పొట్టిశ్రీరాములు గారు చనిపోయింది మద్రాసుతో కూడిన ఆంధ్రరాష్ట్రం కోసం.అయితే తరువాత కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.తరువాత తెలంగాణాను కలుపుకున్నారు.అప్పటికే అక్కడ ఉర్దూ రాజ్యమేలుతూ ఉంది.ఉర్దూను రెండవ అధికారభాష అన్నారు.వాళ్ళ ఉర్దూ పోయింది,మన తెలుగూ పోయింది.ఇంగ్లీషు రాజ్యమేలుతోంది.ఇక మనం ఆంగ్లాన్ని మోయక తప్పదు.తెలుగు రాష్ట్ర పాలనా భాషగా
ఇంగ్లీష్ వైభవం చూడండి రహంతుల్లా,డిప్యూటీ కలెక్టర్,విజయవాడ.
Telugu actor, telugu actores,telugu movies,telugu biodata, telugu history, telugu legends, telugu news, telugu reviews.
Saturday, October 31, 2009
Thursday, October 29, 2009
సతులకే ఎందుకు ఈఘోరశిక్ష
ఊరుమారినా ఉనికి మారునా
మనిషి దాగినా మమత దాగునా
మనిషి దాగినా మమత దాగునా
మరలిరాని పయనంలో మజిలీ లేదు
ఆడదాని కన్నీటికి అంతేలేదు
అనురాగ దీపం అసమాన త్యాగం
స్త్రీజాతికొరకే సృజియించె దైవం
చిరునవ్వులన్నీ పెరవారికొసగి
చీకటులలోనే జీవించు యువతి
తలపులే వీడవు వీడేది మనిషే
వలపులే వాడవు వాడేది తనువే
మగవానికేమో ఒకనాటి సుఖమూ
కులకాంతకదియే కలకాల ధనమూ
తనవాడు వీడా అపవాదు తోడా
పదినెలలమోతా చురకత్తి కోతా
సతులకే ఎందుకు ఈఘోరశిక్ష
సహనమే స్త్రీలకూ శ్రీరామరక్ష
--ఆరుద్ర
మనిషి దాగినా మమత దాగునా
మనిషి దాగినా మమత దాగునా
మరలిరాని పయనంలో మజిలీ లేదు
ఆడదాని కన్నీటికి అంతేలేదు
అనురాగ దీపం అసమాన త్యాగం
స్త్రీజాతికొరకే సృజియించె దైవం
చిరునవ్వులన్నీ పెరవారికొసగి
చీకటులలోనే జీవించు యువతి
తలపులే వీడవు వీడేది మనిషే
వలపులే వాడవు వాడేది తనువే
మగవానికేమో ఒకనాటి సుఖమూ
కులకాంతకదియే కలకాల ధనమూ
తనవాడు వీడా అపవాదు తోడా
పదినెలలమోతా చురకత్తి కోతా
సతులకే ఎందుకు ఈఘోరశిక్ష
సహనమే స్త్రీలకూ శ్రీరామరక్ష
--ఆరుద్ర
మొదటి అడుగు ఎప్పుడూ వొంటరే
ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు
మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరి మొదటి అడుగు ఎప్పుడూ వొంటరే మరి వెనుక వచ్చువాళ్ళకు బాట అయినది ..
ఎవరో ఒకరు !!
కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా అనుకోని కోడి కూత నిదరపోదుగా ..
జగతికి మేలుకొలుపు మానుకోదుగా ..
మొదటి చినుకు సూటికా దూకి రానిదీ ..
మబ్బు కొంగు చాటుగా వొదిగి దాగితే ..
వాన ధారా రాదుగా నేల దారికి ప్రానమంటూ లేదుగా బ్రతకటానికి ..
ఎవరో ఒకరు!!
చెదరక పోదుగా చిక్కని చీకటి మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి ..
దానికి లెక్క లేదు కాళరాతిరి..
పెదవి ప్రమిద నిలపని నవ్వు జ్యోతిని రెప్ప వెనక ఆపని కంటి నీటిని
సాగలేక ఆగితే దారి తరుగునా ?
జాలి చూపి తీరమే దరికి చేరునా ..?
ఎవరో ఒకరు!!
యుగములు సాగిన నింగిని తాకక ఎగసిన అలల ఆస అలసిపోదుగా
ఓటమి ఒప్పుకుంటూ ఆగిపోదుగా ఎంత వేడి ఎండకా ఒళ్ళు మండితే ..
అంత వాడి ఆవిరై వెళ్లి చేరదా అంత గొప్ప సూర్యుడు కళ్లు మూయడా..
నల్ల మబ్బు కమ్మితే చల్లారదా ..?
ఎవరో ఒకరు!!
మూవీ: అంకురం
లిరిక్స్: సిరివెన్నెల

