసు వికలమై
బ్రతుకుతున్న దొక శవం
అయినా పడవ ప్రయాణం

No comments:

Post a Comment