Friday, September 04, 2009

అందరు నడిసొచ్చిన తోవ ఒక్కటె

యాతమేసి తోడినా ఏరు ఎండదు

పొగిలి పొగిలి ఎడ్చిన పొంతనిండదు [ యా ]

దేవుడి గుడిలొదైనా పూరిగుడిసెలోదైనా

గాలి ఇసిరి కొడితే......

ఆ దీపముండదు... ఆ దీపముండదు... [ యాతమేసి ]



పలుపు తాడు మెడకేస్తె పాడి ఆవురా...

పసుపు తాడు ముడులెస్తె ఆడదాయెరా...

కుడితి నీళ్ళు పోసినా... అది పాలుకుడుపుతది...

కడుపు కోత కోసినా... అది మనిషికే జన్మ ఇత్తది

బొడ్డు పేగు తెగి పడ్డ రోజు తలచుకొ

గొడ్డు కాదు అడదనే గుణం తెలుసుకొ [ యా ]



అందరు నడిసొచ్చిన తోవ ఒక్కటె

చీము నెత్తురులు పారె తూము ఒక్కటె

మేడ మిద్దెలొ ఉన్నా..... ఛెట్టు నీడ తొంగున్నా....

నిదర ముదుర పడినాక.....

పాడె ఒక్కటె వల్లకాడు ఒక్కటె.....

కూతనేర్చినోళ్ళ కులం కోకిలంటారా

ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటారా [ యా ]

No comments:

Post a Comment