Sunday, October 18, 2009
పట్టుదల ముందు ఓడిన పేదరికం
పట్టుదల ముందు ఓడిన పేదరికం దుగ్గిరాల, న్యూస్‌టుడే దుగ్గిరాలకు చెందిన మళావత్ బాలనాగయ్యనాయక్ తండ్రి తారునాయక్ రిక్షా తొక్కుతూ భార్య, నలుగురు పిల్లల్ని పోషించాడు. పిల్లలు తనలా కష్టపడకూడదనే ఉద్దేశంతో వారిని చదివించాడు. ఇలా సాగుతున్న కుటుంబంపై విధి కాటు వేసింది. 2000 సంవత్సరం సెప్టెంబరులో మృత్యురూపంలో తండ్రి తారునాయక్‌ను కుటుంబం నుంచి విధి దూరం చేసింది.
దీంతో కుటుంబసభ్యులంతా దిక్కులేని వారయ్యారు. అంతటి దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని తల్లి ధ్వాలీబాయి కూలికి వెళ్ళసాగింది. రెక్కలు ముక్కలు చేసుకుంది. అయినా ఆ సంపాదన కుటుంబ పోషణకు సరిపోలేదు. ఈదశలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న బాలనాగయ్యనాయక్ ఇంటికి పెద్దకొడుకుగా పరిణితి చెందిన మనస్సుతో కర్తవ్యాన్ని గుర్తించాడు. కుటుంబ భారాన్ని నెత్తికెత్తుకున్నాడు.
తండ్రి రిక్షాను అందుకున్నాడు. కళాశాల వదిలిపెట్టగానే ఇంటికి వచ్చేవాడు. రిక్షా లాగేవాడు. దుగ్గిరాల యార్డులో పనిచేశాడు. రైల్వేస్టేషన్ నుంచి వచ్చే ప్రయాణికుల లగేజీని తీసుకెళ్ళేవాడు. బస్తాకు మూడు రూపాయలు చొప్పున రోజుకు రూ. 50 నుంచి రూ. 70 వరకూ వచ్చేవి. బిడ్డ పడుతున్న కష్టం బాధనిపించినా కుటుంబ పరిస్థితుల వల్ల ఆ తల్లి కాదనలేకపోయింది.
స్నేహితుని మార్గదర్శకం 2002లో డిగ్రీ పూర్తి చేసిన బాలయ్యనాయక్ 2002-03లో విజయవాడ దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా హిందీ పండిట్ శిక్షణ పూర్తిచేశాడు. అప్పుడు కూడా ఇంటికి వచ్చి రిక్షా వృత్తి కొనసాగించాడు. 2003-04లో గణితం, ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్టులుగా బి.ఇడి. చేశాడు. నాయక్ మాటల్లో చెప్పాలంటే అతని స్నేహితుడు కాకాని యలమందరావు ఒత్తిడి చేసి బి.ఇడి. ప్రవేశపరీక్ష రాయించాడు.

కష్టపడుతున్న స్నేహితుడికి యలమంద మార్గదర్శకుడయ్యాడు. అతని ప్రోత్సాహమే లేకపోతే తాను ఈనాడు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని బాలునాయక్ అంటున్నారు. బి.ఇడి. పూర్తికాగానే ఏం చేద్దామని అన్పించింది. అప్పుడు స్నేహితుని మార్గదర్శకమే. ఎం.ఎస్.సి. చేయమని సలహా ఇచ్చాడు. డబ్బులు సరిపోతాయా? తన వల్ల అవుతుందా? ఇవన్నీ నాయక్ మదిలో మెదిలిన భావనలు. రిక్షా ఎక్కువ సేపు తొక్కుదాం అనుకున్నాడు. అంతే
దూరవిద్య ద్వారా 2004-06లో ఎం.ఎస్.సి. పట్టా అతని చేతిలోకి వచ్చింది. తాను ఎమ్మెస్సీ పూర్తి చేసి అధ్యాపకుడిగా పనిచేస్తున్న కళాశాలలోనే నాగయ్యనాయక్‌కు కూడా యలమందయ్య అధ్యాపకుని పోస్టు వచ్చేలా ప్రయత్నించాడు. నలంద కళాశాలలో ఒక సంవత్సరం పనిచేశాడు. విజయవాడలో ఉచితంగా గ్రూప్-2 శిక్షణ ఇస్తుంటే దానిలో చేరాడు. అక్కడ నేర్చుకున్న జనరల్ నాలెడ్జి తనకు డీఎస్సీలో ఉపయోగపడిందని నాయక్ చెప్పారు.

ఈదశలోనే స్నేహితుడితో కలిసి 2008లో డీఎస్సీకి సిద్ధమయ్యాడు. గణితశాస్త్ర ఉపాధ్యాయునిగా ఎంపికయ్యాడు. నూజెండ్ల మండలం ములకలూరు జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాలలో పోస్టు పొందాడు. సోమవారం నుంచి విధుల్లో చేరుతున్న నాయక్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు వచ్చేలా కృషి చేస్తానంటున్నారు. తనను ఇంతటి వాడిని చేసిన తల్లికి, స్నేహితునికి, అక్కలు-బావలకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని ఆయన పేర్కొంటున్నారు.
ఆనందంగా ఉంది: తల్లి ధ్వాలీబాయి నా భర్త చనిపోయినప్పుడు ఇంట్లో పరిస్థితుల కొడుకు రిక్షా తొక్కుతానన్నా కాదనలేకపోయాను. ఇప్పుడు బిడ్డ ఉపాధ్యాయుడు అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. వాడు పడ్డ కష్టానికి ఫలితం లభించింది.eenadu18.10.2009